Monday, August 10, 2026

Kapala Moksham Part 12

Kapala Moksham Part 12

Author Name:Telugu Books

Youtube Channel Url:https://www.youtube.com/@telugubooks1031

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ihUynvnF3iY



Transcript:
(00:00) కపాల మోక్షం తొలి ప్రేమలు నా అనుకునే వాళ్ళంతా ఒక్కరిగా నా నుండి దూరం అవ్వడం మొదలయ్యేసరికి నేను ఒంటరిగా మిగిలిపోయే సమయంలో తోడుగా తొలిప్రేమలు మొదలయ్యాయి. నేను ఒక విషయం నిజం చెప్తున్నాను. ఒక పక్కన యోగసాధన మీద ఎన్నో రకాల పరిశోధనలు చేస్తూనే మరో పక్కన చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు పెళ్లి సంసార బాధ్యతలు అనుభవిస్తూనే యోగసాధనను పరిసమాప్తి చేసుకున్నాను.
(00:30) అన్ని రకాల సుఖభోగాలు అనుభవిస్తూ శివారాధన చేసేవాడిని మనసుకు యోగమును శరీరానికి భోగమును ఇచ్చాను. అనగా దత్తాత్రేయ స్వామి లాగా ఉండేవాడిని మనసుకు ధర్మం తప్పకుండా అన్ని విధాలుగాను ఇష్టమైన కోరికలు తీర్చేవాడిని ఆనందపడేవాడిని ఆ తర్వాత బాధపడేవాడిని. పరిశోధన చేసేవాడిని ఫలితాలను రాసుకునే వాడిని నమ్మిన వారికి చెప్పేవాడిని నమ్మిన వారి వద్ద నుండి వారి కొత్త కోణాలను తెలుసుకొని ఆ విధంగా కూడా ఎందుకు పరిశోధించకూడదని మళ్ళీ పరిశోధన చేసేవాడిని తిరిగి ఫలితాలను మార్చి రాసుకునేవాడిని ఎవరికీ అర్థం కాని వాటిని ఎవరితోనూ చర్చించేవాడిని కాదు నాలో నేను ప్రయత్నించేవాడిని అమ్మ ప్రేమ నుండి
(01:12) అమ్మను చేసే ప్రేమ అంటే భార్య ప్రేమ దాకా అన్ని రకాల ప్రేమ భావాలను అనుభూతి పొందాను గను ఇన్ని రకాల ప్రేమలో నాకు బాగా నచ్చిన ప్రేమ మాత్రం ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ భావానికి ప్రథమ స్థానం ఇస్తాను. వారికోసం ఎదురుచూసే ఎదురుచూపులు తీయని బాధలు విరహవ వేదనను అలకలు కవ్వింపు చూపులు కవ్వింపు చర్యలు కవ్వింపు మాటలు, బుంగమూతులు, వెటకారపు మాటలు ఇలా ఎన్నో భావాలు నాకు ఈ ప్రేమ భావంలో కనిపించాయి.
(01:43) మిగిలిన ప్రేమ భావనలో అనవసర ప్రేమలు ఆర్థిక ప్రేమలు మాత్రమే నాకు కనిపించాయి. నేను ఎనిమిదవ తరగతిలో ఉండగా మా ఇంగ్లీష్ మాస్టర్ గారి కూతురితో నాకు మొట్టమొదటి బాలాస్త్రీమూర్తి పరిచయం అయింది. పేరు తారావళి అందంగా సన్నగా నాజూక్గా ఉండేది. ఎందుకో తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుంచి చదివే ఆడపిల్లలన్నా తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉండే ఆడపిల్లలన్నా సంగీతం నేర్చుకునేవారు లలిత కళలు అనగా కూచుపూడి నాట్య కలలు నేర్చుకునేవారంటే నాకు ఎంతో ఇష్టంగా ఉండేది వారితో మాటలు కలపాలని వారితో స్నేహం చేయాలని ఉండేది కానీ నాకు అవకాశాలు ఇచ్చేవారు కాదు.
(02:19) అలాంటి వారు చాలా అరుదుగా నాకు కనిపించేవారు. ఇలాంటి కోవకి ఈ అమ్మాయి చెందింది. ఎందుకో తెలియదు ఈమెతో స్నేహం చేయాలని బాగా అనిపించింది. ఆమెకు తెలుగు రాదు నాకేమో హిందీ రాదు. మా ఇద్దరి మధ్య మళ్ళీ రాని భాష ఆధారమైంది. ఎక్కువగా సైగ భాష నడిచేది. ఆమెకు కూడా తెలివైన బాగా చదివేవారంటే విపరీతమైన ఇష్టమని గ్రహించాను ప్రేమ అంటే ఏమిటో తెలియని నూనూగు మీసాల వయస్సులో మీసాల రాయుడు లాగా ప్రవర్తించేవాడిని ప్రణవ మంత్రము కాస్త ప్రణయ మంత్రముగా శివ పూజారిని కాస్త ప్రేమ పూజారిగా మారాను ఒకరోజు లెక్కల క్లాస్ జరుగుతోంది మాస్టర్ గారు ఒక లెక్కకి జవాబు
(03:00) చెప్పమని అందరినీ అడగడం మొదలుపెట్టారు నాకు దీనికి జవాబు రావడం లేదు ఇంతలో నేను తారావళికేసి చూస్తే అది చేతిమీద 143 అని రాసి చూపించింది. అదే జవాబు అనుకని నేను ఆ మాస్టర్ గారికి చెప్పడం ఆపై తన్నులు తినడం జరిగింది. 143 అనేది లెక్క జవాబు కాదని తెలిసి గతుక్కోమన్నాను. అప్పుడు ఆమెను అడిగితే మొద్దు అది జవాబు కాదు 143 అంటే ఐ లైక్ యు అన్నది.
(03:30) అంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను అనేసరికి ఇది నీకు ఎలా తెలుసు అంటే దానికి ఆమె వెంటనే మా బావ నాకు చెప్పాడు అదే నేను నీకు చెప్తున్నాను మీకు ఇష్టమేనా 143 అన్నది దీనమ్మ దీని బావ దీనికి చెప్తే అది వాడికి చెప్పకుండా నాకు చెప్పింది. నాలో ఏదో తెలియనితనం బాగా నచ్చి ఉంటుంది అనుకున్నాను. ఇలా ప్రతిరోజు బడికి రావడం ప్రతి పీరియడ్ ఖాళీ సమయంలో ఎవరు చూడని సమయంలో మా పుస్తకాల్లో 143 పేజీని తీసి ఒకరినొకరు చూపించుకునేవాళ్ళం.
(04:00) దేవుడు ఆనందంగా ఉంటే ఊరుకోడు కదా మా స్నేహం ఇష్టంగా మారి అది కాస్త ఏదో తెలియని ప్రేమగా మారే లోపల మాస్టర్ గారికి ఆ ఊరి నుండి బదిలగి వెళ్ళిపోయారని వేసవ సెలవులు పూర్తయిన తర్వాత నాకు తెలిసింది. మళ్ళీ మరో రెండు సంవత్సరాల దాకా నాలో మన్మధుడు నిద్ర లేవలేదు. నేను 10వ తరగతి చదివే సమయంలో మా స్నేహితుడు దూరపు బంధువైన జ్యోతిర్మయి అని నాకు పరిచయం అయింది.
(04:28) ఇది విచిత్రమైన స్నేహం ఈమె సంవత్సరంలో మా ఊరి జాతర జరిగే సమయంలో మా ఊరికి వచ్చి ఐదు గంటలు మాత్రమే ఉండి వెళ్ళిపోయేది. మళ్ళీ సంవత్సరానికి జరిగే జాతర సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించేది కాదు అంటే ఇది జాతర స్నేహం మొదట్లో మాట్లాడేది కాదు వాళ్ళ ఇంటి బయటకు వచ్చి మా ఇంటికేసి చూస్తూ నేను ఎప్పుడు బయటకు వస్తాను అని గంటల కొద్ది ఎదురుచూపులు ఎదురుచూస్తూ ఉండేది.
(04:51) నేను కనపడితే అదోలా చూస్తూ కనుసైగలతో అన్ని మాట్లాడేది. కవ్వింపు చర్యలు కవ్వింపు చూపులు ఉండేవి. గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి నాకు టాటా చెప్పి వెళ్ళిపోయేది. అదియే ఆ సంవత్సరానికి ఆఖరి చూపు. అంటే మళ్ళీ ఈమె కోసం సంవత్సరంంతా ఎదురు చూసేవాడిని మళ్ళీ యదావిధి అంతే మాటలు ఉండవు కనపడితే నవ్వడం కవ్వింపు కళ్ళతో ఎదురుచూపులు ఉండేవి.
(05:14) నేను మాట్లాడాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించిన ఉపయోగం ఉండేది కాదు అలాంటి సమయంలో మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో ఒకరోజు ఈమె నుండి ఒక ప్రేమలేఖ అందుకోవడం జరిగింది. అదే నా జీవితంలో నా తొలి ప్రేమ లేఖ. అయితే ఆమె రాసిన భాషా విధానం నాకు అర్థం కాలేదు. నా స్నేహితులు చాలా కష్టపడి చదివి నాకు వినిపించారు. అది తెగే కానీ తెగులు పట్టింది.
(05:37) తొలిప్రేమ సినిమాలో తమ్ముడు తన అన్న ప్రేమ కోసం రాసిన ఉత్తరం లాగా అర్థమై అర్థం కానట్లుగా ఉన్నది. నేను వెంటనే ఏదైనా ఉంటే మాటల్లో చెప్పు కానీ మళ్ళీ అన్నటికీ ఉత్తరం రాసి మమ్మల్ని చంపవద్దని ఆమె తిరిగి ఉత్తరం రాసి ఇచ్చినాను. మాటలు కలిసాయి పరీక్ష ఫలితాలు వచ్చాయి స్కూల్ ర్యాంక్ రావాల్సిన చోట ఫస్ట్ క్లాస్ మాత్రమే ఉన్నది. నేను వెంటనే ఏదైనా ఉంటే మాటల్లో చెప్పన్నాను.
(06:02) ఇంట్లో తిట్లు మనసులో తీయని దురద మరుసటి సంవత్సరం ఆమె నుండి ఉత్తరం రావలసిన చోట శుభలేఖ వచ్చింది నేను గతుక్కోమన్నాను ఆమె మరో ఇంటిది అయింది అయినా నాకు ఆనాడు చాలా బాధ అనిపించలేదు. ప్రేమ అంటే ఏమిటో తెలిస్తే వయస్సులు కాదు అని నాకు తెలుసు కానీ ఏదో తెలియని బాధ అనిపించింది మళ్ళీ నేను ఒంటరి వాడిని అయ్యాను కాలేజీ చదువులకు వచ్చాను.
(06:28) నూనూగు మేసాలు కాస్త నల్లమేసాలు అయ్యాయి. ఏదో తెలుసుకోవాలని వయసులో ఏవో అనుభవ అనుభూతులు పొందాలనే తపన తాపత్రయాలు నా మనసుకు వచ్చేవి. రాత్రివేళలో నా మన మన్మధుడి ప్రభావం వల్ల నాకు తెలియకుండానే అర్ధరాత్రి పూట గాఢ నిద్రలో జరిగే ఒక విధమైన చర్య వలన నిద్ర పట్టేది కాదు. మనస్సు వయస్సు ఉరకలు వేసే స్థితి. జీవితం ఉన్నత స్థితికి అలాగే అధమ స్థితికి మధ్య వయస్సులో ఉన్నామని తెలుసుకోలేని స్థితి.
(07:00) ఏదో కావాలని ఏదో ఒకటి పొందాలని ఏవో అనుభవాలు పొందాలని స్నేహం కావాలని ఓదార్పు మాటలు కావాలని ఆ సానుభూతి కావాలని మనసు మదనపడుతున్న సమయంలో నా చదువు కొనసాగుతూ ఉండగా ఒకరోజు నాకు లాగానే ర్యాంకు కోసం తపనపడే నా సహచర విద్యార్థి అయిన రాధాదేవి నా దగ్గరకు వచ్చి నోట్ పుస్తకాలు కావాలని అడిగి తీసుకుంది. మాటలు కలిసాయి స్నేహం పెరిగింది ఆమె చెప్పేది తీయని తీపి మాటలు వినాలని మనసు ఆరాట పడడం జరిగింది.
(07:32) ఆమెకి నాకు ప్రేమ గురించి ఎంతో కొంత జ్ఞానం కలిగి ఉండేది. సినిమాల ప్రభావం వలన నాకు ప్రేమ మీద శృంగార సాహిత్య పుస్తకాలు చదవడం వలన వీటి మీద అవగాహన సహజ సిద్ధంగానే ఏర్పడింది. అలాంటి సమయంలో ఏదో తెలీదు ఆమెను చూడాలని ఆమెతో మాట్లాడాలని నాలో తపన మొదలయింది. ఒకరోజు ఆమెకు జ్వరం వచ్చిందని తెలిసి నా మనసు విలవెల్లాడింది. ఆమె కాలేజీకి రాని రోజులు నాకు మరణయాతనం లాగా ఉండేది.
(07:59) ఒక రకంగా చెప్పాలంటే తియ్యని దురదలాగా ఉండేది ఉంటే వెళ్ళిపోతుందని వెళ్ళిపోతే అప్పుడే రాదని ఇలా పలు రకాల నా మనసు ఆరాటపడేది అలాంటి సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అదేమిటో తెలుసుకోవాలంటే ఆ తర్వాత ఏమిటో జరిగిందో తెలియాలి అంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి. అండి

No comments:

Post a Comment