The Dark Secret of Pleasure: Orgasm తర్వాత వచ్చే ఆ బాధ ఏంటి? | Nagna Satyam Podcast
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=m3ysX-rbFKw
Transcript:
(00:04) మీ జీవితంలో అత్యంత సంతోషంగా ఏ ఆలోచన లేకుండా ఉండే క్షణం ఏది? పవర్ చేతికివచ్చినప్పుడా అకౌంట్ లో కోట్లు పడినప్పుడా బట్ ఇవన్నీ మైండ్ కి తృప్తిని ఇస్తాయేమో గానీ మైండ్ ని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయలేవు. మనిషి బుర్రలో లాజిక్ చచ్చిపోయి కేవలం ప్యూర్ ప్రెసెంట్ లో ఉండిపోయే ఏకైక క్షణం సెక్స్ శిఖరాగ్రంలో ఉన్నప్పుడు అదే ఆర్గాజం ఆ కొన్ని సెకండ్లు మనిషికి ఈ లోకంతో సంబంధం ఉండదు.
(00:34) బాడీలో కెమికల్స్ బ్లాస్ట్ అవుతాయి. నిన్నటి గిల్ట్ ఉండదు రేపటి భయం ఉండదు సమాజం పెట్టిన రూల్స్ గుర్తుండవు. అంతా ఒక పరమానందం ఒక బౌండరీ లేని ఫ్రీడమ లో తేలిపోతుంటాం. బట్ కథ ఇక్కడే మొదలవుతుంది. ఆ సుఖం ముగిసిన మరుక్షణమే ఆ రూమ్ అంతా ఒక భయంకరమైన నిశశబ్దం ఆవహిస్తుంది. ఇందాకటిదాకా ఆకాశంలో విహరించిన మనిషి ఒక్కసారిగా రెక్కలు తెగి నేలకేసి కొట్టినట్టు పడిపోతాడు.
(01:02) ఒక వింతైన విచారం ఒక లోతైన శూన్యత ఏదో తెలియని ఒంటరితనం ఒక రకమైన గిల్ట్ లోపల స్లోగా స్టార్ట్ అవుతాయి. ఇందాకడిదాకా దేనికోసమైతే అంతలా తపించిపోయాడో అదే శరీరం పక్కనున్నా కూడా ఆ మనిషి వైపు చూడటానికి కూడా ఏదో తెలియని అనాసక్తి కలుగుతుంది. చూడడానికి కనీసం ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ పీక్ హ్యాపీనెస్ తర్వాత అంత పెద్ద లోయ లాంటి శూన్యతలోకి మనిషి ఎందుకు పడిపోతాడు? డచ్ ఫిలాసఫర్ బరుక్ స్పినోజా ఒక మైండ్ బ్లోయింగ్ పాయింట్ చెప్పాడు.
(01:36) ఆయన తన పుస్తకంలో ఏమన్నాడంటే నువ్వు ఆ శారీరక సుఖం అనుభవిస్తున్నంతసేపు నీ మనసు అందులోనే పూర్తిగా మునిగిపోతుంది. అది తప్ప వేరే లోకం లేనట్టు అదే నీ జీవిత పరమావధి అన్నట్టు నీ మైండ్ నిన్ను నమ్మిస్తుంది. కానీ ఆ సుఖం ముగిసిన మరుక్షణమే ఒక తీవ్రమైన విచారం నిన్ను ఆవహిస్తుంది. అది నీ మనసును పూర్తిగా గందరగోళానికి గురిచేస్తుంది మొద్దుబార్చేస్తుంది.
(02:01) స్పినోజా చెప్పిన ఈ గ్రేటెస్ట్ సాడ్నెస్ వెనుక ఒక భయంకరమైన సైకాలజీ ఏంటంటే సెక్స్ కి ముందు నీ బాడీని నడిపించేది కామం లేదా ఒక తీవ్రమైన కోరిక. ఆ కోరిక నీ కళ్ళకు గంతలు కడుతుంది. ఇది దొరికితే నీ లైఫ్ సెట్ అయిపోతుంది. నీ లోపల ఉన్న ఒంటరితనం పోతుంది. నువ్వు వేరే మనిషితో ఒకటైపోతావు అని [సంగీతం] నీ బుర్ర నిన్ను దారుణంగా మోసం చేస్తుంది.
(02:25) తీరా ఆ సుఖం తీరిపోయాక ఆ ఇల్యూజన్ అనే స్క్రీన్ ఒక్కసారిగా చిరిగిపోతుందన్నమాట. స్క్రీన్ చిరగ్గానే నీకు ఏం కనిపిస్తుందో తెలుసా రియాలిటీ. నువ్వు ఎంతగా ఇంకొకరి శరీరంలో లీనమైపోయినా ఎంత తీవ్రంగా ఆ క్షణాన్ని అనుభవించినా ఆ సుఖం ముగిసాక మళ్ళీ నువ్వు ఒంటరి వాడివే అనే పచ్చి నిజం నీ ముఖం మీద కొడుతుంది. శరీరాలు కలవచ్చు కానీ అస్తిత్వాలు కలవవు.
(02:51) ఆ క్షణంలో నీకు అర్థమవుతుంది. నువ్వు ఏ ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి ఆ సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్ళావో ఆ ఒంటరితనం ఎక్కడికి పోలేదు అది అక్కడే ఉంది. ఇంకాస్త పెద్దదై నీ వైపు చూస్తూ నవ్వుతోంది. దీన్నే స్పినోజా మనసు ముద్దుబారిపోవడం అన్నాడు. ఎందుకంటే ఇందాకదాకా పీక్స్ లో ఉన్న ఎనర్జీ ఒక్కసారిగా జీరోకి పడిపోతుంది. కోరిక ఉన్నంతసేపు మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది.
(03:16) ఆ లక్ష్యం చేరడమే జీవితం అనుకుంటాడు. కానీ లక్ష్యం నెరవేరిన మరుక్షణమే తర్వాత ఏంటి అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానం లేనప్పుడే ఈ శూన్యత పుడుతుంది. సెక్స్ తర్వాత వచ్చే ఆ పోస్ట్ కాయిటల్ విచారం లాంటిదే ఈరోజు ప్రతి ఒక్కడు తన నైట్ లైఫ్ తర్వాత తన వీకెండ్ హ్యాంగోవర్ తర్వాత అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు మనిషి దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
(03:40) కానీ జీవితానికి ఒక అర్థం లేదు. నువ్వు సుఖం వెనుక పరిగెడుతున్నంతసేపు నీకు లైఫ్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ సుఖం ముగిసిన ప్రతిసారి లోపల ఒక చిన్న వాయిస్ వినపడుతుంది చూసావా అది నిన్ను అడుగుతుంది. ఇక ఎంతకాలం ఈ తాత్కాలిక మత్తులో బ్రతుకుతావు నీ జీవితానికి అసలైన అర్థం ఏది? ఈరోజు రాత్రికి ఈ సుఖం తీరిపోతుంది.
(04:02) మరి రేపు ఉదయం నువ్వు ఎందుకు లేవాలి? నీ బ్రతుకుకి కారణం ఏంటి? అని. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేకే ఆ శూన్యతను భరించలేకే మనిషి మళ్ళీ ఇంకో తాత్కాలిక సుఖం వైపు పరిగెడుతున్నాడు. ఒక సెక్స్ అయిపోగానే ఇంకో పార్ట్నర్ కోసం ఒక రీల్ అయిపోగానే ఇంకో రీల్ కోసం ఒక పెగ్ అయిపోగానే ఇంకో పెగ్ కోసం ఇలా ఒక లూప్ లో ఇరుక్కుపోయాడు. నిజానికి ఈ సుఖం తర్వాత వచ్చే ఆ విచారాన్ని తట్టుకోవడానికి మనుషులు రకరకాల డిస్ట్రాక్షన్స్ వెతుక్కుంటారు.
(04:31) సెక్స్ అవ్వగానే కొందరు వెంటనే నిద్రపోతారు. కొందరు లేచి సిగరెట్ కాలుస్తారు కొందరు ఫోన్ పట్టుకుంటారు. ఎందుకు ఆ శూన్యతను ఫేస్ చేసే దమ్ము లేక ఆ నిశశబ్దం మనల్ని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నలకి మన దగ్గర ఆన్సర్స్ లేవు. అందుకే ఆ నిశశబ్దాన్ని ఏదో ఒక దానితో భర్తీ చేయాలి. స్పినోజా ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మనిషి ఎప్పుడైతే తన ఎమోషన్స్ కి తన శారీరక సుఖాలకి బానిస అవుతాడో వాడు తన ఫ్రీడమ్ ని కోల్పోతాడు.
(04:58) నువ్వు ఒక సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావు అని అనుకుంటావు. కానీ నిజానికి ఆ సుఖం నిన్ను నడిపిస్తోంది. కాసేపు ఆ సుఖం అనే మత్తుమందు ఇచ్చి అది అయిపోగానే నిన్ను మరింత దారుణమైన నరకంలోకి నెట్టేస్తోంది. ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచం సరిగ్గా ఇదే చేస్తోంది. నీకు నిరంతరం సుఖాల్ని అలవాటు చేస్తోంది.
(05:19) నొప్పి తెలియకుండా సెడేషన్ ఇస్తోంది. పెయిన్ లెస్ లైఫ్ అంటేనే హ్యాపీ లైఫ్ అని [సంగీతం] నిన్ను నమ్మిస్తుంది. కానీ ఆ టెంపరరీ సుఖాల తర్వాత వచ్చే ఆ భయంకరమైన ఎంటీనెస్ [సంగీతం] ని ఏ కంపెనీ దాచలేదు ఏ ఆల్గరిథం భర్తీ చేయలేదు. సపోజ్ నువ్వు ఒక లగ్జరీ కార్ కొన్నావు. ఆ కిక్ కొన్నాళ్ళు ఉంటుంది. తర్వాత కార్ నార్మల్ అయిపోతుంది. శూన్యత మిగులుతుంది.
(05:40) నువ్వు అనుకున్న జాబ్ సాధించావు. ఆ సంతోషం కొన్ని రోజులు ఉంటుంది. తర్వాత మళ్ళీ అదే రొటీన్ లైఫ్ అదే శూన్యత. నువ్వు అనుకున్న వ్యక్తితో సెక్స్ చేశవు. ఆ ప్లెజర్ కొన్ని నిమిషాలు ఉంటుంది. తర్వాత మళ్ళీ అదే విచారం అంటే సుఖం అనేది ఎప్పుడూ ఒక పర్మనెంట్ సొల్యూషన్ కాదు అది కేవలం ఒక టెంపరరీ బ్రేక్ మాత్రమే అయితే దీనికి సొల్యూషన్ ఏంటి మనం సుఖపడడం మానేయాలా సెక్స్ వదిలేయాలా ఎంజాయ్ చేయడం ఆపేయాలా అంటే నువ్వు కేవలం ఇంద్రియ సుఖాల వెనుక పరిగెడితే ఎప్పటికీ ఆ విచారంలోనే మునిగిపోతావు.
(06:13) కానీ ఎప్పుడైతే నువ్వు నాలెడ్జ్ మరియు రీజన్ వైపు వెళ్తావో నీ జీవితానికి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్మించుకుంటావో అప్పుడు [సంగీతం] నీకు లభించే ఆనందం పర్మనెంట్ గా ఉంటుంది. దాన్నే ఆయన బ్లెస్సడ్నెస్ అన్నాడు. సెక్స్ కోసం లేదా ఏదైనా టెంపరరీ సుఖం కోసం వెతకడం ఒక బేసిక్ ఇన్స్టింట్ అది జంతువుల్లోనూ ఉంటుంది. కానీ ఆ సుఖం ముగిసాక వచ్చే ఆ శూన్యతను చూసి భయపడి దాన్ని తట్టుకోలేక మళ్ళీ ఇంకో సుఖం వైపు పరిగెడితే వాడు బలహీనుడు.
(06:41) సో దాన్ని ఫేస్ చేయడమే ఒక రకంగా పొందే అసలైన కిక్ లేదా అక్కడే దాగుడు ముటాలు దండగూడంటూ పని కానించేసి దాకోవడమే అందులో ఏముంటుంది బొంగు అప్పుడు జంతువుకి నీకు పెద్ద తేడా ఏమ ఉండదుగా
No comments:
Post a Comment