Monday, August 10, 2026

PRATIKULA VEDAM
2 hours ago (edited)



🪔ఇప్పుడు నువ్వు చదవబోయేది ఒక News Report కాదు, ఒక Judgement కాదు. ఇది మనల్ని మనం నగ్నంగా అద్దంలో చూసుకునే ఒక ప్రయత్నం. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక విషయంలో జరిగిన దాన్ని అందరూ Accident అంటున్నారు, కొందరు Murder అంటున్నారు. చట్టం ఏ సెక్షన్లు వేస్తుందో పక్కన పెట్టు. ఒక మనిషిగా, ఈ సంఘటనను మనం వేరే కోణంలో చూద్దాం.

సరిగ్గా గమనిస్తే.. ఈ సంఘటనలో అసలు villians ఆ ఇద్దరు యువకులూ కాదు, వాళ్ళ డ్రైవింగూ కాదు, వాళ్ళు తాగిన మందు కూడా కాదు. మరేంటి?

😡Point No 1:

సమాజం చాలా సులభంగా వాడే ఒక సాకు.. "వాళ్ళు ఫుల్ గా మందు తాగి ఉన్నారు, మైండ్ పనిచేయలేదు, అందుకే గుద్దేశారు."
నా మొదటి ప్రశ్న. "నిజంగా మందు మనిషిని హంతకుడిగా మారుస్తుందా?"

కొంచెం ఆలోచించు. ఒక మనిషి మందు తాగితే, ఆ తాగిన వాడి మనసులో ఉన్న నిజ స్వరూపం బైటికొస్తుంది. లోపల బాధ ఉన్నవాడు ఏడుస్తాడు, ఆనందం ఉన్నవాడు నవ్వుతాడు, భయం ఉన్నవాడు పడుకుంటాడు. మందు ఏ కొత్త గుణాన్ని పుట్టించదు, లోపల ఉన్న నిజ స్వరూపానికి బ్రేకులు లేకుండా చేస్తుంది. ఆ ఇద్దరు యువకులు మందు తాగిన తర్వాత ఒక అమ్మాయిని కారుతో పదే పదే గుద్ది, ఆమె తల మీద నుంచి చక్రాలు ఎక్కించి వెళ్ళిపోయారు అంటే.. వాళ్ళ లోపల ఏముంది?

వాళ్ళ లోపల ఉన్నది మందు కాదు.. "నన్నెవడూ ఏమీ పీకలేడు" అనే ఒక రాక్షసమైన అహంకారం. వాళ్ళు మందు మత్తులో లేరు. డబ్బు, అధికారం అనే మత్తులో ఉన్నారు. మందు మత్తు కాసేపటికి దిగిపోతుంది, కానీ ఈ డబ్బు మత్తు ఉందే... అది వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు, ఈ సమాజం ఎక్కించిన మత్తు. అది ఎప్పటికీ దిగదు.

🤢Point No 2:

అసలు గొడవ ఎక్కడ మొదలైంది? థియేటర్ వాళ్ళు వాళ్ళని లోపలికి రానివ్వలేదు. ఇక్కడే నా ఇంకో ప్రశ్న. ఒక మనిషి ego ఎంత బలహీనంగా ఉంటే, ఒక చిన్న No ని తట్టుకోలేక ఒక ప్రాణం తీసే స్థాయికి వెళ్తాడు?

ఇది కేవలం సినిమా టికెట్ గురించి కాదు. ఇది "నేను" అనే ఒక అహంకారం దెబ్బతినడం గురించి. మనం ఒక తరాన్ని ఎలా పెంచుతున్నాం అంటే.. వాళ్ళకి కావాల్సినవన్నీ దొరకాలి, వాళ్ళని ఎవరూ ఆపకూడదు. అంటే డబ్బుంటే ఒక హోదా వస్తుందని, ఆ హోదా ఉన్న వాడి ముందు, ఏ రూల్స్ పని చెయ్యవని మనం కూడా నమ్ముతున్నాం.

థియేటర్ మేనేజర్ "లోపలికి వెళ్లడానికి వీల్లేదు" అన్నప్పుడు, వాళ్ళకి ఆ మాట ఒక అవమానంలా అనిపించింది. ఆ అవమానం ఇచ్చిన కోపాన్ని, Frustration ని ఎక్కడో చూపించాలి. ఎదురుగా ఒక స్కూటీ మీద ఒక అమ్మాయి కనిపించింది. ఆ కారుతో గుద్దేటప్పుడు, వాళ్ళకి అది ఒక ప్రాణంలా కనిపించలేదు, తమ కోపాన్ని తీర్చుకునే ఒక వస్తువులా కనిపించింది. ఒక మనిషిని వస్తువులా చూసే స్థాయికి, ఒకరి mind దిగజారింది అంటే, ఆ mind ఎంత కుళ్ళిపోయి ఉందో ఆలోచించు.

🥶Point No 3:

మనందరం కలిసి ఆ ఇద్దరు కుర్రాళ్ళను తిడుతున్నాం. వాళ్ళకి ఉరి శిక్ష వేయాలి అంటున్నాం. కానీ, వాళ్ళని తయారు చేసింది ఎవరు?

➡️వాళ్ళ చేతికొక 25 లక్షల కారు ఇచ్చి, ఆ కారును హ్యాండిల్ చేసే బాధ్యతను "నేర్పించని" తల్లిదండ్రులది తప్పా?

➡️లేక, marks, ranks, degrees ఉంటే చాలు, character లేకపోయినా పర్లేదు అని నూరి పోస్తున్న మన విద్యావ్యవస్థది తప్పా?

ఒక వైపు డాక్టర్ ప్రియాంక.. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి, MBBS చదివి, పీజీ చేస్తూ, తన కుటుంబాన్ని నిలబెట్టాలి అనుకున్న ఒక సాధారణ మిడిల్ క్లాస్ అమ్మాయి. ఆమె ప్రయాణం వెనుక కష్టం ఉంది, తపన ఉంది.

ఇంకో వైపు కారులో ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు... చేతిలో డబ్బు, కండకావరం తప్ప జీవితం విలువ తెలియని empty minds.

సమాజం ఎప్పుడైతే "విలువలు" కన్నా "డబ్బుకే " ఎక్కువ respect ఇస్తుందో.. ఇలాంటి monsters తయారవుతూనే ఉంటారు. మనం ఈ సిస్టమ్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అని అనుకుంటాం, కానీ నిజానికి మనమే ఈ సిస్టమ్ ని పోషిస్తున్నాం. డబ్బున్న వాడికో న్యాయం, లేని వాడికొక న్యాయం జరుగుతుందని తెలుస్తున్నా కూడా, మనమేం చెయ్యం. ఎందుకంటే రేప్పొద్దున్న మన దగ్గర కూడా ఆ డబ్బు ఉంటే, ఆ "VIP ట్రీట్మెంట్" మనమూ ఎంజాయ్ చెయ్యాలి అని మన లోపల కూడా, ఎక్కడో ఒక స్వార్థం ఉంది.

మనం civilized society లో బతుకుతున్నాం అని ఒక భ్రమలో ఉన్నాం. కానీ నిజానికి మనం అడవిలో కన్నా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. అడవిలో ఆకలి వేస్తేనే ఒక జంతువు ఇంకో జంతువుని చంపుతుంది. కానీ మన సమాజంలో, ఒకడి ego hurt అయితే, వాడి అహంకారం కోసం, ఏ సంబంధం లేని ఒక అమాయకురాలిని చంపేస్తాడు. దాన్ని, చుట్టూ ఉన్నవాళ్లు మౌనంగా చూస్తుంటారు. ఇదా civilization అంటే?

👽Point No 4:
ఈ సంఘటనలో డాక్టర్ ప్రియాంక, కేవలం కార్ కింద మాత్రమే నలిగిపోలేదు. ఈ సమాజం యొక్క డబ్బు పిచ్చి కింద, మన చట్టాల చేతకానితనం కింద, ఒక తరం యొక్క అహంకారం కింద నలిగిపోయింది.

మనం రేపు ఉదయం లేచి రోడ్డు మీదకు వెళ్తున్నప్పుడు, మనకు ఎదురుగా వచ్చేది కేవలం ఒక కారు కాదు. అందులో డ్రైవింగ్ చేస్తున్న వాడి పెంపకం, వాడి ego, ఇవన్నీ మన వైపు దూసుకువస్తున్నాయి.

నువ్వు ఈ కేసు గురించి చదివి బాధపడి, కామెంట్స్ లో రెండ్రోజులు న్యాయం కావాలి అని అడిగి వదిలేస్తే.. నువ్వు కూడా ఈ hypocrisy లో భాగమే. మార్పు చట్టాల్లో రావాల్సింది కాదు, ముందుగా "మనం దేనికి విలువిస్తున్నాం?" అనే మన ఆలోచనా విధానంలో రావాలి. పిల్లలకి ఆస్తులు ఇవ్వడం కాదు, అసలు ఒక మనిషిగా ఎలా బతకాలో నేర్పించలేని ప్రతి తల్లిదండ్రీ, గురువు, స్నేహితుడు కూడా, ఇలాంటి నేరాలకు పరోక్షంగా కారణమే.

నిజమైన న్యాయం ఆ ఇద్దరికి శిక్ష పడితే రాదు. సమాజంలో ఇలాంటి ఎవరికీ పనికిరాని ego-driven minds తయారు కాకుండా ఉన్నప్పుడే వస్తుంది.

ఆలోచించు... ఈ నేరంలో ప్రత్యక్ష నేరస్థులు ఆ ఇద్దరు కుర్రాళ్లే కావొచ్చు... But ఆ కుర్రాళ్లలో ఉన్న ఆ అహంకారాన్ని పెంచి పోషిస్తున్నది పరోక్షంగా నువ్వు, నేను కలిసి ఉన్న ఈ సమాజం కాదా ?🔪

-PRATIKULA VEDAM

22

Add a comment...


@udaygoda744
23 minutes ago
Ikaddaa okati gurthuku chesaru writer anna 
1. మన చదువులు సమాజం కి మంచి చేయాలి అని కానీ గౌరవించాలి అని కానీ నేర్పించడం లేదు 
2 తల్లిదండ్రులు డాగర కూడా మనకి రావడం లేదు కేవలం valla డబ్బు జబ్బు తప్ప 
3 కనీసం దేవుని దగ్గర వస్తున్నాయా అంటే అక్కడ కూడా నువ్వు తక్కువ కులం నేను ఎక్కువ కులం అనేది కనిపిస్తుంది తప్ప మంచి చేయాలి జాగ్రతగా ఉండాలి అని చెప్పకపోతే ఇలానే అవుతుంది సమాజం మనం కూడా మన పిల్లలకి నేర్పించాలి ఎలా మెలగాలి సమాజంలో  ani🙏🙏🙏

1



@sparrowkids9464
1 hour ago
డబ్బు, అహంకారం, మదం, లెక్కలేనితనం.

2



@Kalyani-j2l8t
46 minutes ago
Nijamega mari. E samajam lo entha mandi iela aalochistunnaru. Chaduvukunnodu goppa dabbunnodu goppa. Ani pedavade oppukuntadu.

1



@budagamsatyanarayana1
1 hour ago
నిజం చెప్పారు.

2



@draweranddancer
1 hour ago
Very good baga chepparu sir

1



@paramageethaamari338
1 hour ago
🙏

1


No comments:

Post a Comment