ధ్యానం కుదరడం లేదా? మీరు చేస్తున్న ఈ చిన్న తప్పులే కారణం!
Author Name:naveen kalyan spiritual life
Youtube Channel Url:https://www.youtube.com/@naveenkalyanspirituallife5599
Youtube Video URL:https://www.youtube.com/watch?v=EtoOR5bR0o4
Transcript:
(00:01) నేను ఎందుకు ధ్యానం సరిగ్గా చేయలేకపోతున్నాను ఎక్కువసేపు మెడిటేషన్ లో ఎందుకు కూర్చోలేకపోతున్నాను ఏ విషయాలు ప్రభావించి ఉంచడం వల్ల ధ్యానం నాకు సరిగ్గా కుదరడం లేదు అని మిమ్మల్ని మీరు ఏరోజైనా ప్రశ్నించుకున్నారా ఒక్క క్షణం మీరు ఆలోచించండి ఈరోజు మనం మీరు ధ్యానం చేసే ముందు చేస్తున్న పొరపాట్లు ఏమిటి ధ్యానం కుదరాలంటే మనం ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
(00:34) అయితే ఉదాహరణకి మనం ఒక విత్తనాన్ని తీసుకున్నామండి దాన్ని భూమిలో నాటినప్పుడు దానికి కావలసిన ఎరువు సమయానికి నీరు సూర్యరశమి దానికి కరెక్ట్ గా తగిలే విధంగా మనం చేసినట్లయితే ఆ యొక్క విత్తనం నెమ్మదిగా మొక్క అవుతుంది. మొక్క కాస్త వృక్షం అవుతుంది. వృక్షం కాస్త మనకు ఫలాల్ని ఇస్తుంది. అక్కడ మనం ఏం చేసాం ఆ యొక్క విత్తనానికి కావలసిన అన్ని సదుపాయాల్ని దానికి అందే విధంగా చేశం.
(01:12) అదేవిధంగా మీకు ధ్యానం సరైన పద్ధతిలో కుదరాలంటే ధ్యానంలో అద్భుతమైన అనుభవాలు రావాలంటే ధ్యానం చేసేందుకు కావలసిన అన్ని పరిస్థితుల్ని మీరు ఏర్పాటు చేయాలి. అంతే మిగిలిందంతా తనకు తానుగా జరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ధ్యానం చేసేందుకు ఎంత కుస్తి పడినా సరే ధ్యానం అనేది జరగదు కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మొదటిగా సాధకుడు ధ్యానం చేసే ముందు రకరకాల పరిస్థితుల్లో ఉంటాడు.
(01:46) ఇంట్లో ఎదురైన ఆర్థికపరమైన ఇబ్బందులు అవ్వచ్చు స్నేహితులతో గాని కుటుంబ సభ్యులతో గాని వచ్చిన గడవలు కావచ్చు చేస్తున్న బిజినెస్ లో గాని జాబ్లో గాని ఎదురవుతున్న రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల తను ఎమోషనల్ గా డిస్టర్బ్ అయి ఉంటాడు. ఆ యొక్క డిస్టర్బెన్స్ లో తను మెడిటేషన్ లో కూర్చుంటాడు. తద్వారా తనకి ధ్యానం అనేది కుదరదు. కాబట్టి మీరు ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యేటప్పుడు మీరు ధ్యానంలో కూర్చోవద్దు అది మీకు వరంలా మారదు అతి పెద్ద శాపంలా మారుతుంది.
(02:20) అయితే ఈ యొక్క డిస్టర్బెన్స్ నుండి బయట పడాలంటే మనం ఏం చేయాలి మీరు చేయవలసింది ఏది లేదు. మీ దగ్గరలో ఏదైనా ప్రశాంతవంతమైన వాతావరణం ఉంటే ఉదాహరణకి మాది బీచ్ ఏరియా మాకు ఏదైనా చిన్నపాటి సమస్యగా అనిపిస్తే అప్పుడప్పుడు బీచ్ కి వచ్చి కాసేపు కూర్చుంటా ప్రకృతిలో తద్వారా మనసు ఒక్కసారిగానే రిలాక్స్ అవుతూ ఉంటుంది అలా మీ చుట్టూ ఏదైనా మీ యొక్క మైండ్ ని కూల్ చేసే ప్రదేశాలు ఏవైనా ఉంటే అక్కడికి వెళ్లి ఒంటరిగా వేకాంతంగా మీరు కూర్చోండి.
(02:50) తద్వారా ఆ యొక్క ఎమోషన్ అనేది మీలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. లేదు సార్ మాకు అటువంటి పరిస్థితులు లేవు అనుకుంటే మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి. అలాగే భగవంతుడికి సంబంధించిన కొన్ని కొన్ని ఆ సాంగ్స్ ఉంటాయి అవి గాని పీస్ఫుల్ గా ఉండే మ్యూజిక్ మీరు విన్నట్లయితే మీ మనసు ప్రశాంతవంతంగా మారుతుంది. మొదట మీరు చేయవలసింది ఇది అలాగే మీరు ధ్యానంలో కూర్చేందుకు మీరు ఎంచుకున్న రూమ్ ఏదైతే ఉందో అది మెరీ చిందర వందరగా అక్కడ రకరకాల స్మెల్ బయటకి రావడం గాన శబ్దాలు అధికంగా వినిపించడం గాన అటువంటి పరిస్థితులు ఆ రూమ్లో లేకుండా మీరు జాగ్రత్త పాటించాలి. తద్వారా ధ్యానం
(03:36) చేసేటప్పుడు మీ మనసు కుదురుగా కూర్చొని ధ్యానం మీకు అద్భుతంగా కుదిరేందుకు అవకాశం అనేది 100కి 100 శాతం ఏర్పడుతుంది. అలాగే సాధన చేస్తున్న సాధకులు ఎక్కువసేపు మెడిటేషన్ లో కూర్చోలేకపోతున్నారు. దానికి గల కారణం వారి శరీరం వారికి సపోర్ట్ చేయలేకపోవడమే మన శరీరం మనకు సపోర్ట్ చేయాలంటే మొదటగా మీ యొక్క శరీరం అనేది బలంగా ఉండాలి.
(04:04) మీరు సరైన ఆహారం తీసుకోలేకపోవడం వల్ల మీ శరీరానికి కావలసిన శక్తి లేకపోవడం వల్ల మీరు ఎక్కువసేపు మెడిటేషన్ లో కూర్చోలేరు. కాబట్టి మీరు సరైన పోషక నిలవలు ఉండే ఆహారాన్ని తీసుకోండి. తద్వారా శరీరానికి కావలసిన శక్తి మీకు అందుతుంది. అలాగే మీ శరీరం కూడా ఫెక్సిబుల్ గా ఉండాలి. కొందరు కాస్త బుద్ధిగా ముద్దుగా ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే వారు కాసేపు కూర్చోగానే వారి యొక్క శరీర బరువు అనేది కాళ్ళపై అధికంగా పడి వారు మెడిటేషన్ లో కూర్చోలేరు.
(04:39) కాబట్టి మీరు కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయాలి ప్రతి ఒక్కరు చేయాలి సాధన చేసే ప్రతి ఒక్కరు కూడా అది సన్నంగా ఉన్నా లావుగా ఉన్నా మధ్య తరగతిలో ఉన్నా సరే వారి యొక్క శరీరం అందరూ కూడా శరీరం ఫ్లెక్సిబుల్ గా మారేందుకు మీరు కొన్ని కొన్ని సూర్య నమస్కారాలని సూక్ష్మ వ్యాయామాలని కొన్ని కొన్ని ఎక్ససైజెస్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీ శరీరం అనేది ఫ్లెక్సిబుల్ గా మారుతుంది.
(05:03) తద్వారా మీరు ఎక్కువసేపు మెడిటేషన్ లో కూర్చోగలుగుతారు. అలాగే మన యొక్క మనసు మనకు అతిపెద్ద అడ్డంకి మీరు ఎంత ప్రయత్నిస్తున్నా సరే నది ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో దానికి 100 రెట్లు వేగంగా మనసు అనేది ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకి పొరుగులు తీస్తూ నెదిల ప్రవహిస్తూ ఉంటుంది. తద్వారా మీరు మెడిటేషన్ లో ఎక్కువసేపు కూర్చోలేరు.
(05:35) ఎంత కూర్చుందాం అని ప్రయత్నిస్తున్నా సరే ఈ యొక్క మనసు మీపై ప్రభావం చూపిస్తుంది. దానికి మీరు ఒక పెద్ద ఆనకట్ట కట్టే ప్రయత్నం చేస్తారు. కానీ అది కూడా ఫలించదు కాబట్టి ఆ ఒక్క మనసుని మీరు కంట్రోల్ చేయాలంటే మీరు చేయవలసిన ప్రయత్నం ప్రాణాయామాలు చేయాలి మనసుని ప్రాణాయామం ద్వారా మాత్రమే మనం కంట్రోల్ చేయగలుగుతాం. కాబట్టి మన కొన్ని కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ ఉంటాయి అల్నోమ విల్నోమ అని కపాలబాతి అని ఇలా ఏవైతే ప్రాణాయామ టెక్నిక్స్ ఉన్నాయో అవి మీరు కచ్చితంగా ధ్యానానికి ముందు ప్రాక్టీస్ చేయాలి.
(06:13) అలాగే ధ్యానంలో కూర్చున్న తర్వాత మీకు అనుభవాలు రావడం మొదలవుతూ ఉంటాయి. అనుభవాలు వచ్చిన తర్వాత అరే నాకు ఈ అనుభవం వచ్చింది తర్వాత మళ్ళీ ఇంకో అనుభవం వస్తాదా రాదా మళ్ళీ ఈ అనుభవం వస్తాదా రాదా అని ఆ అనుభవం గురించి మీరు ఆలోచించడం మొదలు పెడుతూఉంటారు. తద్వారా మీ మనసు ఆలోచన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరలా ధ్యానం కుదరదు కాబట్టి మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు.
(06:37) నాకు ఈ అనుభవం రావాలి. నేను వేరే YouTube ఛానల్ లో చూశను ఆయనకి భగవంతుడు కనిపించాడంట. బాడీలో ఎనర్జీ వచ్చిందంట అద్భుతం ఏదో జరిగిందంట ఇవన్నీ వద్దు అవన్నీ కూడా మీలో ఆలోచనలు క్రియేట్ చేస్తూ ఉంటాయి. ధ్యానం అనేది కుదరకుండా మిమ్మల్ని ఆప్ చేస్తాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏమి చేయొద్దు మనసుని ప్రశాంతంగా ఉంచండి ఏం జరిగినా జరగకపోయినా సరే ఉన్నది ఉన్నట్లుగా చూసే విధంగా మీరు ప్రయత్నం చేయండి.
(07:04) తద్వారా ధ్యానం మీకు అద్భుతంగా కుదురుతుంది. ధ్యానం అయిన తర్వాత మీరు వెంటనే ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు అంటే చూడడం గాన వినడం గాన మాట్లాడడం గాన స్పర్శించడం గాన ఇలా రకరకాల విషయాల్లోకి వెంటనే వెళ్ళపోకండి మినిమం ఒక 15 నుండి ఆరు గంట సేపు మీరు గ్యాప్ తీసుకోండి మినిమం తీసుకోవాలి తద్వారా మీరు ధ్యానంలో గ్రహించిన ఎనర్జీ అనేది అలాగే మీలో నిలిచి ఉంటుంది లేకపోతే మీరు ఇంద్రియాలని బయటికి పంపించడం ద్వారా తద్వారా ఆ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది.
(07:39) అలాగే ధ్యానానికి ముందు మీరు ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యే ఏ విషయాన్ని వినొద్దు చూడొద్దు మాట్లాడొద్దు ఒక 15 నిమిషాల ముందు నుండే మీరు కాస్త మౌనాన్ని పాటించండి ఫోన్ ని పక్కన పెట్టండి తద్వారా ధ్యానం అద్భుతంగా కుదురుతుంది కాబట్టి మీరు విత్తనాన్ని భూమిలో నాటడమే కాదు దానికి కావలసిన అన్ని సదుపాయాలు అందించండి. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాలు చేయండి ధ్యానం అద్భుతంగా కుదురుతుంది అయితే మీరు ఎన్ని ప్రయత్నించినా సరే ధ్యానంలో ముందుకు వెళ్ళలేకపోతే దానికి చేయవలసిన ఒకే ఒక్క పరిష్కారం క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయడమే ఎందుకంటే క్రియాయోగ సాధనలో ధ్యానం చేసేందుకు కావలసిన ప్రతి విధానాన్ని కూడా
(08:19) మీకు వివరించడం జరుగుతుంది. ధ్యానం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. దాని గురించి మీరు ప్రత్యేకంగా క్రియాయోగంలో ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. మరొక విషయం ఏమిటంటే మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నాం. మనకు ఏబిసిలో రావండి మన పిల్లలకి మనం నేర్పించలేమా కచ్చితంగా నేర్పించగలం కానీ ఎందుకు స్కూల్కి పంపిస్తున్నాం ఎందుకంటే వారు ఆ యొక్క ఎడ్యుకేషన్ ఎలా బోధించాలి తద్వారా పిల్లలు తొందరగా ఎలా నేర్చుకోవాలనే టెక్నిక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి తద్వారా వాళ్ళు వారు స్పీడ్ గా నేర్చుకొని వారు గ్రోత్ అవుతారని మనం పంపిస్తూ ఉంటాం. అదేవిధంగా
(08:56) మీకు ధ్యానం గురించి పూర్తిగా తెలియదు. తెలియనప్పుడు మీకు మీరుగా ప్రయత్నం చేయడం వల్ల ఏమవుతుదిఅంటే అందులో ఉండే కొన్ని కొన్ని టెక్నిక్స్ మీకు తెలియవు తద్వారా మీరు ఎంత ప్రయత్నిస్తున్నా సరే ధ్యానం అనేది కుదరదు కాబట్టి ధ్యానం అనేది గురుముఖంగా గురువు యొక్క సలహాల ద్వారా మీరు నేర్చుకున్నట్లయితే అద్భుతంగా కుదురుతుంది తద్వారా అద్భుతమైన స్థితిని మీరు పొందడం జరుగుతుంది.
(09:19) ఓకేనండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థాంక్యూ.
No comments:
Post a Comment