Saturday, October 17, 2026

రోజంతా SCREEN ముందేనా? ఈ 10 నిమిషాల ధ్యానం చాలు! | Meditation for Stress Relief

రోజంతా SCREEN ముందేనా? ఈ 10 నిమిషాల ధ్యానం చాలు! | Meditation for Stress Relief

Author Name:Sanmaarg Thoughts

Youtube Channel Url:https://www.youtube.com/@sanmaargthoughts18

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HEp7SLF3tnU





Title: రోజంతా SCREEN ముందేనా? ఈ 10 నిమిషాల ధ్యానం చాలు! | Meditation for Stress Relief

Author Name: Sanmaarg Thoughts

Description: రోజంతా SCREEN ముందేనా? ఈ 10 నిమిషాల ధ్యానం చాలు! | Meditation for Stress Relief

‪@sanmaargthoughts18‬

Do you spend 8–10 hours every day looking at a mobile phone, laptop, or computer screen?

Long screen time can contribute to digital eye strain, dry eyes, neck stiffness, mental fatigue, and stress.

In this video, Sanmaarg Thoughts introduces 10 MINUTE SCREEN RESET MEDITATION, a simple four-step wellness routine inspired by ancient Indian yoga principles and modern evidence-informed relaxation techniques.

This practical routine is designed for software engineers, IT professionals, office workers, students, digital creators, and anyone who spends long hours using digital screens.

Learn how to relax your eyes, release body tension, practice comfortable breathing, and improve mindfulness through a simple daily routine.

---

WHAT YOU WILL LEARN

✅ EYE RESET – 2 Minutes

Learn about digital eye strain, the 20-20-20 rule, natural blinking, and gentle eye relaxation techniques.

✅ BODY RESET – 2 Minutes

Discover simple neck and shoulder movements, posture awareness, and body relaxation practices for desk workers.

✅ BREATH RESET – 2 Minutes

Explore breathing awareness inspired by traditional yoga and modern relaxation practices.

✅ MIND RESET – 4 Minutes

Practice mindfulness meditation, attention training, and breath awareness to develop focus and mental relaxation.

---

VIDEO CHAPTERS

00:00 – Introduction: Screen Time & Mental Fatigue

00:50 – Why Your Body Needs a Screen Reset

02:00 – Eye Reset: Digital Eye Strain Relief

04:00 – Body Reset: Neck & Shoulder Relaxation

06:00 – Breath Reset: Breathing Awareness

08:00 – Mind Reset: Mindfulness Meditation

11:00 – Benefits of Daily Meditation Practice

12:00 – Screen Reset Routine & Final Tips

---

ANCIENT WISDOM MEETS MODERN SCIENCE

This video draws inspiration from traditional yoga teachings, including Patanjali Yoga Sutras, Bhagavad Gita Chapter 6, and Hatha Yoga Pradipika.

Screen Reset Meditation is an original educational framework presented by Sanmaarg Thoughts, combining four familiar wellness practices into one simple daily routine.

Regular mindfulness and relaxation practices may support stress management, attention, and general well-being. Results vary between individuals.

---

WHO SHOULD WATCH?

Software Engineers | IT Employees | Office Workers | Students | Content Creators | Remote Workers | Laptop Users | Smartphone Users

---

IMPORTANT DISCLAIMER

This video is for educational and general wellness purposes only. It is not medical advice, diagnosis, or treatment.

This routine does not replace regular screen breaks, proper ergonomics, or professional medical care. Avoid uncomfortable movements or forced breathing. Consult a healthcare professional for persistent symptoms.

---

VIDEO CREDITS

Concept & Script: Nani

Voice & Presentation: Nani

On-Camera: Nani

Video Editing: Nani

Channel: Sanmaarg Thoughts

YouTube: @sanmaargthoughts18

---

ABOUT SANMAARG THOUGHTS

Ancient Wisdom → Health + Wealth → Modern Life

Subscribe for Telugu videos about meditation, mindfulness, healthy habits, yoga wisdom, personal growth, and practical wellness.

COMMENT: How many hours do you spend looking at screens every day?

LIKE, SHARE & SUBSCRIBE!

---

screen time effects, meditation for stress relief, digital eye strain relief, eye relaxation exercises, 10 minute meditation, mindfulness meditation Telugu, screen fatigue relief, meditation for beginners, neck and shoulder relaxation, breathing exercises for stress, stress relief techniques, meditation for focus, computer eye strain, yoga for office workers, screen reset meditation

---

#Meditation #StressRelief #ScreenTime #Mindfulness #EyeStrain #DigitalWellness #MeditationTelugu #EyeRelaxation #BreathingExercises #YogaTelugu #MentalWellness #HealthyHabits #OfficeWellness #ScreenResetMeditation #SanmaargThoughts

Transcript:
(00:00) మీ మొబైల్ లో ఏదైనా ఒక యాప్ సరిగ్గా పనిచేయకపోతే మీరు ఏం చేస్తారు? వెంటనే దాన్ని అప్డేట్ చేస్తారు. అవసరమైతే మొబైల్ ని కూడా అప్డేట్ చేస్తారు. మరి ప్రతిరోజు ఎనిమిది నుంచి 10 గంటల పాటు స్క్రీన్ ముందు పని చేస్తున్న మీ మెదటికి మీ శరీరానికి మీరు విశ్రాంతి ఎలా ఇస్తున్నారు? ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు, డిజిటల్ క్రియేటర్లు ఇలా ఎంతోమంది ఎక్కువ సమయాన్ని స్క్రీన్ ముందే గడుపుతున్నారు.
(00:27) దీనివల్ల కళ్ళల్లో మంటలు, తలనొప్పి, మెడ నొప్పి, మానసిక అలసట వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే స్క్రీన్ వల్ల కలిగే అలసటని తగ్గించుకుని కళ్ళకు విశ్రాంతిని ఇచ్చి శరీరాన్ని సడలించి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక అద్భుతమైన సాధన ఉంది. మన ప్రాచీన యోగ సూత్రాలను తీసుకొని వాటికి ఆధునిక సైన్సు చెప్పే పద్ధతులను కలిపి రూపొందించిన ఈ సాధన పేరు 10 మినిట్స్ స్క్రీన్ రీసెట్ మెడిటేషన్ రోజుకి కేవలం 10 నిమిషాలు చాలు ముఖ్యంగా మొబైల్ లాప్టాప్ కంప్యూటర్స్ ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన సాధన ఇది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి
(01:05) వరకు చూసేయండి. మన శరీరం ఒక అద్భుతమైన జీవ వ్యవస్థ. మనం స్క్రీన్ చూస్తున్నప్పుడు మన కళ్ళు నిరంతరం దృష్టిని కేంద్రీకరిస్తాయి. మెదడు సమాచారాన్ని పరిశీలిస్తుంది. చేతులు కీబోర్డు పై పనిచేస్తాయి. మెడ భుజాలు ఎక్కువసేపు ఒకే భంగ్యములో ఉంటాయి. ఇలా గంటల తరబడి పని చేసినప్పుడు మన శరీరానికి మన మనసుకి విశ్రాంతి చాలా అవసరం అవుతుంది.
(01:32) అయితే మనకు విశ్రాంతి అవసరం అని తెలిసినా కూడా పని పూర్తఅయ్యే వరకు శరీరాన్ని అసలు పట్టించుకోకుండా ఉంటాం. కానీ పని మధ్యలో తీసుకునే చిన్న విరామం కూడా మన కళ్ళకు మన శరీరానికి మన మనసుకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే స్క్రీన్ నుంచి కొద్దిసేపు దృష్టిని మరల్చి శరీరాన్ని సడలించి మనసుని ప్రశాంతపరుచుకోవాలి.
(01:54) దీన్నే మనం స్క్రీన్ రీసెట్ అంటున్నాం. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది. ఈ 10 నిమిషాల సాధన కోసం మీరు మీ పనిని మధ్యలోనే ఆపాల్సిన అవసరం లేదు. ఉదయం పని ప్రారంభించే ముందు కానీ లేదా పని పూర్తయిన తర్వాత కానీ ఒకవేళ మీకు పని మధ్యలో ఎప్పుడైనా ఫ్రీ ఉంటే అప్పుడైనా ఈ ప్రాక్టీస్ ని మీరు తప్పకుండా చేసుకోవచ్చు.
(02:14) ఈ 10 నిమిషాల్లో మీ కళ్ళకు మీ శరీరానికి మీ శ్వాసకు మీ మనసుకు ఎలా విశ్రాంతి ఇవ్వాలి అనేది ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను. ముందుగా మొదటి రెండు నిమిషాలు ఐ రీసెట్ ఈ 10 నిమిషాల సాధనలో మొదటి రెండు నిమిషాలను మన కళ్ళకు కేటాయించాలి. ఎందుకంటే స్క్రీన్ ముందు పని చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగించే అవయవాల్లో కళ్ళు చాలా ఇంపార్టెంట్. సాధారణంగా మనం ప్రతి నిమిషం అనేకసార్లు రెప్పలు కొడతాం.
(02:40) అలా రెప్పలు కొట్టిన ప్రతిసారి కళ్ళపై కన్నీటి పొర వ్యాపించి అవసరమైన తేమను అందిస్తుంది. కానీ మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ పై ఎక్కువసేపు దృష్టి పెట్టినప్పుడు రెప్పలు కొట్టే సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల కళ్ళు పొడిబారడం మంట అలసట వంటి సమస్యలు రావచ్చు. ఇలాంటి లక్షణాలు డిజిటల్ ఐస్ స్టైన్ లో భాగంగా కనిపిస్తాయి. అందుకే కంటి నిపుణులు 20 20 పద్ధతిని సూచిస్తారు అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకండ్ల పాటు చూడాలి అని ఇది కళ్ళకు చిన్న విరామం ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
(03:14) అయితే ఇప్పుడు మనం మన రెండు నిమిషాల ఐరీ సెట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదట 30 సెకండ్లు స్క్రీన్ నుంచి మీ దృష్టిని మరల్చి మీకు దూరంగా ఉన్న ఒక వస్తువుని అలానే చూడండి. చూస్తూ సహజంగానే మీ రెప్పలను కొట్టండి. తర్వాత 30 సెకండ్లు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. మరో 30 సెకండ్ల పాటు మీ రెండు అరచేతులను సున్నితంగా రుద్ది మీ కళ్ళపై ఎలాంటి ఒత్తిడి లేకుండా కప్పి ఉంచండి.
(03:39) అంటే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి అలా చేయండి. దీన్నే పామింగ్ అంటారు. ఇక చివరి 30 సెకండ్లు మీ చేతులను దించి నెమ్మదిగా కళ్ళు తెరిచి మళ్ళీ దూరంగా చూడండి. ఈ సాధన వల్ల కళ్ళకు స్క్రీన్ నుంచి విశ్రాంతి లభిస్తుంది. ఈ పామింగ్ కొందరికి హాయిగా కూడా అనిపించవచ్చు. అయితే ఈ సాధనతో పాటు పని మధ్యలో వీలైనప్పుడల్లా ఈ 2020 పద్ధతిని కూడా పాటించండి.
(04:05) రోజంతా స్క్రీన్ ముందు పనిచేసే మీ కళ్ళకు ఈ రెండు నిమిషాలు ఒక ప్రశాంతమైన విరామం. అయితే మన కళ్ళతో పాటు మన మెడ మన భుజాలు కూడా ఎక్కువ సేపు ఒకే స్థితిలో ఉంటాయి. అందుకే ఇప్పుడు తర్వాత రెండు నిమిషాలు బాడీ రీసెట్. మనిషి తల బరువు సాధారణంగా నాలుగు నుంచి 6 కిలోల వరకు ఉంటుంది. మనం కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు తలను ముందుకు వంచి ఎక్కువసేపు ఉంచితే మెడ కండరాలపై అదనపు భారం పడొచ్చు.
(04:32) అలాగే భుజాలను ఒకే స్థితిలో ఉంచడం వల్ల కండరాల్లో బిగుతు ఏర్పడుతుంది. ఇక్కడే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆరవ అధ్యాయం 13వ శ్లోకంలో సమం కాయ శిరోగ్రీవం అని శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు. అంటే ధ్యానం చేసేటప్పుడు శరీరం, తల, మెడను ఒకే సరళ రేఖలో స్థిరంగా ఉంచాలని ఈ శ్లోకం వివరిస్తుంది.
(04:57) అదే టైంలో ఆధునిక సైన్స్ ప్రకారం కంప్యూటర్ ముందు పని చేసేటప్పుడు సౌకర్యమైన భంగిమతో పాటు మధ్య మధ్యలో శరీరాన్ని కదిలించడం కూడా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు మన రెండు నిమిషాల బాడీ రీసెట్ ని ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదట 30 సెకండ్లు ఒక కుర్చీలో సౌకర్యంగా కూర్చోండి. వెన్నుకు సరైన ఆధారం ఉండేలా చూసుకోండి.
(05:19) తర్వాత 30 సెకండ్లు మీ భుజాలను నెమ్మదిగా పైకెత్తి వెనక్కి తిప్పుతూ కిందకి దించండి. ఇలా మూడు సార్లు చేయండి. మరో 30 సెకండ్లు తలను నెమ్మదిగా కుడి వైపుకి తర్వాత ఎడమ వైపుకి తిప్పండి. ఎలాంటి బలవంతం చేయకుండా జస్ట్ అలా ఫ్రీగా చేయండి అంతే. చివరి 30 సెకన్లు మీ మెడ, మీ భుజాలు, మీ వెన్నుముక ఎలా ఉన్నాయో అలా గమనించండి. వీలైతే లేచి కొద్దిగా అటు ఇటు కదలండి.
(05:46) ఈ రెండు నిమిషాల సాధన వల్ల ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉన్న కండరాలకు కదలిక లభిస్తుంది. అలాగే మన శరీరంలో కూడా ఎక్కడ బిగుతుందో గమనించే అవకాశం కూడా వస్తుంది. దీన్నే బాడీ అవేర్నెస్ అంటారు. ఇప్పుడు మన కళ్ళకు మన శరీరానికి విశ్రాంతి ఇచ్చాం. మరి మన శ్వాస సంగతి ఏంటి? ఇక్కడే మూడో దశ ప్రారంభం అవుతుంది. అదే బ్రీత్ రీసెట్ మీరు ఎప్పుడైనా కంప్యూటర్ ముందు చాలా ఏకాగ్రతతో పని చేస్తున్నప్పుడు మీ శ్వాసని గమనించారా ముఖ్యంగా కోడింగ్ చేస్తున్నప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ఇంపార్టెంట్ మెయిల్ చదువుతున్నప్పుడు కొందరు తెలియకుండానే శ్వాసని కొద్దిసేపు
(06:24) బిగపెడుతూ ఉంటారు. ఈ అలవాటును వివరించడానికి స్క్రీన్ ఆప్నియా అనే పదాన్ని ఉపయోగిస్తారు. అయితే ఇది అందరిలో కనిపించే లక్షణం కాదు అలా అని ఇదేదో ప్రత్యేకమైన వ్యాధి కూడా కాదు అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం శ్వాసపై అవగాహన మన ప్రాచీన యోగ సంప్రదాయంలో శ్వాసకి ప్రత్యేకమైన స్థానం ఉంది. పతంజలి యోగ సూత్రాల్లో రెండవ అధ్యాయం 49వ సూత్రంలో ప్రాణాయామాన్ని వివరించారు.
(06:50) అలాగే హటయోగ ప్రదీపిక లోని రెండవ అధ్యాయంలో శ్వాస సాధనకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ గ్రంథాలు శ్వాస సాధనకు యోగంలో ఉన్న స్థానాన్ని వివరిస్తాయి. ఆధునిక పరిశోధనల్లో కూడా నెమ్మదిగా సౌకర్యంగా చేసే శ్వాస సాధనలు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడవచ్చని గుర్తించారు. కాబట్టి ఇప్పుడు మన రెండు నిమిషాల బ్రీత్ రీసెట్ ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి.
(07:15) ముందుగా సౌకర్యంగా కూర్చోండి. మీ భుజాలను సడలించండి. ఇప్పుడు ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకుని వదలండి. ఒకటి రెండుమూడు నాలుగు ఐదుఆరు ఇలా మీకు సౌకర్యంగా ఉన్నంతవరకు ఈ శ్వాసని లోపలికి తీసుకుని బయటికి వదలడం అనే దాన్ని కొనసాగిస్తూనే ఉండండి. శ్వాసని బలవంతంగా ఆపకండి. అలాగని బలవంతంగా లోపలికి తీసుకోకండి. లెక్కపెట్టాలేమో అని లెక్క ప్రకారం శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే లెక్క పెట్టడం మానేసి సహజంగా వచ్చి వెళ్తున్న శ్వాసని అలా గమనించండి.
(07:52) ఈ రెండు నిమిషాల సాధనలో మన దృష్టి శ్వాసపై నిలుస్తుంది. ఈ నార్మల్ గా వచ్చి వెళ్తున్న శ్వాసని గమనించడం కొందరిలో శరీర విశ్రాంతి ప్రతిస్పందనకు సహాయపడవచ్చు. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన పని మధ్యలో ఇది ఒక ప్రశాంతమైన విరామంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుంచుకోండి. శ్వాసని గమనించడం అంటే కేవలం గాలి లోపలికి బయటికి వెళ్ళడాన్ని చూడడం మాత్రమే కాదు.
(08:15) మీరు ఈ ప్రక్రియను గనుక సరిగ్గా గమనిస్తే మీకు ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే ఈ శ్వాసని గమనించేటప్పుడు మన ఆలోచన మన దృష్టి ప్రతిదీ కూడా మన గతంలో లేదు మన భవిష్యత్తులో లేదు. మన ఆలోచన మన దృష్టి ప్రజెంట్ లోనే ఉంటుంది. ప్రజెంట్ లో దృష్టిని పెట్టడం అనేది ఎంత గొప్ప విషయమో తెలుసా దీని గురించి నేను మీకు ఒక సపరేట్ వీడియోలో చాలా క్లారిటీగా చెప్తాను.
(08:37) ఇప్పుడు మనం మొదటి ఆరు నిమిషాల సాధనను పూర్తి చేసుకుని చివరి నాలుగు నిమిషాల దగ్గరికి వచ్చేసాం. ఈ 10 నిమిషాల సాధనలో ధ్యానానికి ప్రత్యేకంగా కేటాయించిన భాగం ఇదే మైండ్ రీసెట్ మన ప్రాచీన యోగ సంప్రదాయంలో ధారణ ధ్యానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పతాంజలి యోగ సూత్రాల్లో మూడో అధ్యాయం మొదటి సూత్రం ఈ ధారణ గురించి రెండో సూత్రం ధ్యానం గురించి వివరిస్తాయి.
(09:02) ధారణ అంటే మన దృష్టిని ఒక అంశం పై నిలపడం. ఆ దృష్టిని నిరంతరంగా కొనసాగడాన్ని ధ్యానంగా వివరించారు. ఇప్పుడు ఈ సూత్రాన్ని మన ఆధునిక జీవితానికి అన్వయించుకుందాం. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఎగ్జాంపుల్ తీసుకోండి ఆ ఉద్యోగి ఉదయం నుంచి ఈమెయిల్స్ మీటింగ్స్ కోడింగ్ కొత్త సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం ఇలా రోజంతా ఎన్నో పనుల మధ్య తన దృష్టిని మార్చుకోవాల్సి వస్తుంది.
(09:28) అలాంటి టైంలో కొద్దిసేపు ఒకే అంశంపై దృష్టిని నిలపడం మనసుకు ప్రశాంతమైన విరామాన్ని ఇస్తుంది. అందుకే ఇప్పుడు మన చివరి నాలుగు నిమిషాల్లో ఈ మైండ్ రీసెట్ ఎలా చేయాలో చెప్తాను వినండి. మీరు ఒక కుర్చీలో ప్రశాంతంగా కూర్చోండి కూర్చున్నాక వెన్నుముక నిటారుగా ఉండాలి. మీ రెండు చేతులను దగ్గరికి కలిపించండి. ఎలాంటి ఒత్తిడి చేయొద్దు.
(09:50) జస్ట్ అలాగ ఫ్రీగా ఉంచండి. మీ శరీరం అంతా కూడా చాలా ఫ్రీగా ఉండనివ్వండి. ఇప్పుడు మెల్లిగా మీ కళ్ళు మూసుకొని మీ శ్వాసపై దృష్టిని పెట్టండి. సహజంగానే లోపలికి వచ్చి వెళ్తున్న ఆ శ్వాసను అలా మెల్లిగా గమనించండి. ఇప్పుడు మీకు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. సో వాటిని అలా గమనించండి. వాటిని పట్టించుకోవద్దు. పని గురించి ఇంటి గురించి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి.
(10:12) అది సహజమే వచ్చిన వాటిని అలా గమనించండి అంతే వాటిని బలవంతంగా ఆపడానికి అస్సలు ప్రయత్నించకండి. మీ దృష్టి గనుక శ్వాస నుంచి పక్కకు వెళితే మళ్ళీ శ్వాస పైకి తీసుకురండి. మెల్లిగా మీ ఫోకస్ మొత్తం శ్వాస మీద పెట్టండి. ఇలా చివరి నాలుగు నిమిషాలు పూర్తయ్యే వరకు అలా చేయండి. చివరి నిమిషం పూర్తయ్యాక నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచాక మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి.
(10:37) అంతే ఇప్పుడు మీరు తిరిగి మీ పనిని ప్రారంభించవచ్చు. ఈ నాలుగు నిమిషాల్లో మనం చేస్తున్న ప్రధాన సాధన అటెన్షన్ ట్రైనింగ్ అంటే మన దృష్టిని ఒక అంశపై నిలపడం దృష్టి పక్కకు వెళ్ళినప్పుడు తిరిగి తీసుకురావడం ఈ మైండ్ ఫుల్నెస్ ధ్యానంపై జరిగిన రీసెర్చ్ లో ఒత్తిడిని తగ్గించుకోవడం ఏకాగ్రతను మెరుగుపరుచుకోవడం వంటి ప్రయోజనాలను గుర్తించారు. అయితే ఈ ఫలితాలన్నీ ఒక్క రోజులోనే కనిపిస్తాయని అనుకోకూడదు.
(11:02) ఈ చిన్న సాధనను ప్రతిరోజు క్రమం తప్పకుండా కొనసాగిస్తూ ఉంటే కాలక్రమేణ మీ ఏకాగ్రతలో మానసిక ప్రశాంతతలో వచ్చే మంచి మార్పులను మీరే గమనిస్తారు. ఇప్పటివరకు నేను వివరించిన ఈ నాలుగు దశలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. మొదటి రెండు నిమిషాలు ఐ రీసెట్ తర్వాత రెండు నిమిషాలు బాడీ రీసెట్ మరో రెండు నిమిషాలు బ్రీత్ రీసెట్ చివరి నాలుగు నిమిషాలు మైండ్ రీసెట్ ఇవి నాలుగు వేరు వేరు సమయాల్లో చేయవలసిన పనులు కావు.
(11:30) రోజుకొకసారి 10 నిమిషాలు కేటాయించి వరుసగా చేసే ఒక సాధన ఇది. ఈ 10 నిమిషాల్లో మన కళ్ళకు విశ్రాంతి ఇస్తాం. శరీరాన్ని సడలిస్తాం. శ్వాసని గమనిస్తాం. చివరిగా ధ్యానం చేస్తాం. ఇలా చేయడం వల్ల స్క్రీన్ కారణంగా వచ్చే అలసట నుంచి ఉపసమనం పొందడానికి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. అందుకే ఈ పద్ధతిని స్క్రీన్ రీసెట్ మెడిటేషన్ అని పిలుస్తున్నాం.
(11:53) ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోండి. ఈ 10 నిమిషాల సాధనను రోజుక ఒకసారి మీ అనుకూలమైన టైంలో చేయవచ్చు. అలాగే పని మధ్యలో అవకాశం దొరికినప్పుడల్లా కళ్ళకు చిన్న విరామాలు ఇవ్వండి. ముఖ్యంగా కంటి ఆరోగ్యం కోసం ఈ 2020 పద్ధతిని కూడా పాటించండి. ఇక చివరిగా మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు టెక్నాలజీ మన జీవితంలో ఒక అద్భుతమైన భాగంగా మారింది.
(12:17) మనకు కొత్త జ్ఞానాన్ని అందిస్తుంది. మన పనిని సులభతరం చేస్తుంది. ప్రపంచంతో మనల్ని అనుసంధానిస్తుంది. అలాంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే మన ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం మనం నేర్చుకోవాలి. అందుకోసమే ప్రతిరోజు కేవలం 10 నిమిషాలు మీకోసం కేటాయించండి. అంతకన్నా ఎక్కువ సమయం మీకు ఉంటే మళ్ళీ చేయండి. ఇది ఇంకా ఉత్తమం. ఈ చిన్న సాధనను మీ రోజువారి జీవితంలో ఒక మంచి అలవాటుగా మార్చుకోండి.
(12:42) ఎందుకంటే మనం ఉపయోగించే టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో దాన్ని ఉపయోగించే మన ఆరోగ్యం అంతకన్నా ఇంపార్టెంట్. మరి మీరు ప్రతిరోజు ఎన్ని గంటల పాటు మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూస్తున్నారు కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మీరు భావిస్తే మీరు ఇప్పటి వరకు ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక లైక్ చేసి స్క్రీన్ ముందు పనిచేసే మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.
(13:07) ఇలాంటి ఆరోగ్యం ధ్యానం ఆధునిక జీవనశైలికి ఉపయోగపడే మరిన్ని విషయాల కోసం మన ఛానల్ ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ యూనివర్స్ హరే కృష్ణ.

No comments:

Post a Comment