Saturday, October 17, 2026

జీవితంలో దేన్నైనా ఇబ్బందులు పడకుండా నిర్వహించుకోవాలంటే ఉండవలసినవి | Managing Ability | Garikapati

జీవితంలో దేన్నైనా ఇబ్బందులు పడకుండా నిర్వహించుకోవాలంటే ఉండవలసినవి | Managing Ability | Garikapati

Author Name:Sri Garikipati Narasimha Rao Official

Youtube Channel Url:https://www.youtube.com/@Garikipati_Offl

Youtube Video URL:https://www.youtube.com/watch?v=H76snZNm6pY





Title: జీవితంలో దేన్నైనా ఇబ్బందులు పడకుండా నిర్వహించుకోవాలంటే ఉండవలసినవి | Managing Ability | Garikapati

Author Name: Sri Garikipati Narasimha Rao Official

Description: కాకినాడ ఐడియల్ కళాశాలలో అక్టోబర్ 12వ తేదీన జరిగిన కీ. శే. పి. చిరంజీవిని కుమారి గారి విగ్రహావిష్కరణ సందర్భంగా స్మారక సభలో "నిర్వహణ సామర్థ్యం" పై మహా సహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
#garikapati #management #managementprinciples #managing #garikapatinarasimharao #garikapatilatest
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 https://linktr.ee/srigarikipati

Subscribe & Follow us:
📱YouTube: http://bit.ly/2O978cx
📱Twitter: https://bit.ly/3ILZyPy
📱Facebook: http://bit.ly/2EVN8pH
📱Instagram: https://bit.ly/2XJgfHd
🌎 Official Website: https://srigarikipati.com/

Transcript:
(00:03) [సంగీతం] హరి ఓం హరి ఓం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 12వ తేదీ కాకినాడ ఐడియల్ కాలేజీ ఆదర్శ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న విద్యావేత్త సామాజిక సంస్కర్త ఉన్నత భావ ప్రణీత శ్రీమతి చిరంజీవిని కుమారి గారి విగ్రహావిష్కరణ సందర్భంగా జరుగుతున్న స్మారక సభలో నిర్వహణ సామర్థ్యం మేనేజింగ్ ఎబిలిటీ అనేది మనం శ్రీమతి చిరంజీవిని కుమారి గారి ద్వారా ఎలా
(00:49) నేర్చుకోగలం అనే అంశం మీద ప్రసంగానికి మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వందేమాతర గీతం వెలుబడి 150 ఏళ్ళ అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందేమాతర సంవత్సరంగా ప్రకటించింది. దేశభక్తి ప్రపూరితమైన నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ వందేమాతరం నినాదంతో ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేస్తున్నాం వందే మాతరం వందేమాతరం వందేమాతరం ఈ దేశం నాదనడం అది నిన్నటి మాట ఈ దేశం నాదనడం అది నిన్నటి మాట ఈ దేశం నేనడం అదే దేటి బాట
(01:39) ఈ దేశం నాదనడం అది నిన్నటి మాట ఈ దేశం నేనడం అదే నేటి మాట ఈ దేశం నాదనడం అది నిన్నటి మాట దేశంలో ప్రతి భాగం నీ తనువున ఒక భాగం దేశంలో ప్రతి భాగం నీ తనువున ఒక భాగం దేశీయుల ఆందోళన నీ గుండెలలో రోధన దేశీయుల ఆవేదన నీ గుండెలలో రోధన ఈ దేశం నాదనడం అది నిన్నటి మాట ఈ దేశం నేనడం అదే నేటి మాట
(02:32) ఈ దేశం నాదనడం అది నిన్నటి మాట అవినీతి అతివాపం నీ బలహీనత శాపం అవినీతి అతివాపం నీ బలహీనత శాపం అతివల అపహృతమానం నీకే అది అవమానం అతివల అపహృతమానం నీకే అది అవమానం ఈ దేశం నాదనడం అది నిన్నటి మాట మాట ఈ దేశం నేనడం అదే నేటి బాట ఈ దేశం నాదనడం అది నిన్నటి మాట దేశంలో ప్రతి భాష నీ గుండెలలో ఘోష దేశంలో
(03:24) ప్రతి భాష నీ గుండెలలో ఘోష దేశ ప్రజల మనోగతం నీ కృషికే స్వాగతం దేశ ప్రజల మనోగతం నీ కృషికే స్వాగతం ఈ దేశం నాదనడం అది నిన్నటి మాట ఈ దేశం నేనడం అదే నేటి మాట [పాడటం] ఈ దేశం నాదనడం అది నిన్నటి మాట ఇప్పుడు ఇప్పుడు YouTube లో మీరు బాగా చూసి ఉంటారు 1980స్ ట్రెండ్ అనే ఒకటి నడుస్తుంది.
(04:09) 1980 లో నేను ఎలా ఉన్నాను మా ఆవిడ ఎలా ఉంది పూర్వ జన్మలో ఆవిడ ఎలా ఉంది నేను ఎలా ఉన్నా అని నడుస్తుంది కదా నేను ఎప్పుడు ఆధునికమైన ట్రెండ్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటా మీ అందరి ఫోనుల్లో నేనే ఉన్నాను కానీ నా దగ్గర ఆ ఫోన్ లేదు నా దగ్గర ఉన్నది ఇది మీ అందరి ఫోనుల్లో నేనే ఉన్నా నా దగ్గర ఉన్నది ఇది కానీ నేను అత్యాధునికమైన ట్రెండ్స్ ఫాలో అవుతూ ఉంటా నేను కూడా ఒకసారి నా పాత రికార్డు జరిగేసా 1980స్ లో నేను రాసినవి ఏమన్నా ఉన్నాయా అని ఇది అప్పటి పాట నేను 1980 లో రాసిన పాట అప్పుడు నా వయసు నిండ 27 ఏళ్ళు లేదు ఇంకా కాకినాడ రాలేదు ఎక్కడో ఖనాపురం అని వరంగల్
(04:53) జిల్లాలో ఈ పాట ఎందుకోసం ఇప్పుడు పాడుతున్నాను అంటే కాకినాడలో నన్ను కలవడానికి నా మాటలు వినడానికి నన్ను ఆశీర్వదించడానికి పెద్దలు చాలామంది వస్తారు వారికి నేను పాదాభివందనం చేస్తున్నా కానీ కొన్ని వందల మంది విద్యార్థులు వేళ గరికిపాటి నరసింహరావు గొంతు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారిని నేను మనఃపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను చిరంజీవిని కుమారి విగ్రహం ఆవిష్కరణ చేసి ఇవాళ మనం ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఐడియల్ కాలేజీ నాది అనలేదు ఆవిడ ఐడియల్ కాలేజీయే నేను నేను అంటూ ప్రత్యేకంగా లేను అంది ఐడియల్ కాలేజీ నాది లేకతే నేనే ఐడియల్
(05:42) కాలేజీ అనలా నేనే ఐడియల్ కాలేజీ అంటే గర్వం ఐడియల్ కాలేజీే నేను అంటే అందులో నేను అయిపోయాను లీనమైపోయాను ఇక నేను ప్రత్యేకంగా లేను ఇక్కడ ఇది నిజమైన భావన అది దక్షిణ పక్షమా వామ పక్షమా ఉత్తర పక్షమా అన్ని పక్షాల్లోన ఉండేది భగవంతుడే వేదంలో చెబుతారు సపాత పురస్త దక్షిణతః సయేవత్తరతఃస స ఓర్ధవత్వా ఓర్ధ్వస్తత్సయేవా అదస్త సయేవేదగం సర్వం భావజాలానికి సంబంధించి ఏ పక్షమైనా అది భగవత్ పక్షమే పక్షం ఏదనేది సమస్య కాదు పక్షపాతం లేకుండా ఉండడం చాలా ముఖ్యం ఏ పక్షభావమైనా పర్వాలేదు పక్షపాతం ఉండదు ఆవిడకి అది లేదు
(06:27) ఏ కార్యక్రమం తలపెడితే అందులో లీనమైపోవడమే ఆవిడకి తెలుసు ఇది మనం తెలపెట్టాం తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో రాస్తున్నాం చరిత్రలో మనం ఒక భాగం ఈ రచనలో నా ముద్ర ఉండాలి అని ఆవిడ తాపత్రయ పడాల ఒక నటుడు ఒక పాత్ర నటించేటప్పుడు ఆ పాత్ర కనపడాలి నటుడు కనపడకూడదు ఆయన్ని మహానటుడు అంటారు అటువంటి మహానటుడు నా దృష్టిలో అక్కినేన్ నాగేశ్వరరావు గారు ఆయన ఏ పాత్ర నటించిన ఆయన కనపడ్డ ఆ పాత్రే కనపడుతుంది దేవదాసు అంటే దేవదాసే కనపడతాడు తుకారామ అంటే తుకారామే కనపడతాడు నిజానికి ఆయన నాస్తికుడు కానీ భక్తుల పాత్రలు అంతకంటే బాగా వేసినవాడు లేడు నటన అంటే పాత్ర కనపడాలి తాను కనపడకూడదు
(07:08) జీవితమేనా అంతే జీవితం కనపడాలి మనం కనపడాల్సిన అవసరం లేదు మనం ఎంత ప్రయత్నం చేసినా ఉండం ఇవాళ మనం కోట్లు పోసి కొందామ అన్న చిరంజీవిని కుమారి కాలి గోరు కూడా మనకు దొరకదండి సాధ్యం కాదది సాధ్యం కాదు అది ఆవిడ వెళ్ళిపోయారు ఆవిడ వెళ్ళిపోయారు చెడ్డవాడు చనిపోతే నేను మరణాన్ని గురించి చాలా స్పష్టంగా చెబుతాను మరణం జీవితం కంటే గొప్పది మరణం జీవితం కంటే గొప్పది ఖచ్చితంగా అందర అందరి జీవితాలు గొప్పవని మనం చెప్పలేం కానీ అందరి మరణాలు గొప్పవే చెడ్డవాడు మరణిస్తే లోకానికి మంచిది మంచివాడు మరణిస్తే వాడికే మంచిది మొత్తం మీద మరణాలు మంచివి ఏ మరణమైనా మంచిది బాగా
(07:49) కష్టపడినవాడు మంచివాడు మరణిస్తే వాడు మంచిది లోకం శనివాడికి వదిలిపోయిన సుఖంగా ఉన్నాడు ఇంక వాడిని అనేవాడు ఎవడు లేడు చెడ్డవాడు మరణిస్తే మనందరికీ ఎలాగో మంచిది మనం పండగ చేసుకుంటాం దీపావళి అదే కదా ఆవిడ మరణం ఆవిడక ఏం లోటు కాదు 94 సంవత్సరాలు బతికినంత కాలం ఆవిడ తండ్రి వారసత్వం నుంచి భర్త సంప్రదాయం నుంచి అన్నింటిని నేర్చుకొని ఎంత సేవ చేయాలో అంతా సేవ చేశారు అంతా నిష్కామంగానే చేశారు.
(08:18) ఆవిడక ఏమీ నష్టం లేదు ఆవిడ సంపూర్ణమైన జీవన సంతృప్తితో వెళ్ళిపోయి ఉంటాను నేను పెద్ద కుమారుని దగ్గర పెట్టుకు మాట్లాడుతున్నా నాకు ఆవిడతో అనుబంధం ఏమిటంటే నాకు కుమారుడు వయసులు తెలియని కదమే అమ్మ మీరు మాకు తల్లి అన్నాను నాకు చాలా కాలం తర్వాత అర్థమైంది వీరు వయసు నా వయసు ఒకటే ఏవండీ [నవ్వు] అందుకే నేను ఆవిడ కుమారుడిని నిస్సందేహంగా కుమారుడిని మా సహస్రవధానం చేయించినప్పుడే మా అమ్మగారు ఉన్నారు మీరు ఉన్నారు అమ్మ నాకేమిటి అన్నాను నాకు ఆవిడ వయసు ఏమిటో కుమారులు నాకు తెలియదు తర్వాత తెలిస్తే పెద్దకు కుమారుడు వయసు నాకు నా వయసు ఒకటే ఇప్పుడు అందుకని అలాగే భావన చేశం అదే ఐడెంటిటీ
(08:53) కోసం క్రైసిస్ అంటాం ఇవాళ చాలా మందికి అదే వచ్చింది YouTube లోనే దిక్కుమాలిన సంత గొట్టాంగోల ప్రపంచం వచ్చిన తర్వాత వచ్చింది ప్రతి బొడ్డోడు అన వెధవ నాకు గుర్తింపు కావాలంటాడు వాడు వెధవ వీడియో ఒకడు పెడతాడు తెల్లసారికి లైకులు ఎన్ని డిజలైకులు ఎన్ని వీడి తలకాయ ఎన్ని అని లెక్కెడుతూ ఉంటాడు. వీడు పెట్టిన వీడియోకి లైకులు రావాలి మళ్ళీ ఇక్కడ వీడికి అప్పుడే గుర్తింపు కావాలి మరి 94 ఏళ్ళు ఎంతో కృషి చేసింది వారి తండ్రి గారు చేశారు వారి భర్తగారు చేశారు స్వాతంత్ర సమరోధులుగా ఆ కుటుంబం మొత్తం నుంచి గుర్తింపు ఎక్కడ ఎవరు కోరిన వారు కనబడలే నిన్న కూడా మా
(09:24) శ్రీమతి నేను వారింటికి రాత్రి అల్పహారానికి పడితే మా శ్రీమతి నాతో మాట్లాడిన మాట ఏమిటంటే ఆ ఇల్లు అలాగే ఉంది ఏమిటండి అపార్ట్మెంట్ కట్టడానికి అమ్మయ్య లేదా అని అడిగింది. [నవ్వు] కాకినాడ సెంటర్లో అక్కడ వారి ఇల్లు ఉన్నచోట ఇవేళ ఎంతండి ఖరీదు అది అమ్మేస్తే ఎన్ని కోట్లు వస్తాయండి కానీ ఆ ఇల్లు చూసాక మాకు అనిపించింది అప్పుడు ఆవిడ ఉన్నప్పుడు వాళ్ళ ఆయన ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది కాస్త ఏమనా నీళ్ల గదులు లాంటివి ఏమనా కొద్దిగా మార్చారేమో ఇంకేం మార్చలేదు అక్కడ అలాగే ఉంది ఆ ఇంట్లోకి నేను ఇక్కడ ఉన్న 18 ఏళ్ల కాలం ఉన్నాను నేను 93 నుంచి
(09:57) 2011 వరకు 18 ఏళ్ళు చాలాసార్లు వెళ్ళాను ఆవిడని దర్శించడానికి ఆవిడ ఆజ్ఞ మేరకు వెళ్ళాను కూడాను రమ్మంటే వెళ్ళాలి నేను కుమార ప్రాయుడిని వెళ్ళాను నేను అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది. అది నిజమైన ఆదర్శం అందుకు ఆ కుమారులు ఇద్దరిని నేను ప్రత్యేకంగా వేదిక మీద అభినందిస్తూ ఉన్నాను ఆ ఇంటిని అలాగే ఉంచారు అలాగే ఉంచారు వేరే మ్యూజియం అక్కలేదు ఆ ఇల్లు చాలు ఆవిడ నడిచిన ప్రదేశం పడుకున్న ప్రదేశం ఆవిడ పుస్తకాల కదా ఆవిడ చదివిన పుస్తకాలు ఆవిడ బాధ ముద్రలు ఆ ఇంటి నిండా ఉన్నాయి ఆ కుమారులకి వారి సతీమణలకి వారి మనవలకి మనవరాలకి అందరికీ నేను నమస్కారం
(10:30) చేస్తున్నాను చిన్న పిల్లలని ఆశీర్వదిస్తున్నాను కుటుంబం అంటే అది ఐడియల్ కాలేజీ కాదు ఐడియల్ ఫ్యామిలీ ఆల్సో ఆవిడలో మనం గమనించాల్సిన విశేషం నేను ఈ అంశానికి నిర్వహణ సామర్థ్యం మేనేజింగ్ ఎబిలిటీ అని ఎందుకు పెడుతున్నాను అంటే ఇవాళ ఒక చిన్న పని తలపెడితే ఆ పని ఇంకా నెలాల తర్వాత చేయవలసి ఉండగానే నెలకి ముందే ఈయనకి తలపెట్టిన వాడికి 102 డిగ్రీల జ్వరం వచ్చేస్తుంది ఎలా అవుతుంది ఎలా అవుతుంది ఎలా అవుతుంది ఏదో ఒకటి అవుతుంది అనే ధోరణ లేదండి ఏదో పెద్ద జనక మహారాజు సీతారామ కళ్యాణ తలపెట్టి కంగారు పడిపోలేదు కానీ మనం కంగారు పడిపోతాం ఇక్కడ
(11:06) అంతంత టెన్షన్ ప్రతిదానికి ఏమవుతుందో ఏమవుతుందో ఎలా అవుతుందో ఇదంతా ఎందుకు వస్తుంది అంటే యోగవాశిష్టం లాంటి వేదాంత గ్రంథాల్లో చెబుతారు నేను చేస్తున్నాను అనే భావన వల్ల వస్తుందండి ఒక పని గురించిన ఒత్తిడి మన మీద ఉండి మనకి ఆందోళన ఎందుకు వస్తుంది అంటే నేను చేస్తున్నాను అనేసరికి మనకి ఏమవుతుంది వెంటనే ఇది ఎలా ఉండాలి ఇది నేను చేసినట్టుగా ఉండాలి ఇందులో నా ముద్ర ఉండాలి కచ్చితంగా చేసిన తర్వాత తర్వాత కాకినాడలో చిరకాలం నా పేరు చెప్పుకోవాలి ఇక్కడ ఆయన చేశరండి ఇంకెవరు చేయాలి ఆయన ఇందుకోసం మనం ప్రారంభిస్తాం దీన్ని కుళ్ళు బుద్ధి అంటారు కచ్చితంగా పచ్చి భాషలో
(11:39) దీన్ని కుళ్ళు బుద్ధి అంటారు. ఇందులో నా ముద్ర ఉండాలి ఇది నేను చేశ నా పేరు చెప్పుకోవాలిఅంటున్నావు కాబట్టే నీకు ఆందోళన వచ్చింది. చిరంజీవిని కుమార్ గారు మా సహస్రవధానం చేయించిన రోజుల్లో 1996 మే 15వ తేదీన మండు టెండల్లో పొద్దున్న 10 గంటలకి మొదలైతే అవధానం జూన్ 20 జూన్ఐదవ తేదీ నేను అర్ధరాత్రి 1టి గంటకి 750వ పద్యం అప్పగించి అప్పుడు వేదిక దిగి సన్మాన సభకు కూర్చునే వరకు 22 రోజుల పాటు నిరాఘాటంగా జరిగింది జరిగింది అంటే చిరంజీవిని కుమార్ గారి సంకల్ప బలం చిరంజీవిని కుమార్ గారి సంకల్ప బలం కార్యదీక్ష అందువల్ల నేను కుమారులు ఇద్దరూ నాకు ఫోన్
(12:19) చేయగానే ఈ కార్యక్రమానికి రావడం నాకు బాకీ అండి మీరు నాకు చెప్పక్కలేదు డేట్ చెప్పండి అంతే నేను వస్తాను అని చెప్పి ఇది బాకీ అండి నేను నేను రుణం తీర్చుకోవాలి కదా అన్నాను నేను రుణం తీర్చుకోవాలి కదా ఆవేళ ఆవిడ జయించిన ఐడియల్ కాలేజీ ఆదర్శ అధ్యాపకులు అందరి యొక్క ఔదార్యం వల్ల వారు పల్లకీ మోయడం వల్ల నిజానికి నన్ను కూర్చోబెట్టి పల్లకీ మోయకపోవచ్చు కానీ తర్వాత మద్రాస్ ఐఐటీలో నన్ను పల్లకీలో మోయడానికి ఈ వచ్చిన గురువందనం చేసి హైదరాబాద్‌లో మా దంపతులుద్దరిని పల్లకీలో కూర్చోబెట్టి మొయడానికి కారణం ఎవరంటే ఇక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరికీ ఆదర్శ
(12:51) అధ్యాపకులందరికీ నేను నమస్కారం చేస్తున్నా మీరు మోసరా పల్లకి మీరు మోసాారా పల్లకి ఒక ఏఎస్ఆర్ మోసాడు ఒక బిఎస్ఎస్ మోసాడు ఒక కాశీపట్ల వారు ముహూర్త బలం పెట్టారు ఎన్ని ఎంతమంది పూనుకుంటే అయింది సహస్రవధానం ఈ ఒక్క జీవుడు చేస్తే అయింది అది కేవలం పద్యాలు చెప్పడం అప్పగించడం అంటే నేను చేసి ఉండొచ్చు కానీ ఎన్ని ఉన్నాయండి ఎన్ని ఉన్నాయి నువ్వు చేయగలవయ్యా రావయ్యా నేను ముహూర్తం పెడుతున్నా అని కాశీపట్ల సత్యనాయణ గారు ముహూర్తం పెట్టారు రెండు నెలల క్రితం మార్చి నెలలో ఆ మహానుభావుడు ఉపాసనాపరుడు యొక్క సంకల్ప బలం వల్ల అవధానం పూర్తఅయింది.
(13:22) ఆయన పాత్ర ఐడియల్ కాలేజీలో ఏమిటో అందరికీ తెలుసు వీరందరి సంకల్ప బలం వీరందరి ఉంటే దానికి కారణం మూలమైంది చిరంజీవిని కుమార్ గారి యొక్క కార్య నిర్వహణ దీక్ష మొత్తం 22 రోజుల్లో కూడా ఆవిడ ఏదో సమయంలో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వచ్చి దర్శించేవారు సూర్యకళా మందిరంలో జరుగుతున్న అవధానాన్ని నేను వచ్చినప్పుడల్లా మా అమ్మగారు ఎదురుగా ఉన్నారు 21 రోజులు మా ఎదురుగానే ఉన్నారు.
(13:47) ఆవన్నీ చూసేవాడిని ఈవడిని చూసేవాడిని మా అమ్మగారిలో ఒక ఆందోళన కనపడేది ఎందుకంటే నేను ఎలా చేస్తానో ఏమిటో ఎవడు చేయంది ఇవడు ఒప్పేసుకున్నాడు 750 పద్యాలువ6 సహస్ర అవధానం అంటే అవధానాలు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతిది అవధానం కాదు ఏ అవధానం జరిగినా సరే 75 శాతం పద్యాలు చివరిలో ఏకదాటిగా అప్పగిస్తేనే దాన్ని అవధానం అంటారు లేకోతే పనికిమాలిన ప్రక్రియ అంటారు ఊరికే బిరుదులు పెట్టుకుంటే కుదరదు ఇక్కడ నువ్వు శతావధానం చేసావ అంటే 75 పద్యాలు అప్పగించి తెరాలి ఐదు పాతిక ఎందుకక్క అవి ఆశువులు అప్పటికప్పుడు చెబుతారు పద్యం
(14:20) దాన్ని అప్పగించక్క అవి పోను 75% ఆ సహస్రావధానం అంటే 750 పద్యాలు అప్పగించాలి అలా చేస్తేనే అది సహస్రావధానం అవి ఆ చేసినప్పుడు ఆ 22 రోజులు ఆవిడ తిరుగుతుంటే నేను చూశాను మన ఇంట్లో వంట చేస్తుంటే ఒళ్ళంతా చెమట పట్టేస్తుందండి ఆడ మొగ ఎవరున్నా వంట బ్రాహ్మణుడు అయితే ఇంకా చెప్పక్కల అందుకని వాళ్ళు ప్రత్యేకమైన వస్త్రధారణ కూడా చేస్తారు చెమట పెట్టిన మాసిపోయినా ఇబ్బంది లేకుండా ఆవిడ ఎప్పుడు శుభ్రమైనటువంటి భారతమాత కట్టినటువంటి పవిత్రమైన చీర కట్టి మా సహస్రవధానానికి వచ్చేవారు ఎప్పుడు వచ్చినా చీర అంచు నలగడం కూడా నేను చూడలేదు అసలు ఎక్కడ ఏ మాలిన్యం
(14:57) అంటడం కాాన ఆవిడలో తొట్రుపాటు గాన అడుగులో తడబాటు గాని నేను చూడలేదు మొత్తం వేదిక అంతా అలా తిరిగి వెళ్లి నన్ను ఒక్కడిని పలకరించేవారు కాదు అక్కడ అవధాన వేదిక మీద ఉన్నాను కాబట్టి ఇబ్బంది పెట్టద్దు కాశీభాట్ల వారిని అక్కడఉన్న కార్యకర్తలని అందరిని ముఖ్యంగా ఈ సమయంలో నేను స్మరించుకోవలసిన మహా వ్యక్తి నాకు అత్యంత ఆప్తి ఆత్మీయుడు మిత్రుడుకి ఆడియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మహానుభావుడు సివిఎస్ గారు సివిఎస్ గారు ఆయన్ని నేను తలుచుకొని తీరాలి నిజంగా ఆయన కార్య నిర్వాహక సంఘం అధ్యక్షుడిగా ఉండి ఏకధాటిగా నడిపించారు మొత్తవాటికి తర్వాత అచచిర
(15:28) కాలానికి ఆయన స్వర్గస్తుడు అయ్యాడు పాపం మహానుభావుడు ఎంత నిర్వహణ సామర్థ్యం అంతా చూపించాడు ఆయన్ని కలిసాను ఏం సివియస్ అంత బాగుందా అంత బాగుంది ఏమైనా కావాలా ఏమైనా కావాలా డబ్బు ఏమిటి వ్యవహారాలు ఏమిటి భోజనాలు నడుస్తున్నాయా ఇది అడిగేసి వెళ్ళిపోయేవారు నేను చూసినప్పుడు అప్పుడు నేను 96 లో ఆవిడని గురించి చెప్పిన పద్యం నాకు ఇప్పుడు గుర్తొస్తుందండి ఏ విధి ఈ విధి ఎంత కష్టమని ఎన్నడూ పలికిన జడ లేదు ఈ విధి ఎంత కష్టమని ఎన్నడూ పలికిన జడలేదు తానే విధి అయిన చీరకొస ఇంతయు నల్గక చేయగలుగు తానే విధియైన చీరకొస ఇంతయు నల్గక చేయగలుగు సేవావధి ఆమెన్
(16:13) తానే విధియైన చీరకొస ఇంతయు నల్గక చేయగలుగు సేవావధి ఆమె ఈ క్రతువు పట్టుదల నడిపించే ఈ క్రతువు పట్టుదల నడిపించెను ఆ చిరంజీవినికేను మ్రొక్కెదను ఈ విధి ఎంత కష్టమని ఎన్నడు పలికిన జాడ లేదు తానే విధి చీర కొస ఇంతయు నల్గక చేయగలుగు సేవావధి ఆమె ఈ క్రతువు పట్టుదలన్ నడిపించెను ఆ చిరంజీవినికేను
(16:59) మ్రొక్కెదను స్త్రీజనులన్ తలలోని నాల్కకున్ స్త్రీజనులన్ తలలోని నాల్కకున్ తలలోని నాల్క ఆరు 600 700 మందిగా కనబడుతున్న విద్యార్థిని విద్యార్థులు ఐడియల్ కాలేజీ డిగ్రీ విద్యార్థిని విద్యార్థులు ఇంజనీరింగ్ వారు పీజీ వారు అందరూ గమనించండి జీవితంలో ఎలా ఉండాలో తలలోని నాల్క తెలుగులో ఒక ఇడియం ఇడియమ్స్ ఎంత బాగుంటాయి అంటే అన్నంలో ఒడియమ్స్ అంత బాగుంటాయి ఎంత అన్నం పెట్టిన ఒడియాలు అప్పడాలు లేకపోతే అది అనగా ఒడియాలు ఎంత ఉంటాయో ఇంతే ఉంటాయి కానీ బాగుంటాయి పప్పు ఏం బాగుంటుంది వడియాలు లేకపోతే ఒడియా ఉంటేనే పప్పు బాగుంటాయి ఒడియాలు చిన్న చిన్నవిగా ఉంటాయి తెలుగు
(17:43) ఇడియమ్స్ కూడా ఒడియంస్ చిన్న చిన్నవిగా ఉంటాయి కానీ జీవితాన్ని శాసిస్తే మనకివి శ్వాసిస్తాయి తలలోనే నాలుక ఇవాళ ఉద్యోగాల్లో చాలా మంది టెన్షన్ పడుతున్నారు. మా బాస్ సాయంత్రం మీటింగ్ పెట్టాడండి ఏం చెప్పాలో తెలియట్లే అంత కంగారు ఎందుకయ్యా నీ సమాధానం ఇవ్వలేక గుండె పోట వచ్చి వాడు పోవాలి నువ్వు ఎందుకు బాధపడతావ్ నేను ఇక్కడ చైతన్య కాలేజీలో పని చేసే రోజుల్లో సాయంత్రం ఒకసారి మాకు నాలుగు టు ఐదు ఇచ్చేవారు క్లాస్ ఎందుకంటే తెలుగు మాస్టర్లు అంటే అది కదా సాయంత్రం ఉంటే ఉంటారు పోతే పోతారులే అని పొద్దున్నే ఇవ్వరు క్లాస్ పొద్దున్న మథమెటిక్స్
(18:13) వారికి ఫిజిక్స్ వారికి అందరికీ ఇస్తారు మాకేమో చివర పెట్టేస్తారు ఎందుకంటే ఉన్నవాళ్ళు ఉంటారులే మా సామర్థ్యం అంతా ఉపయోగించి వాళ్ళని ఉంచేవాళ్ళం ఓరోజు నేను పాఠం చెబుతుంటే మబ్బులు కమ్మాయి సాయంత్రం ఆ పావు తక్కువ ఐదుకి వర్షం వచ్చేలా ఉంది పిల్లలేమో వర్షం వస్తుంది అప్పుడు వర్షం మొదలైింది వర్షంలో వెళ్ళలేమంటే కూర్చోండి అని చెప్పి నేను అన్నాను నువ్వు అమ్మాయి ఓ పాట పాడవే అన్నాను [నవ్వు] నాకు భయంఅండి నీ పాట వినడానికి మేము భయపడాలి కానీ నువ్వు ఎందుకు భయపడుతున్నావ్ అన్నాను నిస్సందేహంగా పాడేయవమ్మా ఉండేవాడు ఉంటాడు పోయేవాడు పోతాడు వర్షంలో కూడా
(18:46) భయపడకుండా పారిపోయాడు అంటే నీ పాట ఏమిటో నీకు బాగా తెలుస్తుంది. లేదు ఉన్నాడు అంటే ఉన్నాడు కాబట్టి సంతోషించు పాడే వినేవాడు భయపడాలి నీకే అలాగే ఉద్యోగాల్లో అంత భయపడిపోయి ఏమైపోతుందో ఏమైపోతుంది తలలోని నాలుక ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మీ ఉద్యోగాలన్నీ హాయిగా ఉంటాయి నాలుక ఉందండి తలలో అది ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అప్పుడు మొదలుపెట్టి అరగ 20 నిమిషాలు దాటింది పావుగంట దాటింది ఇక్కడి నుంచి మొదలవుతుంది ఈ నాలుక పళ్లను తాకుతోంది వెనక్కి వస్తుంది పళ్ళను తాకుతుంది వెనక్కి వస్తుంది పోనీ ఆ పళ్ళు ఏమైనా అట్టి పళ్ళా జాం పళ్ళ కోరపళ్ళు కోసపళ్ళు ముక్కపళ్ళు
(19:22) మూతి పళ్ళు అన్ని రంపాలు బ్లేళ్లే ఇన్ని రంపాలు బ్రేళ్ల మధ్యలో నరం లేని నాలుక వెన్నపూసకి ఎర్ర రంగ వేస్తే నాలుక అంతే కదా వెన్నపూసకి ఎర్రంగ వేస్తే నాలిక అంత సున్నితమైన నాలిక మాటిమాటికి ప్రతి పంటిని తాకుతోంది వెనక్కి వస్తుంది తాకుతోంది వెనక్కి వస్తుంది తాకుతోంది వెనక్కి వస్తుంది అలా తాకి వెనక్కి రాగలిగితే నీ సంసార జీవితం నీ ఉద్యోగ జీవితం అన్ని హాయిగా ఉంటాయి అన్ని హాయిగా ఉంటాయి అది తలలో నాలక అది గుర్తు పెట్టుకోండి మీరు చదువులు మీ ఉద్యోగాలు అన్నీ బాగుం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండ ఎక్కువ మాట్లాడొద్దు ఎక్కువ పని చేయొద్దు ఎక్కువ ఆలోచించొద్దు ముందు
(19:55) అసలు ఒక క్రికెట్ మ్యాచ్ వన్ డే మ్యాచ్ పూర్తి అవ్వాలంటే 50 ఓవర్లు ఉండాలమ్మ కానీ జీవితం అనే మ్యాచ్ నాశనం కావాలంటే మూడు ఓవర్లు చాలు ఓవర్ టాకింగ్ ఓవర్ యక్టింగ్ అండ్ ఓవర్ థింకింగ్ ఈ మూడు ఓవర్లు చాలు ఇంకేమ 50 ఓవర్లు అవసరంలే మూడు ఓవర్లు చాలు ఓవర్ టాకింగ్ ఓవర్ యక్టింగ్ ఓవర్ థింకింగ్ అనవసర పనులే నెత్తి మీద వేసుకోవడానికి ఓవర్ యక్షన్ అంట లేకోతే చేసిన పని ఊహ ఇంకా ఊహ ఎవరు చేయనట్టుగా తెలుగులో ఒక శాపత ఉంది ఎగురు ఎగిరఎగిరి దంచిన అంతే కూలి ఎగరకుండా దంచిన అంతే కూలి అని ఉంది ఎందుకని ముగ్గురు ఆడవాళ్ళు రోట్లో ఏదో పోసి దంచుతున్నారట ఇంతట్లో యజమానురాలు వచ్చింది
(20:32) ఎలా దంచుతున్నారో చూద్దాం ఒకవిడ హ అని ఎగిరి ఎగిరి ఆయాసపడు అంటే ఆవిడ ముందు ప్రదర్శన చాలా మంది చాలా చోట్ల ఇలాగే ఉంటారు అసలు యజమానులు వచ్చినప్పుడు ప్రదర్శనం చేస్తారు ఆవి వెళ్ళిపోక నోరు మూసు కూర్చుంటారు ఈ నాటకాలన్నీ ఆవిడకి తెలుసు అందుకే బాగా నడిపించింది అన్ని కార్యక్రమం అది అందుకని పక్క ఆవిడ దంచ దంచే ఆవిడ నువ్వు ఎగిరగిరి దంచిన అదే కూలి ఎగరకున్నా అంతే ఎక్కువ కూలి ఎగరకుండా దంచు నోరు మూసుకుని ఎగిరితే నీకు ఆయాసం తప్పితే అన్న డబ్బులుఏమ ఎక్కువ వేయరు దీన్నే ఓవర్యక్షన్ అంటారు యజమానుని ఆకట్టుకోవడం కోసం ఓవర్ యక్షన్ చేయాల్సిన పని లేదండి మన పనిఏదో
(21:02) మనం చేస్తాం ఓవర్ దేనికి అసలు చేసేదే ఎక్కువ ఓవర్ టాకింగ్ కొంతమంది పని చేయరు మాట్లాడుతూ కూర్చుంటారు ఇక్కడ రేపు ఆ పని అయిపోయి ఇంక తనకంటే ఎవడు చేయనట్టు గొప్పగా చెబుతూ ఉంటాడు అక్కడ ఆ మాట ఇతరులు చెప్పాలి మనమే చెప్తా దీన్నే ఓవర్ టాకింగ్ అంటారు ఏ మొక్కకి ఎంత సమాధానం చెప్పాలో అంత సమాధానం చెప్పి ఆపేయాలి చాట భారతం కింద సాక తీస్తే వినేవాడికి ఒళ్ళు మండిపోతుంది.
(21:24) ఇంకోటి ఓవర్ థింకింగ్ ఇవాళ అనేక రకాల వ్యాధులకు కారణం అవుతున్నది ఇదేనమ్మా యువతరం జాగ్రత్త పడాలి పాతికేళ్ల వాడే గుండెపోటు ఏమిటమ్మా నా కొడుకు మిత్రుడు ఒకతనికి 24 ఏళ్ల వాడు రాత్రి పడుకున్నవాడు పొద్దున్నే లేవలేదండి 24 ఏళ్ళు ఉన్నాయి ఏవో అతని ఇబ్బందులు అతనికి ఉన్నాయి తల్లితోన తండ్రితో ఏదైనా మానసిక ఆందోళనే కదా ఎందుకు వస్తుందండి అంత ఆందోళన ఎవరి కారణమేనా ఇవేళ మనం నేర్చుకోవచ్చు ఓవర్ థింకింగ్ ఉండొద్దు నిజమే సమస్య నీకు ఉంది దాన్ని పరిష్కరించవలసిన సందర్భం వచ్చినప్పుడు ఆలోచించు అత్తమానం ఎందుకు ఆలోచిస్తున్నావు మాకు అవధానాల్లో సహస్ర అవధానంలో 250
(22:00) సమస్యలు ఉంటాయి 250 దత్తపదులు ఉంటాయి 250 వర్ణనలు ఉంటాయి 250 ఆశువులు ఉంటాయి ఆశువులు పోన మిగిలిన 3ఇ 250 750 పద్యాలు అప్పగించవలసిందే అందులో తేడా ఏమ ఉండదు ఇంకా ఏది వదలడానికి వీలులేదు అన్ని అప్పగించవలసిందే మరి మేము దేనికి అంత కంగారుపడిపోయింటే 250 సమస్యలు ఎలా ఎదుర్కుంటామఅండి పోనీ సమస్యలు ఏమనా మామూలునా జోస్నాక కారం అని ఇస్తాడు ఆయన యోచనాకారం అంటే త కింద సావత్తు దాని కింద నా వత్తు నాలుగు వత్తులు ఉన్నాయి అక్కడ ముందు పదాలు ఎలా దొరకాలి తెలుగు పద్యంలో ప్రాస అంటే నాలుగు అక్షరాలు అదే ఉండాలి మొదటి పాదం రెండో పాదం ఎక్కడి నుంచి
(22:34) వస్తాయి కృష్ణంబైన అని పద్యం మొదలెడతాం రెండోది ఎక్కడ వస్తుంది మూడోది ఎక్కడ వస్తుంది మూడోది ఎప్పుడు వస్తుందో నాలుగోది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆలోచించాలండి నాలుగో రౌండ్ వచ్చినప్పుడు అవధానాల్లో సౌకర్యం అది అసౌకర్యంతో పాటుగా సౌకర్యం ఏంటంటే నాలుగో రౌండ్ వచ్చేవరకు నాలుగో పాదం నువ్వు ఆలోచించక్కర్ల ఇప్పటి నుంచి ఎందుకు ఆలోచిస్తావు జీవితంలో కూడా సమస్యలు ఎంతనండి దాని సందర్భం వచ్చినప్పుడు ఆలోచించండి 10 నిమిషాలు ఆలోచించినా 10 సంవత్సరాలు ఆలోచించినా ఒకటే పరిష్కారం అమ్మ ఆ పరిష్కారం జరగడం మనకి ఇష్టం లేక అది మనం ఇష్టం వచ్చినట్టు
(23:05) జరగాలని ఆలోచిస్తాం తప్పితే ఏం జరిగితే అది అనుభవించడానికి సిద్ధంగా ఉంటే ఏ సమస్య సమస్యే కాదు జీవితం అంతా ఆనందంగానే ఉంటుంది ఆనందంగానే ఉంటుంది కచ్చితంగా మనం ఎందుకు ఆందోళన చెందుతామ అంటే ఈ పెళ్లి జరగాలి కానీ నేను అనుకున్నట్టు జరగాలి నువ్వు అనుకున్నట్టు ఎలా జరుగుతున్నాయి పెళ్లి కొడుకు వేరే పెళ్లి కూతురు వేరే రెండు వారు మూసుకొని ఒక చోట కూర్చో నువ్వు అనుకున్నట్టు ఎలా జరుగుతుంది రుక్మిణి కళ్యాణమే జరగలేదు వాళ్ళు అనుకున్నట్టుగా ఎవరినో పెళ్లి నిశ్చయించారు శుభలేక వేశారు ఇంకెవరితోనో పెళ్లి అయింది దాన్ని పెద్ద గ్రంథం కింద పటనం చేసి మన పెళ్ళళ్లు అవుతాయి అని
(23:34) అనుకుంటున్నాం ఇవాళ రుక్మిణి కళ్యాణం జరగలేదు అనుకున్నట్టుగా నీ కల్యాణం అయిపోతుంది ఇక్కడ మనం అనుకున్నట్టు జరగాలి అనుకోవడం వల్ల ఆందోళనలు వస్తుందండి ఎలా జరిగినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా అంటే ఏ పనైనా పర్వాలేదండి అదే మేము సమస్యలని అందుకే ఎదుర్కోగల దానికి ఏదో పరిష్కారం లేకుండా పృచ్చు ఇవ్వరు కదా పరిష్కారం లేకుండా వారు ఇవ్వరు కదా ఉంది ఉన్నప్పుడు మనం ఆలోచిద్దాం తోచింది చెబుదాం లేకపోతే మర్నాడు తెలుస్తుంది కంగారు ఏమిటి ఇది చేయకుండా ఉంటే ఓవర్ థింకింగ్ ఈ ఓవర్ థింకింగ్ ఓవర్ యక్టింగ్ ఓవర్ టాకింగ్ మూడు లేకపోవడం వల్లే చిరంజీవిని కుమార్ గారు గొప్ప
(24:07) నాయకురాలు కాగలిగారు గొప్ప నిర్వహణ సామర్థ్యం కలిగిన వ్యక్తి కాగలిగారు అందుకే నాయనా ఆవిడ మీద ఆ 96లో లేన పద్యం ఏమిటంటే ఈ విధి ఎంత కష్టమని ఎన్నడూ పలికిన జాడ లేదు ఇదండి ఇది ఎంత కష్టం జిల్లా చరిత్ర మొత్తం రాయడమా ఎన్ని సేకరించాలమ్మో ఆలోచించండి విద్యార్థిని విద్యార్థుల ఒక జిల్లా చరిత్ర రాయడం నీ చరిత్ర నువ్వు ఆత్మగతిగా రాయమంటే నీకే సగం గుర్తుండవు ఇక్కడ మొత్తం తూర్పు గోదావరి జిల్లా చరిత్ర అంతా సేకరించి రాయడం దానికి రచయితలను సేకరించడం వారికి ఏవో చెప్పడం సూచనలు ఇవ్వడం అవన్నీ ప్రోది పెట్టడం ఎంత కష్టం ఇది సాహిత్య చరిత్ర తూర్పు గోదావరి
(24:41) జిల్లా సాహిత్య చరిత్ర రాశారు ఆవిడ అందులో మా అవధానం లేకపోతే ఎలాగని నా బొమ్మని ముఖ చిత్రంలో వేశరండి ప్రత్యేకంగా నా జన్మ ధన్యమైందండి నిజంగా జన్మ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు పక్కన నా మొబై వేశారు అంతకంటే అదృష్టం ఏమిటి జీవితంలో [నవ్వు] మా గరికిపాటి వారు మా దగ్గర చేశారు ఈ అవధాన చరిత్రలో ఇది లేకపోతే ఎలాగ అని ఒక వ్యాసం అవధాన చేత రాయించి ఆ ముఖ చిత్రంలో కృష్ణ శాస్త్రి గారి పక్కన నా బొమ్మ వేస్తే నేను ఇప్పటికి చూసుకొని ఆనందిస్తూ ఉంటాను దాన్ని ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకున్నా జిల్లా చరిత్రలో నా బొమ్మ ఉందిరా చాల్లే ఇంకేమ అక్కర్లేదు
(25:12) అందుకని జిల్లా చరిత్ర అనగానే వణకిపోయి సాహిత్య చరిత్ర అనగానే వణకిపోయి ఐడియల్ కాలేజీకి ఎయిడ్ తీసేస్తాట అనగానే వణకిపోయి 14 ఎకరాలు ఆవరణ సేకరించడం ఎలాగా అనగానే వణకిపోయి రేపు పొద్దున కాలేజీ నడపడం ఎలాగా అని గుర్తురాగానే వణకిపోతే చిరంజీవిని కుమారి గారి గురించి ఇవాళ మాట్లాడుకోవలసిన అవసరం లేదండి ఆవిడ దేనికి వణక లేదు తుణక లేదు బెనక లేదు నిశ్చలంగా నిర్భయంగా నిర్ద్వందంగా నిలబడగలిగిన నాయకురాలు చిరంజీవిని కుమారి అందుకే నేను ఆవిడ రుణం ఎలా తీర్చుకోవాలో ఆ మాట ఆవిడకి ఇవాళ విగ్రహ రూపంలో ఉన్న ఆవిడకి ఎలా చెప్పాలో నాకు తెలియక నేను అక్కడ కింద నేల మీద పడి
(25:47) పొర్లాన అమ్మా విగ్రహం దగ్గర నేల మీద పడిపొ పొల్లి సాష్టాంగ నమస్కారం చేశను అంతకంటే నేను నా భావాన్ని ఎలా వ్యక్తం చేయాలో ఆ ఇల్లాలకి నాకు అర్థం కాలే అమ్మ 22 రోజుల కథని సరస్వతీ దేవితో నా గుండెల్లో ఉంటే నువ్వు వేదిక దగ్గర ఉన్నావఅమ్మా ఇద్దరికీ నాకేం తేడా కనపడలే అంత అవధానం నడిపించావు తల్లి ఇవాళ నీ విగ్రహావిష్కరణకి నేను రావడం అంటే నా బాధ్యత అండి నా బాధ్యత నా అదృష్టం అది నేను రాకపోతే పాపాత్ముడిని కదా సందేహం ఏమనా ఉందా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మానుకొని రావలసిందే కదా కానీ నేను వారు ఫోన్ చేయగానే నేను ఒకటే చెప్ప మీకు తెలుసు
(26:21) దసరా రోజుల్లో మా డిమాండ్ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు అమ్మవారికైనా ఖాళీ ఉంటుంది మాకు ఖాళీ ఉండదు. కానీ వారు అడగగానే నేను రెండు రోజులు మీకు కేటాయిస్తానండి ముందురోజే వస్తాను నేను సావకాశంగా ఉంటాను విగ్రహావిష్కరణ చేసి ఆ తల్లి రుణం తీర్చుకొని వెడతాను అని నా సోదరులుఇద్దరికీ నేను మనవి చేశనండి ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.
(26:41) ఆ నిర్వహణ ఎంత గొప్పదండి ఇది కష్టమైన పని అని ఎప్పుడు ఆవిడ నోట రాలేదండి నుదుట కుంకుమ బట్టు చెమటబట్టి కిందికి కారడం అనేది మేము చూడలేదండి ఆవిడ జీవితంలోన చూడలేదు మేము అంత పెద్ద కుంకుమ బట్టు ఎప్పుడు అమ్మవారి కుంకుమ బొట్టులాగా అలాగే ప్రకాశించి అది చెమటబట్టి కారడం కూడా మేము చూడలేదు అలా ఉండేది ఆవిడ అలాగే ఈ ఏ విధి అయినా చీర కొస ఇంతయు నలగక చేయగలుగు కట్టిన చీర కుచ్చిళ్లు గాని మడత గాని మాయకుండా ఆవిడ తిరిగి మొత్తం నిర్వహించ భక్తల్లో ఒకరు చెప్పారు చాలా గొప్ప విషయం ఏ పని చేయవలసిన వ్యక్తినైనా సరే తనకంటే పెద్దవాడినైనా ఆవిడ చాలా
(27:18) చాకచక్యంగా తన దగ్గరికి రప్పించుకునేవారు అది చాలా తెలివి [నవ్వు] మేనేజింగ్ లో అది చాలా ముఖ్యం ఒక ప్రిన్సిపాల్ డైరెక్టర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఆ కాలేజీలో ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అతనే ఇక్కడికి రావాలి నాకు అందరినీ గౌరవించడం అలవాటు అని ప్యూన్ బదులు మనమే గంట కొట్టామ అనుకో వాడు ఏమంటాడు మన్నాడు సార్ మీరు బాగా గంట కొడుతున్నారు సార్ మీరు కొట్టండి ఇక నేను అక్కలేదు అంటాడు జీతం వాడు తీసుకు 100 వామ పక్ష భావాలు చెప్పిన ప్యూన్ ఇస్ ప్యూన్ అండ్ ప్రిన్సిపల్ ఇస్ ప్రిన్సిపల్ తేడా చాలా ఉంటుంది ఒక ఏదైనా ఇన్స్పెక్షన్ జరిగితే ప్యూన్ ఆ కట్లన్నీ పట్టుకొచ్చి
(27:50) ఇస్తాడు దస్తావేజులు ఉంటాయి కదా చాలా పట్టుకొచ్చి ప్రిన్సిపాల్ గారు ముందు పెడతాడు అవన్నీ ఆయన పెట్టడం వల్ల అంతే కాదు ఒరేయ్ ఈ కాయితం ఎక్కడ ఉంది రా అప్పారా అంటే ఆయన తీసిస్తాడు వెంటనే ప్రిన్సిపాల్ కి తెలియపోవచ్చు ప్యూన్ కి తెలుసు ఇక్కడ ఉంది సార్ మనం వచ్చి ఇస్తాడు ఇచ్చారు కదా అని ప్రిన్సిపాల్ గారు ఏం చేసాడట చక్కగా అయిపోయిన తర్వాత ట్యూన్ ని పిలిచి భుజం మీద చేయేసి బాగుందయ్యా బాగా చేసావ అప్పారా బాగా చేసావ అప్పారా ఇగో 50 ఉండనియ అని 50 రూపాయలు జేబులో పెట్టాడు ఆయన సంతోషించాడు ఇంటికి వెళ్లి చెప్పుకున్నాడు కానీ ప్యూన్ కనిపించదు
(28:14) నేను కూడా ప్రిన్సిపాల్ గారిని తీరి గౌరవించాలి కదా అని ఆయన రిటైర్ అవుతుంటే ప్యూన్ వచ్చి ఓ 50 రూపాయలు ప్రిన్సిపాల్ గారి జేబులో పెట్టి బాగా చేసవాయ్ ఉండనే అన్నట్టు వాళ్ళు మండిపోదు ప్రిన్సిపాల్ కి ఎవరు సమానం అండి పిచ్చి మాటలు చెబుతారు ఇక్కడ ప్యూన్ ఎప్పుడు ప్రిన్సిపాల్ తో సమానం కాదు ప్రిన్సిపాల్ ఇస్ ప్రిన్సిపల్ అండ్ ప్యూన్ ప్యూన్ యజమాని యజమానే నౌకర్ నౌకరే పిచ్చి సిద్ధాంతాలు వెలిగించద్దు ఇక్కడ అవి ప్రపంచవ్యాప్తంగా విఫలమయ్యాయి.
(28:36) కానీ వైదిక ధర్మం ఋషి ధర్మం ఏం చెబుతు ప్రిన్సిపాల్‌ని ప్రిన్సిపాల్ గారినే గౌరవించండి పియూని పియ్యూన్ గారే గౌరవించండి అది వైదిక ధర్మం అది ఆర్ష ధర్మం అది హిందూ ధర్మం ఇద్దరికీ ఆకలి ఒక్కటే ఇద్దరికీ సంతానం ఒక్కటే ఇద్దరికీ భార్యా పిల్లల పట్ల ప్రేమ ఒక్కటే ఇద్దరికీ 24 గంటలు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ప్రిన్సిపాల్ జీతం ప్యూన్ జీతం సమానం చేయకూడదు కాలేజీ నాశనం అయిపోతుంది.
(28:57) ఆయన శ్రమ వేరు అది మేధాగతమైన శ్రమ ఒక సహస్రవధాల లాంటి మేధాగతమైన శ్రమకి ఎన్ని కోట్లు ఇస్తే తీస్తే సరిపోతుందండి డబ్బించి కొలుస్తారా దాన్ని దానికి జీతం పెడతారా మేధాగతమైన శ్రమ ఎప్పుడు శారీరక శ్రమతో పోల్చనే కూడదండి అసలు ఇది ఎంత కష్టమని చెప్పిన రోజు లేదు అలాగే ఇది ఈ విధి ఇది చీర నలిగిన జాడ ఎక్కడా లేదు ఆవిడ శ్రమపడడం చెమట కారణం మనం చూడలే సేవావతి ఎందుకు చేశారు అంటే మొఖమాటం లేకుండా చెబుతున్నానమ్మా అంతర్గతంగా మీ అందరికీ చిరంజీవిని కుమారి గారు కార్యకర్తగానో కార్య నిర్వాహక అధ్యక్షులుగానో డైరెక్టర్ గానో ఎలా కనబడ్డారో నాకు తెలియదు నాకు
(29:35) మాత్రం భగవద్గీతలో చెప్పిన ఒక మహా యోగినిలా కనపడతాను ఒక యోగినిలా కనపడతాడు. ఒక యోగి ఎలా ఉంటాడో తెలుసునా అండి భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు అన్ని పనులు చేస్తూనే ఉంటాడు లోపల మాత్రం ఏమి చేయట్లేదనే అనుకుంటాడు అతను యోగి అంతే కాదు ఏ పని చేయడు తపస్సులో ఉంటాడు అన్ని పనులు జరుగుతున్నట్టుగా భావిస్తాడు అతనే యోగి ఈ యోగి భావన ఉన్నవాళ్ళు మేనేజింగ్ ఎబిలిటీ చేయగలరు అందుచేత ప్రతి సఈఓ ఇద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏదో అంటారే ప్రతి కంపెనీ సఈఓ ఒక యోగి కావాలి ముందు అందుకే భగవంతుడు భగవద్గీత తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోభిమతోధిక కర్మిభ్యస్చాధికో యోగి తస్మాత్ యోగి
(30:16) భవార్జున అంటాడు మహా తపస్సులు చేసిన వాళ్ళ కంటే కూడా మహాజ్ఞానులైన వాళ్ళ కంటే కూడా గొప్ప యజ్ఞయాగాదులు చేసిన కర్మిష్టుల కంటే కూడా గొప్పవాడు ఎవరంటే అర్జున యోగి నువ్వు యోగ అయ్యే ప్రయత్నం చేయన్నారు చిరంజీవిని కుమార్ గారు ఒక యోగినిగా మనకి దర్శనం ఇచ్చింది జీవితంంతా లోపల ఏ అందుకే గుండుపోట్లు ఎక్కువ వస్తాయి ఎవ్వరు నన్ను గుర్తుపెట్టుకోకల ఎవరికీ నేను గుర్తుండక్కల అవసరం లేదు ఎవరు నాకు గుర్తుండక్కల చేయవలసిన పని ఏదో చేస్తాం ప్రపంచం నుంచి వెళ్ళిపోతాం అంటే బై యు నీడ్ ఐడెంటిటీ క్రైసిస్ ఇవ్ళ ప్రపంచం తలకిందులు అవుతున్నది ఇక్కడే ప్రతిదానికి ఏదో గుర్తింపు కోరుకుంటాం మనం
(30:52) ఇంత పని చేసాం మనని మెచ్చుకున్నవాడు లేడు ఎందుకు మెచ్చుకోవాలి నీ పని నీకు ఆనందం కలగాలి ఎవడో మెచ్చుకోవడం ఏమిటి పనిలో ఆనందం పొందాలి ఫనితలో కాదు కదా ఆవిడ పనిలో ఆనందం పొందారు అందుకే సహస్రనామధానం తర్వాత నాకు సన్మానం చేశరండి ఆవిడకి సన్మానం చేయలేదు [నవ్వు] చేస్తానని ఆవిడ జహించుకోలేదు వద్దండి నాకేమిటి మధ్య లేకుండా అన్నారు మరి అంత చేశారు కదా చేయాలి కదా లేదండి తర్వాత ఆవిడ పేరు ఐడియల్ కాలేజీ పేరు నేను ఎన్నో చోట్ల చెప్పాను కానీ ఆవిడ ఎప్పుడూ చెప్పాలని కోరుకోలేదు.
(31:22) సేవావధియామే అందుకని ఆ కృతువు ఒక యజ్ఞం లాంటి కాలేజీ నిర్వహణ గన ఒక యజ్ఞం లాంటి సహస్రావధానం కాన ఒక యజ్ఞం లాంటి జిల్లా చరిత్ర రాయడం కాన ఒక జిల్లా ఒక యజ్ఞం లాంటి సాహిత్య చరిత్ర రాయడం కాన నిష్కామ కర్మయోగం కారణంగా నడిపించగలగారు మేనేజింగ్ ఎబిలిటీ అంటే భగవద్గీతలో చెప్పినట్టుగా నిష్కామ కర్మయోగం దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంకా బాగా మీకు వినాలంటే మా శ్రీ గరికిపాటి నరసింహరావు అఫీషియల్ అనే ఛానల్లో ఈ మధ్య నేను దేశవ్యాప్తంగా 10 చోట్ల కేవలం ఆధునిక జీవితంలో లో భగవద్గీత ప్రాధాన్యం అనే దాని మీద 10 రెళ్ళు 20 గంటలు మాట్లాడాను ఇంకో 20 గంటలు ఇంకో 10 భాగాలు మాట్లాడతాను
(31:56) చూడండి అందులో తెలుస్తుంది కచ్చితంగా మీ జీవితాల్లో భగవద్గీత ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది నేను చేస్తున్నా దీని ఫలితం నాకు ఇది రావాలి బీటెక్ చదివేటప్పుడే ప్లేస్మెంట్ ఉందా ప్లేస్మెంట్ ఉందా ఏమిటమ్మా ప్లేస్మెంట్ ఉండేది ప్లేస్మెంట్ ఇచ్చేవాళ్ళని కాలేజీ ప్రిన్సిపాల్ అనారమ్మ నీకు చదువు చెప్పడం కాలేజీ పని ప్లేస్మెంట్ పని మాకేమిటి నాకు అర్థం కాదు నీ ఉద్యోగాన్ని నువ్వు వెతుక్కోవాలి ఇవాళ ఏదో మొదలైంది ప్లేస్మెంట్ వీళ్ళే ఇవ్వాలి పెళ్లి వీళ్ళే చేయాలి పిల్లలకనే ఏర్పాటు వీరే మరి నువ్వు ఏం చేస్తావ ఇక్కడ అదేమిటండి ప్లేస్మెంట్ ఉండే కాలేజీలో
(32:23) చేరుతారా పేరెంట్స్ కి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా అసలు ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీ ఇవ్వాల కాలేజీ వాళ్ళు చదువుల మీద దృష్టి పెట్టరు ఇంక ప్లేస్మెంట్ మీద పెడతారు ఇవేళ మీరు గమనించండి ఐఐటి ఇన్స్టిట్యూట్ ప్రసిద్ధమైన వాళ్ళు ప్రసిద్ధమైన ఇన్ఫోసిస్ ఒరాకిల్ సహా అనేక పెద్ద పెద్ద కంపెనీలు బాబోయి మా దగ్గరికి రావద్దు మాకు ప్లేస్మెంట్ వద్దు క్యాంపస్ ఇంటర్వ్యూలు వద్దని హెచ్చరించేయండి ఎందుకో తెలుసా వీళ్ళు ప్లేస్మెంట్ ఇస్తున్నారమ్మా ఆఫర్ ఇస్తున్నారు ఆడర్ ఇవ్వట్లేదు [నవ్వు] చక్కగా మూడో నాలుగో సంవత్సరం వస్తున్నారు ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు వీళ్ళు ఆ
(32:53) ఉద్యోగాలు చూసుకుని మురిసిపోయి పెళ్ళళ్లు చేసుకుంటున్నారు విల్లాలు కొనేస్తున్నారు మూడు కోట్లు ఈఎంఐ పెట్టేసి వెలవెల ఆడిపోయేలాగా ఇలా చూస్తే ఉద్యోగం లేదు మూడేళ్ళయినా ఉద్యోగం లేదు ఇది గమనించబడ్డ హైదరాబాద్ ఐఐటీ సహా అనేక ఐఐటీలు ప్లేస్‌మెంట్స్ ఆపేసాయి మేము ఇవ్వం అసలు మా కంపెనీకి మా కాలేజీకి రావద్దు మీరు ఎందుకంటే నమ్మకం పోయింది.
(33:13) ఈ ప్లేస్మెంట్ అంటే మనం ఆశించేది చదువు చెప్పడం కాలేజీ వాళ్ళ పనిఅండి ఉద్యోగం సంపాదించుకోవడం విద్యార్థి పని కాలేజీ వాళ్ళు ఏం చేస్తారు దానికి అందుకే ఉద్యోగం గ్యారంటీ ఉద్యోగం గ్యారంటీ ఉద్యోగం గ్యారెంటీ ఇచ్చేది కాలేజీ కాదండి చదువు గ్యారెంటీ అని చెప్పాలి కాలేజీ జ్ఞానం గ్యారెంటీ అని చెప్పాలి ఉద్యోగం గ్యారంటీ అంటారు ఏమిటండి ఏ పురోహితుడైనా పెళ్లి చేయించేవాడు కాపురం గ్యారంటీ కాపురం గ్యారంటీ అంటాడండి కాపురం ఆయన చేస్తాడా కాపురం గ్యారెంటీ అంటాడండి ఆయన ఆయన ఏం చేస్తాడు ముహూర్తం పెడతాడు పెళ్లి చేయిస్తాడు వెళ్ళిపోతాడు ఆయన కాపురం మీరు చూసుకోవాలి అందుకే నేను
(33:42) పురోహితుడు నేను కాపురం గ్యారంటీ అంటాడు ఆయన కాపురం గ్యారెంటీ కాదో మనకేం తెలుసు ఇదేం గ్యారెంటీలు అండి గ్యారంటీలు ఎందుకు ఇవ్వాలి అసలు గ్యారెంటీలు కారణంగా మొత్తం కమర్షియల్ అయింది విద్యా వ్యాపారం ఆ విద్యా వ్యాపారాన్ని కమర్షియల్ వ్యాపారం కాకుండా అడ్డుకొని ఎయిడ్ ఆగిపోతుంది అన్నా సరే ప్రైవేట్ కాలేజీనే నడిపించి అవసరమైన ఫీజులు లేవో మధ్య తరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేలాగా మాత్రమే పెంచుకొని ఇప్పటికీ ఏడిఎల్ కాలేజీని ఆదర్శంగా నడిపించిన చిరంజీవిని కుమారి గారికి వారి వారసులకు డైరెక్టర్ రంజిత్ గారి గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు
(34:13) తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా అదే ఆదర్శాలు అదే ఆశయాలు విగ్రహావిష్కరణ చేసినంతలో ఏమ అయిపోలేదమ్మా ఆ ఆశయాలు కొనసాగాల నేను నేను పొందిన ఆనందం అది వినగానే నిన్న మొన్న అనేక విశేషాలు తెలుసుకుంటే నాకు తెలియని ఆవిడ జీవితంలో ఎన్నో ఉన్నాయి అలా అనుకున్నా ఒక ముఖ్యమైన ఆదర్శం చెబుతా నేనే ఆశ్చర్యపోయా ఇవాళ ఇంటర్మీడియట్ కాలేజీలో ఎక్కడున్నా ఏం నడుస్తుందండి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండదండి.
(34:39) హిందీ సంస్కృతం అరబిక్ ఫ్రెంచ్ విచిత్రమైన భాషలన్నీ పెడతారు వాడికి అర్థం కానివి కొన్ని అవసరం లేనివి కొన్ని అసలు అర్థం లేనివి కొన్ని తెలుగు ఉండదండి అక్కడ కానీ అంత డిమాండ్ ఉందని తెలిసి కూడా సంస్కృతాన్ని ప్రవేశపెట్టకుండా హిందీని ప్రవేశపెట్టకుండా కేవలం తెగే మా దగ్గర ద్వితీయ భాషగా ఉంటుంది ఇంటర్మీడియట్ అయినా సరే డిగ్రీ అయినా సరే ఇక్కడ కనపడుతున్న డిగ్రీ విద్యార్థులందరూ తెలుగు తెగే ద్వితీయ భాషగా చదువుతున్నారు మీకు నేను తెలుగు అభిమాన అనగా మీరు చిన్నవాళ్ళైనా మీకు నమస్కారం చేస్తున్నా మీకు నమస్కారం చేస్తున్నా భాషాభిమానం అంటే ప్రతి చదువు
(35:15) వల్ల ఉద్యోగం రావాలండి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ చదువు జ్ఞానం కోసం అండి ఉద్యోగం కోసం కాదు ఏ కాలేజీ వాడైనా ఉద్యోగం గ్యారెంటీ అంటే ఆ కాలేజీలో చేర్చకండి జ్ఞానం గ్యారెంటీ అని చెప్పమనండి జ్ఞానం వాడు పంచడు కాలు ఉద్యోగం గ్యారెంటీ ఎంత కాలం గ్యారెంటీ ఇచ్చే వరకు గ్యారెంటీ రెండో ఏడ తీసేస్తారు అదే జ్ఞానం గ్యారంటీ అయితే వాడు ఉద్యోగాన్ని వాడు కాపాడుకుంటాడు.
(35:36) ఏ కృతువైనా పట్టుదలగా ఆవిడ ఎందుకు నడిపించగల జ్ఞానం ఉంది లోపల కర్మయోగం ఉంది ఇంకేం కావాలండి అందుకని ఆవిడకి నేను నమస్కారం చేస్తున్నా తలలోని నాల్క సహస్రావధానమే కాదు ఐడియల్ కాలేజీ నిర్వహణ కదా ఆవిడ ఎందుకు చేశారు అంటే తలలోని నాల్క మాట గమనించండి ఎవరితో మాట్లాడవలసి వచ్చిన మాట్లాడేవారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు అనేక రకాల మావంటి సాంస్కృతికమైన వ్యక్తులు ఎవరితోన మాట్లాడేవారు ఎలా మాట్లాడాలో అంతవరకే మాట్లాడేవారు వెంటనే వెనక్కవచ్చి ఆవిడ సీట్లో ఆవిడ కూర్చునేవారు ఇంకా పామ వేసుకోవడం పూసే చేసుకోవడం రాసేసుకోవడం మన
(36:07) రిలేషన్షిప్ కొనసాగాలి అనడం ఈ దరిద్రం లేదండి ఎక్కడ ఆ అవసరం ఎంతవరకు అంతే మనక ఎవడనా ఇవాళ సెలబ్రిటీ అన్నవాడు పొరపాటున పరిచయం అయితే ఇక వాడికి తలనెప్పి వచ్చేలాగా రోజుక ఒకసారి మనమే ఫోన్ చేసి సార్ మీరు వచ్చినప్పుడు నాకు చెప్పాలి సార్ ఏంటి చెప్పేది యమధర్మరాజు వస్తాడు నాకు చెబుతాడా నేను నీకు చెప్పేది ఏంటయ్యా అర్థం లేదు ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి మా ఊరు వచ్చారు నాకు చెప్పలేదు సార్ చెప్పాలా చెప్పాలా అండి ఎంతమందికి చెబుతారండి ఎవరైనా నీకు ఎంత భక్తి చెప్తో గౌరవం ఉంటే తెలుసుకో వచ్చి కలుచుకో లేద మాని అందరికీ పట్టుకున్నది ఇదండి ఏమాత్రం
(36:40) కాస్త పరిచయమైన సెలబ్రిటీ ఇంకా వాడిని పామేసి పూసేసి వాడి బెళ్ళం పిల్లలకు కూడా వాడు దొరకద్దు మనకే దొరకాలి ఎందుకు ఈ తాపత్రయం ఆవిడ ఎవరి గురించి అలా తాపత్రయ పడలే తాను అనుకున్న లక్ష్యం కాలేజీ సామాజికంగా ఒక లక్ష్యం ఉంది ఆవిడకి మంచి అభిజోతమైన ఆశయాలతో తాను జీవించడం ఇతరులగా ఆ జీవితం నేర్పడం ముఖ్యంగా స్త్రీ జనాన్ని మేలుకోలపడం దానికోసం చేశారు ఆవిడ చేయగలిగిందంతా చేశారు అందుకని నిశ్చింతగా 94 ఏళ్ళు బ్రతికారండి యువతరం గమనించండి 25 ఏళ్లకు క్యాన్సర్లు వస్తున్నాయి 30 ఏళ్ల గుండెపోట్లు వస్తున్నాయి బీపి షుగర్ లేని వాళ్ళు యువతరంలో కూడా కనపడట్లే కానీ 94
(37:13) ఏళ్ల వరకు చిరంజీవిని కుమార్ గారు పరమ ఆరోగ్యంగా హాయిగా ఆనందంగా ఉన్నారు. వారి చెల్లెలు కూడా నిన్న నేను చూసి ఆవిడ పాదాలకి దండం పెట్టి వచ్చా 93 ఏళ్ళు ఆవిడ హాయిగా ఉన్నారు గోంగూర పసలు వేసుకొని తింటున్నారు నేను ఏం తింటున్నాను అని కూడా అడిగాను ఆవిడ తెలుగు ఆచార్యులు తెలుగు ఆచార్యులు గవర్నమెంట్లో ఆవిడ చెల్లెలు 93 ఏళ్ళు నిన్న ఆవిడ దర్శనం ఇద్దరం చేసుకొని ఆవిడ కాళ్ళకి దండం పెట్టామ ఇద్దరం కూడా మమ్మల్ని ఆశీర్వదించండి మా గురువులతో కలిసి పని చేశారు ఇంద్రగండ రామచంద్రమూర్తి గారు నా గురువు ఆయనతో ఆయనకి ఆచార్యుడిగా ఉన్నారు ఆవిడ ఏమి
(37:45) అనారోగ్యం లేదండి హాయిగా కూర్చుని ఉన్నారు ఇంట్లోన మనకఎందుకండి పాతిక 30 ఏళ్ళే అనారోగ్యాలు వస్తున్నాయి ఆందోళన ఆందోళన ఆందోళన ఎందుకంటే భవిష్యత్తు గురించి భవిష్యత్తు అంత శాశ్వతమా శాశ్వతం ఎప్పుడూ వర్తమానమేనండి అందరూ గుర్తుపెట్టుకుందాం ప్రెసెంట్ ఇస్ ప్రెసెంట్ ఇంగ్లీష్ వాడు కూడా గొప్ప మాట చెప్పాడు ప్రెసెంట్ అంటే బహుమతి అని అర్థం ప్రెసెంట్ అంటే వర్తమాన కాలం అని అర్థం ప్రెసెంట్ ఇస్ ది ప్రెసెంట్ గివెన్ బై గాడ్ టు యు భగవంతుడు ఇచ్చిన నీకు బహుమతి ప్రెజెంట్ వర్తమానం వర్తమానంలో జీవించు గతం గురించి ఆలోచించకు భవిష్యత్తు గురించి భయపడకు భవిష్యత్తు
(38:17) రేపు రేపు రేపు ఉంటే అప్పుడు ఆలోచిద్దాం ఆ విషయం ఇక్కడ ఓ ఐదేళ్లకు పునాది వేసుకుంటే సరిపోల నేను ఇప్పుడు 30 ఏళ్ల వయసు 60 ఏళ్ల తర్వాత నేను ఎలా జీవించాలో ఇప్పుడు నిర్ణయించుకొని నువ్వు నిర్ణయించుకున్నావ్ యమధర్మరాజు వేరే నిర్ణయించుకున్నాడు లాగేస్తాడు పైకి ఏం చేస్తావ్ ఇక్కడ ఎందుకు నీ నిర్ణయాలు ఇక్కడ పని లేక అంత నిర్ణయం వేసుకోవాలండి 60 ఏళ్ల తర్వాత ఎలా జీవించాలో 30 ఏళ్ళ వాడికి అవసరం అందుకే మనకు ఆందోళనలు వస్తున్నాయి అంతవరకు మనం ఉంటాం ఇక్కడ మన కళ్ళ ముందు ఎంతమంది రాలిపోతున్నారండి నేను ఉన్నవాళ్ళు ఇవాళ లేరు జీవితాన్ని క్షణక ంగా భావించాలి
(38:48) లక్ష్యాన్ని శాశ్వతంగా భావించాలి మనం లేకపోయినా ఆ లక్ష్య నిర్మాణం కనబడుతుంది కదా ఇవాళ ఇంతమంది విద్యార్థిని విద్యార్థులు ఇక్కడికి వచ్చారంటే ఆవిడ మీద గౌరవం కదండీ కచ్చితంగా అంతకంటే జీవితానికి సార్ధకత ఏం కావాలండి మా మేడం గారి గురించి గరిగిపాటి వారు వస్తారట బుద్ధ ప్రసాద్ గారు వస్తారట పెద్దలు ఎంతో మంది వస్తున్నారుట ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతో మంది వస్తున్నారు ప్రగతి వారు వచ్చారు వారు వచ్చారు వీరు వచ్చారు ఇంతమంది వస్తున్నారట అంటే ఆవిడ గురించి తెలుసుకోవాలనే తాపత్రయం కలగలేదని ఇప్పుడు చిరంజీవిని కుమార్ గారు చిరంజీవి గారే ఉన్నారా లేరా మీరు ఆలోచించండి దయచేసి మీరు
(39:18) ఆలోచించండి ఇంతకంటే చిరంజీవిత్వం అంటే ఏమిటండి ఇంతకంటే చిరంజీవిత్వం అంటే ఏమిటండి 10 మంది హృదయాల్లో మనం ముద్రపడి మనం ఉండడమే కదా అది ఆవిడఏం కోరుకోలే అది అనుకోకుండానే వచ్చింది. అలా ఉండగలగాలి. అలాగే సివిఎస్ గారిని కూడా నేను స్మరిస్తాను కచ్చితంగా నాకు చాలా మిత్రుడు ఆవిడకి పుత్రుడు లాంటివాడు ఆయన కూడా కార్య ఎప్పుడు ఆయన నిర్వహణ చాలా నవ్వుతూ చేసేవాడండి ఒక పక్క డెఫిసిట్ సహస్ర అవధానం నాకు తెలుసు లక్షలు లక్షలు కావాలి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఒక దశలో కార్యకర్తలు నా దగ్గరికి వచ్చి నేను అవధానం అప్పుడు ఉడిపి వీనస్ లాడ్జిలో
(39:52) ఉండేవాళ్ళం ఏస కూడా లేదు [నవ్వు] ఏసీ లేని లాడ్జ్యలో 22 రోజులు ఉండి 750 పద్యాలు అప్పగించాను అంటే నిజంగానే నేను మొగడిన్న అనుమానం ఏమ లేదండి అనుమానమే లేదు గొప్ప విషయం అండి నాకు ఎప్పటికీ తలుచుకుంటే వాళ్ళ ఈ మధ్య హైదరాబాద్‌లో కొంతమంది ఏమంటే మీరు సహస్ర అవధానం చేయండి అంటే మళ్ళీ చేయడం నా వల్ల కాదండి వాడుఎవడో గరికిపాటి నరసింహరావు దిగి రావాలని చెప్పాను [నవ్వు] నా వల్లగా అంత భయం వేసిందండి ఏసీ లేని లాడ్జ్‌లో 22 రోజులు కుటుంబానికి దూరంగా ఉండి పైగా గరికిపాటి కాలేజీ అనే ఒక కళాశాల నడుముతో అప్పటికే ఎకరం అమ్మేసి ఇంకో ఎకరం అమ్మడానికి అక్కడ సిద్ధంగా ఉండి ఆ
(40:24) స్థితిలో నేను సహస్రావధానం చేశను. కానీ 750 పద్యాలు ఏకధాటిగా వెళ్ళిపోయినాయి నా మనసులో అవధానం చేసిన 22 రోజులు అవధాన పద్యాలు మాత్రమే ఉన్నాయమ్మ మిగిలిన విషయాలు లేవు ఎప్పుడు ఏ పని చేస్తున్నామో దాని గురించి ఆలోచించి మిగిలినవి ఆలోచించకుండా ఉంటే ఏ టెన్షన్ లేకుండా ప్రతివాళ్ళు చిరంజీవిని కుమారులాగా 94 ఏళ్ళు బతకగలుగుతారు 94 ఏళ్ళు బతకగలుగుతారు ఆరోగ్యంగా ఉంటారు ఏది చేస్తున్నామో దాని మీద దృష్టి పెట్టండి సిబిఎస్ అంటే అంతే ఆయన కార్య నిర్వహణ చేసేటప్పుడు ఎలా ఉండేవాళ్ళ తెలుసా కార్య నిర్వహణము కళ్యాణమట్లుగా భావనమ్ము చేయు భాగ్యశాలి కార్య నిర్వహణము
(41:00) కళ్యాణమట్లుగా భావనమ్ము చేయు భాగ్యశాలి నీరసం మెరుగని నిత్య తేజస్ాలి నీరసం మెరుగని నిత్య తేజస్ాలి సివియస్సు జన్మ రావి కొమ్మ సివియస్సు జన్మ రావి కొమ్మ మన సంప్రదాయంలో రావి చెట్టు చాలా గొప్పది అశ్వద్ధం అంటే శ్రీమహా మహావిష్ణువు అశ్వద్ధం చనిపోయే వాడికి కూడా జీవాన్ని పోస్తుంది అందుకే సంతానం లేని వాళ్ళని రావి చెట్టు చుట్టూ ప్రదక్షణం చేయమంటారు అదేదో మహిమ అని కాదు అక్కడ రావి ఆకుల మీద పడే సూర్యకాంతి ఈ వ్యక్తి మీద పడితే లేని జీవం పుట్టుక వస్తుందండి కచ్చితంగా పిప్పలాదుడుని దీశు మహర్షి కుమారుడు రావి ఆకుల రసం సేవించిన
(41:46) కారణంగా బతికి బట్ట కట్టాడండి అందుకనే రావి కొమ్మ నా దృష్టిలో సిబిఎస్ గారు అంటే ఆయన జన్మ రావి కొమ్మ ఒక పవిత్రమై అన్నింటికో ఆదర్శమ ఆధారమై నిలబడింది అటువంటి వ్యక్తులు నడిపించింది ఇక్కడ ముఖ్యంగా ఆదర్శ కళాశాల గురించి నేను ఇంకొక మాట చెప్పాలి మధ్యలో 22 రోజుల మధ్యలో 10వ రోజునో 11వ రోజునో నాకు తెలిసిన వార్త ఏమిటో తెలుసా ఆ నిర్వహణ సామర్థ్యం అంటే అది అన్నం పెట్టడానికి ఇబ్బందిగా ఉందండి పృచకులకి వెయ మంది ఉన్నారు పండితులు వాళ్ళందరూ ఎక్కువ దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు విరగళాలు తగ్గిపోయాయి ఎవరు ఇవ్వట్లేదు గరికిపాటి వారు మీరు వేదికి
(42:24) దిగివచ్చి కాకినాడలో గాని ఇతరత్ర వెళ్లి కొన్ని అడిగి కొన్ని విరాళాలు పట్టుకు రావాలి అని కార్యకర్తలు నాకు వార్త చెబితే నా పరిస్థితి ఎలా ఉంటుందండి ధారణ చేయాలా ఈ పని చేయాలా అని సాయంత్రం బయలుదేరి విరాళాలకు వెళితే ఆ పద్యాలు ఏమైపోతాయి ఆ స్థితిలో చిరంజీవిని కుమార్ గారు ఆ చెప్పిన వారిని మందలించి నా దగ్గరికి వచ్చి అవధాని గారు మీ పని మీరు చూసుకోండి 22వ రోజు మీరు ధారణ చేసే వరకు నడిపించే పూచి మాది అని నాకు ధైర్యంగా చెప్పారమ్మా ధైర్యంగా చెప్పారు వెంటనే కళాశాల లెక్చరర్లు అందరినీ పిలిచి మీడియం ఏం మనం పెట్టలేమా అన్నాం ఒక రోజు నువ్వు పెట్టు
(42:58) ఒకరోజు నువ్వు పెట్టు అని లెక్చరర్ల కేటాయించి ఐదఆరు రోజులు ఆవిడే పెట్టారమ్మ అన్న తిన్న అన్నదాతలు సాక్షి తిన్నవారలు సాక్షి ఎన్నో చోట నా సహస్రవధానం గురించి నేను చెప్పవలసి వచ్చేస్తే ఐడియల్ కాలేజీ గురించి చెప్పానండి సహస్రావధానానికి సాక్షులు ఎవరంటే కన్నతల్లియు సాక్షి కాకినాడయు సాక్షి సాగర తీరమ్ము సర్వసాక్షివ6 పృచ్యకావళి సాక్షి బేతవోలుక సాక్షి భీతి సాక్షి అన్నదాతలు సాక్షి తిన్నవారలు సాక్షి ఐడియల్ కాలేజీ అసలు సాక్షి అన్నదాతలు సాక్షి తిన్నవారలు సాక్షి ఐడియల్ కాలేజీ అసలు సాక్షి మండు టెండలు
(43:44) సాక్షి గుండె గుబులు సాక్షి మండు టెండలు సాక్షి గుండె గుబులు సాక్షి దూరదర్శను సాక్షి మీరు సాక్షి 750 పద్యాలు ఏకదాటిగా అప్పగిస్తుంటే దూరదర్శన వాళ్ళు రికార్డు చేసి తర్వాత ప్రసారం చేశరండి ఇప్పటికి ఎవడైనా కాదని అనగలిగే దమ్ము ఉన్నవాడు ఉన్నాడా రికార్డు ఉంది అక్కడ దూరదర్శను సాక్షి మీరు సాక్షి 22 రోజులు ఇంత కథను వాలు చూపుల నడిపించు వాణి సాక్షి 22 రోజులు ఇంత కథను వాలు చూపుల నడిపించు వాణి సాక్షి నా సహస్రావధాన నమము వాసికెక్క ఆంధ్రదేశమున ప్రతిరక్షి
(44:27) సాక్షి ఇక్కడ ప్రత్యేకం మనం గుర్తుపెట్టుకోవలసింది ఆవిడ వ్యవహార శైలిలో ఒక విషయం విరాళాలు అడగవలసి చూస్తే కాలేజీ గురించి అయినా సరే అవధానం గురించి అయినా సరే గోదావరి జిల్లాల చరిత్ర ముద్రణ గురించి అయినా సరే సాహిత్య చరిత్ర గురించి అయినా సరే ఏదైనా అడగవలసి ఉంటే ఎవరు ఇస్తారో ఇచ్చే హృదయం ఉన్నవాళ్ళ వాళ్ళ దగ్గరికే ఎవరినైనా పంపించి అడిగించేవా అంతేగానీ కొబ్బరి చెట్టుని చూసి మోసపోయిన చిలకలాగా ఇవ్వని వాడి దగ్గరికి చేపని ఆవు దగ్గరికి ఎప్పుడు ఆవిడ పాలగిన్న ఇచ్చి పంపలేదండి మనం గుర్తుపెట్టుకోవాలి ఏ సంస్థ
(45:12) తలపెట్టినా ఏ కార్యక్రమం పెట్టిన విరాళాలు ఎవరిని అడగాలి ఎక్కువ ఇచ్చేవాళ్ళని కాదండి ఎంతో కొంత ముందు కాదనకుండా ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళాలి వాడి హృదయం మంచిది వాడు ఎంత ఎంతైనా ఇవ్వని వాడుఏదో ఎక్కువ ఇస్తాడు ఎక్కువిస్తాడు ఎక్కువ ఇస్తాడు అని వాడు ఏమి ఇయ్యాడు చివరికి దాని గురించే పండితరాయలు జగన్నాథ పండితరాయులు పద్యాల్లో చెప్త ఒక చిలక ఉందిట అమాయకురాలు అది కొబ్బరి చెట్టు చూసిందట కొబ్బరి బొండాలు చూసారు దానికి ఏదో విచిత్రమైన ఆలోచన వచ్చిందట చిలక ఏం తిని బతుకుతుంది వరిచేల మీద ఎన్నులు తిని బతుకుతుంది మహాయితే ఏవో ఆ గింజలు ఈ గింజలు తినిపోదాని కొబ్బరి
(45:43) బొండంతో పని ఏమిటండి కానీ వెర్రిమ మొహం అమాయకురాలు ఇంతలా ఉంది కదా ఏదో అవుతుంది అనుకుంది దానికి పండితురాయలు చెబుతాడు పద్యాల్లో తరువది ఉన్నతంబను తత్ఫలముల్ విపులంబులంచు సంబరమున ఎన్నులందినుటమాని సుఖంబు ఒక నారికేళముందరిసి తరువది ఉన్నతంబనుచు తత్ఫలముల్ విపులంబులంచు తత్ఫలముల్ విపులంబులంచు సంబరమున ఎన్నులందినుటమాని సుఖంబొకనారికేళ ముందరిసి ఫలంబు విత్సా సుఖంబొకనారికేళ ముందరిసి ఫలంబువిచ్చా బహుదా బహుదాశ్రమియించెను ముక్కుబోటులన్ బహుదాశ్రమియించెను ముక్కుబోటులన్ హరి హరి హరి హరి తశ్రమంబు
(46:30) వృధయై సుఖతుండము చూర్ణమైనెన్ ఏవో ఎన్నులు గింజలు తిని బ్రతికేటువంటి చిలక కొబ్బరి చెట్టు చూసిందట ఆశ కదా కొబ్బరి బొండాలు చూసింది ఆకుపచ్చగా ఉన్నాయి ఆకుపచ్చగా ఉంటే మామిడికాయ అనే దాని ఉద్దేశం పాపం వెర్రిమ ఇంతలా ఉంది ఇంకా ఎన్నో రోజులు ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకొని తినొచ్చు ఏమిటో అనవసరంగా చిన్న చిన్న మొక్కలమీద మీద పడ్డాను ఇది కొబ్బరి చెట్టు ఎత్తుగా ఉంది కొబ్బరి బొండాలు కూడా ఒక్క బొండను తీసుకుంటే నా జీవితం వెళ్ళిపోతుంది అని అక్కడికి వెళ్లి ముక్కెట్టే ఆ బొండాన్ని కొట్టి కొట్టి కొట్టి కొట్టి గంట కొట్టిన దాని ముక్కు విరిగిపోయింది కానీ ఒక్క చిన్న ముక్క కూడా
(47:04) దానికి రాలేదండి లోకంలో కొంతమంది దాతలు అలాగే ఉంటారండి బాగా పోజు కొడతారు బాగా దర్పం కొడతారు నేను అనుభవించానండి అవధాని గారు మీకు ఎందుకు కూర్చోండి తర్వాత పని నాది అంటాడు తర్వాత మనమే కూర్చుంటాం ఆయన ఉండడు అక్కడ ఆయన ఉండడు నేను చూసాను పుస్తకాలకు విరాళం ఇస్తాను అని చెప్పి పుస్తకంలో ఆయన బొమ్మ వేసాక ఎగ్గొట్టిన వాళ్ళని కూడా ఈ ఊళలోనే చూశను నమఃశివాయ ఇవ్వన్నమాట చెప్పేస్తాను ఎందుకు వచ్చింది ఎగ్గొట్టిన వాళ్ళని కూడా బొమ్మ వేసేసాం అప్పటికే పైగా మామూలు ఫోటో ఇవ్వలేదు ఆయన భార్యన పక్కన కూర్చోపడు కాలి మీద కాలు వేసుకున్న ఫోటో ఇచ్చాడు ఈ కాలు ఎవడిది
(47:34) అన్నాడా అనుకో తెలియదు ఇప్పటికీ నాకు ఆ పుస్తకం చూస్తే వాడు గుర్తొస్తాడు వీడుపే ఇస్తాను కొట్టాడురా వాడు బొమ్మ వేసేసాం అప్పుడు నాకు ఈ పండితరాయల పద్యం గుర్తులేదు లేకోతే నేను అడిగేవాడిని కాదు చిలుక ఏం తినాలో తినాలి కొబ్బరి బొండం దానికి ఎందుకంటే లేని లావుగా ఉంది కదా బొండాం కదా అవుతుంది కదా అని ముక్కుతో పొడిచి పొడితే ఏమంది ముక్కు విరిగిపోయింది కానీ ఇంత ముక్క రాలేదు దానికి అటువంటి అయోగ్యులైన దాతల దగ్గరికి చిరంజీవిని కుమారి గారు ఎప్పుడూ వెళ్ళలేదు ఏం కావలసి వచ్చినా ఐడియల్ కాలేజీకి 14 ఎకరాల సుక్షేత్రాన్ని ఇక్కడ సొంతం చేసి పెట్టిన
(48:07) అన్ని విధాలా నడిపిన ఆవిడ దేన్ని ఎలా భావించారు అంటే అనుశాసనక పర్వల్లో వ్యాసుడు చెబుతాడమ్మా ప్రజా కార్యం అంటే ఎలా ఉంటుందో ప్రజానాయకుడు అంటే ఎలా ఉండాలో మేనేజర్ అంటే ఎలా ఉండాలో అక్కడ చెబుతాడు ండి ప్రజాకార్యం తత్కార్యం ప్రజా సౌఖ్యంతు తత్సుఖం ప్రజాహితం హితం తస్య స్వహితంతు ప్రజా ప్రజాప్రియం ప్రియం తస్య స్వహితంతు ప్రజాహితం ప్రజాప్రియం ప్రియం తస్య స్వహితంతు ప్రజాహితం సకలం తస్య ప్రజార్థం తస్యవై సర్వం ప్రజార్థం తస్యవై సర్వం ఆత్మార్థం నవిధేయతే అనుశాసనక పర్వంలో చెబుతాడు వ్యాసుడు ఈ మాట భీష్ముడు చేత ధర్మరాజుకి చెప్పిస్తాడు
(48:50) పాలకుడు మేనేజర్ అంటే ఎలా ఉండాలి అంటే ప్రజాకార్యంతు తత్కార్యం ప్రజల పనే నా పని నాకంటూ ప్రత్యేకమైన పనులు ఏమ లేవు ప్రజా ప్రజాకార్యం ప్రజా సౌఖ్యంతు తత్సుఖం ప్రజలు సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉంటాను నా సుఖం కాదు ప్రజల సుఖం ఇక్కడ విద్యార్థులు అధ్యాపకులు బాగుండడం ముఖ్యం అనే భావించారు ఆవిడ ప్రజ ప్రజా ప్రియం ప్రియం దస్య ప్రజలందరికీ ఏది ప్రియమైతే అదే నాకు ప్రియం స్వహితంతు ప్రజాహితం ప్రియం వేరు హితం వేరు మనకి నచ్చిన దాన్ని ప్రియం అంటారు నచ్చినా నచ్చకపోయినా మనకి జీవితాంతం మేలు చేసేదాన్ని హితం అంటారు యువతరం గుర్తుపెట్టుకోండి మీరు ప్రియమైన
(49:26) దానికి ప్రాధాన్యం ఇయకండి అమ్మా హితమైన దానికి ప్రాధాన్యం ఇయండి జీవితం అంతా బాగుంటుంది జీవితం అంతా బాగుంటుంది మీరు చదువుకుంటుంటే ఎవరో స్నేహితుడు స్నేహితురాలే పిలుస్తారు చదువు చదువుతావ చదివేవాడు బాగుపడ్డాడు దా సినిమాకి వెళదాం అంటారు అది ప్రియంగానే ఉంటుంది. ఆ సమయంలో ఎగ్గొట్టేసి రిలీజ్ సినిమాకి వెళ్ళడం ప్రియంగానే ఉంటుందండి కానీ హితం కాదు కదా పరీక్షలు ఉన్నాయి కదా త్వరలో చదువుకుందాం సినిమాకి ఏముంది ఇంకా నాలుగు రోజులు ఉంటుంది కదా అంట అప్పుడు వాడు ఏమంటాడో తెలుసా నాలుగు రోజుల తర్వాత ఈ సినిమా ఉంటుందో ఉండదు నాలుగు రోజుల తర్వాత ఉండని
(49:54) సినిమా నువ్వు చూడాల్సినంత పనేమ ఉందండి పని కట్టుకొని ఇక్కడ తబుక సినిమా ఏడాది ఉండబట్టే కదా మనం చూసాం ఇక్కడ నాలుగు రోజుల తర్వాత ఉండదు అంటే అంత తొందరపడ చూడడం ఎందుకండి అందుకే కదా టికెట్ రేట్లు పెరుగుతున్నాయి అన్న చోట్ల మనం చూడకపోతే ఏం పెరుగుతాయండి ఆలోచించవలసింది యువతరం ప్రియాన్ని గురించి కాదమ్మా హితాన్ని గురించి ఆలోచించాలి ఏది మనకి ఇష్టమైనదే అని కాదు ఏది మనకి మేలు చేస్తుంది అని ఆలోచించాలి అలా ఆలోచించేవాడే నిర్వాహకుడు అలా ఆలోచించేవాడే నాయకుడు దానికి వాళ్ళక అటువంటి వాళ్ళకి ప్రజార్థం తస్యవై సర్వం ప్రజలే వాళ్ళకి ముఖ్యులు ప్రజల కోసమే
(50:27) ఏదైనా చేస్తారు ఆత్మార్థం నవిధితే తమ కోసం అంటూ ఏమి మిగిల్చుకోరు ఏమి చేయరు ప్రత్యేకంగా అంతేకాదు చిరంజీవిని కుమార్ గారి దగ్గర మనం గ్రహించవలసింది ఏమిటో తెలుసా ఎప్పుడు కోప్పడాలో అప్పుడు కోప్పడేవారు ఐడియల్ కాలేజీ అధ్యాపకుల్లో నాకు మిత్రులు చాలామంది ఉన్నారు ఆ మేనేజింగ్ ఎబిలిటీ అమ్మ బాబోయ్ మేడం గారు పిలిస్తే ఆ పిలుపును బట్టి ఎందుకు పిలిచారో మాకు అర్థమయింది పిలుపును బట్టి అమ ఆ పిలుపులో ఏముందో ఏయ్ ఆయన పిలు అంటే ఒక రకం ఇదిగో ఆయన ఒకసారి పిలు అంటే ఒక రకం ఆయన ఎక్కడున్నాడయ్యా అంటే ఒక రకం అట నాకు చెప్పారండి ఆ మిత్రులు దాని పేర్లు
(51:04) చెప్పను ఎందుకంటే మైక్ మంచి ఉంటే మైక్‌లో చెప్పాలి చెడు ఉంటే చెవిలో చెప్పాలిట వివరాలు వద్దు కానీ నిర్వహణ సామర్థ్యం అది అది ఇప్పటిది కాదు వ్యాసుడు శాంతిపరంలో చెబుతాడు న్యాయకుడు అనేవాడు మేనేజర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే యస్యక్షమాచ క్రోధస్చ దానానే భయభయే నిగ్రహ నిగ్రహంసోభౌ సవై ధర్మ విదుచ్యతే ఎవరికైతే ఎప్పుడు క్షమించాలో ఎప్పుడు కోపపడాలో తెలిసిఉంటుందో వాడు నాయకుడు కోప్పడవలసిన చోడు కోప్పడాలి ప్రిన్సిపాల్ కోపం రాలేదు అంటే దద్దమ్మ అని అర్థం మరోలా శాంతమూర్తి ప్రిన్సిపాల్ గా పనికి రాడు.
(51:42) కచ్చితంగా నిర్వహణ సామర్థ్యం అంటే కోపపడాలి కానీ ఆ కోపం పెదవల మధ్యలోనుంచే రావాలి గుండెల్లోనుంచి రాకూడదు లెక్క అది గుండెల్లోనుంచి వస్తే గుండెపోటు వస్తుంది ఆయనకి గుండెల్లోనుంచి రాకుండా పెదవుల మీనుంచి వస్తే పని జరగడానికి ఉపయోగపడుతుంది తర్వాత వెంటనే మర్చిపోతాను నీ మీద నాకు కోపం ఏముందయ్యా పని జరగాలి కాబట్టి ఒ మాట అనానయ్యా అంటే ఆయన తట్టుకుంటాడు అందుచేత కోపపడకుండా శాంతంగా ఉంటాడు ఇది పెద్ద క్వాలిటీ కాదండి దాని గురించి మాట్లాడద్దు అలాగా శాంతిపర్వంలో చెప్పాడు ఈ మాట కోప్పడవలసిన చోడు కోప్పడమని చెప్పాడు లేకతే పనులు అవ్వండి
(52:11) మామూలు వాళ్ళం మనం ఉండొచ్చు కోపపడకుండా ఒక యజమాని అయిన వాడు ఎలా ఉంటాడండి ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడండి ఒక ముఖ్యమంత్రి కోపం రాకుండా ఉంటుందండి ఒక అధికారి కోపం రాకుండా ఎలా ఉంటుందండి ఉంటుంది పడాలి ఒక ఆదర్శమైన విశ్వనాథ సత్యనాడు గారు కోప్పడేవాడు ఎందుకంటే కోప్పడాలి లేకతే ఓ అడ్డమైనవాడు కవినా అనేవాడు ఆయన ఒళ్ళు మడి అనేవాడు నిజమా మరి ఆయన అన్న మాటలు ఆయనకు ఉన్నాయి కోప్పడద్దంటే ఎలాగా కోప్పడతారు వ్యవహారం సక్రమంగా నడవాలంటే కోప్పడాలండి కానీ ఆ కోపం గుండెల్లో నుంచి రాకూడదు పెదవుల్లో నుంచి రావాలి రామచంద్రమూర్తి లాగా వాల్మీకి రామాయణంలో చెప్పి కోపం
(52:42) తెచ్చుకోవాలి రాకూడదు దాన్ని తెచ్చుకోవాలి నాటకంలో ఓ పాత్ర వేసినాడు తెచ్చుకొని పాత్ర అయిపోగానే మేకప్ తీసినట్టు తీసి పారేయాలి దానితో నాకు సంబంధం రాదు మనం ఎందుకు కోపగించావయ్యా పని జరగాలి కాబట్టి పని జరగకుండా కోపగించకపోతే పని మనుషులు కూడా పని చేయరండి పెద్ద మనుషులు ఎలా పని చేస్తారు ఇక్కడ ఆ కోపం ఉండేది ఆవిడికి అందుకే ఆ పిలవడంలో నాకు అధ్యాపకులు చెప్పింది ఏమిటంటే అయబో వాడు కబురు చేసిన విధానాన్ని బట్టి మాకు వ్యవహారం ఉండేదండి ఒకసారి వెలవు ఆయన ఎక్కడున్నాడో అంటే వేరండి ఆయన ఒకసారి పిలవయ్యా ఆయన నేనే వెళ్ళ వెళ్ళాలి గనీ నాకు కొంచెం బిజీగా
(53:13) ఉన్నాను రమ్మ అంటే ఆ వ్యవహారం వేరండి ఆ చెప్పిన మనిషి చెప్పిన మాటను బట్టి ఆవిడ ఎందుకు పిలిచార అంటే ఎక్కడ కోపపడాలో అక్కడ కోప్పడుతూ ఎక్కడ క్షమించాలో అక్కడ క్షమించేవారు అంతే కాదు ఇంక్రిమెంట్ ఇచ్చే చోట జీతాలు పెంచే చోట సేవ చేయించుకునే చోట దానికి తగిన గుర్తింపు కాలేజీలో కాకపోయినా వేరే చోట ఇచ్చే చోట ఎలా ఉండేవారు అంటే దాన అదానే ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వకూడదు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి ఎక్కడ ఆపేయాలి భయ అభయే దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు తప్పు పని చేయడానికి భయపడేవారేమో చిరంజీవిని కుమారి గారు గాని మరి ఏ పనికి జీవితంలో భయపడలేదండి జీవితంలో భయపడలేదు ఆవిడ మనమేనా
(53:49) అంతే తప్పు అంటే భయం ఉండాలి పాపం అంటే భయం ఉండాలి దైవం అంటే భయం ఉండాలి పెద్దలు అంటే భయం ఉండాలి కుక్క అంటే భయం నక్క అంటే భయం వీధిలో వాళ్ళ అంటే భయం కాదని ఉండాల్సింది పాపానికి భయపడాలి తప్పుడు పని చేయాలంటే దీనికి ఏదో లంచం ఇస్తే ఎందుకయ్యా అది ఇప్పుడు ఆప ఆపేయ్ తర్వాత చూద్దాం ఏంటి తర్వాత అంత తప్పనిసరితో చూద్దాంలే ఒకవేళ లక్ష రూపాయలు ఇస్తే గాని కాదంటే ఓప వేలకు బేరవాడు అనేవాట [నవ్వు] తప్పదు కొన్ని పనులు అవ్వండిప వేలకు బేరవాడు పాపం ఎంత తగ్గితే అంత మంచిది కదా ఇది ఆవిడ లక్షణం ఆవిడ ఎక్కడ చదివారో ఎక్కడ నేర్చుకున్నారో నాకు తెలియదండి బహుశా
(54:21) తండ్రి ఎంత గొప్పవాడు భర్త అంతకంటే గొప్పవాడు వారిద్దరి నుంచి వారు ఏం నేర్చుకున్నారో వారి అన్నదమ్ముల నుంచి అక్క చెల్లల నుంచి గాని నాకు వ్యాసభారతంలో కనపడితే చదివితే ఇదే కదా చిరంజీవిని కుమారే అనుకున్నాను యస్య క్షమాచ క్రోధస్య దానా అదానే భయ అభయే ఈ లక్షణాలు తెలిసఉండవు అంతేగ నిగ్రహ అనిగ్రహం ఉభవు ఎప్పుడు నిగ్రహించుకోవాలి ఎప్పుడు అనిగ్రహం నిగ్రహాన్ని కాస్త పక్కన పెట్టి కొంచెం మందలించి మాట్లాడాలి ఇవి తెలిస్తే మేనేజింగ్ బాగుంటుందమ్మా అవసరమైన చోట మందలించాలి లేవాలి ఎవరవస్తే మనం సీట్లోనుంచి లేవాలి ఎవరవస్తే లేవకూడదు లేని తెలుసుకునే ఉండాలి కచ్చితంగా ప్రతి
(54:56) వాడికి మనం లేవాల్సిన అవసరం లేదు కొంతమందికి పదవితో నిమిత్తం లేకుండా లేవాలి మన గురువులండి మన తల్లిదండ్రులండి లేవకుండా ఎలా ఉంటాం అటువంటి వాళ్ళ ఆ గౌరవా గౌరవాలు తెలిసిన వాళ్ళు సవయ ధర్మ విదుచ్యతే అటువంటి వాళ్ళే నిజమైనటువంటి వంటి ధర్మాత్ములు అన్నారు అంటే నిర్వహణ సామర్థ్యం అంటే యువతరం దయచేసి గమనించండి తెలుగులో ఒక సామెత ఉందండి పాల కోసం రాయనా మొయ్యాలి అంటారు ఆవిడ మోష పాల కోసం రాయేనా మొయ్యాలి ఎలా వచ్చిందో తెలుసునా అండి వెనక పాలు కావిలో పెట్టి అమ్మేటప్పుడు బాగా పూర్వకాలంలో పల్లెటూలో కావిలో పెట్టి పాలు అమ్మేవారు ఆ అమ్మినప్పుడు మరి పాలు అక్కడ
(55:31) తూచాలి కదా లీటర్ షేరు అర్ధ చేరు అనేవారు కదా తూచడానికి రాళ్ళు కావాలి కదా ఆ కావిట్లో ఒకవైపు పాల బిందెలు పెట్టుకొని రెండో వైపున తిన్న మూకుడులోన తొట్టెలోన ఈ రాళ్ళు పెట్టేవారు తూకం రాళ్ళు పెట్టేవారు చూసినవాళ్ళు అనేవారు పాలు రాళ్ళు పాలు రాళ్ళు రెండు మోస్తున్నారంటే పాల కోసం రాయి మోయాలి తప్పదు మరి పాలు అమ్మకం అవ్వాలంటే రాళ్ళు ఉండాలి లేకపోతే కొలత లేకుండా రాళ్ళు ఎలా పాలు ఎలా అమ్ముతావ్ అందుకని ఆవిడ ఒకటి రెండు సార్లు సహస్రవధాన సమయంలో వాడడం చూసా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయండి వాళ్ళని ఏం చేస్తామయ్యా పాల కోసం రాయి మోయాలి కానీ వెళ్ళు తీసుకొచ్చే
(56:06) పని చేరిపేసి తర్వాత చూద్దాం ఈ పాల కోసం రాయి మోయాలి అనేది గుర్తు పెట్టుకుంటే అందరం బాగుంటాం ఇంకొక మాట చెప్పి నేను ఐదు నిమిషాల్లో సెలవు తీసుకుంటా ఎప్పుడు యజమానులైన వాళ్ళందరూ ఆల్ ది డైరెక్టర్స్ అండ్ ఆల్ ది ప్రిన్సిపల్స్ ఆల్ ది క్పిటలిస్ట్ అండ్ అదర్ ఇస్ ఆల్సో యజమాను అన్న ప్రతివాడు గుర్తుపెట్టుకోవలసిన మాట ఉద్యోగులని ఎంత ప్రేమగా చూస్తే ఆ సంస్థ అంత బాగుంటుందండి అనుమానం ఏం లేదు దాంట్లో ఉద్యోగుల సంక్షేమం వీళ్ళని ఏడిపించి మనం లాభం పొందు పొందుదామ అంటే ఎప్పుడు ఎవ్వడు బాగుపడ్డండి ఐడియల్ కాలేజీ ఇవ్వాళ ఈ దశలో ఉంది ఇంత గౌరవం ఆవిడకి జరుగుతోంది అంటే ఆవిడ
(56:46) పాటించిన నియమం ఏమిటో తెలుసా సరిగ్గా భారతంలో అనుశాసనక పర్వంలో చెప్పాన్నమాట అపీడియన్ హృచ్యవర్గం అపీడియన్ అపీడయన్ హృచ్యవర్గం ఇమై అపీడయన్ హృచ్యవర్గం ఇమం విశృతిచామమా ఇమం విశృతంచత ఇమం విశృతతంచతే అపీడియన్ భృచ్యవర్గం ఎప్పుడు వృచ్చులని సేవకులని బాధించాల్సిన అవసరం లేదు పీడయన్ భృచ్యవర్గంహి పీడయన్ భృచ్యవర్గంహి ఆత్మానమపకర్షతి కింది సిబ్బందిని జీతాలు ఇవ్వకుండా ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా పనికి ఎక్కువ పని చెప్పేసి ఈ మాత్రం చేయలేవా ఈ మాత్రం చేయలేవా అంటున్నావ అంటే ఆ యజమాని తనని తానే కిందకి లాగేసుకుంటున్నట్టు లెక్క అని
(57:32) చెప్పాడండి వ్యాసుడు అనుశాసనక పర్వంలో ఇక్కడ ఎవరికి ఏ పని చెప్పినా ఆవిడ ఆ రకంగా ఏదో ప్రయోజనం చూపించేవారు నువ్వు చేయవయ్యా ముందు నేను నేను చూసుకుంటాను కదా అని ఇంకో చోట ఎక్కడో వారికి ఆ ప్రయోజనం కల్పించేవారు ఎక్కడైనా ఒక విశ్రాంతి ఇచ్చి ఫలానా పని మీద పంపిస్తే ఆయన కాస్త పని తగ్గేలా చూసేవాన్నారు ఆ పని ఈ పని అన్ని చేయాలంటే కష్టం కదా అది జాగ్రత్తగా చూసుకుని ఆవిడని నడిపించారండి ఆ రకంగా ఎవరైతే కింది సిబ్బందిని ఉద్యోగులని పీడనకు గురి చేయకుండా పూర్తి స్వేచ్ఛ ఇస్తూనే ఓ కన్ను వేసిపెట్టి ఓ నిఘా వేసిపెట్టి జాగ్రత్తగా వాళ్ళు ఎవరు గాడి
(58:05) తప్పకుండా చూస్తారో వారు శాశ్వతంగా చిరంజీవిని కుమారి గారిలాగా ఒక నాయకురాలిగా మిగిలిపోతారండి చరిత్రలో అనుమానం లేదు ఆ విషయం ఒక్క మాట నేను తెలుగు భాషాభిమానిగా ఆవిడకి శ్రద్ధాంజలి ఘటించి విన్నవిస్తా ఇన్ని వ్యాపార కళాశాలను నడుస్తున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను వ్యాపారం చేయను కచ్చితంగా చదువు చెప్పడం ద్వారానే నా కాలేజీకి పేరు తీసుకువస్తాను నాకు నా కాలేజీ బాగుండం ఎంత ముఖ్యమో మాతృ భాష బాగుండడం అంత ముఖ్యం అని కచ్చితంగా ఇంటర్మీడియట్ లోన డిగ్రీలోన వీలైనంతవరకు రెండేళ్ళు కూడా ఇక్కడ హాజరైనటువంటి కొన్నినాలుగువేల మంది
(58:44) విద్యార్థులు ఉన్నారుట డిగ్రీ చదువుతున్న వాళ్ళు 4వేల మంది విద్యార్థులు 4వేల మంది ఇంకా తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చదువుతున్నారు అంటే చిరంజీవిని కుమారి గారి దయ చిరంజీవిని కుమారి గారి దయ చాలండి నాకు ఇది చాలు నాకు వేరే సన్మానాలు ఏమి అవసరం లేదు నేను చిన్నబ్బాయి పెద్దబ్బాయి నాకు ఫోన్ చేయగానే నేను ఏం చెప్పానంటే ఓ షరతు పెట్టా నాకు నాకు పారితోషికంగా ఏమి ఇవ్వను అంటే నేను వస్తాను అని చెప్పాను నేనుఅమ్మ అది నేను చెప్పాను నాకు ఏమి ఇవ్వడానికి వీలు లేదండి నేను వస్తాను ఆవిడ రుణం తీర్చుకోవాలండి నేను దానికి పారితోషకం
(59:17) ఏమిటండి ఇప్పుడు నాకు వస్తుంటే రెండు మూడు రోజులు బట్టి విన్నటువంటి విషయాలు విన్నాక ఇంకా నేను బాకీ పడ్డానమ్మా తెలుగు భాషకు అంత గుర్తింపు రావాలని అంత సేవ చేసి అంతిమావస్థలో ఉందేమో అని మేమంతా బుద్ధ ప్రసాద్ గారు లాంటివారు ఎన్వి రమణ గారు మేము వెంకయ్య నాయుడు గారు ఇంతమంది బాధపడి చస్తుంటే దాన్ని బ్రతికించడానికి ఇంత కృషి చేసిన ఆవిడ సభకి రావడానికి నాకంటే నిజంగా మీరు అభిమానించి గౌరవించాల్సిన వ్యక్తి మా మిత్రుడు మండల బుద్ధ ప్రసాద్ గారు నా బోటు గాడికి పనేము ఉందండి ఏదో సాయంత్రం దసరా ఉపన్యాసం ఇవ్వడం తప్ప ఆయన ఏ రాజకీయాల్లో ఉన్నారు ఎటువంటి పార్టీలో ఉన్నారు అందులో
(59:51) సంకీర్ణ ప్రభుత్వం అందులో ఉండి ఇవాళ వాళ్ళ నాయకుడు ఇక్కడ వస్తున్నాడని తెలిసుండి అంత బిజీ అయుండి ఇవాళ ఒక సాహిత్యోపన్యాసం కోసం ఇంతసేపు కూర్చున్నందుకు బుద్ధ ప్రసాద్ గారికి నేను ప్రత్యేకంగా నమస్కారాలు చేస్తున్నా ఆయన సాహిత్య ప్రీతి అటువంటి సాహిత్య ప్రీతి అటువంటిది అటువంటి వాళ్ళందరూ ఈ సభకు ఎందుకు వచ్చారు అంటే ఆవిడ సాహిత్య ప్రీతి అవధానం జరిగిన సాహిత్య సభలో జరిగిన ఆవిడ ప్రారంభోపన్యాసం చేసి దాన్ని పద్ధతిగా నడిపించి నడిపించేవారు అటువంటి చిరంజీవిని కుమార్ గారి యొక్క నాయకత్వ లక్షణాలని నిర్వహణ సామర్థ్యాలని ఈ యువతి యువకులు నేర్చుకోవడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం
(1:00:27) ఉపయోగపడినా నేను ధన్యుడిని నాకు మీకు వారిదిగా నిలబడిన ఆంధ్ర భాష ధన్యమైంది సెలవు మాట మనిషిని మారుస్తుంది. మంచి మాట సమాజాన్ని మారుస్తుంది. అలాంటి తమ అమూల్యమైన మాటలతో అద్భుతమైన ప్రసంగంతో మనందరికీ జ్ఞానాన్ని జీవిత విలువలను అందించిన గౌరవనీయులు పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ [సంగీతం]
(1:01:15) [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment