భీష్ముడు కౌరవుల పక్షాన పోరాడినందుకు ఎప్పుడైనా పశ్చాత్తాపపడ్డాడా?
భీష్ముడు ధర్మవంతుడు మరియు సద్గుణవంతుడు.
గంగమ్మ తల్లి పుత్రుడు ఆయన. పవిత్రమయిన వారు.
ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే, అది తప్పకుండా ధర్మబద్ధమైనదై ఉండాలి మరియు దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటాడు.
తన గురువైన పరశురాముడు అడిగినప్పటికీ, భీష్ముడు అంబను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు, అంతేకాక పరశురాముడు తనతో యుద్ధం చేయమని విసిరిన సవాలును కూడా స్వీకరించాడు.
ధర్మం అనేది ఏకపక్షమైనది. తాను చేస్తున్నది ధర్మమో కాదో ఆ వ్యక్తే నిర్ణయించుకోవాలి. ఎవరి చర్యలనూ నిర్ణయించే అధికారం ఇతరులకు ఉండదు.
దుర్యోధనుడు తన చర్యలు ధర్మబద్ధమా కాదా తానే నిర్ణయించుకోవాలి, దుర్యోధనుడు చేస్తున్నది అధర్మమని తీర్పు చెప్పే అధికారం భీష్ముడికి లేదు.
తాను చేసింది తప్పని అనిపించినప్పుడు మాత్రమే పశ్చాత్తాపం కలుగుతుంది.
కుమారసంభవంలో శ్రీనాధ మహాకవి అంటారు " ఉత్తమ పురుషులకి ఎప్పుడైనా ధర్మసందేహం వస్తే వారి మనస్సే సమాధానం ఇస్తుంది " అని. అటువంటి వారి మనస్సు ఎప్పుడూ తప్పు చేయనివ్వదు.
అందుకే భీష్ముడి వంటి వారు తమ చర్యలకు ఎన్నడూ పశ్చాత్తాపపడరు. వారు తప్పు చేయరు కనుక.
భీష్ముడు మనకు అత్యంత పవిత్రమైన విష్ణు సహస్రనామాన్ని అందించాడు, ఇది అతను ధర్మవంతుడని మరియు సద్గుణవంతుడని ధృవీకరిస్తుంది.
శుభమస్తు.
No comments:
Post a Comment