వెంకటేష్ :*" కష్టాలను ఎలా ఎదుర్కోవాలి ? "*
పత్రీజీ : *" ప్రతి మనిషికీ కష్టాలు వస్తాయి. కొంతమంది వాటినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి పారిపోతారు ! వారు పిరికివారు ! కష్టాలను ఎదుర్కోవాలంటే కష్టం వల్ల వచ్చే ఫలం మీద ధ్యాస ఉంచాలి. చెట్టు మీద వున్న పండు అందాలంటే చెట్టు ఎక్కటానికి కష్టపడాలి. 'కష్టం ' వల్ల వచ్చే 'ఫలం' మీద అశ ఉండి, తగిన కష్టం చేస్తేనే ఫలం అనుభవించగలవు. "*
లక్ష్మి:" *జ్ఞానానికీ-చదువుకూ తేడా ఏమిటి ? ”*
పత్రీజీ : *" చదువు ఒక సబ్జెక్ట్ నేర్పుతుంది. అయితే జ్ఞానం అన్నది మనకు సరిగ్గా ఎలా జీవించాలో నేర్పుతుంది ! 'ధ్యానం' అనే చదువు నేర్చుకుంటే ' జ్ఞానం ' అనే ' ఫలం వస్తుంది. జ్ఞానం అంటే హాయిగా జీవించే విధానం! ”*
No comments:
Post a Comment