The Divine Yoga Taught by Lord Krishna | Sankhya Yoga |Bhargava Sharma #bhagavadgita #sreesannidhitv
Author Name:Sree Sannidhi TV
Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=UIR1YaRrRpk
Transcript:
(00:02) [సంగీతం] శ్రీ సన్నిధి ప్రేక్షకుల నమస్కారం మనం ఎందరో యోగులను ఎందరో గురువులను మరి ఎందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. చిద్గురుగీత భార్గవ శర్మ గారు వారు వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఏ విధంగా ప్రారంభమైంది వారి గురువులని ఏ విధంగా కలుసుకున్నారు అక్కడ వారు పొందినటువంటి జ్ఞానం ఏంటి ఏ
(00:46) లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఈ చిద్గురుగీత ద్వారా వారు ఎందరికో మార్గ నిర్దేశం చేస్తూ భగవద్గీతని మన నిత్య జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవాలి అనేక విషయాలు తెలియజేస్తూ వారు వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎంత గొప్పగా మలుచుకున్నారో గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం. అయితే అసలు భగవద్గీత ఎందుకు బోధించబడింది దాన్ని మన నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవాలి ఏ అధ్యాయానికి అంటే నిగూడంగా ఉన్నటువంటి అర్థాలు ఏంటి ఆ అధ్యాయం ద్వారా మనం పొందవలసినటువంటి నిత్య జీవితంలో ఉపయోగపడే జ్ఞానం ఏంటి ఇలా అనేక విషయాలు ఈరోజు మనం ఈ సత్సంగంలో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు
(01:30) నమస్కారం అండి గురువుగారు మొన్న మనం మాట్లాడుకున్నాం సత్సంగంలో మనకి చాలా మంచి విషయాలు తెలియజేశారు దానికి అందరి నుంచి కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది అయితే భగవానులు ఈ ఒక్కొక్క దాన్ని సెపరేట్ సెపరేట్ సెపరేట్ గా చేసుకుంటూ వెళ్ళడానికి కారణం ఏంటి దానిలో నిగూడంగా ఏం అర్థం ఉన్నది ఇప్పుడు కర్మయోగం అనుకుందాం మూడవ అధ్యాయం ఈ కర్మయోగంలో ఉన్నటువంటి శ్లోకాల్లో ముఖ్యమైనగా మనం తీసుకోవాల్సిన శ్లోకాలు ఏంటి దానిలో నిగూడంగా ఉన్న అర్థం ఏంటి దాని ద్వారా మన భౌతిక జీవనంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అవును గీతాసారం అనేది ఒక్కటే అయితే ఎందుకు ఇన్ని
(02:10) అధ్యాయాలుగా విభజింప చేశారు వ్యాసులవారు అసలు వ్యాసుడు అంటేనే విభజించడం వ్యాస అనే పదానికి అర్థం ఏంటంటే విభజిస్తాడు ఆయన ఒక్కటే కుప్పగా ఉన్నటువంటి వేదాన్ని వేద నిధిని ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద అని ఆయన మొట్టమొదటే ఆయన యొక్క ఆటిట్యూడే విభజించడం ఎందుకు విభజించాలి అనింటే ఒక విషయాన్ని విభజించకుండా విశ్లేషించకుండా దాన్ని మనం అందుకోలేంు సారం తీసుకో సారం తీసుకోలేము ఇప్పుడు మనం తీసుకున్న ఆహారం అయినా సరే లాలాజలం దగ్గర విభజింపబడుతుంది అణు అణువుగా విభజింపబడుతుంది.
(02:50) అది గొంతు దగ్గర విభజింపబడుతుంది జర్ణాశయంలో కూడా విభజింపబడి దాని యొక్క సారాన్ని ఈ దేహం ఎలా అయితే గ్రహిస్తుందో ఒక విశ్లేషించాలి ఒక అంశాన్ని మనం ఒక జ్ఞానపరమైనటువంటి అంశాన్ని విశ్లేషించాలి అంటే దాన్ని విభజించాలి అదే వ్యాసుని యొక్క స్వరూపం దేన్నైనా సరే విభజించాలి విభజించనిదే విషయాన్ని అర్థం చేసుకోలేము సో ఒక అంశాన్ని భగవద్గీత ద్వారా మనకు అందిస్తున్నారు వ్యాసులవారు ఈ అంశాన్ని ఉన్నది ఉన్నట్లుగా అందించొచ్చు ఒకే వ్యవస్థలాగా అందించొచ్చు అలా ఒకే వ్యవస్థలాగా అందించినప్పుడు దాన్ని మనం విశ్లేషించలేం విభజించలేము సో వ్యాసుల వారు మనల్ని దయతో ఆయన మన మీద
(03:32) అపారమైనటువంటి ప్రేమతో సాధారణంగా అయితే గురువు విభజించడు గురువు సారం చెప్తాడు అంతే ఆ విభజించుకునే ప్రాసెస్ విశ్లేషించుకునే ప్రాసెస్ విచారణ చేసే ప్రాసెస్ సాధన చేసే ప్రాసెస్ అంతా సాధకుడి మీద ఆధారపడి ఉంటుంది కానీ వ్యాసుల వారు మనం చేయాల్సిన హోమ వర్క్ను కూడా సాధకులు శిష్యులు చేయాల్సినటువంటి హోమ వర్క్ను కూడా ఆయనే చేసి విభాగం చేసి మనకు భగవద్గీతను అందించారు.
(03:58) సో మనం పెద్దగా ఇంకా చేయాల్సిన అవసరం లేకుండా దాన్ని గ్రహించడమే అంటే ఎసెన్స్ ని తీసుకోవడమే అన్నట్లుగా భగవద్గీతను రెడీమేడ్ గా తయారు చేసి అందించారు వ్యాసుల వారి నోటి నుండి వచ్చినది అలాగే వినాయకుల వారు రాశారు మనం అర్థం చేసుకోవాలి ఎంతమంది భగవద్గీతకు శ్రమ చేశారు. భగవద్గీత నీ దగ్గరికి రావాలి అంటే ఎవరెవరు దాని వెనక ఉన్నారు అని అర్థం చేసుకుంటే శ్రీకృష్ణుల వారు వ్యక్తం చేశారు ఆ సారాన్ని వ్యాసుడి ముఖము నుండి ఉద్భవించింది అది లిఖిత రూపంలో శాస్త్ర రూపంలో వినాయకుల వారు రాశారు కృష్ణ ద్వైపాయుడు అంటారు వ్యాసులవారు అంటే ఆయన ఒక అవతారం వినాయకుల వారు తక్కువ వ్యక్తి కాదు
(04:38) శ్రీకృష్ణ పరమాత్మ అసలు తక్కువ వ్యక్తి కాదు ఇంతమంది ముగ్గురు కలిసి మనకి భగవద్గీతని అందించారు అంటేనే మనం భగవద్గీతను ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయకూడదు అనేది అర్థమైపోతుంది అవును మనం ఇప్పుడు 18 అధ్యాయాలు భగవద్గీతలో ఉన్నాయి. అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం అంటాం. యోగము అంటే అది కలిసి ఆ విధమైనటువంటి వ్యవస్థతో అర్జునుడు అనుసంధానం అవ్వడం చేత దానికి ఆ యోగం అని పేరు పెట్టారు.
(05:05) అక్కడ విషాదం అనేది పొందాడు కాబట్టి విషాద యోగం. విషాదం నుండి బయటకి రావాలి అంటే ఏం చేయాలి? ఒక దిశ నిర్దేశం కావాలి. ఏది నిజం ఏది అబద్ధం తెలియాలి అలా ఏది నిజం ఏది సత్యం ఏది అసత్యం ఏది ఉన్నది ఏది లేదు అని తెలియాలి కాబట్టి సాంఖ్య యోగం అని చెప్పారు. తర్వాత అది తెలిసింది ప్రణాళిక అర్థమయిన తర్వాత నువ్వు కర్తవ్యోన్ముఖుడివి కావాలి కర్తవ్యోన్ముఖడు కావాలంటే ఎలా చేయాలి అనేది తెలియాలి అందుకనే కర్మ యోగం చెప్పారు.
(05:31) ఎలా చేయాలో తెలిసినంత మాత్రం సరిపోదు దానికి కావాల్సినటువంటి పరిజ్ఞానం కూడా తనకు ఉండాలి కాబట్టి వెంటనే జ్ఞాన యోగం అని చెప్పారు అంటే స్టెప్ బై స్టెప్ అన్నమాట మనకి ఇదే విధమైనటువంటి వ్యవస్థ అన్ని వాంగ్మయాల్లోనూ ఉంటుంది పతంజలి యోగ సూత్రాలు తీసుకున్నట్లయితే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని ఒక మెట్లు లాగా అన్నమాట ఇది అయిపోయిన తర్వాత అది అది అయిపోయిన తర్వాత అది అట్లాగే మీరు అధ్యాయాలను కూడా ఒక క్రమంలో సమన్వయం చేసుకోవాలి అధ్యాయం పేర్లను వదిలేసేయకూడదు అది కూడా ఒక సోపాన ప్రక్రియ దేనికి మోక్ష సన్యాస యోగానికి ముందుగా మనం విషాదంలో ఉండ మనం
(06:06) అందరం అది కావాలి ఇది కావాలి ఒక బాధలో ఉంటాం ఒక వెలితిలో ఉంటాం ఆ వెలితి ఉండేటటువంటి ప్రకరణమే విషాద యోగం తర్వాత సాంఖ్య యోగం తర్వాత కర్మ యోగం తర్వాత జ్ఞాన యోగం జ్ఞానం తెలిసింది అంటే అజ్ఞానాన్ని వదిలేయాలి కదా అదే సన్యాస యోగం అజ్ఞానాన్ని వదిలేసావు అంటే నీ స్వరూపాన్ని దర్శించేటటువంటి ధ్యాన యోగంలో నువ్వు నిమజ్ఞుడు అవుతావు ధ్యాన యోగం నీకు అర్థమయింది అంటే జ్ఞానం ఏంటి విజ్ఞానం ఏంటి అనేటటువంటి స్పృహ నీకు అర్థం అవుతుంది అందుకే జ్ఞాన విజ్ఞాన యోగం తర్వాత విభూతి యోగం తర్వాత రాజవిద్యా రాజగుహ్య యోగం తర్వాత విశ్వరూప దర్శన యోగం
(06:38) తర్వాత భక్తి యోగం అక్షర బ్రహ్మ యోగం నాశనం కానీ బ్రాహ్మీ స్థితిని నువ్వు పొందడం ఈ ఆరు అధ్యాయాలని జ్ఞాన శట్కం అంటారు మనం గమనించినట్లయితే ఈ మొదటి ఆరు రెండవ ఆరు పూర్తిగా మన అంతర్గతమైనటువంటి వ్యవస్థలని తెలియజేస్తాయి. లోపల ఆత్మతత్వం ఎలా ఉంటుంది జ్ఞానం ఎలా ఉంటుంది ధ్యానం ఎలా చేయాలి తత్వం ఏంటి అనేటటువంటి అంశాలు ఉంటాయి.
(07:02) ఇక చివరి ఆరు అధ్యాయాలని మనం భక్తి షట్కంగా చెప్పుకుంటాం ఆ ఆరు అధ్యాయాలు పూర్తిగా ఎక్స్టర్నల్ గా నువ్వు ఎలా ఉండాలి ఆ విధమైనటువంటి విశ్లేషణ మనక అంటే లోకంలో నువ్వు ఎలా జీవించాలి ఈ భగవద్గీత జ్ఞానంతో వ్యక్తిగతంగా ఎలా ఎదగాలి శారీరకంగా ఎలా ఎదగాలి సామాజికంగా ఎలా ఎదగాలి అనేటటువంటి మూడు అంశాలు చెప్పినట్టుగా ఉంటుంది. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగము యోగం అంటారు అసలు ఏంటి క్షేత్రం అంటే ఏంటి అంటే ఏదో కౌరవ క్షేత్రం అనో ఆ కురుక్షేత్రం అనో రాస్తారు చాలామంది అలా రాస్తారనే వ్యాసుల వారు క్షేత్రం అంటే అది కాదయ్యా ఇదం శరీరం క్షేత్రం మిత్య విధియతే ఈ శరీరాన్నే క్షేత్రం అని పిలుస్తున్నారు
(07:40) నువ్వు శరీరం దాటి బయటికి వెళ్లొద్దు నువ్వు అర్థాలు రాయాలి అంటే సంస్కృతం తెలుసు కదా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవహ మామక పాండవాస్వ కిమకుత సంధ్య అనగానే ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్ర తలో సమావేశమై ఉన్నటువంటి నావాళ్ళు పాండవులు ఏమి చేసిరు సంధ్య అనేటటువంటి సమన్వయంకి వెళ్ళావు అంటే నువ్వు మొట్టమొదట్లోనే బురదగుండలో పడ్డాడు.
(08:00) అయిపోయింది. ఎక్కడో ధర్మక్షేత్రం కురుక్షేత్రం అన్నావు అంటే నువ్వు అయిపోయినట్టే మిస్టేక్ చేసినట్టే ఇక మొత్తం వేస్ట్ అక్కడితోనే పతనం అయిపోయినట్టే ఇక భగవద్గీత మనకు అందదు స్వామి అనుగ్రహం మనకు అందదు మోక్ష సన్యాసం వైపు నువ్వు వెళ్ళే ప్రశ్నే లేదు. అందుకే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చబిదీతే ఈ శరీరాన్నేనయ్యా నేను క్షేత్రం అని పిలుస్తున్నాను అంతే గానీ అదేదో క్షేత్రం కాదు అదేదో ఏరియాకి అది ఆ చెప్పగానే కురుక్షేత్రంకి వెళ్ళాలి టికెట్స్ బస్సులు పుణ్యం తీర్థయాత్రలు అలా వెళ్ళిపోతాం మనం అక్కడ సప్త అదో బిజినెస్ మళ్ళీ వ్యాపారం రకరకాలుగా వెళ్ళిపోతుంది అట్లా కాదు ఇదే
(08:34) శరీరం ఈ క్షేత్రంలోనే మనకి రెండు విధాలైనటువంటి అంశాలు ఉంటాయి. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం అవ్వగానే గుణత్రయ విభాగ యుగం మనుషులు ఎంతమంది ఉంటారు మనుషుల రకాలు ఏంటి ఏ ఏ గుణాలు ఉంటాయి ఏ గుణాలు వాళ్ళు ఎటువంటి ఆహారం తింటారు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు ఎలాంటి ఆటిట్యూడ్ కలిగి ఉంటారు వాళ్ళ [గొంతు సవరించుకోవడం] యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అంటే రజోగుణం వాడిని ఎలా కంట్రోల్ చేయాలి తమోగుణం వాడితో ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి ఒక విజ్ఞానదాయకమైనటువంటి చాప్టర్ ఉంటుంది ఇది పిల్లలకి తెలియజేస్తే అద్భుతంగా వాళ్ళు తేజోవంతులు అవుతారు
(09:08) గుణత్రయ విభాగం తర్వాత పురుష పుషోత్తమ యోగం పురుషోత్తమ యోగం తర్వాత దైవాసుర సంపద్ విభాగ యోగం అంటే ఏంటి బ్యాడ్ ఏంటి గుడ్ ఏంటి నీకు తెలియాలి నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి తెలియాలి నెగిటివ్ తెలియదు పాజిటివ్ తెలియదు ఎలా పడితే అలా వెళ్ళకుండా అసలు పాజిటివ్ ఇలా ఉంటుంది నెగిటివ్ ఇలా ఉంటుంది అనేది తెలియడం కోసమే దైవాసర సంపద్ విభాగ యోగం అంటారు.
(09:30) నన్ను కొంతమంది ఫోన్ చేసి గురూజీ జాబ్స్ కావాలి గురూజీ జాబ్ వెళ్తున్నాం కానీ అసలు జాబ్స్ రావట్లేదండి అనిఅంటే నేను ఒకటే చెప్తా దైవాసుర సంపద విభాగ యోగం చదవండి 20 శ్లోకాలకు మించి ఉండవు దైవాసుర సంపద విభాగం చదివితే మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి మీరు ఎలా కమ్యూనికేట్ చేయాలి మీరు ఎలా ఎంటర్ అవ్వాలి ఎలా బాస్ తో ఎలా ఉండాలి జాబ్ 100% పడతారు.
(09:51) దైవాసురుడు సంపద విభాగ యోగం చదివితే మీరు పిహెచ్డిలు చేసినా ఎంత స్కిల్స్ ఉన్నా ఎంత సామర్థ్యం ఉన్నా అక్కడ ఉండే వ్యక్తి మీ యొక్క ఎడ్యుకేషన్ గురించి ఆలోచించడు ఈడు నాకు పనికి వస్తాడా లేదా అని ఆలోచిస్తాడు. ఆ పనికవచ్చే విధానం ఇక్కడ ఉంటుంది దైవాసుర సంపద్ విభాగ యోగం అంటే ఏంటి భగవద్గీత అనేది మీకు ఎడ్యుకేషన్ పరంగా కాదు ఆ ఎడ్యుకేషన్ ని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలి సమాజంలో అనేటటువంటి దిశా నిర్దేశం ఈ భగవద్గీత చేస్తుంది.
(10:19) మీరు భగవద్గీత చదవకుండా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత ఎడ్యుకేషన్లో ఎంత ముందంజి ఉన్నా దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోలేరు అలా ఇంజనీర్ చదివినవాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు పిహెచ్డిలు చేసినవాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేక అంటే అర్థం ఏంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ నేర్పు భగవద్గీత ద్వారా ఉంది అది భగవద్గీత చదవట్లేదు అదే దాంతో పాటు దేవాసుర సంపద విభాగం చదివారంటే బ్రహ్మాండంగా ఉద్యోగాల్లో రాణిస్తారు మీకు ఆ నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి అనేటటువంటి అంశాల్లో స్పష్టత ఉంటుంది ఎలా ముందుకు వెళ్లాలో కూడా తెలుస్తుంది.
(10:48) తర్వాత శ్రద్ధాత్రయ విభాగ యోగం తర్వాత మోక్ష సన్యాస యోగం ఇట్లా ఆరు అధ్యాయాలు ఇలా 18 అధ్యాయాలు మనం గమనించినట్లయితే మొదటి ఆరు అధ్యాయాలు వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఎదగాలి ఎలా కర్మ చేయాలి ఏంటి సరైనటువంటి విధానం ఏంటి ఎలా ఆలోచించాలి సరైనటువంటి ఆలోచన విధానం ఎలా ఉండాలి సరైనటువంటి పని చేసే విధానం ఎలా ఉండాలి సరైనటువంటి జ్ఞానం ఏ విధంగా ఉంటుంది దేన్ని నువ్వు వదిలిపెట్టాలి దేన్ని వదిలిపెట్టాలి దేన్ని తీసుకొని ఉండాలి సతి నితరాం ఆసహ అంటాం సన్యాసం అంటే అన్ని వదిలేసేయమని కాదు ఏది కావాలో దాన్ని రక్షించుకోవడాన్ని సన్యాసం అంటారు.
(11:23) న్యాస అంటారు మనకి న్యాస రక్ష అంటారు అంటే ఇదిగోండి నేను మీకు ఇది ఇస్తున్నాను మీరు దాన్ని రక్షించండి అంటే దాన్ని న్యాస రక్ష అంటాం. సన్యాసం అంటే ఏంటి ఏదైతే నీకు కావాలో ఆత్మ తత్వం ఏదైతే కావాలో దాన్ని ఉంచుకొని రక్షించడాన్ని సన్యాసం అంటారు. ఇట్లా సన్యాస యోగం కావచ్చు ధ్యాన యోగం కావచ్చు ఇవన్నీ కూడా మనల్ని పర్సనల్ గా డెవలప్ చేస్తాయి.
(11:43) అవును సరైనటువంటి ఆలోచన విధానం సరైనటువంటి కర్మ పని చేసే విధ కర్మ బంధం లేకుండా పని చేయడం ఇవన్నీ నేర్చుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటాడో మనిషి అంత హాయిగా ఆనందంగా ఉండగలుగుతాడు అలాగే జ్ఞాన విజ్ఞాన యోగం కావచ్చు అక్షర బ్రహ్మ యోగం కావచ్చు రాజవిద్య రాజగుహ్య యోగం కావచ్చు విభూతి యోగం కావచ్చు విశ్వరూప దర్శన యోగం కావచ్చు భక్తి యోగం కావచ్చు మొత్తం 18 అధ్యాయాల్ని ఇలా ఒక వేలు పెట్టి బ్యాలెన్స్ చేసేటటువంటి అధ్యాయం భక్తి యోగం మనకి మొత్తం 701 శ్లోకాల సారం ఒకరెండు రెండే రెండు శ్లోకాల్లో ఏయత్వక్షరం నిర్దేశం అచింత్యం ఆ లక్షణాలు చెప్పాడు శ్లోకాల్లో సర్వత్రగం అచింత్యంచ కూటస్తం
(12:21) అచలం ధ్రువం అని చెప్పేసి ఈ ఎనిమిది లక్షణాలే నేను ఆ ఎనిమిది లక్షణాలే మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో దాని వివరణ ఉంటుంది. అచలం అనే లక్షణాన్ని ఎట్లా వివరిస్తారు కూటస్తం అనేటటువంటి లక్షణాన్ని ఎట్లా వివరించాలి అవే ఉంటాయి. ముందుగా అధ్యాయాల యొక్క నిర్వచనాన్ని తెలుసుకొని అది సోపాన క్రమంలో ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా మన వాంగ్మయం యొక్క స్టైల్ అలానే ఉంటుంది ఒక్కొటి స్టెప్ ఎక్కినట్టుగా వెళ్ళాలి ఇప్పుడు చదువుకునే వ్యక్తికి అంతా కలగాపులకం ఉందనుకోండి ఎటు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం దేని దగ్గరికి వెళ్తున్నాం అనే ఇంట్రెస్ట్
(12:49) ఉండదు. ఇప్పుడు అర్జున విషాద యోగం చదవగానే సాధకుడు కనిపించాలి ఈ విషాదం నుండి బయటపడాలి సాంఖ్య యోగంలోకి వచ్చే సాంఖ్య యోగం చదవగానే కర్మ గురించి అర్జునుడు అడుగుతూ ఉంటాడు సో మనకి తెలియకుండానే సబ్కాన్షియస్ గా కర్మ గురించి తెలుసుకోవాలి అనిపిస్తుంది వెంటనే కర్మ యోగంలోకి వెళ్తాడు అట్లా మన చేత మొత్తం 18 అధ్యాయాల్ని చదివించి నేర్పించేటటువంటి బాధ్యతను వ్యాసుల వారు తీసుకున్నారు కాబట్టి భగవద్గీత సారం మొత్తాన్ని 18 అధ్యాయాలుగా విడగొట్టారు అవును 18 అధ్యాయాలుగానే ఎందుకు విడగొట్టారు అంటే 18 అంటే ఆయనకి ఇష్టం అదే ప్రతి పురాణాలు 18 ఉపరాణాలు 18 18
(13:23) పర్వాలు 18 అధ్యాయాలు 18 అక్షోహిణీలు ఇటు 11 అటు ఏడు అక్షోహిణీలు మళ్ళీ యుద్ధం జరిగింది 18 రోజులు అంటే అంత 18ని అంత చక్కగా ఇష్టపడేటటువంటి వ్యక్తి అన్నమాట అంటే 18 లోనే సర్వస్వం ఉంది సర్వం 18 లోనే ఉంది 18 ని పట్టుకుంటే నీకు అంతా సాధ్యమే అనేటటువంటి ఉద్దేశంలో 18 మనకి 18 విభాగాలుగా చేయడం జరిగింది అది ఆయన వ్యాసుల వారి శైలి ముందుగా భగవద్గీత చదవడం అంటే వ్యాసుల వారి శైలిని పట్టుకోవాలి మనం వ్యాసుల వారిని దర్శనం చేయాలి అసలు వ్యాసుల యొక్క సైకాలజీ ఏంటి వ్యాసుల వారి యొక్క స్థాయి ఏంటి దాన్ని అర్థం చేసుకోవాలని ఆ స్థాయికి తగ్గట్టుగా ప్రతి శ్లోకాన్ని నేను సమన్వయం
(14:01) చేసుకుంటున్నానా లేదా లేదా నాకు నచ్చినట్టుగా చేసుకుంటున్నానా ఇవన్నీ చూసుకుంటూ గనుక మీరు భగవద్గీత అధ్యయనం చేస్తే లౌకికంగా ఉపయోగపడుతుంది ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది పారమార్థికంగా ఉపయోగపడుతుంది మోక్షదాయిని కూడా మనం ఈ భగవద్గీతని ఉపయోగించుకోవచ్చు అంటే మన ఇప్పుడు కర్మయోగం ముఖ్యంగా అవును ఏ శ్లోకాల ద్వారా అవును మనం కర్మని కచ్చిత అంటే మోక్షం కావాలంటే కర్మనాశనం కావాలన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి కర్మలు చేయకుండా ఉండడమే ఉత్తమం అనుకొని లేదంటే కర్మలు ఏ విధంగా చేయాలి అసలు కర్మ ఏ విధంగా చేయాలి అవును ఆ కర్మ యొక్క ఫలితాన్ని మనం తీసుకోకుండా
(14:38) అంటుకోకుండా ఉండాలంటే ఎలా ఉండాలి అవునండి కర్మ యోగంలోనే కొన్ని శ్లోకాలు ఉంటాయి అవి చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూహు మాతే సంగోస్తువ కర్మణి అనే శ్లోకానికి కర్మ యందే నీకు అధికారం ఉంది ఇక ఫలితములందు నీకు అధికారం లేదు అనేటట్టుగా వ్యాఖ్యానం రాస్తారు. నిజానికి అక్కడ అర్థం లేదు కర్మ అంటే ఏంటి అందరి దృష్టిలో ఏదో పని చేయడం కర్మ అంటాం లేదా కొంతమంది ఏంటి ఏదనా కీడు జరిగింది అనుకుంటాం ఇది నా కర్మ అంటాం అక్కడ ఒత్తుక వాడతాం కర్మ వేరు కర్మ వేరు అన్నమాట అయితే ముందు అసలు కర్మ అంటే ఏంటి అంటే
(15:20) ఆలోచన ప్లస్ యక్షన్ థాట్ ప్లస్ యక్షన్ ఓన్లీ యాక్షన్ ఇస్ నాట్ కర్మ ఒక ఆలోచనతో కూడిన నటువంటి యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కర్మ అంటాం ఆలోచన అంటే ఏంటి ఇప్పుడు నేను మీకు భగవద్గీత పూర్తి స్థాయిలో చెప్పాలి అనేది ఒక ఆలోచన ఆ విధమైనటువంటి ప్రవర్తన ఈ రెండు కరెక్ట్ గా ప్రెజెన్స్ లో సింక్ అవ్వాలి.
(15:50) అంతేగాన రేపు అది చేస్తాను అని ఆలోచన ఇప్పుడు ఉండి కర్మ పని ఏదైతే ఉందో అది రేపు ఉంటే దాన్ని కర్మ అనం అర్థమవుతుందా అండి కర్మ అనేది ఆలోచన ఇప్పుడే జరగాలి దాని యొక్క ప్రవర్తన కూడా ఇప్పుడే జరగాలి ఆ రెండు ఇక్కడే సమన్వయం అవ్వాలి దానిని మాత్రమే కర్మ అంటారు. మ్ ఈ విశ్లేషణ నాకు తెలిసి మీరు ఎక్కడా విని ఉండరు. కానీ మేము రీసెర్చ్ చేసాం కాబట్టి మీకు స్పష్టంగా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాం.
(16:16) ఆలోచన ఉండాలి బాహ్యమైనటువంటి ప్రవర్తన ఉండాలి ఒకటి అంతరంగిక ప్రవర్తన అంటే ఆలోచన కావచ్చు భావం కావచ్చు ఏదైనా కావచ్చు అది ఒక ప్రవర్తన ఉండాలి దానికి తగ్గటువంటి వ్యక్తమయ్యేటటువంటి ప్రవర్తన ఉండాలి ఈ రెండింటి యొక్క సమయం ఈ రెండిటి కలిసిపోవాలి దానినే కర్మ అంటాం ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో తెలియకుండానే నీకు దాని యొక్క హేతువు ఏంటి అది ఎందుకు ప్రేరేపిస్తుంది అనేదాన్ని వదిలేస్తావ్ అలాగే దీని వల్ల వచ్చే ఫలితం ఏంటి దాన్ని కూడా వదిలేస్తావ్ అలాగే ఇది చేయాలా వద్దా అనేటటువంటి మీమాంస దానిలో అసంఘ అంటారు సంఘవేషోపజాయత అంటారు అది కూడా మనం విడగొట్టగలుగుతాం.
(16:53) కానీ మనం [గొంతు సవరించుకోవడం] చేసేటప్పుడు పని చేస్తున్నామ అనుకోండి మనం ఏం చేస్తున్నామ అనేది ఆలోచించకుండా దీని వల్ల ఏం జరుగుతుంది అనేది ఆలోచన పెట్టామ అనుకోండి దాన్ని వికర్మ అంటారు. కర్మ ఇప్పుడు జరుగు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రశాంతంగా ఉండి మాట్లాడుతున్నాడు అంటే ప్రశాంతం అనేటటువంటి ఒక అభౌతిక ప్రవర్తన లోపల జరుగుతుంది మాట్లాడడం అనేటటువంటి భౌతిక ప్రవర్తన బయట జరుగుతుంది కదా ఈ రెండు కలిస్తే యోగం దాన్ని కర్మం అన్నారు కర్మ అన్నారు అంతేగాన ఇప్పుడు నేను ఈ ప్రవచనం చెప్పడం వల్ల ఇలా మాట్లాడడం వల్ల రేపు నాకు ఏం లాభం వస్తుంది
(17:25) దాంతో కలిసింది అనుకోండి దాన్ని వికర్మ అంటారు. లేదు దీని వెనక ఒక రకమైన ఉద్దేశం పెట్టుకొని చేస్తున్నామ అనుకోండి దాన్ని వికర్మ అంటారు. దీనివల్ల నాకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు కాబట్టి నేను చేయను అన్నామ అనుకోండి దాన్ని అకర్మ అంటారు సకర్మ అంటే ఏంటంటే కరెక్ట్ గా ఇప్పుడు నేను ఏం చేయాలో దానికి నా మానసికమైనటువంటి స్థితి ఏ విధంగా ఉండాలో దాన్ని అలానే మెయింటైన్ చేస్తూ ప్రవర్తనలో ప్రస్తుతాన్ని నేను పొందుతూ ఉన్నట్లయితే దాన్ని కర్మ అంటారు అటువంటి కర్మ చేయడం ద్వారా కర్మ బంధాన్ని తొలగించుకుంటావు కాబట్టే కర్మ యోగం చెప్పారు.
(18:00) అంటే ప్రెజెన్స్ లో ఉండి చేయడం ప్రెజెన్స్ లో ఉండాలి. నువ్వు చేస్తున్న పని మీదే ఆలోచన ఉండాలి నేను ఇప్పుడు చెప్పిన దానికి నేను ఆయన భాషలోనే ఇంకో శ్లోకం కూడా చెప్తాను అసోచ్యాన్ అన్వసోచస్త ప్రజ్ఞావాదాం భాషసే గతాసున్ అగతాసు నానుసోచంతి పండితః పండితుడు అనగానే సకల శాస్త్రాలు చదివినట్టుగా సకల వేదాలు చదివితే పండితుడు అంటామని అందరం అనుకుంటాం కానీ నిజానికి శ్రీకృష్ణుడి దృష్టిలో పండితుడు ఎవరు స్వామి దృష్టిలో పండితుడు ఎవరంటే ఎవడైతే ప్రెజెన్స్ లో ఉంటాడో వాడు గతం గురించి ఆలోచించడు ఎందుకు గతం జరిగిపోయింది భవిష్యత్తు గురించి గురించి ఆలోచించాడు
(18:33) అది జరుగుతుంది అనే నమ్మకం లేదు ఖచ్చితమైనటువంటి ప్రమాణం లేదు భవిష్యత్తు గురించి మనక ఖచ్చితమైనటువంటి ప్రమాణం ప్రెజెన్స్ లో ఉంటుంది ప్రస్తుతంలో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఉంటుంది కాబట్టి దాని యందే ఫోకస్డ్ గా ఉంటూ దాన్ని నేను సరిగ్గా చేస్తున్నానా లేదా ఆ విధమైనటువంటి విచారణ కలిగి దానిలో నువ్వు పూర్తి స్థాయి నిమగ్నం అయిపోయి నువ్వు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తావో దాన్ని కర్మ అంటారు అలా కంప్లీట్ చేస్తున్నప్పుడు నువ్వు పొందేదాన్నే ధ్యానం అంటారు అలా కంప్లీట్ చేస్తున్నప్పుడు నువ్వు ఉండేటటువంటి స్థితినే సాంఖ్యం అంటారు అలా
(19:00) ఉండేటప్పుడు నువ్వు పొందే స్థితినే జ్ఞాన జ్ఞానం అంటారు అలా ఉంటున్నప్పుడు నువ్వు తొలగించేటటువంటి వ్యవస్థనే సన్యాసం అంటారు అంటే ఒకే కర్మలో మనక అన్నీ వచ్చేసాయి. సాంఖ్య అలా ఉండగలిగేవాడిని పండితుడు అంటాడు అలా ఉండేవాడిని పండితుడు అంటారు అంటే ఏంటంటే ఆరు అధ్యాయాల సారం కర్మ అందుకే కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అంటారు అంటే ఏంటి నిన్ను బ్రహ్మగా చేయాలి నువ్వు జీవుడి ఉన్నావు నిన్ను బ్రహ్మగా చేయాలి అంటే ఒక మార్గం ఉంది అదే కర్మ మార్గం కర్మతోనే నువ్వు బ్రహ్మ కాగలుగుతావు కాబట్టి కర్మకి విశేషమైనటువంటి స్థానం అందించాలి కానీ కర్మని మనం నిర్వచనాల్లో మీరు ఏ
(19:31) బుక్లో అయినా సరే ఎట్లాంటి బుక్ అయినా తీసుకొచ్చి మీరు చూస్తే ఇంత విశ్లేషణ మీకు అందదు కర్మ అంటే ఏదో నార్మల్ పని అనో లేకపోతే ఒక కార్యక్రమం అనో అన్నట్టుగా ఏం చేసినా కర్మ కిందే కదా అట్లా రాసేస్తారు అప్పుడు మనం స్వామి వారి యొక్క స్థాయిని వారి యొక్క స్థాయిని కించపరిచినట్టు అవుతుంది వాళ్ళు చిన్న అర్థాలతో చిన్న చిన్న విశ్లేషణలతో ఏ శ్లోకం రాయరు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి జాతస్య ధ్రువో మృత్యుహు ధ్రువం జన్మ మృతస్యచ తస్మాద పరిహార్యే అర్థే నత్వం సోచతి మరహస్య అనగన కింద చచ్చినవాడికి పుట్టుక తప్పదు పుట్టినవాడికి చావక తప్పదు అనివార్యమగు ఈ విషయము గూర్చి చింతింపదగదు
(20:09) అని చెప్పి ఒక శోకతమైనటువంటి రాగంలో పాడినంత మాత్రాన అది ఆ నిర్వచనం కాదు అంత చిన్న నిర్వచనం మనకు తెలియదా చచ్చినవాడు పుట్టక తప్పదు పుట్టినవాడు చావక తప్పదు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది దానికి ప్రత్యేకించి భగవద్గీత శ్లోకం అక్కర్లేదు దానికి కాబట్టి జాతస్యహి ధ్రువ మృచుహు అంటే జాత అంటే నీకు ఇప్పుడు కలిగినటువంటి ఒక అవకాశం ఆ అవకాశం వచ్చింది సరిగ్గా సరిగ్గా చక్కగా నువ్వు ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నావ అనుకోండి ఎదుగుతాం [గొంతు సవరించుకోవడం] ఒకవేళ మన మన సంస్కారాలో మన ప్రవృత్తిలో ఏదో ఒక రకమైనటువంటి అవాంతరం చేత ఆ
(20:44) అవకాశాన్ని వినియోగించుకోలేదు అనుకోండి బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళీ వస్తుంది అవకాశం వచ్చిన అవకాశమే మళ్ళీ వస్తుంది అవకాశాలు వస్తూనే ఉంటాయి నువ్వు సిద్ధంగా ఉండాలి అనేటటువంటి మోటివేషన్ మనక ఆ శ్లోకం ద్వారా గ్రహించాలి గానీ చచ్చిపోయిన వాడు పుట్టక తప్పదు కాబట్టి పుట్టినవాడు చావక తప్పదు కాబట్టి ఎలాగో బతుకేద్దాం అనేటటువంటి ఒక నైరాస్ మనం ఆ శ్లోకం ద్వారా గ్రహించడం అనేది అది అది చాలా పాపం కింద నేను అభివర్ణించగలుగుతాను ఎందుకంటే ఈరోజు భగవద్గీత చావు అనగానే భగవద్గీత పెడుతుండడానికి కారణం ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలే సో ఆ వ్యాఖ్యానాల నుండి మనం విముక్తి
(21:20) పొందాలి అంటే మనం భగవద్గీతను ఉన్నత స్థానంలో చూడాలి వ్యాసుల వారిని గాని శ్రీకృష్ణుల వారిని గాని వినాయకుల వారిని గాని ఏమాత్రం తక్కువ అంచన వేయకూడదు అసలు అన్ ఇమాజినబుల్ అన్నమాట మనం ఏ విధంగాన ఊహించ ఊహించలేని స్థాయిలో భగవద్గీత శ్లోకాలు ఉంటాయి మన మనం మన ఓపిక అన్నమాట మనం జీవించేలోపు ఎంత నిధిని గ్రహించగలుగుతామో అంత నిధిని గ్రహించి చక్కగా ఆనందంగా ఉండాలనేటటువంటి దృక్కోణంలో మీరందరూ ఉండాలన్నది నేను ఆశిస్తున్నటువంటి అంశం అంటే ఇప్పుడు యాక్షన్ కావాలంటే థాట్ అనేది ముఖ్యం అవును థాట్ లేకుండా అసలు యాక్షన్ జరిగే అవసరం అవును అవకాశం ఉంటుందా
(21:54) ఉండదు ఆలోచన లేకుండా ఏది జరగదు జరగదు అంటే ఈ ఆలోచన పుట్టే స్థితిలోనే ఒక సరైన ఆలోచనలు రావాలి సరైన స్థితిలో ఆలోచన ఉండాలి అనేదానికి కృష్ణ భగవాన్ లో రకం చెప్పడం జరిగింది ఆ అందుకే ఆలోచన దగ్గర నుండే ఒక మనిషిని మార్చాలి మనం ఇప్పుడు ఏడుస్తున్నటువంటి అర్జునుడిని మార్చాలంటే తత్వం చెప్పడమో ఆధ్యాత్మికత చెప్పడమో నాకు తెలుసు కదా అని చెప్పి బ్రహ్మాండం మొత్తం చూపించడమో అలా చేయలేదు స్వామి టెక్నికల్ గానే వెళ్ళాడు స్టెప్ బై స్టెప్ే ఒక వ్యక్తిని మనం గైడ్ చేయగలుగుతాం ముందు అసలు ఆలోచన విధానం అర్జునుడిది మార్చాలనే సాంఖ్య యోగం అన్నారు సమ్య ఖ్యాయతీతి
(22:31) సాంఖ్య సాంఖ్య యోగం అంటే మొత్తం ఆలోచన విధానం ఇలా ఆలోచనలు చేయాలి అలా ఆలోచనలు చేయకూడదు క్లైభ్యం మాస్మగమఃపార్ధ నైతత్వపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్వా ఉత్తిష్టపరంత కసిరినట్టుగానే చెప్పినప్పటికీ అది మానసిక దుర్బలత అనేది నీచమైనదా అసయకరమైనది అది నీకు ఏ విధంగాను ఉపయోగపడదు కస్మలమిదం విషమేసమపరిస్థితం అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికరమన ఎందుకు ఉపయోగపడదు అది కీర్తికి ఉపయోగపడదు పేరుకి ఉపయోగపడదు ప్రశాంతతకి ఉపయోగపడదు నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగపడదు బయట పేరు రాదు అట్లాంటి కష్మిలమైనటువంటి ఈ హృదయ దుర్బలత అనేది నువ్వు ఎట్లా పొందుతున్నావు నీకు
(23:12) అసలు విషయం చెప్తాను విను అని చెప్పి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతిపావత నచనం క్లేదయంత నసోషతారుత ఏమైపోద్ది యుద్ధంలో ఏమి కాదు ఆత్మతత్వం అనేది అలా శాశ్వతంగా ఉంటుంది అది శస్త్రముల చేత ఇబ్బంది పడదు వాన నీటి చేత తడువుపబడదు అగ్ని చేత కాల్చబడదు వాయువు చేత శోషింపబడదు ఇంకేం కావాలి నీకు నాసతో విద్యతే భావ నాభావో విద్యతే సత ఉభయ దృష్టవంతు అనయ తత్వదర్శిబి నువ్వు ఉన్నది ఉన్నది అంటున్నావు కదా ఉన్నది అనేదానికి లేమి ఉండదు కదా అసలు ఇప్పుడు ఒకటి ఉన్నది అంటున్నారండి దానికి లేమి లేమి ఉండదు కదా లేమి ఉండనప్పుడు ఎందుకు బాధపడతావ్ నువ్వు
(23:48) లేమి [గొంతు సవరించుకోవడం] ఉంటే కదా బాధపడాలి ఉన్నది అని ఒక పదార్థాన్ని నువ్వు అన్నట్లయితే అది లేకపోవడం ఉండదు దానికి సో [గొంతు సవరించుకోవడం] లేకపోవడం లేని ఉన్నదాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు సరే లేదంటావా అది ఎటూ ఉండదు కదా ఇంక [గొంతు సవరించుకోవడం] దాని గురించి బాధపడాల్సిన అవసరం ఏముంది ఒకసారి ఉంది ఒకసారి లేదు అన్నావ అంటే అది లేనట్టే ఈరోజు ఈరోజు నా దగ్గర కారు ఉంది బంగళ ఉంది అనుకుందాం అది రేపు ఉండదు అనుకోండి అది ఎటు ఉండదు కదా దాని గురించి ఎందుకు బాధపడాలి నా లోపల ఆత్మతత్వం అనేది ఉంది కదా అది ఎప్పటికీ పోదు కదా అదేదో
(24:16) పోయేదయితే మనం బాధపడాలి ఆత్మతత్వం నిరంతరంగా ఉంటుంది కదా దానిలో కూడా చాలా వరకు ప్రెజెంటేషన్ అన్నమాట నువ్వు ఇలా అనుకుంటే ఇలా అవుతుంది ఒకవేళ నువ్వు పుట్టి చచ్చిపోయేదే అనుకో అవును ఇప్పుడు పుట్టింది మళ్ళీ చచ్చిపోతుంది మళ్ళీ పుడుతుంది కదా ఆ ఉద్దేశంలో ఆ మోటివేషన్ పర్పస్ మనకి ఆత్మ తత్వాన్ని చక్కగా ప్రెసెంట్ చేసి అందించడం తో అర్జునుడు ఏడుపు ఆపేసేసి విషాదాన్ని ఆపేసేసి కర్తవ్యోన్ముఖుడు కావడానికి నాకు ఏం చెప్పాలో అది చెప్పు స్వామి నీకు శరణాగతుడిని అయిపోతున్నాను యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయశీవామి తదేకం వద నిశ్చిత్య ఏనశ్రేయోహమాప్నే నాకు
(24:50) అన్ని రకాలు చెప్పొద్దు అసలు ప్రతి వ్యక్తికి ఉండాల్సినటువంటి ఆటిట్యూడ్ ఇది మనం రకరకాల గురువులని దర్శిస్తాం రకరకాల గురువుల దగ్గరికి వెళ్తాం ఆ కొంచెం ఈ కొంచెం అన్ని తీసుకుంటాం కానీ మనక ఏది కావాలో తెలియదు మనకి ఇప్పుడు ఏది కావాలో అది ఎక్కడి నుండి వస్తుందో అక్కడికి వెళ్లి నువ్వు నేర్చుకున్నావు అంటే నువ్వు నిజంగా కార్యసాధవుడి కింద లెక్క సో నాకు నీకు తెలుసని నాకు అర్థమయింది.
(25:14) నువ్వు జగద్గురువు సో నువ్వు అన్నీ చెప్పగలవు అన్ని శాస్త్రాలు అన్ని సకల ఉపనిషత్తులు నించొని నాకు 10 నిమిషాల్లో బోధ చేయగలవు కానీ నాకు అవన్నీ వద్దు. నాకు ఇప్పుడు బాధలో ఉన్నా భరించలేని శోకంలో ఉన్నా నాకు ఇప్పుడు ఏది శ్రేయోదాయకమో ఏది శ్రేయసును కలిగిస్తుందో అది ఒక్కటి నువ్వే ఆలోచించి విచారణ చేసి నిశ్చయించి నాకు ఆ [గొంతు సవరించుకోవడం] బోధ మాత్రమే చెప్పు స్వామి అని అడిగితే ఉద్భవించిందే భగవద్గీత అంటే ఏంటంటే నీకు ఏది కావాలో అదే ఉంటుంది భగవద్గీతలో ఇ అనవసర పుస్తది ఉండదు 70 శ్లోకాల్లో ఇది అన్వర్ధం ఇది అసంబద్ధం అనేటటువంటి పదం గాన అక్షరం
(25:50) గాన భగవద్గీతలో ఉండనే ఉండదు ప్రతి అంశం ఇంపార్టెంటే మేము గతంలో సాధారణంగా సంస్కారాలతో ఉంటాం కాబట్టి భగవద్గీతలో ఏకశ్లోకి భగవద్గీత అంటున్నారు కదా చక్కగా [నవ్వు] ఒక శ్లోకం చదివేస్తే మొత్తం అయిపోయిందా అంటున్నారు కదా దాని ఉద్దేశం వేరు నువ్వు ఒక శ్లోకం అన్నా చదివిస్తే తర్వాత 700 శ్లోకాలు ఇంపార్టెంట్ అనుకొని చదువుతావ అన్న ఉద్దేశంలో చెప్పారు ఆ నాకు ఒక శ్లోకం చదవచ్చు సిలబస్ పెట్టుకొని లేదా ఒక అధ్యాయం చదవచ్చు అనేటటువంటి భావనలో నేను ఉన్నాను కానీ అది 700 శ్లోకాలు విచారణ చేసి పరిశోధన చేసే స్థాయికి తీసుకెళ్లి మనకు చెప్తారు కదా ఎత్ర యోగేశ్వరః కృష్ణః
(26:26) యత్ర పార్దో ధనుర్ధరః తత్ర శ్రీరి విజయోర్భూతి ధ్రువానేతిర్ము ఆ చివరి శ్లోకం ఆకర్షించింది దాన్నే ధారణ చేద్దాం ఇది ఒక్కటి చాల్లే అనుకుంటారు కానీ లైఫ్ టైం సరిపోదండి మనం ఒక్కొక్కసారి కొన్ని అధ్యాయాలు ఇప్పుడు విషాద యోగం అనుకున్నాం విషాద యోగంలో శ్లోకాలన్నీ ఏముంటాయి ఈ ధృతరాష్ట్ుడు అనేవాడు సంజయుడిని అడుగుతాడు సంజయుడు ఇలా ఇలా ఇద్దరు విడిపోయి ఉన్నారు అక్కడ అంత మంది సైన్యం ఉన్నారు ఇక్కడ ఎంత మంది సైన్యం ఉన్నారు అనడంతో మొదలు పెడతాడు.
(26:56) ఆ తర్వాత దుర్యోధనుడు నా రాజ్యంలో ఇంతమంది ఉన్నారు నా సైనికులు ఇంతమంది ఉన్నారు వాళ్ళ సైనికులు అంతమంది ఉన్నారు అని చెప్పి ద్రోణుడికి వివరించేది ఉంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడు ఎంటర్ అయ్యి శ్రీకృష్ణుడితో అర్జునుడు మాట్లాడే సంఘటనలు ఉంటాయి వాళ్ళందరినీ చూడడం రథాన్ని మధ్యలో నిలబెట్టమనడం వాళ్ళందరినీ చూసేసరికి ఈయనకి మొత్తం చెమటలు కక్కోవడం కళ్ళు తిరగడం మన బ్రమయితి అన్నాడు మొత్తం భ్రమిస్తుంది నేను ఆయుధాన్ని అసలు చేయబట్టలేకపోతున్నాను ఏదైనా సరే గురు అహత్వ వారిని నేను చంపే ప్రశ్నే లేదు వాళ్ళని చంపేసే కంటే రక్తాన్నం రక్తపుడు తినడానికైనా నేను సిద్ధమే లేదా
(27:31) అడుక్కొని తినడానికైనా నేను సిద్ధమే అన్న స్థాయిలో మాట్లాడేసేసి అక్కడ అవన్నీ పడేసేసి ఏడుస్తూ కూర్చునేటటువంటి ఒక అధ్యాయం ఉంటుంది. ఈ అధ్యాయంలో మనకు కావలసింది ఏముంది అసలు సబ్జెక్టే లేదు కదా అసలు అర్జున విషాద యోగం చదవద్దు సాంఖ్య యోగం చదువుకుందాం సాంఖ్య యోగంలో శ్రీకృష్ణుల వారు చెప్పారు కదా శ్రీకృష్ణుల వారి ప్రకారమే మనం వెళ్దాం అన్నట్టుగా మనం ఆలోచిస్తూ ఉంటాం అంటే ఏంటంటే 701 శ్లోకాలు ఎందుకు చదవాలి అది విషయం 701 శ్లోకాలు చదవాల్సింది అనే కోణంలో వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం అవును తప్పించుకోవడం మనిషి యొక్క ఆ భావం అన్నమాట
(28:07) మొదటి అధ్యాయం 47 శ్లోకాలు ఎన్నో ఉంటాయి ఇప్పుడు అవి చదవకపోతే వచ్చిన నష్టం లేదు పక్కన పడేవి సాంఖ్య యోగంలో ఇంపార్టెంట్ శ్లోకాలు బాగుండేవి కాస్త ఇన్స్పిరేషన్ ఇచ్చేవి వ్యవసాయాత్మికా బుద్ధిహి ఏకేహ గురునందన బహుశాఖహనంతస్ బుద్ధయోరవ్యవసాయన అబ్బా ఎంత బాగుంది అంటే ఏంటి ఏదనా పని చేయాలంటే వ్యవసాయం చేసినట్టుగా చేయాలి వ్యవసాయంగా చేసినట్టయితే ఒకే అంశాన్ని మనం పొందుతాం రకరకాల అంశాలు పొందాం ఒకవేళ రకరకాల అంశాలు అభిప్రాయాలతో ఉన్నామ అంటే అది వ్యవసాయం కిందకి రాదు అంటే ఎంత బాగా చెప్పాడు కర్మ చేయడం గురించి చెప్పాడు ఇట్లాంటివి కొన్ని వందల్లో అమూల్యమైన
(28:39) రత్నాలు ఉంటాయి. వాటిని ఆకర్షింపబడతాం అవే నేర్చుకోవాలని చెప్పి ముందు ప్రయత్నం చేస్తాం. అది చాలా తప్పు మనం మొట్టమొదటి శ్లోకం దగ్గర నుండి చివరి 701 శ్లోకాల దాకా ప్రతిది మణే ప్రతిది మహత్తు కలిగింది తర్వాత ఒక ఏడు సంవత్సరాలు రీసెర్చ్ అట్లానే గడిచిన తర్వాత మొదటి అధ్యాయం పట్టుకున్నామండి అర్జున విషాద యోగం అనేటటువంటి ఒక అధ్యాయం పట్టుకుంటే అసలైన మొత్తం 701 శ్లోకాల అర్థం మొత్తం 701 శ్లోకాల వ్యవస్థ మొత్తం ఆ మొట్టమొదటి శ్లోకంలోనే ఉంచాడు [గొంతు సవరించుకోవడం] ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామకాహ పాండవాస్చేవ కిం అకుర్వత సంధ్య ఇదేముందండి శ్లోకం
(29:24) చిన్న శ్లోకం అందరికీ వచ్చినట్టే ఉంటుంది. కానీ మీరు ఈ శ్లోకం యొక్క గమనాన్ని గమనించాలి అసలు ఎట్లా వస్తుంది ఇప్పుడు మొదటి పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం నాలుగు పాదాలు ఉన్నాయి ఈ శ్లోకంలో మనం ఇలా ఇలా విచారణ చేయాలి మీరు కూడా ఇలానే విచారణ చేస్తారనే ఆశిస్తూ చెప్తున్నాం. అంటే మొదటి పాదంలో రెండు వేరు వేరైనటువంటి పదాలను పెట్టాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని సరే మొదటి పాదం కాబట్టి ఏదో పెట్టాడులే ప్రాస కోసం అనుకుందాం సమవేత యుత్సవః అంటున్నాడు యుత్సవః అంటే ఏంటి యుద్ధం చేయాలనే ఆశ సమవేత అంటే ఏంటి కలవాలని సమవేత అంటే కలవడం
(29:59) యుత్సవః అంటే యుద్ధం చేయడం యుద్ధం చేయడానికి [గొంతు సవరించుకోవడం] గెట్ టుగెదర్ కి చాలా తేడా ఉంటుంది అంటే రెండు విరుద్ధమైనటువంటి అంశాలు అక్కడ పెట్టాడు మళ్ళీ మూడో పాదం కూడా గమనిస్తే మామకాహ పాండవాస్ అంటాడు అంటే నా వాళ్ళు పాండవులు వేరు భావం మామకాహ పాండవాస్చేవ వేరుభావం అంటే మూడు అంశాలలో విరుద్ధమైనటువంటి భావాలని అక్కడ ఉంచడం జరిగి కిమకుర్వత సంజయ అని ప్రశ్న వేసాడు కిమకుర్వత సంజయ అంటే ఏం చేస్తారు యుద్ధరంగంలో అక్కడికి వెళ్ళారు అందరూ కలిసి ఉన్నారు ఏం చేస్తారు పార్టీ పెట్టుకొని మాట్లాడుకోరు కదా యుద్ధమే చేస్తారు అది కామన్ సెన్స్ కదా యుద్ధమే చేస్తారు
(30:33) యుద్ధరంగంలో ప్రత్యేకించి కిమ కుర్రోత సంధ్య ఏమి చేసిరు సంజయ్ అని ఎందుకు అడిగాడు ఇలా మీరు విచారణ చేయాలి దానికి ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది ఏమి చేసిరి సంజయ్ ఏమి చేసిరి సంజయ అంటే చేయడం అనేటటువంటి వ్యవస్థ ఎక్కడ ఉంటుంది ఇవన్నీ కూడా విచారణ చేయాలి ఇప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే రెండు విరుద్ధమైనటువంటివి సమవేత యుచః రెండు విరుద్ధమైనటువంటివి మామకాహ పాండవాస్యవ రెండు విరుద్ధమైనటువంటివి అంటే ఏంటంటే ఒకటి దేహంలో ఉండేటటువంటి భౌతిక దేహంలో ఉండే రెండు విరుద్ధమైనటువంటివి రెండోది మానసిక దేహంలో ఉండే రెండు విరుద్ధమైనటువంటివి [గొంతు సవరించుకోవడం]
(31:09) బుద్ధిప పరమైనటువంటి రెండు విరుద్ధమైనటి బుద్ధిలోనే నాది పరాయది అనేటటువంటి విభేదం కలుగుతుంది మనసులోనే కలవడము విడిపోవడం అనేటటువంటి వ్యవస్థ ఉంటుంది భౌతికమైనటువంటి దానిలోనే ఉండడము చేయడము అనేటటువంటి రెండు అంశాలు ఉంటాయి ధర్మ అంటే ఉండడము కురు అంటే చేయడం అన్నమాట సో ఇట్లా రెండు రెండు విరుద్ధమైనటువంటి భావాలతో నువ్వు ఉన్నప్పుడు లోపల ఏ విధమైనటువంటి వ్యవస్థ జరుగుతుంది అనేటటువంటి క్వశ్చన్ అన్నమాట సో ఇది మొత్తం ఒక ఎనర్జీ బాడీ ఒక శక్తి దేహానికి సంబంధించినటువంటి ంటే ఒక వ్యవస్థగా మనం అర్థం చేసుకుంటే ఈ 47 శ్లోకాలు మన లోపల ఉండేటటువంటి
(31:44) సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది అనేది అంతర్లీనంగా స్వామివారు వ్యాసుల వారు మనకు అందించారు ఇప్పుడు ఆ ఒక్క శ్లోకంలోనే ఇంత అర్థం ఉంది ధర్మక్షేత్ర కురుక్షేత్ర అంటే ధర్మం అంటే మన లోపల ఉండేటటువంటి ఒక ప్రశాంత స్థితి అనుకుందాం కురుక్షేత్ర అంటే ఆ ప్రశాంతతలో నువ్వు పని చేసేటటువంటి వ్యవస్థ ఈ రెండు కలుస్తున్నాయా విడిపోతున్నాయా చూసుకోవాలి మరి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ప్రశాంత స్థితి ఉన్నదా ప్రశాంతత స్థితి పోతుందా ప్రశాంత స్థితి పోతుంది అంటే మాట సరిగ్గా రాదు సో ఈ రెండు కలుస్తుంటే భౌతికంగా నువ్వు సమన్వయమైనట్టే రెండోది సమవేతా యుత్సవః
(32:22) అంటున్నాడు బాగా కలిసినటువంటి వ్యవస్థ విడిపోయినటువంటి వ్యవస్థ ఇది మానసిక యోగం అన్నమాట మనసులో యోగం ఉండాలి అంటే మనసు ప్రశాంతంగా ఉందా లేదా అది రెండవ పాదం అలాగే బుద్ధిలో మమత్వమా నాదా పరాయదా అనేటటువంటి భావంతో పని చేస్తున్నా విడిపోయినట్టు విషాదం వస్తుంది లేదు నాది లేదు పారాయది లేదు అంతా మన మంచికే అందరం మనకోసమే మనం మనం ముందుకు వెళ్ళడం కోసం అనేటటువంటి ఒక సమభావంతో నువ్వు ఉన్నావు అంటే విషాద యోగం ఉండదు అసలు విషాదమే ఉండదు మొత్తం ఇప్పుడు 701 శ్లోకాల యొక్క భావము ఆ శ్లోకంలోనే ఉంటుంది.
(32:57) ఇదే భావాన్ని మనక అన్ని శ్లోకాల్లోనూ రకరకాల ప్రెజెంటేషన్స్ తో స్వామి వారు మనకు అందించారు ఏమో ఇప్పుడు ధర్మక్షేత్ర కురుక్షేత్ర శ్లోకం నీకు అర్థం కాలేదు అసత్య అనుసత్యస్తుం దగ్గరనా అర్థం చేసుకుంటావ్ అక్కడ కూడా అర్థం కాలేదు కర్మణ్యవాధికారస్తి దగ్గర అర్థం చేసుకుంటాం అక్కడ కూడా అర్థం కాలేదు చివరి శ్లోకం ఉంటుంది దగ్గరే విషమ పరిణామ అమృతం తత్సుకం సాత్వికం ప్రోక్తం ఆత్మ బుద్ధి ప్రశ అక్కడైనా అర్థం చేసుకుంటాం ఒకటే భావం ఒకటే ఉన్నతమైనటువంటి లక్ష్యంతో 700 శ్లోకాలు ఉన్నాయి మనం ఏ ఒక్క శ్లోకాన్నే తక్కువ భావం చేయకుండా అన్ని శ్లోకాలని అర్థం చేసుకోవాలి సమన్వయం
(33:30) చేసుకోవాలి మన జీవితంలో ఆచరించాలి దాన్ని అదే నేనైపోయేటటువంటి భావాన్ని మనం పొందేంతవరకు భగవద్గీత సాధన చేయాలి అలా మీకు భగవద్గీతను అందించేందుకే ఒక ఒక కోర్సుని మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఆ ప్రోగ్రాం లో చక్కగా మీరు భగవద్గీతను అన్ని స్థాయిల్లోనూ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును అంటే గురువుగారు ఇప్పుడు సాంఖ్య యోగంలో మన ఆలోచనలని ప్రభావితం చేసినటువంటి అనేక విషయాలని స్వామివారు తెలియజేశారు అవును అవును అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు ఉన్న ప్రపంచంలో థాట్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది మరి దీన్ని తగ్గడం కోసము అంటే ఆలోచనల్ని
(34:06) సరైన క్రమంలో పెట్టడం కోసం అవును వారు ఏ ఏ శ్లోకాల్లో మనకి ఏ ఏ విషయాలు తెలియజేశారు కాస్త విపులంగా తెలియజేస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం మిగతా యోగాల గురించి దాంట్లో ఉన్న వివరాలు తప్పకుండా తప్పకు సాంఖ్య యోగం అనేది 72 శ్లోకాల పైన ఉండేటటువంటి అధ్యాయం మనం భగవద్గీతను పూర్తిగా గమనిస్తే ఇలా 70 శ్లోకాలు పైన ఉండేటటువంటి అధ్యాయాలు రెండు ఉంటాయి ఒకటేమో సాంఖ్య యోగం రెండు మోక్ష సన్యాస యోగం 80 శ్లోకాల దాకా ఉంటుంది అది ఎందుకంటే ఇది ముఖ్యం ఇది చాలా ముఖ్యమైనది అని ఆయనకి అప్పుడే తెలుసు ఈరోజు మీరు ఏదైతే థాట్ పొల్యూషన్ చాలా భయంకరంగా ఉందని
(34:42) అంటున్నారో ఈ థాట్ పొల్యూషన్ ఈ రాంగ్ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి చాలా ప్రమాదకరమైన స్టా మనిషిని ఇబ్బంది పెడతాయి అని వారు ముందుగానే ఊహించి ఈ థాట్ ప్రాసెస్ ని క్రమబద్ధీకరించేటటువంటి విధంగా సాంఖ్య యోగాన్ని మనకి అందించారు. ఈ సాంఖ్య యోగంలో ప్రధానంగా అన్ని శ్లోకాలు ఇంపార్టెంట్ మనకి ఆ అసోచ్య నన్నువసోచస్వం ప్రజ్ఞవాదం భాషే గతాసు నగతాసు నానుసోచంతి పండిత నత్వేవాహం జాతునాస నత్వం నేమే జనాదిప నచేవన భవిష్యమ సర్వేవయమతపరం అని చెప్పి దేహనస్మియదేహే కౌమారే యవనంజ దేహాంతర ప్రాప్తి తదా దేహాంతర ప్రాప్తి దీరస్తత్రత అని వరుసగా వచ్చే ప్రతి శ్లోకం అసలు నువ్వు
(35:25) ఆలోచించాల్సిన అవసరం లేదు అసలు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అసలు నువ్వు దుఃఖించాల్సిన అవసరమే లేదు విపరీతంగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక 20 30 శ్లోకాలు వరుసగా ఉంటాయి. అవును 70 శ్లోకాల్లో ఆ 20 30 శ్లోకాలు ప్రధానంగా మీరు తీసుకొని దాన్ని అధ్యయనం చేశారంటే థాట్ ప్రాసెస్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. ఎలా ఆలోచించాలి ఎలా ప్రెసెన్స్ లో ఉండాలి ఎలా ఫ్యూచర్ ని ఎలా సమన్వయం చేసుకోవాలి ఈ అంశాలన్నీ మనకి సాంఖ్య యోగంలోనే ఉంటాయి.
(35:48) అవును మేము హెల్త్ పరంగా ఈ హీలింగ్ పరంగా ఆలోచించినప్పుడు మనకి ఈ వెనకాల ఉండేటటువంటి గ్లాండ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ బ్యాక్ సైడ్ ఉండేది ఒకవేళ గట్టిగా దెబ్బ తగిలినా సరే ఇక్కడ ఏ విధంగానైనా సరే దోషాలు జరిగినప్పుడు మతి భ్రమణ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అట్లాంటి వాటికి కూడా ఈ శ్లోకాలన్నీ కూడా ఒక హీల్ చేసినట్టుగా ఒక థెరపీ చేసినట్టుగా ఉపయోగపడతాయి ఆ శబ్దజాలం కూడా మీకు వెనక భాగం వైపు ఏదనా సమస్య ఉన్నా సరే ఈ సాంఖ్య యోగాన్ని మనం పారాయణ చేసుకుంటే అవి హీల్ చేసుకో బ్రైన్ కి సంబంధించిన న్యూరాన్స్ కావచ్చు ఏదైనా ఇబ్బంది కలిగితే మతి చపలము ఇవన్నీ ఉంటాయి కదా అట్లాంటి
(36:23) వాటికి సాంఖ్య యోగంలో ఉండేటటువంటి శబ్దాలు మామూలుగా పారాయణ చేయడం వేరు దాని అర్థాన్ని తెలుసుకొని జ్ఞానపరంగా సమన్వయం చేసుకోవడం వేరు సౌండ్ ఫ్రీక్వెన్సీని మన లోపల ఉండేటటువంటి కండరాలకి కనెక్ట్ అవుతాయి మనం ఏదైతే సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఏదైతే ఉంటుందో అది ఈజీగా మన లోపల ఉండేటటువంటి వ్యవస్థలకు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో ఒక మాట మాట్లాడామ అనుకోండి మనం ఇబ్బంది పడతాం.
(36:47) అవును ఒక లో ఫ్రీక్వెన్సీ మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి కొంతమంది సాధుకులు మనకు ఫోన్ చేస్తారు. ఓ గురూజీ అయిపోయింది గురూజీ జీవితం అంతా అయిపోయింది గురూజీ నేను నష్టప ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ అన్నమాట అవి మనల్ని కూడా డిస్టర్బ్ చేస్తాయి ముందు ఆగండి ఆగండిమ్మ ముందు అలాంటి మాటలు మాట్లాడకండి ఆగండి ఆగండి అని చెప్పి ముందు అసలు వాళ్ళని సైలెంట్ చేసేసే ప్రయత్నం చేస్తాం సో శబ్దం అనేది సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది మన ఎనర్జీ సెంటర్స్ ని ఎనర్గైజ్ చేయడానికి ఉన్నతమైనటువంటి స్థితిలో మెయింటైన్ చేయడానికి లో స్థితికి కూడా వెంటనే తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది మీరు అన్ని
(37:15) ప్రూఫ్లు సైన్స్ అని అంటున్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో సాంఖ్య యోగం యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో తల వెనక భాగం ఎవరికైనా సరే పెయిన్స్ గానీ ఇట్లాంటి వాటి ఇవి చాలా ప్రధానమైనది. ఇక్కడ ఏదైనా దెబ్బ తగిలింది అంటే మనిషి బతుకు ఉండడం కూడా వేస్ట్ అన్నమాట. ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ సాంఖ్య యోగ పారాయణ కావచ్చు ఆ శబ్దం యొక్క ఫ్రీక్వెన్సీని చక్కగా అందుకోవడంతో అవి చక్కగా ఉపయోగపడతాయి.
(37:41) క్యాన్సర్ ఇట్లాంటివి కీమోథెరపిస్ట్ తీసుకునే వాళ్ళ మీద ఈ ప్రయోగం చేయడం జరిగింది. వాళ్ళకి చక్కగా రికవరీ అవ్వడం హుషారుగా ఉండడం అది దెబ్బ తినడం వల్ల ఎక్కువసేపు నిద్రలోకి వెళ్ళిపోతాం చాలా ఇదిలో వెళ్తారు కానీ యాక్టివ్ అవ్వడం చక్కగా పని చేసుకుంటూ వెళ్ళడం ఇవన్నీ చూసామ అన్నమాట. సో అది సౌండ్ ఫ్రీక్వెన్సీ అంటే మనకి శబ్దం యొక్క అర్థం తెలియక్కర్లేదు.
(38:04) శబ్దాన్ని స్పష్టంగా ఉచ్చరించగలిగేటటువంటి వ్యవస్థ ఉంటే చాలు ఆ విధమైనటువంటి సౌండ్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది ఎట్లా రిథం ఎలా ఉండాలండి రిథం కూడా ఎలా ఉండాలి అంటే నాలుగు పాదాలని అసోచ్యాన్ అన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంస్చ భాషసే గతాసున్ అగతాసుచ నానుసోచంతిపం పండిత అట్ల నాలుగు పాదాలు స్పీడ్ [గొంతు సవరించుకోవడం] గా వెళ్ళకూడదు అలాగని స్లోగా వెళ్ళకూడదు అలాగే అర్థవంతం కాకుండా మాట్లాడకూడదు చక్కగా స్పష్టంగా శబ్దాన్ని అలా చక్కగా నాలుగు మనకి వీడియోస్ ఉంటాయి చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే డే వన్ నుండే మీకు
(38:49) రిజల్ట్స్ వస్తాయి 701 శ్లోకాలు రికార్డింగ్ కూడా చేస్తున్నాము రకరకాల స్థాయిల్లో భగవద్గీతను అందించే ప్రయత్నం చేస్తున్నాం నా ఉద్దేశం ఏంటంటే మీరు నేర్చుకోవాలి ఇప్పుడు నేను పాడేసేసి నేను ఆడియో రికార్ రెడ్డింగ్ మీకు ఇస్తే చక్కగా నిద్రపోతూ వినొచ్చు అది గుడ్డిలో మెల్లగా ఉపయోగపడుతుంది. కానీ మీరు కూడా నేర్చుకుంటే ఇలా పాడడం ఇలా అర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ పటణం చేయడం అనేది చాలా ఉపయోగపడుతుంది.
(39:12) ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఇంకా తేలిగ్గా కనెక్ట్ అవుతుంది. వేరే వాళ్ళు పాడిన దానికంటే మనమే పాడితే ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ మన మజిల్స్ సిస్టం మీద కావచ్చు గ్లాండ్స్ మీద కావచ్చు జీర్ణక్రియ ఇట్లాంటి వ్యాపారాలు జరిగేటటువంటి వ్యవస్థల మీద ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ బలంగా పనిచేస్తుంది. ఈ సృష్టిలో రెండే రెండు బలమైనటువంటి అంశాలు ఒకటి వాయువు అంటాం ఎక్స్టర్నల్ గా వెళ్తే వాయువు బలమైంది అంటాం.
(39:34) ఇంటర్నల్ గా వెళ్ళినప్పుడు సౌండ్ బలమైంది అంటాం శబ్దం చాలా బలంగా ఉంటుంది. అది ఎక్స్టర్నల్ గా కూడా దాని ఇప్పుడు గట్టిగా ఒక 80 డెల్స్ డెసిబల్స్ దాటే శబ్దం విన్నామ అంటే చెవులు పోతాయి. కన్నవేరు [గొంతు సవరించుకోవడం] పగిలిపోతుంది. ఇంకొంచెం శబ్దం పెంచామ అంటే వస్తువులు కూడా పగిలిపోతాయి. మొత్తం భూకంపాలే వస్తాయి శబ్దాలకు సో సౌండ్ అనేది చాలా ఎనర్జిటిక్ శక్తివంతమైనటువంటి వ్యవస్థ కాబట్టి ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీనే ఇక్కడ యూస్ చేశారు భగవద్గీతలో మరి ఆ సైన్స్ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితమే భగవద్గీత డెవలప్ అయింది.
(40:04) ఇప్పుడు సౌండ్ హీలింగ్ సౌండ్ హీలింగ్ అని చెప్పి ఇప్పుడు ట్రెండింగ్ థెరపీ ఏదనా ఉంటే అది సౌండ్ హీలింగ్ సౌండ్ హీలింగ్ ఎప్పుడో చేసాం మనం కొన్ని వేల సంవత్సరాల క్రితమే స్వామి మనకు అందించారు సౌండ్ హీలింగ్ సౌండ్ హీలింగ్ అంటేనే ఫ్లూట్ మురళీ గానం వింటేనే మనం తరించిపోయేటటువంటి వ్యవస్థ కాబట్టి ఆయన మొట్టమొదటి సౌండ్ హీలర్ సో ఆయన ఆయన అందించినటువంటి భగవద్గీత కూడా మనకి హీలింగ్ కి ఉపయోగపడేటటువంటి గ్రంథం ఇలా భౌతిక స్థాయి మనం రుగ్మతలని దాటడం కోసం మనం మనం ఉపయోగించుకోవచ్చు అలాగే సాంఖ్య యోగంలో ఉండే అన్ని శ్లోకాలు మొట్టమొదట ఆ 20 శ్లోకాలు మీరు గట్టిగా
(40:39) చదివితే ఈ జాత శహుద్రువ మృచు వాసాంశజనాని యదావిహాయనవాని గురునాతి నరోపరాణి ఈ శ్లోకాలన్నీ కూడా సాంఖ్యంలో స్థాయిలో ఒక్కొక మనిషి ఉంటాడు కదా అవునండి ఇప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు ఉండే ఆలోచనలు అవును యవ్వనంలో ఉన్నాయి కౌరంలో రకరకాలుగా మారుతుంటాయి కదా ఆలోచనలు మరి ఏ వ్యవస్థలో ఉన్నప్పుడు ఏ ఆలోచనలు ఏ విధంగా చేయాలి అనేది కూడా ఉంటాయి ఉంటాయి ఉంటాయి అయితే వాటిని ఆలోచనలు అన్నాం అయితే ఆలోచన వేరు భావం వేరు అనుభవం వేరు అనాలసిస్ వేరు విశ్లేషణ వేరు జ్ఞానపరంగా సమన్వయం వేరు కానీ ఇవన్నీ ఆలోచనలే ఆలోచనలకు పెట్టే పేర్లే ఇప్పుడు ఉదాహరణకి మనం కొంచెం పాశ్చాత్యుల యొక్క సైన్స్ కూడా
(41:23) తీసుకొస్తే వాట్ ఇస్ ద థాట్ వాట్ ఇస్ ద ఫీలింగ్ ఫీలింగ్ అంటే విజువల్ పాటర్న్ లో ఉండేదాన్ని ఫీలింగ్ అంటారు. అంటే ఇట్లా కళ్ళు మూసుకోగానే ఒక టీచర్ నన్ను తిడుతున్నట్టుగా ఒక టీచర్ నన్ను మందలిస్తున్నట్టుగా ఒక విజువల్ పాటర్న్ కనబడుతుంది అనుకోండి దాన్ని తాట అనకూడదు. దాన్ని ఫీలింగ్ అంటాం. విజువల్ పాటర్న్స్ లో ఉండేదాన్ని ఫీలింగ్ అంటాం మైండ్ నుండి పుడుతుంది దాన్ని భావం అంటారు భావం అంటే ఏంటి విజువల్ పాటర్న్ మనం ఊహించుకోవడం ఇమాజినేషన్ అంటాం కదండీ అది భావం చాలా మంది ఏమనుకుంటారంటే వీటిని ఆలోచనలు అనుకుంటారు ఓ నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి చాలా
(41:54) ఆలోచనలు అవి చాలా ఆలోచనలు కావు అవి భావాలే ఈ భావాలు ధ్యానంలో కూడా ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన అట్లా గొలుసుకట్టుగా ఆలోచనలు వస్తాయి తప్ప ఒకేసారి మీ మీద దూకినట్టుగా ఆలోచనలు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆలోచన చేయాలి అంటే 10 దళాల ప్రాణశక్తి ఖర్చు అవుతుంది. మీరు ఒకవేళ అట్లా ఆలోచన క్రమంలో పడిపోయారు అంటే మీరు నిరసించిపోతాం బలహీనం అయిపోతాం అప్పుడు 10 దళాల ఎనర్జీ ఖర్చు అయిపోతుంది కదా మనం సన్నబడిపోతామేమో అని అనుకోకూడదు సన్నబడడం వేరు శక్తిహీనం అయిపోవడం వేరు పూర్తిగా బలహీనం అయిపోతాం అంటే రోగ నిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది ఎక్కువ ఆలోచన చేస్తూ
(42:29) అందుకే నేను చాలా మందిని గమనించాలండి మనం పల్లెటూళ్లలోకి వెళ్ళినప్పుడు ఆ ఈ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటూ ఉంటారు కదా వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళ వాళ్ళలాగా 30 ఏళ్ళ వాళ్ళలాగా ఉంటారు. ఉ మీరు గమనించ 60 ఏళ్ళు వచ్చిన 70 ఏళ్ళు వచ్చిన హుషారుగా పని చేస్తున్నాం అనుకోండి ఎందుకంటే వాళ్ళకి అసలు థాట్ ప్రాసెస్ే ఉండదు.
(42:46) అంటే ఆలోచనలకి ఎనర్జీని ఖర్చు పెట్టేటటువంటి వ్యవస్థ ఉండదు పొద్దున్న లేచిన దగ్గర రాత్రి దాకా ఈ పని చేద్దాం ఆ పని తర్వాత ఆ పని ఒకటి డిసిప్లిన్ ఉంటుంది. దాని ప్రకారం [గొంతు సవరించుకోవడం] వాళ్ళ లైఫ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆలోచించరు కాబట్టి వాళ్ళు యంగ్ గా ఉంటారు. మూలాధార ఎనర్జీ సెంటర్స్ బాగా డెవలప్ అయి ఉంటాయి. అంటే ఆలోచనల వల్ల వృద్ధాప్యం కూడా కలుగుతుంది.
(43:04) ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే ముసలితనానికి వెళ్ళిపోతాం మనం ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. ఉమ్ ఏ ఆలోచన అయితే ఐడియాగా మారుతుందో మ్ అంటే ఆలోచన రాకుండా చేసేయడం కాదు ఆలోచనని ఐడియాగా మార్చాలి ఎప్పుడైతే [గొంతు సవరించుకోవడం] ఆలోచన ఐడియా అవుతుందో అప్పుడు ఆలోచన వల్ల ఏ నష్టం ఉండదు. ఆలోచన ఐడియా కాకుండా ఒక కొట్టుమిట్టాడే స్థితి ఉంటుందో అక్కడే ఎనర్జీస్ బలహీనం అవుతాయి.
(43:30) అందుకని స్వామి ఆలోచనని ఐడియాగా మార్చే విధంగా సాంఖ్య యోగం ఉంటుంది అంటే ఒక ఆలోచన ఏ విధంగా ఉపాయంగా మారాలి ఉపాయంగా మారినటువంటి ఆలోచన మనల్ని ఉద్ధరిస్తుంది. లేదు అంటే అపాయంగా మారుతుంది సో ఆ ఉద్దరేదాత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయేత అంటే ఏంటి ఆలోచన ఎలా ఉండాలి నన్ను నేను ఉద్ధరించుకునే విధంగా ఆలోచన విధానం ఉండాలి. మేము ఈ జగత్తు మొత్తాన్ని ఉద్ధరిస్తాం మనల్ని మేము పక్కన పెట్టుకుంటాం అంటే అది ఉద్ధరింపడం కాదు.
(43:55) సో ముందు అసలు సెల్ఫ్ అనేది ఇంపార్టెంట్ ఆత్మోద్ధరణ ముందు ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత జనోద్ధరణ భౌతికోద్ధరణనే నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ మాట నేను అన్నాను అనుకోండి ఈయన స్వార్ధపరుడు ఈయన సెల్ఫిష్ అంటాడు. ఇప్పుడు భగవద్గీత చదివి నేను బాగుపడ్డా కాబట్టే కదా మీకు చెప్పగలుగుతున్నా 15 సంవత్సరాల క్రితం నేను ఒక యువకుడిని నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే ఒక 40 50,000 శాలరీ వస్తుంది.
(44:17) లేదా వేరే పనులు చేసుకుంటే ఒక శాలరీ వస్తుంది. చక్కగా ఆల్రెడీ అందరూ నడిచే మార్గంలో నేను వెళ్తే ఏో నా రూపాయలు వస్తాయి. ఆ అక్కడ బాగుపడ్డాను అనుకోండి అందులో బాగుపడ్డాను నువ్వు లౌకికంగా బాగుపడ్డావు అనొచ్చు కానీ భగవద్గీత చెప్పుకుంటూ 15 సంవత్సరాలుగా భగవద్గీత మీదే ఉంటూ [గొంతు సవరించుకోవడం] భగవద్గీత క్లాసులు పిల్లలకి వాళ్ళకి చెప్పుకుంటూ నేను అందరికంటే బాగా ఉన్నాను ఇప్పుడు ఉన్న వాళ్ళందరికంటే హాయిగా ప్రశాంతంగా ఉన్నాను నలుగురు గౌరవిస్తున్నారు భార్గవ శర్మ అంటే ప్రాణంగా చూసేవాళ్ళు ఉన్నారు ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నారు ఇంతమంది ఆప్యాయతలు నా ముక్కు మొహం
(44:49) తెలియకుండానే నాకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు అదంతా ఎందుకు వస్తుంది ఇది భగవద్గీత సమాజానికి ఉపయోగపడే పని ఒకటి మనం చేసామ అంటే సమాజం మనకి ఈ రోజు కాకపోతే రేపైనా ఉపయోగపడుతుంది. సో ఈ భగవద్గీత అనేది అత్యంత విలువైనటువంటి అంశంగా నేను ఆరోజే నిర్ణయించుకున్నాను నా మార్గాన్ని ఇలానే మలుచుకున్నాను ఇలానే ఇందులోనే ఎదగాలనుకున్నాను ఇందులోనే ఎదుర్కుంటూ వచ్చామ అన్నమాట ఈరోజు మీ ముందుకు కనబడుతున్నాను అంటే అది భగవద్గీత యొక్క గొప్పతనమే ఆలోచనలో స్పష్టత కావాలి అంటే ఏం చేయాలి గురువుగారు దాన్ని మనకి చాలా శ్లోకాలు అంటే మనకి స్పష్టత అనేది చాలా విషయాల్లో రావాలి
(45:24) ఒక అంశంలో స్పష్టత తెచ్చేస్తే సరిపోదు చాలా విషయాల్లో స్పష్టత రావాలి ఎందుకు బతుకుతున్నాం అసలు జీవించడం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి ఆత్మ యొక్క ధర్మాలు ఎలా ఉంటాయి ఎలా ఉండాలి ధీరుడు అనేవాడు ఎలా ఉండాలి ఇట్లా మల్టిపుల్ వేస్ లో మనకి స్పష్టత కలగాలి అలా మల్టిపుల్ వేస్ లో సాంఖ్య యోగం అనాలసిస్ ఉంటుంది మనక అన్ని రకాలుగాను విచారణ చేసుకుంటూ వెళ్ళిపోతాం సో ఆ విధంగా మనకి ఒక పరిపూర్ణమైనటువంటి థాట్ ప్రాసెస్ థాట్ అంటే ఏంటి మనం భావం అంటే విజువల్ పాటర్న్ అనుకుందాం థాట్ అంటే ఏంటంటే అంటే సౌండ్ పాటర్న్ ప్లస్ విజువల్ పాటర్న్ అంటే ఆల్రెడీ ఒక విజువల్ పాటర్న్ ఉంటుంది.
(45:58) దానికి ఒక సౌండ్ పాటర్న్ కూడా ఉంటుంది. అంటే మనకి తెలియకుండా అనుకుంటూ ఉంటాం. ఉదాహరణకి ఒకడు మనల్ని తిట్టు ఉంటాడు. ఆ తిట్టు మనం కూడా అనుకుంటూ ఉంటాం వాడు నన్ను ఇట్లా అన్నాడు, వాడు నన్ను ఇట్లా అన్నాడు, వాడు నన్ను ఇట్లా అన్నాడు అనేటటువంటి ఒక సౌండ్ పాటర్న్ రిపీటెడ్ గా వస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఒక విజువల్ పాటర్న్ కూడా కనబడుతూ ఉంటుంది.
(46:17) దాని వల్ల ఏమవుతుంది 10 దళాల ప్రాణశక్తి తగ్గిపోతుంది. అవును ఈ ఇలా గనక మనం చేసినట్లయితే ఇలా గనక మీరు ఒక నెల రోజులు చేస్తే ఈ విధంగా ఒక సౌండ్ పాటర్న్ ని రిపీటెడ్ గా పెట్టుకుంటూ విజువల్ పాటర్న్ తో ఉండి మీరు గనక చేస్తే 100 కి 1000% బీపి షుగర్ ఎసిడిటీ గాల్ బ్లాడర్ లో రాళ్ళు కిడ్నీలు ఫెయిల్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఇంత చిన్న తప్పే చూస్తూ ఉంటే చిన్న తప్పులాగానే కనబడుతుంది.
(46:44) చిన్న తప్పే అది ఎనర్జీ సెంటర్స్ మొత్తం ఎనర్జీని గ్రాబ్ చేసేస్తాయి. సో అట్లా జరగకుండా ఉండాలి అంటే ఈ సాంఖ్య యోగం ఒక్కటి మనకి ఉపయోగపడే అంశం అన్నమాట సో ఈ సాంఖ్య యోగాన్ని మనం ఉపయోగించుకుంటే థాట్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది ఆలోచనా విధానం డెవలప్ అవుతుంది దాని సౌండ్ ఫ్రీక్వెన్సీ గనక మనం కనెక్ట్ అయితే సవా లక్ష రోగాలకు సమాధానంగా ఉంటుంది సాంఖ్య యోగం అనేది అవును అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక అక్షరం గాని గ్రంథంలో ఉన్నటు వాటన్ని అక్షరాలు అవును ఆ అక్షరాలే బీజాక్షరాలుగా మంత్రాలుగా వాళ్ళు దండ ండ పెట్టారు అవునండి అవును అవును అంటే ఇప్పుడు మీరు భగవద్గీతని చక్కగా మంచి
(47:22) ఆడియో రూపంలో అందిస్తున్నారు ఎన్నో ఆడియోలు ఉన్నాయి కూడా అవును అవి వినడం ద్వారా వీళ్ళలో వచ్చే మార్పుకి వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు చదువుకోవడం ద్వారా వచ్చే మార్పుకి లేదు ఎవరైనా ప్రత్యక్షంగా ప్రెజెన్స్ లో ఉండి వింటున్నప్పుడు అంటే మీరు ఒక స్టేజ్ మీద చదువుకుంటున్నారు పక్కలేదు మీరు పక్కనే కూర్చ అవును ఈ మూడిటిలోకి ఏమనా వేదం ఉంటుంది 100% తేడా ఉంటుంది భగవద్గీత వల్ల 100 శాతం మీకు రిజల్ట్స్ రావాలి అంటే భగవద్గీతని పూర్తిగా మన శక్తి కేంద్రాలకు సమన్వయం చేసి గ్రహించినప్పుడే 100% రిజల్ట్స్ వస్తాయి.
(47:55) జస్ట్ విన్నారు అనుకుందాం వింటే ఒక 10% మార్క్స్ చదివారు అనుకోండి 20 మార్క్స్ 100 కి తెలుసుకుంటున్నారు అనుకోండి గరిగిపాటి గారో చాగండి గారో ప్రవచనాలు చెప్తున్నప్పుడు భగవద్గీత మీద ఆసక్తిగా తెలుసుకుంటున్నారు అనుకోండి 30 మార్కులు పాస్ మార్క్ అయితే కాదు కానీ ఆ భగవద్గీతని మీరు ఇంకో నలుగురికి చెప్తున్నారు అనుకోండి విడమర్చి సమన్వయం చేసి చెప్తున్నారు అప్పుడు మీరు పాస్ అవుతారు 45 మార్క్స్ 50 మార్క్స్ వస్తాయి దానితో పాటు విశ్లేషణ చేయాలి ఈ శ్లోకం ఎందుకు చెప్పారు వ్యాసులవారు ఎందుకు చెప్పారు అందులో వ్యాసులవారి దృక్కోణం ఏంటి ఈ క్వశ్చన్ సంజయుడు చేత ఎందుకు అడిగిచ్చాడు
(48:26) ధృతరాష్ట్ుడు చేత ధృతరాషుడు 701 శ్లోకాల్లో ఒకటే శ్లోకం అదేంది ధృతరాష్ట్ుడు ఒకటే శ్లోకం ఎందుకు ఇచ్చాడు ఈ ఈ సంఘటనలు అప్పుడు విశ్వరూప సందర్శన యోగంలో మనకు చెప్తారు. విశ్వరూప సందర్శన యోగంలో దూరంగా ఒక విశ్వరూపం జరుగుతున్న సంఘటననే ముందు సంజయుడి చేత చెప్పిస్తారు. అంటే మనం దూరంగా ముందు విశ్వరూపాన్ని చూడాలి.
(48:45) తర్వాత [గొంతు సవరించుకోవడం] అర్జునుడి చేత చెప్పిస్తారు అప్పుడు మనం విశ్వరూపం దగ్గరికి వెళ్ళిపోతాం మనం సో ఈ విధమైనటువంటి ఆడియో విజువల్ స్క్రీన్ ప్లే అంటారు కదా సినిమా చూపించినట్టుగా విశ్వరూప సందర్శనాన్ని ఒక స్క్రీన్ ప్లే అది అదిఒక స్క్రీన్ ప్లే అన్నమాట అంటే మనం కూర్చొని విశ్వరూప దర్శనాన్ని ఒక 5డి లోనో 6డి లోనో చూడొచ్చు ఆస్వాదించొచ్చు అందుకని చెప్పి సంజయుడిని వీళ్ళందరినీ ఉంచారన్నమాట అట్లా మీరు ప్రశ్నలు వేసుకుంటూ విశ్లేషణ చేస్తే 60 మార్క్స్ వస్తాయి దాన్ని మీరు జ్ఞానపరంగా సమన్వయం చేసుకొని ప్రతి యాక్షన్ దగ్గర ఉపయోగించుకొని మెలితి లేకుండా జీవితాన్ని
(49:15) మీరు గడిపారంటే 80 మార్క్స్ వస్తాయి అసలు వెళ్తే ఉండకూడదు అసలు ఇది లేదు అనే మాటే రాకూడదు అలా మీరు భగవద్గీతను అధ్యయనం చేయొచ్చు భగవద్గీతతో లేమి అనేదాన్ని పూర్తిగా తుడిచేసేయొచ్చు మనం జీవితంలో అట్లా గనక వెళ్తే 80 మార్క్స్ వస్తాయి మీరు పూర్తిగా ఎనర్జీస్తో సమన్వయం చేసి గనుక మీరు భగవద్గీతను అందుకుంటే 100 మార్క్స్ వస్తాయి భగవంతుని మీలోనే ప్రతిష్టాపన చేయొచ్చు స్వామి వారిని మీలోనే ప్రతిష్టాపన చేయొచ్చు అంటే భగవంతుని మన లోపల ప్రతిష చేసుకోవాలిన్నారు కదా అంతే అంటే మన లోపల లేడా సర్వాంతర్యామి ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్ సర్వోపగతుండు దానవాగ్రణ
(49:53) వింటే హిరణ్య కశపుడికి కూడా అంతా ఉంటాడు గుర్తించడు ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు గుర్తించడు ఇక్కడ గుర్తించన స్థితి అక్కడ గుర్తించని స్థితి ఉంటుంది సూర్యుడిని కొంత కొంత ప్రాంతం వాళ్ళు గుర్తించరు కొంత ప్రాంతం వాళ్ళు గుర్తిస్తారు కానీ సూర్యుడు ఉంటాడు అలాగే స్వామి మన లోపల ఉంటాడు కాన్షస్ రూపంలో ఆయన ఉంటాడు ఆయన ఉంటే ఉంటే సరిపోదు ఆయన ఉన్నట్టుగా మనం గుర్తిస్తే కదా మనకు ధైర్యం వచ్చేది.
(50:16) ఇప్పుడు ఇక్కడ స్వామి ఉన్నాడు అనుకొని కూర్చునే విధానం స్వామిని గుర్తించకుండా ఉండేటటువంటి విధానం చాలా తేడా ఉంటుంది నాలో స్వామి ఉన్నాడు అనే గుర్తింపు 100కు 100 శాతం బలపడాలి అంటే మనం భగవద్గీతని శక్తి అంశాలతో సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మన లోపల ఉండేటటువంటి సత్శక్తి కేంద్రాలు ఉంటాయి. సర్వ శాస్త్రాలు సకల శాస్త్రాలు ఈ శక్తి కేంద్రాలతో సమన్వయం అయ్యేవే అని లలితా సహస్రనామం చెప్తుంది.
(50:43) లలితా సహస్రనామం అంటే ఏంటంటే సకల శాస్త్రాలు ఆవిడవే లలిత ఉపాసన అంటేనే అన్ని శాస్త్రాలు అన్ని వేదాలు ఆవిడ ముఖం నుండి వచ్చినవే సకల శాస్త్రాలు ఆ శాస్త్రం ఈ శాస్త్రం కాదు భగవద్గీత కాదు ఏది వేదాలు సరే ఆ లలిత ముఖం నుండే వచ్చినవి అనేది శాస్త్రం చెప్తుంది. సో ఈ లలితా దేవి అనగానే ఆవిడ ఎలా మూలాధార సంస్తితాయే నమః అంటాం.
(51:05) మూలాధారంలో [గొంతు సవరించుకోవడం] ఆవిడ ఎలా ఉంటుంది స్వాధిష్టానంలో ఆవిడ ఎలా ఉంటుంది మణిపురంలో ఎలా ఉంటుంది అనాహతంలో మనల్ని ఎలా రక్షిస్తుంది విశుద్ధులో ఎలా ఉంటుంది ఆజ్ఞలో ఎలా ఉంటుంది సహస్రారం దగ్గర పరమేశ్వరుడితో లయం అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది ఈ విధమైనటువంటి సైన్స్ ని పక్కన పెట్టుకొని అమ్మవారిని కూడా పెట్టుకొని అయ్యవారిని అందుకుంటే 100% మార్క్స్ వస్తాయి అన్నది నా అభిప్రాయం ఓన్లీ అయ్యవారిని పట్టుకోవద్దు అమ్మవారిని కూడా పక్కన పెట్టి పట్టుకోవాలి సహస్రారంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు సంయమించేటటువంటి క్షేత్రం అది సహస్రారం అంటే అమ్మ [గొంతు సవరించుకోవడం] అయ్య ఇద్దరూ ఉంటారు
(51:36) అమ్మవారు అయ్యవారు ఇద్దరూ ఉండేటటువంటి కేంద్రమే కాబట్టి శక్తి చైతన్యాల కొలువే సహస్రారం కాబట్టి సహస్రారాన్ని అందుకుంటేనే సాధకుడికి మోక్షం వస్తుంది. సహసారాన్ని అందుకుంటేనే 100 మార్కులు సో అట్లా అమ్మవారితో సమన్వయం చేయాలి ఎనర్జీ సెంటర్స్ తో సమన్వయం చేస్తూ మనం భగవద్గీతను అందుకోగలిగితే 100% మార్క్స్ వస్తాయి లేమి అనేదే మన లైఫ్ లో ఉండదు అటువంటి సమాజాన్ని మనం పొందాలి అట్లాంటి దేశం మనది కావాలి మళ్ళీ ఈరోజున మనకు ఉన్నటువంటి ఈ సమయంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలియజేసుకున్నాం.
(52:07) కానీ మళ్లా మీరు వచ్చి మీ యొక్క జ్ఞానాన్ని అందించేంత వరకు చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఏ అధ్యాయాల్లో ముఖ్యంగా ఒక 10 శ్లోకాలు ఏమేమీ పటిస్తా ఉంటే ఉపయోగపడుతుందా కాస్త 10 శ్లోకాలు కాదు జస్ట్ భక్తి యోగంలో మనకి మూడో శ్లోకం ఉంటుంది ఏత్వక్షరం అనిర్దేశం అచింత్యం సర్వత్రగం అచించ కూటస్తమచలం అని ఒక శ్లోకం ఉంటుందండి ఆ ఒక్క శ్లోకాన్ని ధారణ చేయండి ఏత్వక్షరం అనిర్దేశం అచింత్యం సర్వ ఇట్లా తొమ్మిది ఎనిమిది లక్షణాలు ఆయనకు ఉండేటటువంటి ఎనిమిది లక్షణాలు ఆ శ్లోకంలో ఉంటాయి భక్తి యోగంలో ఉంటుంది మూడో శ్లోకం మూడో నెంబర్ ఆ ఒక్క శ్లోకాన్ని ధారణ చేయండి నెక్స్ట్ మన ఎపిసోడ్ లో దానికి
(52:47) సంబంధించినటువంటి ఒక విశ్లేషణ మీకు అందిస్తాను సైంటిఫిక్ గా అది గనుక మీరు అందుకున్నారంటే ముందు అసలు శుద్ధి అయిపోతుంది కుండలినయే శుద్ధి అయిపోతుంది అంతటి గొప్ప మహిమ ఆ శ్లోకానికి ఉంటుంది స్వామి నేను ఇదిరా నువ్వు అనుకున్నట్టు కాదు నేను ఇట్లా ఫ్లూట్ పట్టుకొని నేంచిన వ్యవస్థ కాదు నేను ఈ లక్షణాల్లో ఉంటాను ఇది నా ప్రకృతి నా ఈ పరా ప్రకృతి నాది నువ్వు దీన్ని గ్రహిస్తే నన్ను గ్రహించిన వాడు అవుతావ అని శాసిస్తూ చెప్పినటువంటి శ్లోకం అన్నమాట ఆ ఒక్క శ్లోకాన్ని అందరూ భగవద్గీత తీసుకొని ఆ ఒక మూడో శ్లోకం భక్తి యోగంలో ఉంటుంది దానికి కాస్త గట్టిగా నేర్చేసుకుంటే మీకు
(53:20) నెక్స్ట్ ఎపిసోడ్ లో దాని యొక్క మహిమని వైభవాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. చాలా సంతోషం గారు ధన్యవాదాలు ధన్యవాదాలు [గురకలు] అంటే ఇప్పటిదాకా మీరు ఎన్నో రకాలైనటువంటి విశ్లేషణలు భగవద్గీతకు సంబంధించి విని ఉంటారు చదివి ఉంటారో చూసి ఉంటారు లేదు మీకంటూ కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. మనందరం కూడా ఆ పరమాత్ముని యొక్క బిడ్డలే కాబట్టి వారు ఏ జ్ఞానాన్ని అందించారో అవంతా కూడా మనకు తెలిసే ఉంటుంది.
(53:45) కాకపోతే కాస్త నిద్రావస్థలో ఉండుంటుంది. అలాంటి వాటిల్ని జాగ్రత్తం చేసి మరల మరల మనలో జ్ఞానాన్ని నింపడం కోసం భార్గశర్మ గారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో వారు సక్సెస్ కావాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూండి శ్రీ సన్నిధి టీవీ నమస్కారం.
No comments:
Post a Comment