🧠"నిన్ను నమ్ముతున్నాను" అని నువ్వెవరితోనైనా అంటే, దానికి అసలు అర్థం ఏంటో తెలుసా? "నా మెదడు వాడటం నాకు చేతకాదు, ఆలోచించే ఓపిక నాకు లేదు.. కాబట్టి నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నన్ను వాడుకో" అని నీకు నువ్వే ఇస్తున్న invitation అది. సమాజం, సినిమాలు కలిసి మన brain లోకి ఎక్కించిన అతిపెద్ద Scam ఇది.
అసలు మనం ఒకరిని ఎందుకు నమ్ముతాం? "నేను చాలా మంచోడిని, అందుకే అందర్నీ నమ్ముతాను" అని నీ ego నీకు కథలు చెప్తూ ఉండొచ్చు. కానీ దీని వెనకాతలున్న నిజం వేరు. మనిషి brain ఎప్పుడూ energy ని save చేసుకోవడానికి చూస్తుంది. పక్కన ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, వాడి ఉద్దేశ్యాలు ఏంటి, వాడి మాటల వెనక ఉన్న కుట్ర ఏంటి, అని ప్రతి క్షణం observe చేసి analyse చేయడమంటే, అది brain కి ఒక పెద్ద గుది బండలా అనిపిస్తది.
😔ఒకరిని నమ్మడం అంటే, నీ భద్రతని, నీ ఆలోచనని వాళ్ల చేతుల్లో పెట్టేసి నువ్వు Relax అయిపోవడం. నువ్వు ఎప్పుడైతే Relax అయ్యావో, అవతలి వాడికి నిన్ను మోసం చేయడానికి దొరికే first loop hole అదే. ప్రపంచంలో జరిగే ప్రతి మోసానికి పునాది, మోసపోయేవాడు తన బుర్రకి Rest ఇచ్చి పక్కనోడిని గుడ్డిగా నమ్మడమే.
👹ఇక ఆ నమ్మకం వమ్ము అయినప్పుడు, మనిషి జీవితాంతం ద్వేషంతో రగిలిపోతాడు. And నువ్వు మోసపోయినప్పుడు నీకు వచ్చే ఆ ద్వేషం అవతలి వాడి మీద కాదు.. నీ మీద నీకే. "నేనెంత ఎదవనైతే, వాడి చేతిలో ఇంత దారుణంగా బకరా అయ్యాను, నా intelligence ని నేనే ఎలా వాడుకోలేకపోయాను" అని నిన్ను నువ్వే అసహ్యించుకునే frustration అది. ఆ self-hatred ని తట్టుకోలేక, దాన్ని అవతలి వాడి మీదకు shift చేసి ద్వేషంగా మారుస్తావు.
👩🔬నిజమైన సత్య శోధకుడు, తన జీవితంలో ప్రతి విషయాన్ని ఎప్పుడో ఒకప్పుడు అనుమానించాలి. Science పితామహుడు Galileo చెప్పింది కూడా అదే, Doubt is the Father of iinvention.
అసలు డౌటే రానివాడు జీవితంలో ఎప్పుడో ఒకసారి ఘోరంగా బొక్క బోర్లా పడతాడు. అనుమానం అనేది ఒక negative quality కాదు. It’s an evolutionary survival tool. నీ System లో Virus రాకుండా కాపాడే antivirus అది. So ఎవరైతే గుడ్డిగా నమ్ముతారో, వాళ్లే ఈ సొసైటీలో ఎప్పుడూ బలిపశువులు అవుతూ ఉంటారు.
💕ఇక ఈ భార్యాభర్తలు, Lovers విషయానికొద్దాం. "నా భర్తని/భార్యని నేను గుడ్డిగా నమ్ముతాను" అని కాలర్ ఎగరేసే వాళ్ళని చూస్తే, నాకైతే వాళ్ళ అమాయకత్వానికి జాలేస్తుంది. గుడ్డిగా నమ్మడం అంటే ఏంటో తెలుసా? నీ Partner ని ఒక మనిషిలా కాకుండా, నీ ఇంట్లో ఉన్న ఒక కుర్చీ లాగ, టీవీ లాగ, ఒక ప్రాణం లేని వస్తువుగా Treat చేయడం. మనిషి అనేవాడు dynamic. వాడు మారుతూ ఉంటాడు. వాడి Emotions మారుతాయి, పరిస్థితులు మారుతాయి, అవసరాలు మారుతాయి. "నా Partner ఎప్పటికీ మారడు" అనుకోవడం నీ మూర్ఖత్వం.
🤔 So అనుమానం రావడం తప్పు కాదు. Doubt means you are paying attention. నువ్వు వాళ్ళని గమనిస్తున్నావు, వాళ్ళు ఒక మనిషి అని నువ్వు గుర్తిస్తున్నావు అని అర్థం. నీ partner మీద doubt వస్తే, లోపల దాచుకుని, Over thinking చేసి, అనుమానం అనే నిచ్చెన అల్లి, వాళ్ళని ఒక Psyco లాగా torture చేయొద్దు. Straight గా, కళ్ళల్లోకి చూసి చాలా ప్రశాంతంగా, "Hey, I noticed this in u. అసలేం జరుగుతోంది?" అని అడిగేయ్. In fact ఇలా అడగడం అనేది, వాళ్ళ intelligence కి నువ్వు ఇచ్చే respect. అలా కాకుండా, ఏదో దాచిపెట్టి, నువ్వొక గూఢచారిలా మారడం toxic. నమ్మకంలో అనుమానం ఒక భాగం మాత్రమే కాదు, నమ్మకానికి ప్రాణవాయువు లాంటిది.
🤓"అనుమానంతో అనుమానం, నమ్మకంతో నమ్మకం పెరుగుతాయి" లాంటి ముద్దు ముద్దు మాటలు పుస్తకాల్లో చదువుకోడానికి బాగుంటాయి.. But Reality ఎంతో harsh గా ఉంటుంది. కొంచెం అనుమానం ఉన్నప్పుడే, ఆ అనుమానం లోంచి అసలైన నమ్మకం పుడుతుంది. అలాగే, గుడ్డి నమ్మకం ఉన్న చోటే, జీవితాన్ని నాశనం చేసే అతిపెద్ద మోసం పుడుతుంది.
So ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, వాళ్ళే నా ప్రాణం అని గుడ్డిగా నమ్మేసి, నీ life steering ని వాళ్ళ చేతుల్లో పెట్టకు.
🤎Trust, but verify.
🤍Love, but observe.
❤️Doubt, but communicate.
అనుమానించడం అంటే భయపడటం కాదు. "నాకు తెలుసు, నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు స్పృహ ఉంది, నేను దేన్నైనా ఎదుర్కోగలను" అనే Confidence తో కళ్ళు తెరిచి ఉండటం.
అసలు "నమ్మకం" అనే ముసుగు నువ్వు వేసుకుంది.. ఎదుటివాడికి స్వేచ్ఛ ఇవ్వడానికా? లేక నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక, కళ్ళు మూసుకుని పడుకోవడానికా?
ఆలోచించు. సమాధానం నీకే వదిలేస్తున్నా.
-PRATIKULA VEDAM
http://youtube.com/post/UgkxzR35O6jqWlzwV0gOaFlhDBgGNYRF7Eaf?si=afHaDvHHubsRyhjr

No comments:
Post a Comment