కష్టాలు,ఆపదలు ఎందుకు వస్తాయి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి||Telugu life lessons||Motivation Messages|
Author Name:Keerthi creatives
Youtube Channel Url:https://www.youtube.com/@keerthicreatives8265
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6sAGVDGzOv4
Transcript:
(00:00) ఒక్కొక్కసారి మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తూ ఉంటారు. మనం [గురకలు] ఇలా జరుగుతుంది అనుకుంటే అది మరోలాగా జరుగుతూ ఉంటుంది. కానీ మనం కోరుకున్నది కోరుకున్నట్టుగా జరగకపోవడం వల్ల అబ్బా ఎందుకు ఇలా జరగలేదు భగవంతుడు నాపై ఎందుకు కక్ష కట్టాడు నాకెందుకు న్యాయం చేయట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాము. కానీ కొంత కాలం తర్వాత అసలు వాస్తవాలు మన కళ్ళకి కట్టినట్టుగా కనపడుతూ ఉంటాయి.
(00:26) కానీ మరి వాస్తవాలు కనులకు కట్టినట్టుగా కనిపించేంతవరకు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి జరిగేటువంటి అంశంలో మనకి మంచే జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఎలా గుర్తించాలి మొదలైనటువంటి అంశాలన్నింటిని కూడా నేటి వీడియోలో మనము చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్ నేను మీ కీర్తన రెడ్డి. [సంగీతం] [సంగీతం] మనకి మనం ఒకలాగా జరగాలి అని చెప్పి బలంగా
(01:11) కోరుకుంటూ ఉంటాము. మనం నమ్మిన సిద్ధాంతం వైపే అడుగులు వేస్తూ అది అలా కాదు ఇలాగే జరగాలి నా వైపే న్యాయం జరగాలి అవతలి వాళ్ళు నా వైపే మాట్లాడాలి నాకు నచ్చినట్టుగా మాట్లాడాలి అని చెప్పో లేదంటే నాకే లాభం రావాలి అని చెప్పో నేను కోరుకున్నదే జరగాలని చెప్పో ఇలా విపరీతమైనటువంటి కోరికతో కొన్ని అంశాల పట్ల ఇది ఇలాగే జరగాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము కానీ మనం అనుకున్నట్టుగా అస్సలు జరగకుండా మరోలాగా జరుగుతూ ఉంటుంది అలా జరగగానే మన పైన మనకు విపరీతమైనటువంటి కోపం రావటం భగవంతుడు నాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నాడు అన్నట్టుగా భావించటం
(01:46) ఇలా జరుగుతూ ఉంటాయి అయితే అంతా మన మంచికే అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళటం వల్ల ఇలాంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుందట మీరు అంత సులభంగా చెప్పేస్తున్నారు కానీ అలా ఎలా అనుకోగలుగుతాం చెప్పండి అంతా మన మంచికే అని చెప్పి అనుకోవటం అసలు సులభ సాధ్యమేనా అని చెప్పి మీకు అనిపించొచ్చు దానికి సంబంధించి నేను మీకు ఒక కథని ఉదాహరిస్తాను ఒక ఉప్పు అమ్ముకొని వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి ఉన్నాడు ట ఉప్పుని తీసుకొని మరొక ఊరికి వ్యాపారం చేయడం కోసం అని చెప్పి ఉప్పుల బస్తాతో వెళ్తూ ఉన్నాడట అలా వెళ్తూ ఉండగా ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి వర్షం బాగా
(02:22) కురుస్తూ ఉందట ఆ వర్షానికి తట్టుకోలేక తన దగ్గర ఏదైతే ఆ ఉప్పు బస్తాల పైన కప్పటానికి తాటిపత్రులు అని చెప్పి అంటూ ఉంటాం కదా ఆ ఏదైతే రక్షణకి కవచంగా ఉండేటువంటి ఆ కవర్ లాంటిది వేసి కప్పి పెట్టాడట అది సగం వరకే సరిపోవడంతో మిగతా ఉప్పంతా కరిగి నీరై కారిపోయిందట అలాగే కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ మిగతా ఉప్పు కవర్ కూడా కొట్టుకొని పోయి ఉప్పుంతా నీరై కారిపోయిందట అతను విపరీతంగా బాధపడుతూ అయ్యో భగవంతుడు నేను కష్టపడి పని చేసుకుంటున్నానే నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు నా ఉప్పు బస్తాలు మొత్తం పాడైపోయాయి అని చెప్పి బాధపడుతూ ఉన్నాడట అలా బాధపడుతూనే ముందుకు పయనిస్తూ
(02:58) ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడొక అక్కడఒక దారి దొంగ కాల్చుకొని కూర్చున్నాడట అతడు బలహీనంగానే ఉన్నాడు కానీ అతడి చేతిలో కాల్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి మందుగుండి సామాగ్రితో కూడుకున్న ఉన్నటువంటి పిస్తో ఉందట దాంతో కాల్చి ఇతని దగ్గర ఉన్నటువంటి ఉప్పు బస్తాలని ఇతని దగ్గర ఉన్నటువంటి ఆభరణాలని ఎత్తుకు వెళ్ళాలి అనేటువంటిది అతడు ఉపాయంతో కూర్చొని ఉన్నాడట.
(03:22) కాల్పులు జరిపి ఏమైనా తీసుకొని వెళ్దామా అంటే మందుగుండి సామాగ్రి మొత్తం తడిచిపోయి అతనికి అపాయం తలపెట్టాలనేటువంటి ప్రయత్నము విఫలమైపోయింది. దానివల్ల అతను మౌనంగా అలాగే చెట్టుపైనే కూర్చుండిపోయాడట. మందుగుండి సామాగ్రి పేలకుండా అయిపోవడం వల్ల ఏమి చేయలేక మౌనంగా చెట్టుపై నుండి చూస్తూ కూర్చుండిపోయాడట అంతేకాదు విపరీతంగా తడిచి ఉరుములకి మెరుపులపి భయపడుతూ ఆ చెట్టుపైనే బిక్క చచ్చిపోయి కూర్చొని ఉండిపోయాడట కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ గణించినటువంటి ఈ వ్యక్తి అయ్యో భగవంతుడా నా దగ్గర ఉన్నటువంటి ఉప్పు బస్తాలని కాదేసావు నా వ్యాపారానికి నష్టం చేశవు అనుకున్నాను కానీ అంతకన్నా పెద్ద
(03:58) నష్టం జరగబోతుంటే దాని నుండి రక్షించావు అనేటువంటి విషయాన్ని అతడు కాస్త ముందు ముందుకు వెళ్ళిన తర్వాత ఎవరైతే దారిదొంగ ఉన్నాడో అతడిని చూసిన తర్వాత ఇతడు అర్థం చేసుకోగలిగాడట మాటున మాటు వేసి ఉన్నటువంటి దారి దొంగ నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని అతడి మందుగుండి సామాగ్రి పేలకుండా ఉండటం కోసమే భగవంతుడు ఈ వర్షాన్ని కురిపించాడని ఉప్పు బస్తలు పోతే మళ్ళీ సంపాదించుకోగలుగుతాము కానీ ప్రాణం పోతే తిరిగి రాదని కేవలం నన్ను కాపాడటం కోసమే భగవంతుడు ఇలా చేశాడు అని చెప్పి భగవంతుడికి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత పూర్వకంగా అక్కడి నుండి బయలుదేరి
(04:34) వెళ్ళిపోయాడట కథ చెప్పుకోవడానికి చాలా సున్నితంగా మామూలు విశ్లేషణతో కూడుకొని ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో కూడా ఒక అవాంచనీయమైనటువంటి సంఘటనో ఒక ప్రమాదం లాగా కనిపించేటువంటి సంఘటనో మనకు ఎదురైనప్పుడు ఖచ్చితంగా ఆ సందర్భంలో అంతకన్నా పెద్దదేదో తప్పించడం కోసమే విధి మన పైన అలాంటి ప్రయోగాలను చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకొని కాస్త సమయమనం పాటించి నెమ్మదిగా మన చుట్టూతా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది ఏం జరగబోయేది ఎలాంటి పరిస్థితుల నుండి బయట పడ్డాను అనేటువంటిది గమనించుకుంటే కచ్చితంగా మీ ప్రశ్నకి సమాధానం
(05:10) దొరుకుతుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రం ఇది వర్తించదు. ఎందుకు అంటే ప్రతి ప్రమాదం జరగబోయే ముందు భగవంతుడు అంటామో విధి అంటామో కాలం అంటామో కర్మ అంటామో ఏమైనా పేరు పెట్టుకోండి మీరు కానీ అది మాత్రం మనల్ని పదే పదే మూడు నాలుగు సార్లకు మించి హెచ్చరిస్తుంది ఇది నీ జీవితంలో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పి ఆ అంశం పట్ల అప్రమత్తతని చేకూరుస్తుంది.
(05:34) మనం గమనించుకోకుండా ఏదైతే మనకు నష్టం చేసేటువంటి పని పట్ల అవాంతరాలు ఎదురవుతున్నప్పటికీ కూడా గమనించుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే పని చేయాలనేటువంటి ప్రయత్నం చేసామే అనుకోండి ఖచ్చితంగా భారీ నష్టం ఏర్పడుతుంది. ఇది మనం గమనించుకోవాలి గమనించుకునేటువంటి స్థితిలో విశ్లేషణ పూర్వకమైనటువంటి స్పృహతో మనం ఉన్నప్పుడు మాత్రమే దీన్ని గమనించుకోగలుగుతాము మీకు ఇంకా అర్థమయ్యేలాగా సామాన్యమైనటువంటి భాషలో చెప్పాలి అంటే ఉదాహరణకి హెల్మెట్ లేకుండా పైన విపరీతమైనటువంటి స్పీడ్ తో వెళ్తున్నారే అనుకోండి మొదటిసారి కింద పడినప్పుడు మామూలుగా దెబ్బ దెబ్బ తగులుతుంది బయట పడిపోతారు. అంటే ఇది
(06:09) మొదటిసారి నిన్ను విధి హెచ్చరించింది అని అర్థం. ఇలాగే రెండవసారి కూడా మళ్ళీ అదే పని చేస్తూ వెళ్లారే రెండోసారి చేతులు విరగటమో కాళ్ళు విరగటమో అలాంటివి జరుగుతాయి. అక్కడ కూడా విధి హెచ్చరిస్తుంది. ఇంకా మూడవసారి కూడా మీరు అదే ప్రయత్నం చేస్తూ అంతే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే మాత్రం కచ్చితంగా భారీ మూల్యాన్ని చెల్లించుకునేలాగా శిక్షిస్తుంది.
(06:29) దీన్ని నేను చిన్న ఉదాహరణతో చెప్పాను కానీ మన జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటనకి ముందు విధి పలుసార్లు హెచ్చరిస్తుంది అది చెడు సంఘటన నిర్లక్ష్యంతో కూడుకున్నటువంటి సంఘటన జీవితం పట్ల స్పృహ లేకుండా చేసేటువంటి పని లాంటి సంఘటన అయితే కనుక కచ్చితంగా విధి అంటామో కాలం అంటామో భగవంతుడు అంటామో ఏ పేరైనా పెట్టుకోండి హెచ్చరిస్తుంది హెచ్చరించినప్పటికీ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో మొండితనంతో అడుగు ముందుకు వేస్తే కచ్చితంగా భారీ నష్టం మీ జీవితంలో మిగులుతుంది అనేటువంటి విషయం విషయాన్ని గమనించుకోండి ఇలాంటి నిర్లక్ష్యంతో నిర్లక్ష ధోరణితో కూడుకున్నటువంటి
(07:02) పరిస్థితులలో మినహా మరి ఏ సందర్భాలలోనైనా మీకు తెలియకుండా మీరు ఎంత కష్టపడినప్పటికీ నష్టం జరుగుతుంది అంటే దానికన్నా భారీ నష్టం జరగబోయేటువంటిది ఏదో ఉందని దాని నుండి నిన్ను కాపాడటం కోసమే ఇది ఇలాంటి నష్టాన్ని నీ జీవితంలో చేకూర్చి అక్కడ నుండి కాపాడేటువంటి ప్రయత్నం చేసింది అని నీ దిశని నువ్వు వెళ్ళాల్సినటువంటి పద్ధతిని మార్చి మరోవైపు నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి దీన్నే మనం పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ మైండ్ సెట్ అని చెప్పి అంటూ ఉంటాం.
(07:32) ఎవరైతే ఏదైనా సంఘటన జరగగానే అప్రమత్తమై మరోసారి ఇది ఇలా జరిగింది అంటే నేను ఇలా చేయకుండా ఉండాలి అని నిర్లక్ష్య ధోరణిని వదిలేసి సరైనటువంటి మార్గంలో నడిచినటువంటి వాళ్ళకి జీవితం మరో దారిని చూపిస్తూ సరైనటువంటి మేలుకొలుపుతో స్పృహతో ముందుకు నడిపిస్తుంది. అలా కాకుండా నిర్లక్ష్య ధోరణితో ఉన్నటువంటి వాళ్ళకి కచ్చితంగా కొంతమేరకు నష్టము కష్టము ఎదురవుతూ ఉంటాయి.
(07:55) అలా కాకుండా కష్టాన్ని నమ్ముకొని తమ స్వశక్తిని తమ నమ్ముకొని ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళకి కష్టం ఎదురైంది వాళ్ళ జీవితంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండానే కష్టం ఎదురైంది అంటే మాత్రం కచ్చితంగా భగవంతుడు మిమ్మల్ని ఏ అంశం నుండో కాపాడటం కోసం మాత్రమే అలాంటి పని చేశాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి దానికన్నా భారీ నష్టం ఏదో ఉంది ఆ భారీ నష్టం నుండి మిమ్మల్ని రక్షించడం కోసం మాత్రమే చిన్న నష్టం ద్వారా చిన్న కష్టం ద్వారా చిన్న బాధ ద్వారా మిమ్మల్ని దారి మల్లించేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి విషయాన్న అర్థం చేసుకునేటువంటి
(08:26) ప్రయత్నం చేయాలి. అంతేకానీ మీరు గమనించుకోలేనంత మాత్రం చేత మీరు పరిశీలనాత్మకమైనటువంటి ధోరణిలో లేకపోయినంత మాత్రం చేత మీకేదో భారీ నష్టం జరిగిపోయిందనో అన్యాయం జరిగిపోయిందనో జరగరాంది జరిగిపోయిందనో నిరాశ నిస్పృహలతో కూరుకుపోకండి. మీకు ఏదో అక్కడి నుంచి సరికొత్తనైనటువంటి జీవన విధానాన్ని సరికొత్తనైనటువంటి దారిని తీరుని మార్గాన్ని అన్వేషించడం కోసం మాత్రమే అలా జరిగింది.
(08:53) మిమ్మల్ని మరో ప్రమాదం నుండి గట్టెంకించడం కోసం మాత్రమే అలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని మీ జీవితంలో ఏది ఎందుకు జరిగిన అది నిర్లక్ష్యంతో కూడుకున్నది కానీ అహంకారంతో కూడుకున్నటువంటిది కానీ మొండితనంతో కూడుకున్నటువంటిది కానీ కానంతవరకు ఖచ్చితంగా అది మీ మంచి చేసేది మాత్రమే అయి ఉంటుంది అనేటువంటిది గుర్తుపెట్టుకొని ధైర్యాన్ని కోల్పోకుండా మరింత శక్తిని కూడగట్టుకొని మీ ప్రయత్నాన్ని సరైన దారిలో కొనసాగించండి అంతేకానీ భయపడుత ఇక్కడ ఇలా నష్టం జరిగింది అక్కడ అలా కష్టం జరిగింది అయ్యో భగవంతుడు నాపై కక్ష కట్టాడు నేను ఎన్ని పూజలు
(09:29) చేసినా ఫలించట్లేదు నా తలరాతే ఇలా ఉంది నేను ఏది చేసినా కలిసి రావట్లేదు అన్నట్టుగా భయభ్రాంతులకు గురైపోయి అక్కడే ఆగకండి మరో ప్రయత్నంతో అడుగు ముందుకు వేయండి జీవితం ఎప్పుడు ఆశా దృక్పదంతో ముందుకు సాగేలాగా ప్రయత్నం చేయండి. మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది కావలసిందల్లా నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు సరైనటువంటి అపర్రమతతో కూడినటువంటి అడుగులు ముందుకు వేసేటువంటి ప్రయత్నం కొనసాగించాలి ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో సకారాత్మకమైనటువంటి ఆలోచనా విధానం అంటే పాజిటివ్ థింకింగ్ తో అడుగు ముందుకు వేయండి మీ జీవితంలో అన్ని
(10:05) అద్భుతాలే చూస్తారు మీకంతా మంచే జరుగుతుంది. ఎలాగ అంటే సముద్రం కెరటాలతో ఉప్పొంగుతున్నప్పటికీ కూడా ఒక సరైనటువంటి పడవలో మనం గనుక కూర్చున్నట్లయితే ఆ పడవ మనల్ని సరైనటువంటి దిశలోనే నడిపిస్తుంది. అలాకాకుండా ఎన్ని కెరటాలు వస్తున్నప్పటికీ కూడా కెరటానికి వ్యతిరేక దిశలో కనుక నీ పడవ ప్రయణిస్తుంది అంటే కచ్చితంగా మునిగిపోతుంది.
(10:27) అందుకని స్పృహ తో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని సరైనటువంటి అప్రమతత్తతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని ధర్మానికి కట్టుబడినటువంటి జీవన విధానాన్ని నమ్ముకొని ముందడుగు వేయండి అప్పుడు సముద్రంతో పాటు కెరటాలతో పాటుగా సరైనటువంటి దిశలో మీ పడవ మీ జీవన నౌక పయనం చేస్తుంది. అలా కాకుండా నిర్లక్ష్య ధోరణితో మొండితనంతో మూర్ఖత్వపు వైఖరితో అధర్మానికి పాల్పడేటువంటి జీవన విధానం కనుక కొనసాగిస్తే కెరటాలకి ఎదురెగుతూ ఎప్పుడు మునిగిపోతుందో తెలియనటువంటి జీవన నౌకగా మీ జీవితం మారుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకొని ఏం జరిగినా ఎందుకు జరిగినా సరైనటువంటి స్పృహతో
(11:02) ఆలోచించేటువంటి నేర్పును కలిగి ఉంటూ మీ జీవితాన్ని అత్యద్భుతమైనటువంటి దిశగా మల్లించుకుంటారు అని ఆశిస్తూ మీ జీవితంలో మీకు అంతా మంచే జరగాలి అని ఆకాంక్షిస్తూ థాంక్యూ ఫర్ వాచింగ్. బాయ్.
No comments:
Post a Comment