కొత్త బట్టల మోజు.. ప్రకృతికి శాపం! మనం వాడి పడేసే దుస్తులతో పెను నష్టం || Idisangathi
Author Name:ETV Andhra Pradesh
Youtube Channel Url:https://www.youtube.com/@ETVAndhraPradesh
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0OdZXZFabfg
Transcript:
(00:01) ఇంతకుముందు పండగలు పబ్బాలు పెళ్లిళ్లు శుభకార్యాలు లేదా ప్రత్యేక సందర్భాలు ఉన్నప్పుడే కొత్త బట్టలు కొనేవాళ్ళం అది కూడా ఒకటి రెండు జతలు పేదా మధ్య తరగతి కుటుంబాల్లో అయితే దసరా సంక్రాంతి వంటి పెద్ద పండగలకు ఇంట్లో జరిగే శుభకార్యాలకు నూతన వస్త్రాలు తీసుకునేవారు. ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం. పండుగ చిన్నదైనా పెద్దదైనా తలతల లాడిపోవాల్సిందే.
(00:26) శుభకార్యాల కోసం సాధారణంగా వేసుకోవడానికి ఒక జత వ్రతాలు పూజల కోసం ఇంకోటి ఫోటోల కోసం మరో జత కొంటున్నారు. ట్రెండ్ కి తగ్గట్టు ఉండాలనే ఉద్దేశంతో అవసరానికి మించి ఒకేసారి మూడు నాలుగు జతలు తీసుకుంటున్నారు. అయితే ఈ ఫ్యాషన్ కాస్త పర్యావరణానికి హాని చేస్తుంది. గుట్టలుగా పేరుకుపోయిన బట్టల వ్యర్థాలు ప్రకృతిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
(00:50) మరి మనం వాడి పడేస్తున్న దుస్తుల వెనుక ఎంతటి వినాశనం దాగి ఉంది వాటి వల్ల జరుగుతున్న నష్టం ఏంటి? [సంగీతం] మనిషికి ప్రాథమిక అవసరాల్లో కూడు, గూడు, బట్ట, కీలకం మొదటి రెండు విషయాల గురించి అటుంచితే ఒంటిపై ఉండే వస్త్రాలు మనిషి గౌరవాన్ని నిలబెడతాయి. చెప్పాలంటే మనందరికీ మొదటి అలంకరణ వేసుకున్న దుస్తులే అందుకే నూతన వస్త్రాలు ధరించినప్పుడు ఏదో తెలియని ఉత్సాహం అందరిలో అదే ఉత్సాహం ఎప్పుడూ ఉండాలి. నిత్యం కొత్తగా
(01:35) కనిపించాలనే ఉద్దేశంతో కొత్త బట్టలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటిదాకా పండుగలు శుభకార్యాలకు సర్వసాధారణంగా ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు చేతిలో డబ్బులు ఉంటే చాలు సందర్భం చిన్నదైనా షాపింగ్ కి వెళ్ళిపోదామా అన్నట్లు తయారైంది పరిస్థితి. దీంతో ఇళ్లల్లోని బీరువాల్లో బట్టలు పెరిగిపోతున్నాయి. నాలుగైదు సార్లు వేసిన తర్వాత సైజు సరిపోవట్లేదనో కలర్ ఫేడ్ అయిందనో వాటిని పక్కన పెట్టి మళ్ళీ కొత్తవి కొంటున్నారు.
(02:03) దీంతో దేశంలో బట్టల వ్యర్థాల కుప్పలు గుట్టలుగా పేరుకుపోయి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. [సంగీతం] మరి ఈ బట్టలు కొనే సంస్కృతి గతంలో ఎలా ఉండేది అంటే ఒక మనిషికి ఐదారు జతల బట్టలు మాత్రమే ఉండేవి. 10 జతలు ఉంటే మహా గొప్ప అనుకునేవారు. అందులో రోజు వేసుకునే రెండు లేదా మూడు జతలు మిగతావి ప్రత్యేక సందర్భాల్లో వేసుకునేవి ఉండేవి.
(02:35) అవి రంగు వెలిసిపోయినప్పుడు మరకలు పడ్డప్పుడు లేదా చిరిగిపోయినప్పుడే కొత్తవి కొనాలనే ఆలోచన ఉండేది. కొందరు వాటిని కూడా బూగు చేసుకొని అంటే రంగు పోయినప్పుడు కలర్స్ వేసి చిరిగిపోయినప్పుడు కుట్టించుకొని వాడుకునేవారు. ఒక జతను సుమారుగా ఏడాదికి పైగానే వాడేవారు. కొత్త బట్టలు కొన్నప్పుడు కూడా ఒకటి లేదా రెండు జతలు మాత్రమే కొనేవాళ్ళం అయితే ఇప్పుడు కాలం మారింది.
(03:00) కాలానికి అనుగుణంగా మనుషులు మారుతున్నారు. ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అందులోనూ నిన్న వేసుకున్న డ్రెస్ ఇవాళ మళ్ళీ వేసుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనతో ఎక్కువగా వస్త్రాలు కొంటున్నారు. ఆన్లైన్ లో ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే ఆటోమేటిక్ గా ఈ కార్ట్ లో పెడతాం. ఏ బ్రాండెడ్ే చూసుకుంటాం బట్ మన బడ్జెట్ లో చూసుకుంటాం. ఎంత తక్కువ వస్తే అంత తక్కువలో చూసుకొని ఏటై లో బాగుంది ఏట లో ప్రైస్ డ్రాప్ అయ్యింది అదని చూసుకొని పర్చేస్ చేస్తాం.
(03:25) ప్రెసెంట్ ట్రెండ్ ఎట్లా ఉందంటే ఒక మనిషికి 25 టు 30 పేయర్స్ ఉంటాయి. సో ఎక్కడన్నా ఏమన్నా మంచి బ్రాండ్స్ లో ఆఫర్స్ ఉన్నాయ అంటే వెంటనే కొనేస్తారు అండ్ ఎక్కడికన్నా వేసుకొని వెళ్ళింది మళ్ళీ ఇంకోటి వేసుకోరు ఏదన్నా రీల్స్ చూశరంటే వెంటనే అది ఆర్డర్ పెట్టేస్తారు. ప్రతి అకేషన్ కి ఒక కొత్త బట్టలు కొనుక్కోవాలి వేసిన బట్టలు మళ్ళీ వేయకూడదు అది పండుగ అవ్వచ్చు ఫ్రెండ్ బర్త్ డే అవ్వచ్చు లేకపోతే ఏదైనా చిన్న సందర్భం అయినా అయి ఉండొచ్చు.
(03:50) ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే కాలేజ్ కి వస్తున్నప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే సాటర్డే సివిల్ డ్రెస్ ఉంటే ఈ సాటర్డే వేసిన డ్రెస్ ని మళ్ళీ నెక్స్ట్ సాటర్డే రిపీట్ చేయకూడదు. ఇంకో టూ త్రీ మంత్స్ వరకు అసలు రిపీట్ చేయకుండా డ్రెస్సెస్ వేయాలి ఇట్లాంటి వాటికి అలవాటు పడిపోయి అనవసరమైన ఖర్చు చేస్తున్నారు. బట్టలు అనేవి మన కంఫర్ట్ కోసం ఉండాలి అండ్ అవసరంకి ఎంత అవసరం పడతాయో అన్ని ఉంటే సరిపోతుంది.
(04:12) ఎన్ని బట్టలు కొన్నా మనకు మిగిలిపోతాయి కదా ఆ బట్టలు మళ్ళీ ఎవరికీ ఇవ్వకుండా ఇంట్లోనే ఉంచుకుంటారు కొంతమంది కొంతమంది బయట పడేస్తారు కొంతమంది స్వచ్ఛంద సంస్థలో ఇచ్చేస్తారు. ఇలా బట్టలు ఉపయోగం పెరగడం వల్ల మనం కూడా అవసరం లేకుండా కొనడం అనేది వేస్టే కదా మరి ఏ సందర్భాల్లో జనాలు ఎక్కువగా బట్టలు కొంటున్నారని చూస్తే ప్రస్తుత తరుణంలో బట్టలు కొనడానికి ప్రత్యేక సందర్భం అంటూ లేదనే చెప్పాలి.
(04:37) ఎందుకంటే సంక్రాంతి, ఉగాది, వినాయక చౌతి, దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ ఇలా ప్రతి నెలలో ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంది. వాటన్నింటికీ నూతన వస్త్రాలు కొని ధరిస్తున్నారు. అలాగే చాలా మంది వారాంతాల్లో షాపింగ్ చేస్తున్నారు. శాలరీ రాగానే కొంటున్నారు. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో షాపింగ్ అనేది సాధారణమైంది.
(05:01) వీటన్నింటితో పాటు షాపింగ్ ఆఫర్లు, బిగ్ సేల్ కూపన్లు అధికంగా బట్టలు కొనుగోలు చేసేలా చేస్తున్నాయి. అందులోనూ ఈ కామర్స్ సేవలు అందుబాటులో ఉండటంతో ఇంట్లోనే ఉండి కావలసిన వస్త్రాలను ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇన్‌స్టా పోస్ట్ రీల్స్ కోసం కూడా కొత్త బట్టలు కొనే ధోరణి పెరిగిపోయింది. బీరువా నిండా బట్టలు ఉన్నప్పటికీ వేసుకోవడానికి కొత్త బట్టలే కావాలనే పరిస్థితి ఉంది.
(05:24) ఎక్కువ బట్టలు కొనే కొద్ది పాత బట్టలు పెరిగిపోతున్నాయి. కొద్ది రోజుల తర్వాత చెత్త కుప్పల్లోకి చేరి వ్యర్థాలుగా మారుతున్నాయి. [సంగీతం] దేశంలో 41% దుస్తులను ఒకటి రెండు సార్లకే పారేస్తున్నారని పలు నివేదికల అంచన. మారిపోతున్న ఫ్యాషన్లు తాజా ట్రెండ్స్ ఈ కామర్స్ వేదికలే ఇందుకు కారణమని వస్త్రరంగ నిపుణులు చెబుతున్నారు.
(05:51) పట్టణ ప్రాంత గృహాల నుంచి వచ్చే పాత దుస్తులను 55 నుండి 70% వాటిని బహిరంగ ప్రదేశాల్లోనే పారేస్తున్నారు. అవి డ్రైనేజ్‌లోకి చేరటం వల్ల మురుగు వరదనీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతున్నాయి. అయితే వస్త్రాల్లో కాటన్ కు బయోడిగ్రేడబుల్ పేరుంది. కానీ అది పూర్తిగా కరిగిపోవడానికి చాలా సమయం పడుతుంది. అలాగే మట్టిలో కలిసిపోని సెమీ సింతటిక్ సింతటిక్ వస్త్రాలతో కుట్టిన ఒక చొక్క జీవితకాలంలో భారీ స్థాయిలో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులను విడుదల చేస్తుంది.
(06:22) పాలిస్టర్ నైలాన్ వంటి సింతటిక్ వస్త్రాలు అంత తేలికగా మట్టిలో కలిసిపోవు సరి కదా భూమి నీటిలోకి సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులను విడుదల చేస్తాయి. వస్త్రాల రంగులోని రసాయనాలు నేలను, భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. [సంగీతం] బట్టలు ఎంత ఎక్కువగా వినియోగిస్తే పర్యావరణంపై అంతటి ప్రభావం పడుతుందనేది సుస్పష్టం. అదే సమయంలో వనరులు దుర్వినియోగం అవుతాయి.
(06:53) ఎందుకంటే ఒక వస్త్రం తయారీకి పత్తిసాగు, నూలు వడకడం, నేయడం, రంగు వేయడంతో పాటు కుట్టడం, ప్యాకేజింగ్, ప్రపంచ రవాణ వంటి అంశాలు ముడిపడి ఉంటాయి. అందులోనూ ఇప్పుడు చెప్పుకున్న ప్రతి అంశంలోనూ పర్యావరణ ప్రభావం ఇమిడి ఉంటుంది. ఒక వస్త్రం వ్యర్థంగా మిగిలిపోతుంది అంటే దానికి ఎన్నో వనరుల్ని వినియోగించారని దాని వల్ల ఎన్నో ఉద్గారాలు వెలువడ్డాయనే వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి.
(07:18) ఉదాహరణగా చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి పర్యావరణంపై జరిపిన ఓ పరిశోధన ప్రకారం ఒక సాధారణ కాటన్ టీ షర్ట్ తయారీకి సుమారు 2700లటర్ల నీరు అవసరమవుతుంది. ఒక జీన్స్ ప్యాంట్ తయారీకి 3000 నుంచి 4000లటర్ల నీరు ఖర్చువుతుంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం పారిశ్రామిక మురుగు నీటిలో 20% వస్త్ర పరిశ్రమ నుంచే వస్తుందని నివేదికలు చెబుతున్నాయి.
(07:42) అలాగే ప్రపంచ గ్రీన్ హౌస్ ఉద్గారాలలోరెండు నుంచి 8 శాతం వాట ఫ్యాషన్ పరిశ్రమదే ఈ గణాంకాలు బట్టి మనం ఒక్కసారి వేసి పక్కన పడేసే డ్రెస్ వెనుక పర్యావరణానికి జరుగుతున్న నష్టం అంచనాలకు అందనంత పెద్దది అనే విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సరే 20 25 వాషెస్ చేసుకోవచ్చమ్మ. అంటే మినిమం 25 నుంచి 30 సార్లు వేసుకోవచ్చు.
(08:07) 25 నుంచి 30 సార్లు అంటే ఒక షర్ట్ వేసుకున్న ఒక డ్రెస్ మెటీరియల్ మీరు వేసుకున్నానమ్మ ఈ డ్రెస్ ఒక 10 డ్రెస్సులు ఉంటాయి ఇంట్లో అంటే 10 రోజులు వాడతారు 10 రోజుల తర్వాత మళ్ళ ఒకసారి అంటే 250 రోజులు మినిమం అంతకుముందు మీరు తెలిసి ఉండొచ్చు గతంలో మా మేము యువతగా ఉన్నప్పుడు ఒక దసరాకో ఒక క్రిస్మస్ కో ఒక రంజాన్కో ఒక సంక్రాంతికో మనం బట్టలు కొనుక్కునేవాళ్ళం.
(08:28) ఇవాళ ఏమైంది మిల్ మెయిల్ మీద విపరీతమైన ప్రొడక్షన్ వచ్చేసరికి మాకు కూడా అంతకుముందు దసరాను శ్రావణ మాసం ఇట్లా బిజినెస్ ఉండేది ఇప్పుడు రెగ్యులర్ బిజినెస్ అంత క్రౌడ్ ఉంటలేదు బిజినెస్ అంత స్లో ఉండటంలే ఎప్పుడూ కొత్తగా కనపడాలనే ఉద్దేశంతో కొత్త బట్టలు ఎక్కువగా కొని వేసుకుంటున్నాం. కానీ ఒక వస్త్రాన్ని ఎన్ని సార్లు వేసుకోవాలనే దానిపై ఎవ్వరికీ స్పష్టత లేదు.
(08:51) ఇంతకుముందు అయితే మన్నిక వచ్చేంతవరకు వేసేవాళ్ళు. అది రెండు సంవత్సరాలైనా ఎలాంటి మొహమాటం లేకుండా ధరించేవాళ్ళు. ఇప్పుడు వేసిన బట్టలు మళ్ళీ వేయడం నామోషిగా మారింది. అందుకే ఒక జతను ఒకే వారంలో రెండు సార్లు వేయడానికి ఇష్టపడటం లేదు చాలామంది ఎన్ని సార్లు ఒక వస్త్రాన్ని వేసుకోవాలని దానిపై యూరోపియన్ యూనియన్ క్లారిటీ ఇచ్చింది. దాని ప్రకారం చొక్కాలు, బ్లౌజులు కనీసం 40 సార్లు వేసుకోవాలి.
(09:15) ప్యాంట్లు, షర్ట్లు, స్కర్ట్లు, జంప్ సూట్లు, లెగ్గింగ్‌లు 70 సార్లు ధరించాలి. జంపర్లు, కార్డిగన్లు, హుడీలు 85 సార్లు వరకు వేసుకోవచ్చు. ఇక జాకెట్లు కోట్లు 100 సార్లు వేసుకోవచ్చు టీ షర్ట్లు 45 సార్లు ధరించవచ్చని యూరోపియన్ యూనియన్ తెలిపింది. జనరల్ గా అయితే పాత బట్టలు అని పేరే గానీ అన్ని ఇచ్చేవి మాత్రం చాలా కొత్త బట్టలు మేడం అయి ఎవర కొద్దిగా చిరిగినవి కూడా ఇవ్వట్లే చిరిగినవి వాళ్ళే వాడేసుకోండి పారేస్తున్నారు.
(09:43) మిగతా బట్టలు ఇస్తున్నారు అయన్నీ ఉద్దరా ఆశ్రమానికి రైల్వే స్టేషన్ దగ్గర గాంధీనగరం ఎక్కడ ఎక్కడైతే పిల్లలు ఉన్నారో మొన్న సిక్కు కాలనీలో పిల్లలకి పంచిపెట్టాం మేడం ఈయన్ని ఎక్కడికి ఎక్కడ సెగ్రిగేట్ చేసి ఏ వయసుకి ఆ వయసు ఆడపిల్లలుయితే ఆడపిల్లలు మగపిల్లలుయితే మగపిల్లలు సెగ్రిగేట్ చేసి మేము ఆ ఏరియాకి వెళ్లి పంచుతాం మేడం. యూరోపియన్ యూనియన్ చెప్పిన లెక్కల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో అన్నిసార్లు బట్టలు వేసుకోవడం అసాధ్యం అనే చెప్పవచ్చు.
(10:07) ఎందుకంటే కాలానికి అనుగుణంగా మారుతున్న ఫ్యాషన్లు కొత్త అభిరుచులు పెరిగిపోతున్నాయి. కొత్త బట్టలు కొని మురిపె తీరే వరకు అంటే ఒక ఎనిమిది నుంచి 10 సార్లు రెగ్యులర్ గా వేస్తున్నారు. ఆ తర్వాత బీరువాలో పెడుతున్నారు. మళ్ళీ ఎప్పుడు తీసి వేసుకుంటారో తెలియదు. కొన్ని నెలలు గడవగానే వాటి గురించి మరిచిపోతారు. అవి పాతపడిపోతాయి.
(10:28) దీంతో వాటిని స్వచ్ఛంద సంస్థలకో పేదలకో ఇచ్చేయాలని చూస్తుంటారు. అయితే సాధారణంగానే పాత దుస్తులని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. అందుకే అవి వ్యర్థాల కుప్పలుగా మారిపోతున్నాయి. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసిన ఐరోపా పరిశోధకులు పాత దుస్తులు ప్రపంచవ్యాప్తంగా ఓ సమస్యగా తయారైన విషయాన్ని గుర్తించారు. ఈ సంక్షోభం తీవ్రతరం కాకముందే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
(10:52) వ్యర్థాలలో ఎక్కువ భాగం వస్త్రాలు కనిపిస్తున్నాయి. మన డంప్ యార్డ్స్ లో చూసినట్లయితే పడేస్తున్నాం. డంప్ యార్డ్స్ కూడా పర్యావరణానికి విపరీతంగా నష్టం కలుగజేస్తున్నాయి అందులో ముఖ్యంగా ప్లాస్టిక్ తో పాటు వస్త్రాలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి కానీ ఈ మధ్య కొంతవరకు ఈ పాత వస్త్రాలని మనం చాలా వరకు అందులోనుంచి మళ్ళీ తిరిగి రీసైకిల్ చేయడం దానినుంచి తీయడం అంటే వస్త్రాలు తీసేటప్పుడు దీనిలో మనకి ప్రింటింగ్ డైింగ్ ఉంది కాబట్టి డైింగ్ కెమికల్స్ కూడా చాలా వరకు నష్టాన్ని కలుగజేస్తున్నాయి నీటిని పొల్యూట్ చేస్తున్నాయి అలాగే పర్యావరణాన్ని కూడా పొల్యూట్ చేస్తున్నాయి దీని దీనివల్ల
(11:27) అనారోగ్య సమస్యలు విపరీతంగా వస్తున్నాయి. దేశంలో వస్త్రాల వినియోగం ఎలా పెరిగిపోతుంది అనేదానికి మార్కెట్ గణాంకాలే ఉదాహరణ. 2025 నాటికి మొత్తం టెక్స్టైల్ అపరల్ మార్కెట్ విలువ 24,870 కోట్లకు చేరింది. భవిష్యత్తులో ఇది సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. అయితే దీనికి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. అవసరానికి మించి కాకుండా పరిమితంగా బట్టలు కొనుగోలు చేయాలి.
(11:53) పండుగలు శుభకార్యాలకు అవసరమైతేనే బట్టలు కొనుగోలు చేయాలి. మన దగ్గర ఉన్న జతలనే మార్చి మార్చి వేసుకోవాలి అంటే మిక్స్ అండ్ మ్యాచ్ తరహాలో పాత దుస్తులనే కొత్తగా రీస్టైల్ చేసి వేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే కొత్త దుస్తులు ధరించడమే కాదు ధరించిన వాటిని ఐరన్ చేసుకోవడం నీట్ గా ఉంచుకోవడం కూడా మనల్ని హుందాగా కనిపించేటట్లు చేస్తుంది. అప్పుడే ఈ పర్యావరణానికి జరిగే హాని తగ్గి మనకు ప్రమాదం లేకుండా మేలు జరుగుతుంది.
(12:19) ఒకసారి వాడి పడేసే ఈ ఫాస్ట్ ఫ్యాషన్ అలవాటు భూగోళానికి పెనుభారంగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి మనకు దుస్తుల్ని తయారు చేసుకోవడానికి వనరుల్ని ఇస్తుంది. కానీ వాటిని వృధా చేసుకోవడానికి కాదని చెప్తున్నారు. మనకు అవసరం లేని దుస్తులు మరొకరి జీవితంలో చిరునవ్వుగా మారొచ్చని వాడని దుస్తులను చెత్తలో కాకుండా అవసరమైన చేతులకు అందించాలని చెప్తున్నారు.
(12:44) ఫ్యాషన్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదని కేవలం చిన్న అలవాటును మార్చుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్‌తో సత్యవేణి ఈటీవీ న్యూస్ విజయవాడ.
No comments:
Post a Comment