Priya Chowdary - Best Moral Video For Women | How To Handle People Who Hurt You | Sumantv
Author Name:SumanTV Motivation
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMotivation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FbrvKEhJMdY
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు మనకొక ఆలోచన బాధ పెడుతుందని తెలిసినా కూడా పదే పదే అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం మనం ముఖ్యంగా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఆడపిల్లకి గాని గృహిణికి గాని సపోర్ట్ దొరక్కపోతే ఉంటదండి దాని మీదే కూర్చొని ఆ నిజం చెప్పాలి అనింటే ఇంక అక్కటి నుంచే వాళ్ళకి ఏదైనా సరే తెలియకుండానే ఆ రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కొంతమంది అయితే సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళిపోతారు.
(00:40) ఎస్ సపోర్ట్ దొరకదు. నాకు వచ్చే కేసెస్ అనేవే ఆ అదే అండ్ ఇటు జెంట్స్ లో కూడా చాలా మందికి ఉంటుంది నాకు మొన్న ఒకసారి భయపడిపోయాను ఏంటి అనింటే ఆ నేను ఒక్క రోజు గనుక అది పోస్ట్పోన్ చేసి ఉంటున్నట్టయితే ఇంటర్వ్యూ పోస్ట్పోన్ చేసి ఉన్నట్టయితే ఆమె నిజంగానే సూసైడ్ చేసుకునేది. ఉమ్ నాకు ఇప్పుడు భయం వేస్తుంది అపాయింట్మెంట్స్ ఇవ్వాలంటే అదే ఒక్క నిమిషం అటు ఇటు పోస్ట్పోన్ అయినా లేకపోతే లేట్ అయినా ఏం జరుగుతుందో అన్న భయం అంటే ఇప్పుడు నాకు ఏమైపోయింది అంటే వాళ్ళ టెన్షన్లు అన్నీ నాకు పట్టుకున్నట్టు ఉన్నాయి.
(01:11) ఉమ్ [నవ్వు] యా అవును ఈవెన్ జెంట్స్ కైనా సరే అండి ఉంటుంది దాని వల్ల జీవితాలు పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆ ఆలోచన చాలా కలిచి వేస్తా ఉంటుంది అవును అది మనకు తెలుసు మనం అక్కడ ఉండకూడదు అనేటువంటి వాతావరణం ఆ వాతావరణంలో మనం ఉండకూడదు అని అనుకుంటాము కానీ తప్పట్లేదు తప్పక దాని గురించే పదే పదే ఆలోచిస్తూ జీవితం మొత్తాన్ని నాశనం చేసుకుంటాం ఇలా జరగకూడదండి అది ప్రతి ఒక్కరి లైఫ్ లోనే ఉంటుంది ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా జరుగుతుది ఆ స్టేజ్ దాటిన తర్వాత కూడా జరుగుతాయి చాలా మందికి అది ఏ రకంగా అనా సరే ఏ రూపంలో అయినా సరే రావచ్చు బట్ దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అనింటే ఏం
(01:45) చేయాలంటారు ఒకటే నాగరాజు గారు ఫస్ట్ మనం మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. మనం గత ఎపిసోడ్ లో కూడా మనం సావిత్రి గారి గురించి చర్చించుకున్నాం దేని గురించి మెయిన్ అక్కడ ఆవిడ మానసికంగా బలహీనత అనేది తెచ్చుకోవడం బలహీనత అంటే ఇక్కడ ఏంటి అనింటే మానసిక బలహీనత ఎలా వస్తదో చెప్తాను నేను ఇక్కడ మంచి క్వశ్చన్ వేశరు మీరు ఎలా వస్తది అనింటే ఒక విషయాన్ని నేను ఎందుకు ఇలా అయిపోయాను నన్నెందుకు ఇలా చేశారు నాకెందుకు ఇలా జరుగుతుంది నేను ఇంత బాగున్నాను కదా ఎదుటి వాళ్ళు నన్ను ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు అని మన మన గురించి ంచి మనము విపరీతంగా ఆలోచించేసుకోవడం
(02:24) ఆ ఆలోచన పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఏమవుతది అంటే బలహీనత వచ్చేస్తుంది అన్నమాట ఎంత లెజెండరీస్ గా అయినా సరే ఎందుకు వస్తదిఅంటే కారణం అదే ఒక ఒకళ్ళ చేతిలో మనము మోసపోయినా లేకపోతే ఒకళ్ళు మనకి హార్ట్ అయ్యేట విధంగా మనల్ని మాట్లాడినా లేదా ఒక ఇన్సిడెంట్ మన జీవితంలో జరిగినా కూడా ఎందుకు మానసికమైనటువంటి బలహీనత ఏర్పడుతుంది అంటే పదే పదే దాన్ని గుర్తు చేసుకోవడం వల్ల నేనేమంటాను అంటే అంటే పదే పదే గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది లేదా ఒక మాట అన్నారు లేకపోతే ఒక ఇష్యూ ఉంది అక్కడ అది వాస్తవం దాన్ని అంగీకరించండి ఫస్ట్ ఎస్ ఇట్
(03:00) హాపెన్స్ ఇట్ హాపెన్డ్ జరిగిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి అనేటటువంటి అది ఎంత భయంకరమైనది అయినా సరే 10 నిమిషాలో 15 నిమిషాలో మించి మీరు ఆ సంఘటన గురించి ఆలోచించడానికి వీలు లేదు ఆలోచించొద్దు కూడా ఎప్పుడైతే మనము పరిష్కారం ఏంటి అని ఆలోచించడం మొదలు మొదలు పెట్టామో కొత్త ఎనర్జీ వస్తది మన శరీరంలోకి అదే గనుక మనము జరిగిపోయినటువంటి సంఘటన మీదనే మనం దృష్టి పెట్టామ అంటే మన ఎనర్జీ మొత్తం ఆ సంఘటన తీసేసుకుంటది.
(03:32) ఓకేనా ఇక్కడ జరిగేది అదే సూసైడ్ కి ఎందుకు వెళ్తారు అనిఅంటే నీ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ మొత్తాన్ని కూడా ఆ యొక్క సంఘటన మీదకి కేంద్రీకృతం చేసేసి ఎనర్జీ మొత్తాన్ని నువ్వు దానికి ఎఫోర్డ్స్ పెట్టేస్తున్నావ్ ఎఫర్ట్స్ కింద పెట్టేస్తున్నావ్ సో నీ ఎనర్జీ మొత్తం అది తీసేసుకుంటుంది నీ శరీరంలో ఆ ఉన్నటువంటి ఎనర్జీ లో ఎనర్జీలోకి నువ్వు వెళ్ళిపోతావ్ లో ఎనర్జీలోకి వెళ్ళిపోయినప్పుడల్లా ఏమవుతుందంటే నెగిటివిటీ పెరిగిపోతుంది బాడీలో ఆ నెగిటివ్ ఎనర్జీ పెరిగేసరికి నెగిటివ్ ఎనర్జీ ఏం తీసుకో వాడిని చంపేద్దామా మనం చచ్చిపోదామా లేకపోతే ఈ జీవితం మారదా లేకోతే వాళ్ళు
(04:05) మారరా ఇలా ఈ ఆలోచన వేస్తూ వేస్తూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ మనకు గుర్తుకు రాగానే మనలో విపరీతమైన కోపం వచ్చేస్తది అసహన వచ్చేస్తది భయం వస్తది ఏడుప వస్తది ఇవన్నీ ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే మన ఎనర్జీ మొత్తాన్ని దానికి ఖర్చు పెట్టేస్తున్నాం మన ఎనర్జీ వెళ్ళిపోతూ ఆ ప్లేస్ లో అసహనము కోపము దుఃఖము తర్వాత ఈ ద్వేషము భయంకరంగా మనలో చోటు చేసుకుంటానికి కారణం ఏంటంటే మన ఎనర్జీస్ ని ఆ సంఘటనలకి ఆ సంఘటనకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఖర్చు పెట్టేస్తున్నామ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది 100% వాస్తవం వాస్తవం వాస్తవం ఎప్పుడు కూడా సంఘటన జరగరానిదే మన జీవితంలో
(04:47) జరిగిపోయింది అబ్బా రైట్ అది వాస్తవం దాన్ని యక్సెప్ట్ చేయ ఫస్ట్ ఎస్ ఇది జరిగింది నిజమే నిజమే ఫస్ట్ నిన్ను నువ్వు సంసిద్ధత చేసుకో ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి నేను ఎలా బయటికి రావాలి అనేటటువంటి ఆలోచన ఆలోచించడం మొదలు పెడితే కొత్త ఎనర్జీ వస్తూ ఉంటుంది అంటే ఏంటి కొత్త ఆలోచనలు వస్తాయి ఇలా చేస్తే ఇలా ఉంటే లేదా ఈ ప్లేస్ వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మ్ లేదు ఈ మనుషులని వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళని వదిలిచ్చేసుకుంటే ఉంటే ఈ ఆలోచనలు ఎప్పుడైతే మీ యొక్క దీని లేదు ఈ మనుషులు బాగు చేసుకుంటే ఈ మనుషులని సరిచేసుకుంటే ఈ బంధాలని సరిచేసుకుంటే లేదా ఈ బంధాన్ని
(05:27) వదిలేస్తే అనేటటువంటిది ఒక సేఫ్ సైడ్ ఆలోచన ఎప్పుడైతే మీరు చేస్తారో పాజిటివ్ సెన్స్ మీలోకి వస్తది అప్పుడు ఎనర్జీ యాడ్ అవుతుంది మీకు యాడ్ అయ్యేసరికి మీలో ధైర్యం పెరుగుతుంది అది ఎలాంటి ఇన్సిడెంట్ అయినా సరే తిప్పి కొట్టేటటువంటి ధైర్యం మీకు వస్తుంది ఆ దీనికి సంబంధించినటువంటి చర్యలు మీ జీవితంలో జరుగుతాయి. అది నేర్చుకోవాల్సినటువంటి అవసరం మేల్ ఆర్ ఫీమేల్ ఎవర మా ఆవిడ వెళ్ళిపోయిందండి చాలా ప్రేమించారండి తట్టుకోలేకపోతున్నానండి అని బాటిల్ ముందు పెట్టి వేసుకొని దాంట్లోకి వెళ్ళిపోయి విషయం ఏంటంటే వాళ్ళద్దరు మాట్లాడుకున్నది చిన్న మాట కావచ్చు వాళ్ళ
(06:05) మధ్య వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఇంకా వేరే విషయంలో కావచ్చు కానీ వెళ్ళిపోయిన తర్వాత ఇతను చేసే పనులు ఉంటాయి చూసారా ఆవిడ ఇది ఎక్కువ చూపించేస్తది. అవును ఎక్కువ చూపించి పిన్ చేస్తా ఉంటది అసలు జరిగింది ఇంతే వీళ్ళు పెంచుకునేది ఇంత అంతది అంత అవుతది. ఉమ్ చాంతాడంత పురికోస అన్నమాట అద పురికోస కూడా కాదు ఊరికే జస్ట్ జరిగింది ఏంటంటే ఒక రబ్బర్ ఒక దారం ఇట్లా టై దాన్ని వీళ్ళు పురికోసం చాంతాడు తోటి కట్టేస్తారు చాంతాడు అంటే తెలుసుగా బావిలో నుంచి తోడే లావుగా ఉంటది చూసారా దానితోటి కట్టేస్తారు చివరికి ఎందుకు కట్టేస్తారు అని అంటే తీవ్రంగా ఆ సమస్య గురించి ఆలోచిస్తూ పలు
(06:46) తప్పులు చేస్తాం మనం ఆవేశంతో అరిచేయడమో లేకపోతే ఆవేశంతో పక్కనకి వెళ్లి వీళ్ళ వాళ్ళ మీద చెప్పేయటమో మళ్ళీ వాళ్ళు మోసేస్తారు కదా మోసేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మన చుట్టూత ఎందుకంటే పాపం వాళ్ళ తప్పు కూడా కాదండి ఎందుకంటే వాళ్ళు మంచే చేద్దాం అని వెళ్లొచ్చు అంటే ఇలా అనుకుంటున్నారుని మంచి చేద్దాం అని వెళ్లొచ్చు కానీ అది మనకి చెడే వస్తది.
(07:05) లేదు చెడు దృష్టితోటే ఉన్నారు ఆ నేనుఎందుకు ఊరుకోవాలి వీళ్ళ గురించి చెప్పేయాల్సిందే వీళ్ళు ఎందుకు ఉండాలి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకో అది ఇంకా మైనస్ అవుతుంది నీకు ఏం చేస్తున్నావ్ సమస్య ఏ సమస్య అయినా సరే భూతద్దంలో పెట్టి చూడకండి ఎలా చూడాలి అనింటే కొండని అద్దంలో పెట్టి చూస్తే ఎంత ఉంటదో మన సమస్యను కూడా పరిష్కారం అనేటటువంటి అద్దంలో చూడండి అంతే చిన్నగా కనపడుతుంది.
(07:36) మీరు చిన్నప్పుడు పద్యం చదువుకోలేదా సార్ అవును కొండ అద్దమందు కొంచెమై ఉండదా అంత పెద్ద కొండ మనం ఎక్కడానికే చాలా సేపు పడుతుంది మనం ఇలా కౌగలించుకోలేము దాంట్లో ఒక చిన్న రాయిని కూడా కౌగలించుకోలే కౌగలించుకోవడానికి చాలా పెద్దదిగా ఉంటది కానీ అద్దంలో చూస్తే ఇంతే ఇలా పట్టుకోగలం మనం ఆ సమస్యని పరిష్కారం అనేటటువంటి అద్దంలో చూడండి చాలా చిన్నగా కనిపిస్తుంది.
(08:02) ఎస్ తప్ప ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది అమ్మ ఈ కొండ దీన్ని ఎక్కాలా ఇటు నుంచి ఎక్కాలో ఎక్కితే ఎంతసేపు ఎక్కుతానో ఎక్కితే ఎవరనా వస్తారో లేదో నాతో పాటు ఇంత పైకి ఎన్ని రోజులకు ఎక్కగలుగుతారు ఇక్కడే ఉన్నావు నువ్వు ఆలోచించి ఆలోచించి ఆలోచించి ఎక్కలేదు వెళ్ళలేదు ఏం చేయలేదు విపరీత అర్ధాలు విపరీతమైన ఆలోచనలు నీకు వచ్చేసినయి చూడు పరిష్కారం అనేటటువంటి అద్దంలో ఒక్కసారి చూడు నీ సమస్య చాలా చిన్నదిగా కనిపిస్తది నీ చుట్టూ చాలా పెద్ద విలువైనటువంటి జీవిత యొక్క జీవితము కనిపిస్తుంది దాంట్లో జీవితం చాలా విలువైనదండి ఏది కూడా సరిదిద్దుకోలేని తప్పులు ఏవి ఉండవు సార్
(08:41) చరిత్రలు తిరగేయండి లెజెండరీస్ లైఫ్లు తీసుకోండి అన్ని తీసుకుంటే మనక అరే వీళ్ళు ఇలా చేసుకొని ఉండొచ్చు కదా ఈజీగా బయటపడిపోయేవాళ్ళు వీళ్ళు దీని గురించి ఎందుకు ఆలోచించారఅబ్బా అని మళ్ళీ మనమే బోల్డ్ అని ప్రసంగాలు ఇస్తాం బోలని చర్చలకు దారి తీస్తది మనం చాలా దాని గురించి విశ్లేషిస్తాం పక్కవాడి జీవితం గురించి విశ్లేషించేటటువంటి విజ్ఞత నీకు ఉన్నప్పుడు నీ సమస్యను పరిష్కరించుకునేటటువంటి విజ్ఞత కూడా నీలో ఉందని నువ్వు ఎందుకు ఆలోచించవ్ నీ సమస్యని పక్కవాడిది అనుకనే తీసుకొని ఆలోచించు పక్కవాడికే ఇది వస్తే ఏం చేస్తాడో ఆలోచించు నీలో ఉన్న నిన్ను
(09:15) బయటికి తీసి ఆలోచించు అద్భుతమైనటువంటి మార్గాలు కనిపిస్తాయి. అద్భుతమైనటువంటి మార్గాలు కనిపిస్తాయి అంతే తప్ప చాలా చిన్న విషయాలు సార్ కొన్ని బంధాలు ఇట్లా వదిలేంచుకుంటే వీళ్ళ జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అవును ఒక ఇంట్లో ఒక వ్యక్తి కోసం సార్ 10 మంది సార్ 10 జీవితాలు ఇటా కొట్టుకుంటాయి దీపం అదే ఏమంటారు గాలిలో దీపం లాగా 10 జీవితాలు కొట్టుకుంటా ఉంటాయి అది ఎప్పుడు ఆరిపోద్దో తెలవదు అరే ఆ గాలికి ఒక అడ్డు పెట్టండి ఆ దీపం వెలుగుతది.
(09:46) అంటే మీకు ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో దానికి చెక్ పెట్టండి ఒక్క వ్యక్తి వల్ల 10 జీవితాలు నాశనం అవ్వాల్సిన అవసరం ఉందా ఒక్క వ్యక్తి వల్ల ఇల్లు మొత్తము నాశనం అవ్వాల్సిన అవసరం ఉందా ఇంట్లో జనాలంతా మనశాంతి లేకుండా ఉండాల్సిన అవసరం ఉందా ఆ ఒక్క వ్యక్తిని తీసి బయట పెట్టండి 10 మంది జీవితాలు లేదా మిగిలిన వాళ్ళ జీవితాలు సంతోషంగా ముందుకు వెళ్తాయి.
(10:09) చాలామంది వ్యక్తుల విషయాల్లో కానివ్వండి వ్యవస్థాగతంగా మోసపోయిన విషయంలో కానివ్వండి లేకపోతే ఏదైనా డబ్బు లాస్ అయిన విషయం కానివ్వండి అప్పులు పాలైపోయిన విషయం కూడా కానివ్వండి. [గురకలు] ఇక్కడ అప్పుల వాళ్ళు వేధిస్తున్నారు వాళ్ళు విపరీతంగా మాట్లాడుతున్నారు మనల్ని వాళ్ళు మనల్ని విపరీతంగా అవమానిస్తున్నారు మనల్ని జస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ దౌర్జన్యంకి మీదకు వచ్చేసారు అనుకోండి దౌర్జన్యాలు చేశరనుకోండి చట్టం ఉందమ్మా కాపాడటానికి కరెక్ట్ గా మీరు ఆ చట్టాలను ఉపయోగించుకోండి కానీ మీరు బాగుపడి వాళ్ళ అప్పు వాళ్ళకి నయా పైసలతో సహా తీర్చేయండి.
(10:44) డెఫినెట్ గా ఎగ్గొట్టొద్దు నేను తీరుస్తాను అనేటటువంటి దృక్పదంతో మీరు ముందుకు వెళ్ళండి. కచ్చితంగా విశ్వం మనకి బోల్డ్ అన్న అవకాశాలు ఇస్తుంది. అంతే తప్ప నేనేమనో ఏం చేస్తావో చేసుకో లేకపోతే అయ్యో నేను కట్టకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారని నువ్వు చావటమో ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ నువ్వు జన్మెత్తి మళ్ళీ ఇదే జీవితం గడపాల్సి వస్తుంది.
(11:06) జన్మ జన్మలకి వెంటాడేటటువంటి పాపాలు ఇవన్నీ కూడా కర్మలు అంటే ఏంటంటే స్వయం కృతాపరాధాలు అంటారు వీటన్నిటిని కూడా ఎన్ని వస్తాయి మన చుట్టూ వస్తాయి కష్టల్లో ఉన్నప్పుడు మన నీడ కూడా మనతో రాదు నాగరాజు గారు ఎస్ కానీ మనతో వచ్చేవాడు ఎవడో తెలుసా వాడు ఎప్పుడు నీతో ఉంటాడు ఎప్పుడు నీతో ఉంటాడు అది గమనించు డెఫినెట్ గా అండి దీనికి ఒక చిన్న కథ ఉంది అందరికీ తెలిసిందే అయినా సరే మళ్ళీ చెప్తా ఉంటాను ఎప్పుడూ కూడా ఒకానొక ఒక భక్తుడు భగవంతుడితో విపరీతంగా స్నేహం చేసేసాడు ఎంత గొప్పగా అంటే అతను ఎక్కడికి వెళ్ళినా కూడా అతనితో కూడా భగవంతుడు ఉండేవాడు ఉండేవాడు అందుకు సాక్ష్యం ఏంటి
(11:51) అంటే పక్కన రెండు అడుగులు ఆ యొక్క మార్కులు పడతా ఉంటాయి అన్నమాట భగవంతుడా నువ్వు ఎక్కడున్నావ్ అంటే చూడు నాయనా నీ పక్కనే ఉన్నాను నీ మాటలన్నీ వింటున్నాను నీ కథలన్నీ వింటున్నాను నీ సంతోషం చూస్తున్నాను నీ బాధలు చూస్తున్నాను షేర్ చేసుకుంటున్నాను అన్నీ వింటున్నాను నువ్వు ఫలానా ఫలానా ఇదిగో చూడు కావాలంటే చూడు నేను నీ పక్కనే ఉన్నాను అంటే పక్కన చూడంగానే అడవులు మార్కులు కనపడుతున్నాయంట అమ్మ భగవంతుడు నా పక్కన ఉన్నాడు కదా అనుకని ఆయన సంతోషంగా బ్రతకడం అనేది స్టార్ట్ చేసి బ్రతికాడు అనుకోకుండా విపరీతమైనటువంటి కష్టాలు వచ్చి పడిపోయినయి
(12:20) ఏమవచ్చినాయి అంటే ఒక ఇంట్లో తల్లి క్యాన్సర్ తీసుకోండి లేకపోతే ఇంట్లో భర్త కొట్టాడు అనుకోండి లేకపోతే భార్య వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి ఇట్లా సినిమా కష్టాలన్నీ మన జీవితాల్లో వచ్చేస్తా ఉంటాయి సినిమా కష్టాలు అంటారు అసలు మన కష్టాలే సినిమాలవి అంతేగన ఒక మానవుడికి ఎలాంటి కష్టాలు వస్తాయో వాడికి కూడా విపరీతంగా సాడేసా అంటారన్నమాట అంటే అష్టమశని ఉంటే గనుక ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కుంటామో ఆ సిచుయేషన్ లో ఉన్నాడు అతను ఉండా అసలు అవి తట్టుకోలేక ఈ విధంగానే భగవంతుడికి చెప్తూ చెప్తూ చెప్తూ పక్కన కూర్చుని ఏమయ్యా వింటున్నావా అని
(12:51) పక్కన చూస్తే అడుగులు కనపడట్లేదు అప్పుడు అనుకున్నాడు నాయనా భగవంతుడా నువ్వు కూడా వెళ్ళిపోయావా కష్టాల్లో సుఖంగా ఉన్నప్పుడు మాత్రం నా పక్కన నుండి బాగా పంచుకున్నావే బాగా కబుర్లు విన్నావే కష్టాల్లో నా నీడ వరకు కూడా రావట్లేదు నువ్వు కూడా వెళ్ళిపో పోయావా అని అడుగుతాడు అప్పుడు భగవంతుడు అడుగుతాడు ఎవరు నాయనా అడిగినాడు నేను ఉన్నాను అనిఅంటే ఎక్కడున్నావు అనిఅంటే కింద నా అడుగులే కనపడుతున్నాయి నీ అడుగులు కనపడలేదు అంటే పిచ్చోడా ఆ అడుగుల మార్కులు నావి నువ్వు నా భుజం మీద ఉన్నావు అన్నాడు నేను నిన్ను మోస్తున్న నీ అడుగులు పడకపోతే
(13:23) నేను మోస్తున్నా అంటే ఎవ్వరైనా సరే గుర్తుపెట్టుకోండి చాలా మంచి క్వశ్చన్ వేశారు మనం అనుభవించేటటువంటి కర్మలు కానీ మనం అనుభవించేటటువంటి దరిద్రం కానివ్వండి ఏదైనా 20% % మాత్రమే నాగరాజు గారు మిగిలిన 80% ఎవరు అనుభవిస్తున్నారు విశ్వం దేవుడు దేవుడు మనం విశ్వం అంటాము అందరి దృష్టిలో చెప్పాలంటే భగవంతుడు 20 శాతం కష్టాలకే ఏడ్చి గిలగల కొట్టుకుని సూసైడ్లు చేసేసుకుని ఏంటేంటో అయిపోయి జనాల్ని తిట్టేస్తున్నావే నువ్వు మరీ ఇన్ని కోట్ల మంది వందల కోట్ల మంది యొక్క కష్టాల్ని 80 శాతం కష్టాల్ని భరించే భగవంతుడు ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ విశ్వానికి
(14:09) ఎక్కడి నుంచి వచ్చింది అది తెలుసుకోండి ఫస్ట్ మనక ఇచ్చింది 20 శాతమే బిడ్డ 80 నేను నేను భరిస్తా 20 నీకు ఇస్తున్నా పో వాటిల్ని క్లియర్ చేసుకోండిరా అని భగవంతుడు పంపిస్తే ఛాలెంజింగ్ గా తీసుకొని థాంక్ఫుల్ గా తీసుకొని వాటిల్ని ఓవర్కమ్ అయ వెళ్ళామంటే మనకోసము డెఫినెట్ గా మంచి ఆ దాన్ని ఏమంటారు అంటే ఒకళ్ళ భాషలో చెప్పాలంటే స్వర్గం అనేది ఎట్లా ఉంటదో ఎవరికీ తెలవదు బట్ మన జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఎప్పుడైతే మనం దాన్ని అనుభవించి దాన్ని ఓవర్కమ్ అయ్యి వెళ్తామో ఇంకొకళ్ళకి మనం లెజెండరీ అవుతాం.
(14:45) ఎస్ అదే స్వర్గం అదే స్వర్గం నీ ఎంతో మందికి మనం లెజెండరీ అవుతాం మన కుటుంబాల్లోనే చాలా మంది చెప్పుకుంటారు తరతాలు చెప్పు ఒరేయ్ ఆ తమ్మి తాత ఎన్ని కష్టాలు అనుభవించాడురా కానీ బ్రహ్మాండంగా బ్రతికెళ్ళాడురా అలా ఉన్నాడురా ఇలా ఉన్నాడురా లేదా మీ బాబాయి ఇలాగా లేకపోతే మీ అత్త ఇలాగా లేకపోతే ఇంకొకళ్ళు అలాగా ఇంకొకళ్ళా పక్కవాడు చెప్పుకుంటాడు స్నేహితుడు చెప్పుకుంటాడు ఇంకా చెప్పాలంటే మనకోసం చరిత్రలు రాయడానికి సిద్ధంగా ఉంటారు అవును ఆ జీవితం మన కోసం రెడీగా ఉంది చాలా మంది నా దగ్గరికి వచ్చినవాళ్ళు అంటారు ఎందుకు మేడం ఎప్పుడెప్పుడో జరిగాయి మాకు ఎందుకండి
(15:18) ఇప్పుడు ఇప్పుడు క్లియర్ అవ్వాలండి అనింటే ఎందుకు క్లియర్ అవుతది నువ్వు నీ జీవితాన్ని నువ్వు ఎలా తెచ్చుకున్నావో నువ్వు స్వీకరించలేనప్పుడు నీ అస్తిత్వాన్ని దిగజార్చుకొని నీ యొక్క బలహీనతలని నువ్వు స్వీకరించలేనప్పుడు భగవంతుడు నిన్ను ఎలా స్వీకరిస్తాడు నీ కష్టాలు ఎలా బయటకి తీస్తాడు ఫస్ట్ నువ్వు యక్సెప్ట్ చెయ్ భగవంతుడా ఇది నా తలరాత తలరాత కాదు ఇది కూడా చెప్ప చెప్పకూడదు నేను యాక్చువల్ గా చెప్పాలని భగవంతుడా నేను నీ నుంచి వచ్చినటువంటి అంశని నాకు ఇవి వచ్చినయి నేను ఓవర్కమ్ అయ్యే ధైర్యాన్ని నాకు ఇవ్వు దీన్ని ఆ శక్తిని నాకు ప్రసాదించు నేను నీ
(15:56) యొక్క అండం ఉంటే చిటికలో దీన్ని దాటేస్తా అనే కాన్ఫిడెన్స్ ఎందుకు పెట్టరు పెట్టరు ఎంతసేపు ఏంటంటే మనకున్న మైనస్ల మీద పెట్టుకుంటూ ఇందాక చెప్పాను కదా ఎనర్జీని డిస్చార్జ్ చేసేసుకుంటారు. అరే రిసీవ్ ఎనర్జీ నీలోనే ఉన్నాడు భగవంతుడు ఆ భగవంతుడికి చెప్పు నేను దీని నుంచి బయట పడతా నాకు దారి చూపించు నీకు నువ్వే చెప్పుకో ఆ దారులు ఎలా రావో చూడండి.
(16:21) డెఫినెట్ గా అండి నైరాస్యము అనేది తర్వాత నిర్వేదం అనేది ఎప్పుడూ కూడా ఒక మనిషికి ఆలోచించకూడనటువంటి పదాలు ఇవి రెండేరండి. ఎస్ నాగరాజు గారు ఒక్క విషయం నేను చెప్తాను మీరు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైనా ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తాను మీరు చిన్నప్పటి నుంచి మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆలోచించండి అప్పుడు వచ్చిన కష్టాలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎలా అనుకున్నారు ఆ ఏజ్లో వచ్చిన కష్టాలు ఇంకొక స్థాయికి వచ్చిన తర్వాత ఎలా అనుకున్నారు ఆ కష్టాలకి ఇంకొక స్థాయి ఎలా అనుకున్నారు ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా చూస్తే ఏమనుకుంటున్నారు పాతగా ఆలోచించుకుంటే సిల్లీగా ఉంటాయి
(16:58) కదా [నవ్వు] ఇంకొకటి చిన్నప్పుడైతే మనం కొబ్బరికాయలు కొట్టేస్తామని దేవుడిని మొక్కుంటాం ఎందుకు హోమ వర్క్ మాస్టర్ చూడకపోతే అడక్కపోతే కొబ్బరికాయ కొడతారురా దేవుడా అని స్కూల్ కి వెళ్ళే దారిలో దేవుడు కనిపించేస్తే మొక్కుంటాం లేదా ఇంట్లో దేవుడు కనిపించేస్తే మొక్కుంటాం చాలా సిల్లీగా ఉంటదా [నవ్వు] ఇప్పుడేంటి భగవంతుడా నాకు ఆ కాంట్రాక్ట్ వస్తే కొబ్బరికాయ కొడుతున్నా అంటాడు భగవంతుడు కూడా ఇట్టాగే నవ్వుకుంటాడు ఒరేయ్ కాంట్రాక్ట్ నీ పక్కనే ఉందిరా నాయనా లేదు ఇది పోయిందంటే ఇంకొకటి రెడీగా ఉందిరా నాయన ఎందుకురా అనవసరంగా నాకు కొబ్బరికాయలు కొడతాను అని
(17:27) మొక్కుంటావ్ పిచ్చోడా హోం వర్క్ గబ గబ చేస్తే అయిపోయేది కదా మనం అనుకుంటాం రాత్రి బద్దక వేసి పడుకున్నాం లేదా సినిమా చూసి పడుకుందాం లేకపోతే ఇంకేదో బం కొట్టేసి పడుకున్నాం తప్పు మందే కానీ దేవుడికి కొబ్బరికాయ కొడతామని ముట్టుకుంటాం దేవుడు కాపాడాలి మనకి మన తప్పులు మనం క్రమశిక్షణతో మన తప్పులను సరిచేసుకుంటూ మనం వెళ్తే డెఫినెట్ గా దైవం ఎక్కడఉంది సార్ మనలో ఉంది మనలోనే ఉంది మనలో ఇంకొకడు చూస్తాడా దైవత్వాన్ని ఎస్ ఏదైనా ఈరోజు ఉన్నటువంటి కష్టము రేపటికీ చాలా సింపుల్ పాతపడిపోతది అది అవును ఎప్పటికప్పుడు మన జీవితంలో వచ్చిన అమ్మో దీన్ని ఎలా బయటపడాలి అనుకున్న క్షణాలు
(18:07) ఉన్నాయి చచ్చిపోతాయే బాగుండా అనుకున్న క్షణాలు ఉన్నాయి పరువు పోతుంది అనుకున్న క్షణాలు ఉన్నాయి కానీ కాలం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తుంది. ప్రతి ఒక్క కష్టానికి పరిష్కారం తీసుకొస్తుంది. కాలానికి వదిలేసి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి సార్. షూర్ చాలా బాగా చెప్పారు ఇందాక దేవుడి కాన్సెప్ట్ ని తీసుకొని మరి భుజాల పైన మోసనాను ఎస్ గ్రేట్ అదే అన్నాడు ఎక్కడున్నాయి స్వామి నీ అడుగులు లేవు అదిగో నా అడుగులే కదా అన్నాను ఒరేయ్ పిచ్చోడా నా అడుగులు కాదురా నాయనా నా అడుగులు నువ్వు నా భుజం మీద ఉన్నావ్ అన్నాడు
(18:40) అంటే కష్టాలు ఉన్నప్పుడు భగవంతుడు మనల్ని మోస్తున్నాడు అని మర్చిపోకండి అతన్ని అడగండి అతన్ని ఏం అడగాలి నాకు ఎందుకు ఇచ్చావు నాకు ఎందుకు ఇచ్చావు అదే కదా అతను అడిగాడు ఒరేయ్ సచ్చినోడా నా భుజం మీద ఉన్నావు చూడరా నువ్వు అన్నాడు అడగాల్సింది ఏంటి భగవంతుడా నువ్వు నీ భుజాల మీద ఎక్కించుకొని మోస్తున్నావా నాయనా నన్ను దించి నాకు ఆ శక్తిని ఇవ్వు నేను నడుస్తాను అనిఅంటే అప్పుడు భగవంతుడు ఇస్తాడు నాయనా నన్ను బయట పడే బయట పడేసే శక్తిని నువ్వు నాకు ఇచ్చావు దాన్ని వెతుక్కునే దారి నాకు చూపించు దాన్ని తిరిగి తెచ్చుకునేటటువంటి పరిస్థితులు
(19:13) ఎక్కడఉన్నాయో నాకు చూపించు అంటే డెఫినెట్ గా విశ్వం మన ముందు పెడుతుంది. ఎస్ సార్ అప్పుడప్పుడు అనుకుంటాం అసలు అనుకోలేదండి నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగిందండి అని అంటారు ఆ అనుకున్నటువంటి అఫర్మేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటది చూడండి మనసా వాచా కర్మణ అనుకుంటారు ఆ నిమిషంలో అవును ప్రతిదీ కూడా మన జీవితంలో అలాగే ఉంది.
(19:34) ఎస్ ఇప్పుడు నా ఎదురుగుండా కౌన్సిలింగ్ కూర్చున్నారు నాగరాజు గారు మీ సమస్య [గొంతు సవరించుకోవడం] ఏదో నాకు చెప్పారు నేనేం చెప్తాను లేదమ్మా ఇది చాలా చిన్న సమస్య వాళ్ళది బాగనే ఉంటదండి వాళ్ళు పెద్దోళ్ళండి ఏదన్నా ఒక పెద్ద పెద్దాయన గురించి ఒక కష్టం చెప్పి ఇది ఆయన ఓవర్కమ్ అయ్యాడు వాళ్ళు పెద్దోళ్ళండి ఓవర్కమ్ అయిపోతారండి అని అంటారు లేదు మీకంటే లో క్యాడర్ లో ఉన్న వాళ్ళని తీసుకొని చూడమ్మ వాడు నీకంటే చిన్నవాడు నీకంటే అన్ని విషయాల్లో చిన్నవాడు ఎంత ధైర్యంగా నెట్టుకొని వచ్చాడో చూడు అని అంటే వాళ్ళదే ఉందండి వాళ్ళ జీవితంలో ఏం పట్టించుకోలేదండి అని అంటాం లేదు నీతో
(20:01) సమానంగా ఆ వాడి మనస్తత్వం వేరు నా మనసత్వం వేరు అని అంటావు అప్పుడు నేను నీకు ఏం చెప్తాను ఏం చెప్పను నీ తీసి నీకు ఇచ్చి బయటికి నడువు అంట దేవుడు కూడా అంతే భగవంతుడు కూడా నువ్వు ఏం చెప్తున్నావ్ వాడు ఏం చెప్తున్నాడో నువ్వు వినేటటువంటి అవేర్నెస్ నీలో లేకపోతే తిప్పి నీ జీవితాన్ని నీకే వదిలేసిపోతాడు. ఎంతసేపు కంప్లైంట్లే చెప్తున్నాం కదా ఎవడు వింటాడండి అసహనం ఎవడికి అవసరంఅండి కాబట్టి నీ ఫీస్ ఏంటంటే ఆయనకి నువ్వు ఇచ్చిన ఫీస్ నీ జీవితం సావు నీ సావు నువ్వు సావ్ అవును ఇదే జరుగుతది.
(20:41) ఎస్ థాంక్యూ సో మచ్ ప్రియా చౌదరి గారు థాంక్యూ చూసారు కదా వీడియో ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ముఖ్యంగా చాలా మంది స్పీకర్స్ ఉంటారు. సో తెర ముందుకు వచ్చి మాట్లాడాలి అనేటువంటి ఆలోచన ఎవరికనా ఉన్నా సరే మిస్టర్ నాగ అఫీషియల్ అని ఆయనఇగ ఐడి ఉంది దానికి మీరు కచ్చితంగా ఆ పర్సనల్ గా ఫాలో అయ్యి అయినా సరే మీరు సుమన్ టీవీ ఆఫీస్ దాకా రావచ్చు అండ్ దాంతో పాటు ప్రియా చౌదరి గారు ఎప్పటికప్పుడు క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు.
(21:07) సో మహిళలకు సంబంధించినటువంటి క్లాసెస్ స్పెషల్ గా ఎవ్రీ వీక్ ఉంటాయి అది మీరు ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే సో వాటిని గనుక మీరు ఫాలో అయ్యి ఆ క్లాసెస్ గనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే వర్క్ షాప్స్ అయినా సరే పర్వాలేదు అండ్ కొంతమంది అపార్ట్మెంట్స్ లో గాని లేదా బయట ఎక్కడైనా సరే మెడిటేషన్ కి సంబంధించినటువంటి క్లాసెస్ కానీ ప్రియా చౌదరి గారితో కావాలి అనుకుంటే మిస్టర్ నాగ అఫీషియల్ నాఇగ్ర ఐడి ఉంది దానికి మీరు మెసేజ్ పెట్టినా పర్లేదు దాని నుంచి అప్డేట్స్ వస్తాయి లేదు అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది చాలా మందికి ఒక క్లాస్ ఉంటే అంటే మాకు
(21:36) ఉండేటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉంటే లేదా ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటిపై క్లారిటీ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి మీరు సంప్రదించవచ్చు వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ మీ అభిప్రాయం ఏదన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో మాత్రం పోస్ట్ చేయడం మర్చిపోవద్దు థాంక్యూ
No comments:
Post a Comment