Tuesday, June 2, 2026

మొఘల్ రాజకుమార్తెలకు పెళ్లి ఎందుకు చేయలేదు? | Why Mughal Princesses Never Married?

మొఘల్ రాజకుమార్తెలకు పెళ్లి ఎందుకు చేయలేదు? | Why Mughal Princesses Never Married?

Author Name:Think Deep

Youtube Channel Url:https://www.youtube.com/@ThinkDeep

Youtube Video URL:https://www.youtube.com/watch?v=VCXQYG8LZ40



Transcript:
(00:00) కాబుల్ నుంచి దక్కన్ వరకు ఎదురులేని సైన్యం లెక్కలేనంత సంపద ఉన్న మొగల్ సామ్రాజ్యపు రాజులు తమ కూతుర్లకు పెళ్లిళ్లు చేయడానికి ఎందుకు భయపడేవారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అక్బర్ నుంచి ఔరంగజేబ్ వరకు ఎంతో మంది పవర్ఫుల్ మొగల్ రాజులు తమ కూతుర్లకు జీవితాంతం పెళ్లి చేయకుండా ఎందుకు ఉంచారు ఇది ఏదో ఒక క్రూరమైన రాజు తన కూతుర్లను బంధించి వాళ్ళ స్వేచ్ఛను లాక్కున్న కథ కాదు ఇది జియో పాలిటిక్స్ పవర్ కోసం ఆశ మరియు సర్వైవల్ కు సంబంధించిన కథ ఇక్కడ జరిగే ఒక చిన్న పొరపాటు మొత్తం మొత్తం సామ్రాజ్యాన్ని లాక్కుంటుంది నాశనం చేస్తుంది. అసలు
(00:33) అక్బర్ నామాలు రాజుల కూతుళ్లకు పెళ్లిళ్లు చేయకూడదని ఏదైనా చట్టం రాసిఉందా మొగల్ రాజులు తమ సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం కన్న కూతుళ్ల సంతోషాన్ని బలి తీసుకున్నారా లేదా దీని వెనకి ఇంకేదైనా కారణం ఉందా పదండి చూద్దాం. మొగల్ హిస్టరీని గమనిస్తే మనక ఒక పాటర్న్ కనిపిస్తుంది. నెమ్మదిగా రాజకుమార్తెలకు పెళ్ళీళ్లు చేయడం ఆగిపోతాయి.
(00:54) ముఖ్యంగా అక్బర్ తర్వాత ఈ పెళ్లిళ్లు దాదాపు లేవు. అలాగని ప్రతి మొగల్ రాజకుమార్తె జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయిందని కాదు. బాబర్ కూతురు గుల్బదన్ బేగం కు తన కజిన్ కిజర్ క్వాజా ఖాన్ తో పెళ్లి జరిగింది. అలాగే హుమాయు కూతురు బక్షీ బేగం కు ముందు ఇబ్రాహిం మిర్జాతో అతను చనిపోయాక మిర్జా ఫుద్దీన్ హుసేన్ తో పెళ్లి జరిగింది. అక్బర్ పెద్ద కూతురు కూడా సఫీ వంశానికి చెందిన మిర్జా ముజఫర్ హుసేన్ తో పెళ్లి జరిగింది.
(01:20) కానీ ఆ తర్వాత అక్బర్ తన మిగతా కూతుర్లకు పెళ్ళీళ్లు చేయడం మానేసాడు. నిజానికి ఈ మార్పు రాత్రికి రాత్రి రాలేదు. అక్బర్ తన కూతుళ్ల పెళ్లెళ్ల మీద ఏదైనా కఠిన రూల్ పెట్టుకున్నాడా బ్యాన్ చేశడా కానీ ఆ కాలం నాటి పర్షియన్ రికార్డ్స్ అయిన అబుల్ ఫజల్ రాసిన అక్బర్ నామాలో అలాంటి ఆర్డర్ లేదా చట్టం ఎక్కడా కనిపించలేదు. ఇదేదో నియంతృత్వంతో తీసుకున్న నిర్ణయం కాదు.
(01:41) చాలా ఆలోచించి నెమ్మదిగా అమలు చేసిన ఒక డైనాస్టిక్ స్ట్రాటజీ. మొగలు తమ సంచార జీవితాన్ని వదిలేసి ఇండియాలో ఒక పర్మనెంట్ అండ్ గ్రాండ్ ఎంపైర్ ను నిర్మించిన సమయం అది. తమ పవర్ ను కాపాడుకోవడానికి వాళ్ళకు కొత్త దారులు వెతకాల్సి వచ్చింది. రాజవంశం మరియు పరువును ఒక లిమిట్ లో ఉంచాలనే ఆలోచన అక్కడి నుంచి మొదలైంది. ఆ ఆలోచనే రాజకుమార్తెలకు పెళ్లి కాకుండా మిగిల్చిన శాపంగా మారింది.
(02:04) కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. రాజకుమార్తెలకు పెళ్ళీళ్లు చేయకపోవడం అనేది మొగలు ఇండియాకు రాకముందు నుంచి ఉందా లేక ఇండియా వచ్చాక మొదలైందా? ఇది తెలుసుకోవాలంటే మనం కొంచెం హిస్టరీ లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మొగలుల పూర్వీకులైన తైమూర్ చెంగిజ్ ఖాన్ కాలంలో మహిళలను కోటల్లో అలాగే నివాసాల్లో బంధించే ఆచారం ఉండేది కాదు.
(02:25) ఆనాటి టర్క్ మరియు మంగోల్ సమాజంలో మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళకు కూడా ఫ్రీడమ ఉండేది. వాళ్ళు గుర్రపు స్వారి చేసేవాళ్ళు యుద్ధ మైదానాలకు వెళ్ళేవాళ్ళు. తమ వాళ్ళ మీద ఏదైనా క్రైసిస్ వస్తే కవచం తొడుక్కొని నిలబడేవారు. ఇండియాలో మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ తన ఆటోబయోగ్రఫీ అయిన బాబర్ నామాలో ఆ విషయాలని స్వయంగా రాశాడు.
(02:44) ఫర్గానాలో తన పవర్ ను కాపాడుకోవడానికి బాబర్ కష్టపడుతున్నప్పుడు అతని నాయనమ్మ ఎసాన్ దౌలత్ బేగం ఎన్నో స్ట్రాటజీస్ చెప్పి శత్రువులను ఓడించడానికి సాయం చేసిందట. బాబర్ అక్క కంజాదా బేగం కథ వింటే ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. షబానిీ ఖాన్ అనే శత్రువు బాబర్ ను నలువైపులా చుట్టుముట్టినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి బాబర్ ఒక పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
(03:05) అతను తన సొంత అక్క ఖాన్జాదా బేగం ను షబానీ ఖాన్ దగ్గర వదిలేసి వచ్చాడు. షాన్జాదా 10ఏళ్ల పాటు ఎన్నో బలవంతపు పెళ్లిళ్లు విడాకులు ఫేస్ చేసింది. కానీ ఆమె తిరిగి తన తమ్ముడి దగ్గరికి వచ్చినప్పుడు సొసైటీ కానీ బాబర్ కానీ ఆమెను దూరం పెట్టలేదు. బాబర్ తన అక్కకు పాద్షా బేగం అనే కుటుంబంలోనే అతి పెద్ద హోదా ఇచ్చాడు.
(03:26) ఆ తర్వాత హోమయున్ మరియు అతని తమ్ముడు కామ్రన్ మధ్య గొడవలు తగ్గించడానికి అదే కాన్జాదా బేగం ఒక అద్భుతమైన డిప్లమాటిక్ పని చేసింది. మరి మొగల్ మహిళలకు అంత రెస్పెక్ట్ సమానత్వం ఉన్నప్పుడు ఇండియాలో వాళ్ళ పెళ్లిళ్లు ఎందుకు ఆగిపోయాయి. బాబర్ హోమయూన్ తర్వాత 1556లో అక్బర్ మొగల్ సింహాసనం ఎక్కాడు. ఇండియాలో తమ పవర్ స్ట్రాంగ్ చేసుకోవడం కోసం అక్బర్ రాజ్పుట్ మరియు ఇతర రీజనల్ ముస్లిం రాజులతో సంబంధాలు కలుపుకోవడం మొదలు పెట్టాడు.
(03:53) 1562 లో అమీర్ రాజు బార్మల్ తన కూతురు హర్కాబాయిని అక్బర్ కి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు మొగలులో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. పొలిటికల్ సపోర్ట్ కోసం వాళ్ళు హిందూ మరియు రీజనల్ రాజుల కూతుర్లను పెళ్లి చేసుకోవడం మొదలు పెట్టారు. కానీ తమ కూతుర్లను మాత్రం వేరే వాళ్ళకు ఇచ్చేవారు కాదు. ఇలా ఎందుకు జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ కాలంలో ఉన్న సైకాలజీ ప్రకారం కూతురును ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ కూతురును తీసుకునే వాళ్ళ కంటే తక్కువ స్థానంలో ఉండేవారు.
(04:16) ఈ ఆలోచన ఎక్కడో ఒక చోట ఈరోజు కూడా ఉంది. ఇది మీరు కూడా గమనించే ఉంటారు. ఒకవేళ గమనిస్తే కామెంట్ చేయండి. మొగల్ రాజులు తమను తాము జిల్లే ఇలాహి అంటే భూమ్మీద దేవుడి నీడగా భావించేవారు. వాళ్ళు తమ కూతురును ఏదైనా రాజ్పుట్ రాజుకు లేదా తమ కింద పనిచేసే సుబేదారుకు ఇస్తే ఆ రాజుకు తమతో సమానమైన స్టేటస్ ఇచ్చినట్టు భావించేవారు.
(04:38) అందుకే ఆడపిల్లలను తీసుకుని తమ పిల్లలను ఇవ్వకపోవడం అనేది మొగలుల సుప్రీం సిటీకి ఒక సింబల్ గా మారింది. మీరు ఇంకా మా కిందే ఉన్నారు. మాతో ఎప్పటికీ సమానం కాలేరు అని ఎప్పటికప్పుడు గుర్తు చేసే ఒక అలవాటు అన్నమాట. దర్బార్ బయట ఎవరితోనైనా సంబంధాలు కలుపుకుంటే అది లోపల ఒక కొత్త పవర్ సెంటర్ లాగా మారిపోతుందనే డౌట్ మొగలులకు ఎప్పుడూ ఉండేది.
(05:01) ఒకవేళ రాజకుమార్తెను ఏదైనా పవర్ఫుల్ మన్సబ్దారుకు లేదా సేనాధిపతికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ బంధం రేపు ఏదైనా బలహీనమైన సమయంలో ఒక తిరుగుబాటుకు కారణం కావచ్చని కొందరు హిస్టోరియన్స్ అంటారు. బహుశా ఈ కారణం వల్లే జహంగీర్ షాజహాన్ కాలంలో కుమార్తెల పెళ్లిళ్లు చాలా లిమిటెడ్ గా జరిగేవి. వాళ్ళను కేవలం కోటలకే పరిమితం చేశారు. దీనివల్ల పవర్ అంతా రాజుల కంట్రోల్ లో ఉండేది.
(05:22) ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అన్నదమ్ముల మధ్య సింహాసనం కోసం రక్తపాతం జరిగినప్పుడు ఈ రాజకుమార్తెల సపోర్ట్ ఎప్పుడు తమ సొంత కుటుంబంలోని వాళ్ళకే ఉండేది. పవర్ కోసం జరిగిన యుద్ధంలో జహానారా బేగం దారాషికోకు సపోర్ట్ చేస్తే రోష్నారా బేగం ఔరంగజేబ్ వైపు నిలబడింది. అంటే వాళ్ళ రోల్ కేవలం కోటలకే పరిమితం కాలేదు.
(05:43) పవర్ కోసం జరిగే యుద్ధంలో కూడా వాళ్ళ ఇంపాక్ట్ స్పష్టంగా కనిపించేది. దీనికి తోడు ఈ ఆచారానికి ఒక మతపరమైన సామాజిక కారణం కూడా యాడ్ అయింది. ఇస్లాంలో కఫు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే సోషల్ స్టేటస్ మరియు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరంగా సమానంగా ఉన్న వాళ్ళ మధ్య పెళ్లి జరగాలి. మొగలు తమను తాము తైమూర్ మరియు చంగీజ్ ఖాన్ వారసులుగా భావించేవారు.
(06:05) అందుకే వాళ్ళు తమ రేంజ్ అందరికంటే ఎక్కువ అని ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ ఆలోచన వల్లే వాళ్ళకు సమానమైన సంబంధం వెతకడం అంత ఈజీగా దొరికేది కాదు. యూరోప్ నుంచి వచ్చిన ఫ్రాంకోయిస్ బెర్నియన్ కూడా తన రికార్డ్స్ లో ఇదే విషయాన్ని చెప్పాడు. రాజ కుటుంబం తమకు సమానమైన సంబంధం దొరకడం కష్టమని భావించడం వల్లే మొగల్ రాజకుమార్తెలు పెళ్ళలు కాకుండా ఉండిపోయేవారు.
(06:24) కానీ కోట లోపల వాళ్ళ పవర్ వాళ్ళ పొలిటికల్ ఇంపాక్ట్ ఏ సాధారణ బేగం కంటే తక్కువ కాదు. హరన్ అంటే కేవలం పాటలు డాన్స్లు లగ్జరీ లైఫ్ అనుకుంటే అది పొరపాటు. మహిళలు కేవలం రాజును సంతోష పెట్టడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారనే ఇమేజ్ ను బ్రిటిష్ మరియు యూరోపియన్ రైట్స్ క్రియేట్ చేశయి. హరంను ఒక అతి పెద్ద పవర్ సెంటర్ గా చరిత్రకారులు చెబుతారు.
(06:45) అది తెర వెనక నుంచి మొత్తం సిస్టం ను ఎఫెక్ట్ చేసేది. అక్బర్ సమయానికి హరంలో వందల్లో కాదు వేలల్లో మహిళలు ఉండేవాళ్ళు. ఈ మొత్తం సిస్టం ను నడపడానికి మగవాళ్ళు పెద్దగా ఉండేవారు కాదు. ఇది వింటే మీకు ఆశ్చర్యం అనిపించొచ్చు. ఈ సిస్టం ను పూర్తిగా మహిళలు మరియు హిజ్రాలు లేదా క్వాజాసరాలు మాత్రమే ఆపరేట్ చేసేవారు. ఆ హరం అడ్మినిస్ట్రేషన్ లో కూడా వేరు వేరు పోస్ట్ులు బాధ్యతలు ఉండేవి.
(07:06) అన్నిటికంటే పైన పాషా బేగం ఉండేది. ఆమె ఈ ఎంపైర్ కు ఫస్ట్ లేడీ ఆమె దగ్గరే ఉజూక్ అంటే రాయల్ స్టాంప్ ఉండేది. ఏ పెద్ద నిర్ణయం లేదా ఆర్డర్ అయినా సరే ఈ స్టాంప్ పడకుండా పాస్ అయ్యేది కాదు. అలాగే హరంలో మహల్దార్ అనే ఒక పోస్ట్ ఉండేది. ఆమె మొత్తం హరకు చీఫ్ అడ్మినిస్ట్రేటర్ పైగా రాజుకు అత్యంత ముఖ్యమైన స్పై లాగా పనిచేసేది.
(07:27) మహల్దార్కు ఎంత పవర్ ఉండేదంటే ఆమె యువరాజులను కూడా మందలించేది. అలాగే అకౌంట్స్ చూసుకోవడానికి హవాల్దార్ ఉండేవాడు. హరం సెక్యూరిటీ కోసం కూడా మహిళలే ఉండేవారని హిస్టారియన్స్ చెబుతున్నారు. రాజు హరం లోపల ఉన్నప్పుడు అతని భద్రత అంతా మహిళా గాడ్స్ చేతుల్లోనే ఉండేది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఆ పెళ్లి కాని రాజ కుమార్తెలు ఏమి అమాయకులు లేదా చేతకాని వాళ్ళయితే కాదు.
(07:49) రూబీలాల్ అఫ్గన్ బుఖారిీ లాంటి మోడర్న్ హిస్టోరియన్స్ చేసిన రీసెర్చ్ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. పెళ్లి చేసుకునే పిల్లల్ని కానీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసే బేసిక్ రైట్ ను వాళ్ళకు దూరం చేసినప్పుడు వాళ్ళు ఆ ఎనర్జీ మొత్తాన్ని వేరే వైపు మళ్ళంచేవారు. ఆ మహిళలు తమ ఫోకస్ అంతా పవర్, పాలిటిక్స్, బిజినెస్ మరియు ఆర్కిటెక్ట్ మీద పెట్టేవారు.
(08:09) వాళ్ళు తెర వెనక ఉండి మొత్తం ప్రపంచాన్ని తమ కనుసన్నల్లో నడిపించారు. షాజహాన్ కు అత్యంత ఇష్టమైన కూతురు జహానారా బేగం దీనికి అతి పెద్ద ఎగ్జాంపుల్ 1631లో వాళ్ళ అమ్మ ముంతాజ్ మహల్ చనిపోయినప్పుడు కేవలం 17 ఏళ్ల వయసులో జహానారాను పాద్షా బేగంగా చేశారు. ఆ రోజుల్లో ఆమె శాలరీ ఎంత ఉండేదో మీరు ఊహించగలరా జహానారా బేగంకు సంవత్సరానికి 6 లక్షల రూపాయలు వజీఫా దొరికేది.
(08:33) షాజహాన్ దాన్ని మరింత పెంచి 10 లక్షలు చేశాడు. ఇక ఔరంగజేబ్ సింహాసనం ఎక్కాక తన సొంత అక్క శాలరీని సంవత్సరానికి 17 లక్షల రూపాయలుగా చేశాడు. దీనికి తోడు అప్పట్లో మొగల్ సామ్రాజ్యంలో అత్యంత రిచ్ పోస్ట్ అయిన సురత్ నుంచి రెవెన్యూలో చాలా భాగం నేరుగా జహానారకి వెళ్ళేది. రాజకుమార్తెలు కేవలం కోటలో కూర్చుని ఆ వజీఫాతోనే బ్రతికేలేదు. వాళ్ళు ఒక కార్పొరేట్ బాస్ లాగా బిజినెస్ చేసేవాళ్ళు.
(08:56) వాళ్ళకు సొంతంగా పెద్ద పెద్ద షిప్స్ ఉండేవి. మొగల్ మహారాణులకు రహీమి అనే ఒక షిప్ ఉండేది. దీని బరువు 1200 టన్నల కంటే ఎక్కువ. ఈ షిప్ మసాలాలు, బట్టలు, నీలి మందు తీసుకుని రెడ్ సీ అంటే ఎర్ర సముద్రం పోర్ట్ వరకు వెళ్ళేవి. డచ్ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలతో వర్తగాలు చేసేవాళ్ళు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఔరంగజేబ్ పాలన వచ్చేసరికి ఈ నో మ్యారేజ్ పాలసీలో చాలా తెలివిగా ఒక మార్పు చేశారు.
(09:22) ఔరంగజేబ్ పక్కా సున్నీ ముస్లిం. ఇస్లాం ప్రకారం జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండడం కరెక్ట్ కాదని అతనికి తెలుసు. దానికి తోడు అతని కుటుంబంలో పొలిటికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. అందుకే తన మతపరమైన ఆలోచనలను జియోపొలిటికల్ ప్లానింగ్ ను కలిపి ఒక కొత్త దారి వెతికాడు. ఔరంగజేబ్ తన కూతుర్లకు మేనకోడలకు పెళ్లిళ్లు చేశాడు.
(09:41) కానీ ఆ పెళ్లిళ్లు బయట వాళ్ళతో చేయలేదు. సింహాసనం కోసం జరిగిన యుద్ధంలో తను ఓడించి చంపేసిన తన సొంత అన్నదమ్ముల కొడుకులతోనే చేశాడు. ఆ నిర్ణయం కేవలం ఒక ప్లాన్ మాత్రమే కాదు మతపరమైన నియమాలు ఫ్యామిలీ బ్యాలెన్స్ పొలిటికల్ సెక్యూరిటీలకు సంబంధించిన ఒక పర్ఫెక్ట్ కాక్టైల్ లాంటిది. ఎగ్జాంపుల్ కు ఔరంగజేబ్ తన కూతురు జుబ్దుత్ ఉన్ నిసాకు సిపిహేర్ షికోతో పెళ్లి చేశాడు.
(10:03) సిపిహేర్ షికో మరెవరో కాదు ఔరంగజేబ్ ఎవరి తలనైతే నరికించాడో అదే దారాషికో సొంత కొడుకు ఇది చాలా భయంకరమైన మాకేవెలేవ్ స్ట్రాటజీ ఇలా చేయడం ద్వారా ఔరంగజేబ్ తన శత్రువులను చాలా వరకు తన కంట్రోల్ లోనే ఉంచుకున్నాడు. బ్లడ్ లైన్ ప్యూరిటీని కూడా కాపాడుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే శత్రువుల కొడుకులను అల్లుళ్లుగా మార్చుకొని వాళ్ళను పూర్తిగా తన చేతుల్లో పెట్టుకున్నాడు.
(10:26) ఆ ఆ అల్లుళ్ళకు సొంతంగా ఎలాంటి సైన్యం కానీ జాగీర్లు కానీ లేరు. వాళ్ళు పూర్తిగా ఔరంగజేబ్ వేసే ముక్కల మీదే ఆధారపడి ఉంటారు. అంటే జీతం. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఔరంగజేబ్ కూతుర్లందరి తలరాత ఒకేలా లేదు. అతని పెద్ద కూతురు జెబూన్ నిసా స్టోరీ మొగల్ హిస్టరీలోనే అత్యంత బాధాకరమైంది. జెబూన్ నిసా చాలా గౌరవప్రదమైన ఒక ఇంటలెక్చువల్ మరియు స్కాలర్.
(10:49) ఆమెకు పెళ్లి చేసుకునే పర్మిషన్ లేకపోవడంతో తనకంటూ ఒక పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేసుకుంది. సూఫీయిజం మరియు కవిత్వాన్ని తన తోడుగా మార్చుకుంది. మక్ఫీ అనే పేరుతో ఆమె ఎంతో బాధతో కూడిన తిరుగుబాటు రగిల్చే కవిత్వాలు రాసేది. ఆమె రాసిన దివాన్ ఏ ముక్ఫీ ఈరోజుకి ఉంది. జేబునిసా ఫ్రీ థింకింగ్ అనేది ఔరంగజేబ్ కు ఎప్పుడూ నచ్చేది కాదు.
(11:10) 1681లో ఔరంగజేబ్ కొడుకు ప్రిన్స్ అక్బర్ తన తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు జేబునిసా తన తమ్ముడికి సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఔరంగజేబ్ చేసిన పని మొగలు [సంగీతం] క్రూరత్వానికి ఒక నిదర్శనంగా నిలిచింది. తను ఎంతో టాలెంట్ ఉన్న తన సొంత కూతురిని [సంగీతం] ఆస్తిలో నుంచి పూర్తిగా గగ్గెంటేశారు. అంతేకాకుండా ఆమెను ఢిల్లీలోని సలీం గడు కోటలో 20 ఏళ్ల పాటు ఖైదు చేశారు.
(11:32) జేబున్నిసా తన చివరి శ్వాస వరకు అక్కడే ఖైదుగా ఉండిపోయింది. జైలు గోడల మధ్య రగులుతున్న ఆ సైలెంట్ తిరుగుబాటుకు ఆమె కవిత్వమే సాక్ష్యం. ఇక మొగల్ రాజకుమార్తెలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన చరిత్ర కేవలం మహిళలను అణచివేసిన కథ మాత్రమే [సంగీతం] కాదు పవర్ సాధించడానికి దాన్ని కాపాడుకోవడానికి చెల్లించాల్సిన మూల్యానికి ఇదొక ఉదాహరణ. మొగల్ రాజులు సామ్రాజ్యాన్ని స్టేబుల్ గా ఉంచడానికి తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ కూతుర్ల పర్సనల్ లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ చూపించాయి.
(11:59) కానీ మహిళలు కూడా ఎప్పుడూ ఓడిపోలేదు. తమకున్న ఒంటరితనాన్ని ఆ లోటును సంపద ట్రేడ్ పాలిటిక్స్ మరియు డిప్లమసీతో భర్తీ చేసుకున్నారు. పవర్ ఎప్పుడు సింహాసనం మీద కూర్చునే వాళ్ళ చేతుల్లోనే ఉండదని వాళ్ళు ప్రూవ్ చేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
(12:18) నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.

No comments:

Post a Comment