Wednesday, October 14, 2026

 🦚జ్ఞానప్రసూనాలు🚩

1) నేను బద్ధుడిని' అనేది ఎంత అసత్యమో, 'నేను విముక్తుడిని' అన్నది కూడా అంతే అసత్యం. ఈ రెంటిలో ఉమ్మడిగా ఉన్న 'నేను'ను కనిపెట్టి, దానికి అతీతంగా వెళ్లండి.

2) సత్యాన్ని చూడటమనే స్థితే లేదు.  చూచేవారెవరు? చూడవలసినదేమిటి? ‘సత్యంగా' ఉండగలరు. అంతే. ఎటుతిరిగీ ఆ మాటకొస్తే, మీరు ఇప్పటికే 'సత్యం'గా ఉన్నారు కూడా. ఈ సమస్య కేవలం మానసికమే. అసత్యమైన అన్ని ఆలోచనలనూ. భావనలనూ వదిలిపెట్టండి. అంతేచాలు.

3) ఈ కలలో చిక్కుకుని మీ నిజమైన సత్తాను మీరు మర్చిపోయారు. లేని ప్రపంచం మీద జాలి చూపకండి. మీలో ఉన్న అహంత మీదా, స్వీయం మీదా జాలి చూపండి.

4) రెండే మార్గాలు-

1. నిస్స్వభావంగా గుర్వాజ్ఞ పాటించడం.

2. స్వీయవిచారణకు పూర్తిగా అంకితమైపోవడం.

5) విభజించే ఈ కుడ్యాన్ని పగలకొట్టండి. 'నేను దేహాన్ని' అన్న భావన పోతే అంతర్గతమూ, బాహ్యమూ అనేవి ఏకమౌతాయి.

No comments:

Post a Comment