Tuesday, August 11, 2026

 *సూర్య నమస్కార శ్లోకం*

సూర్యుడు, భాస్కరుడు, భానుడు, రవి, దినకరుడు, దివాకరుడు, ఆదిత్యుడు, మార్తాండుడు, మిత్రుడు ఇలా ఎన్నో నామాలు. సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవమని, కర్మ సాక్షి అని అంటారు. మనం సూర్య నారాయణ మూర్తి అని కొలుస్తాము. 

స్వామికి అర్ఘ్యం అంటే ఇష్టం. 

కాని అందరికీ అర్ఘ్యం ఇవ్వటం కుదరదు కదా. 

అందుకే నమస్కారం చేస్తే చాలు. 

అయన నమస్కార ప్రియుడు కూడా. 

ఈ స్తోత్రం రోజు మూడు కాలాలో పఠిస్తే మంచిది.

లేదా రోజూ పూజ చేసే సమయంలో ముమ్మారు పఠించినా చాలు.

ముఖ్యంగా ఆదివారం స్వామికి నమస్కారం చేసి ఈ శ్లోకం  పఠిస్తే మంచిది.

ఉదయే బ్రహ్మరూపశ్చ, మధ్యాహ్నేతు మహేశ్వరః అంతకాలే స్వయంవిష్ణుః త్రిమూర్తించ దివాకరం.

సూర్య బింబ(కిరణ) స్వరూప వర్ణన చేసే శ్లోకమిది .

ఉదయ భానుని లేత కిరణాలు బ్రహ్మ స్వరూపం గా, మధ్యాహ్న కాల మార్తాండుని ప్రచండ తాపం తో కూడిన కిరణాలు మహేశ్వర స్వరూపంగా,అలసిన శరీరాలకు హాయి నొసగి విశ్రాంతి కి కారణమయ్యే సాయం సంధ్యా కిరణాలు వ�

No comments:

Post a Comment