Tuesday, June 2, 2026

 సరస్వతి, లక్ష్మీ ఒకచోట ఉండవని విద్వాంసుల దారిద్ర్యాన్ని గురించి ప్రస్తావిస్తారు. ఎందుకని ఇలా జరుగుతుంది? అంత పాండిత్యం కలిగినవారికి ఈ దారద్ర్యమేమిటి?
నిజమే... ఎవరు దేనికోసం ప్రయత్నం చేస్తే అది దొరుకుతుంది. కామ్యాపేక్ష కలవాడు ఆ కోరిక నెరవేరే పనులు చేసి కృతార్థుడౌతాడు

జ్ఞానాపేక్ష గలవాడు ఆ కృషిలో నిర్విరామంగా ఉంటాడు. జ్ఞానం ముందు మిగిలినవన్నీ విలువ లేనివని వాటికోసం ప్రయత్నం అనవసరమనీ భావిస్తాడు.

కంటికి కనబడే ఐశ్వర్యాలు నశించి పోయేవే అని తెలిసి నపుడు వాటికై అహర్నిశలు పాటుపడడం ఎందుకు? అని అతడు తనను ప్రశ్నించుకొంటాడు. నేర్చేకొద్దీ వృద్ధి అయ్యేది సరస్వతి. నిత్యమూ ఆనందం కలిగించేది. తన జ్ఞానం పదిమందికీ పంచి సరియైన బంధ విమోచన మార్గం లో నడిపించే వాడు తనకేదో కావాలని ఇతరులను యాచించడు. ఏ వేళ కు ఏది దైవం అనుగ్రహిస్తే దానితో సంతృప్తుడౌతాడు అతడు. ఒకరి కలిమిని చూచి అతడు అసూయపడడు. తనకు లేదే .. అని తలపోయడు.

లక్ష్మి మహా ప్రయత్నం మీద గానీ నిలబడదు. అది పోయే సమయం వచ్చినపుడు మన ప్రయత్నాలేవీ పనిచేయవు. దుఃఖాలకూ కలహాలకు కారణమైన సంపదల కోసం పాకులాడడం అవివేకం అని అతని నిశ్చితాభిప్రాయం.

No comments:

Post a Comment