*"నా వాడు" - కొంచెం తేలికగా ఉంటుంది. "నా వాడు, నా చెప్పుచేతల్లోనే ఉంటాడు. గీసిన గీటు దాటడు" - ఇది బావుంది. కావలసినంత బరువు.*💪
*ఈ సత్యభామ అంశలకి స్వాధీనతాభావం ఎక్కువ. "నా" అనే అక్షరానికి నారాయణుడు కూడా అంత విలువ ఇవ్వడేమో.*🤔
*భావప్రకటనల్లో సామూహిక ఆస్కార్ అవార్డు గనక వుంటే, అది ఆడవారికి ఇవ్వొచ్చు. మనసులోని మాట ఎటూ బైటపెట్టరు. వ్రేళ్ళతో, చూపులతో, సౌంజ్ఞలతో రాజ్యం ఏలేస్తూ ఉంటారు. "నా భర్త" అని చెప్పి వదిలేయడానికి మనసొప్పదు. మీరు గమనించండి, ఆ మాట అనగానే వారివంక చూసి ఓ నవ్వు వదులుతారు. "ఔను" అనమని.*😊
*కానీ, నాణేనికి రెండో వైపు చూస్తే, ఈ లక్షణం చాలా ముఖ్యం అనిపిస్తుంది. ఎవరికీ చెందని మగవాడి కోసం ఆమాత్రం తాపత్రయపడే అర్థాంగి ఒక బహుమానమే మరి. నాకే సొంతం, నా వద్దే ఉండాలి, నా మాటే వినాలి, నా గురించే ఆలోచించాలి.... ఇలాంటి ఆశయాలు కొంచెం ఇబ్బందిగా వున్నా, సర్దుకుపోవడం చాలా ప్రధానం.*
*"మగువేగా మగవారికి మధుర భావనా....."*💕
*శుభోదయం.*🙏
No comments:
Post a Comment