Sunday, August 28, 2022

మదర్ తెరిసా అసలు రూపం.

 *మదర్ తెరిసా అసలు రూపం.*

మీరు *ద అన్ టోల్డ్ స్టోరీ* అనే పుస్తకం కూడా చదవండి.

కేన్సర్ బాధ భరించలేక మూలుగుతుంటే, జీసస్ క్రీస్తు నిన్ను ముద్దెట్టుకుంటున్నాడని మదర్ తెరిసా అన్నదట. అందుకు బదులుగా ఆ వ్యాధిగ్రస్తుడు, దయచేసి నన్ను ముద్దెట్టుకోవద్దని సిఫారసు చేయమని ఆమెను అడిగాడట. జీసస్ చేత ముద్దు పెట్టించుకోవడానికి ఎవరు మాత్రం చనిపోతారు...!!

ఇది జరిగింది కలకత్తాలోని మదర్ తెరిసా "పిల్లల ఆశ్రమం" లో. ఆమె నిర్వహించిన అనాథపిల్లల గృహాలలో పిల్లలకు రోగాలొస్తే, నయం కావడానికి మందులు వాడేవారు కాదు. ప్రార్థనలు చేసేవారు. అది వారి విశ్వాసం. సుప్రసిద్ధ బ్రిటిష్ మెడికల్ మ్యాగజైన్ "లాన్సెట్" ఎడిటర్ రాబిన్ ఫాక్స్ స్వయంగా 1991లోనే కలకత్తాలో ఈ దృశ్యాలు చూచారు. అలాగే విశ్వవిఖ్యాత జర్నలిస్ట్ క్రిస్టోఫర్ హిచెన్స్( Christopher hitchens) కూడా స్వయంగా మదర్ తెరిసాను కలస్తే ఇలాంటి సంఘటనలే చూసారు.

అయితే మదర్ తెరిసాకు గుండెపోటు వస్తే, ప్రార్థన చేస్తూ, జీసస్ క్రీస్తు ముద్దుపెట్టుకున్నాడని అనుకుని సరిపెట్టుకున్నారా? స్టార్ హోటళ్ళ వంటి కార్పొరేట్ ఆస్పత్రులలో చేర్చారు. ఏమిటీ విచక్షణ? అలాంటి ప్రశ్నలు "భారతరత్న" మదర్ తెరిసా గురించి వేయకూడదంతే? మీరు అడక్కూడదు అంతే?

మదర్ తెరిసా పేరుమార్చి,ఊరుమార్చి పోప్ దృష్టి ఆకర్షించి, నోబెల్ ప్రైజ్ గ్రహించింది. భోపాల్ లో ఒకరోజు పొద్దున్నే నిద్రలేచే సరికి వేలాది కార్మికులు, పిల్లలు, తల్లులు యూనియన్ కార్బైడ్ విషవాయువులు కారణంగా చనిపోయారు దాంతో  దానికి కారణం అయిన అమెరికా కంపెనీ యాజమాన్యం ఖంగుతిన్నది. కలకత్తానుండి హుటాహుటిన భోపాల్ చేరుకున్న మదర్ తెరిసా జీవకారుణ్యంతో ఒక విజ్ఞప్తి చేసింది. కార్మికులనుద్దేశించి ప్రకటన చేసిందని భ్రమపడితే పొరపాటే. యాజమాన్యాన్ని క్షమించమని మదర్ తెరిసా కోరింది. అది ఆమె ప్రత్యేకత!
1976లో హైదరాబాద్ లో నేను మదర్ తెరిసాను ఇంటరర్వూ చేసాను. 

అప్పట్లో ఆంధ్రజ్యోతి బ్యూరోఛీఫ్ గా నేను పబ్లిక్ గార్డెన్స్ లో ఒక కార్యక్రమం సందర్భంగా మదర్ తెరిసాతో మాట్లాడాను. ఏది అడిగినా ఆమె సమాధానం ఒక్కటే, అంతా దైవకృప అనీ, పరిష్కారానికి యేసు ప్రార్థన మార్గమని చెప్పడమే. చాలా నిరుత్సాహపడ్డాను. ఆమెనుండి నేను ఏవో సమాధానాలు ఆశించడం పొరపాటని గ్రహించాను. అయితే అప్పట్లో ఆమెకు మద్దతుగా బలమైన క్రైస్తవ మతం, ప్రభుత్వాలు, పాలకవర్గాలు ఉన్నందువల్ల సాగిపోయింది. మదర్ తెరిసా గురించి చాలామందికి చాలా విషయాలు తెలియవని, గుడ్డినమ్మకమే ఆధారమని గ్రహించాను. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు, ఎంతో మంది యువతులు చెరచబడి పారిపోయి, ఇండియా వచ్చారు. అయినా సరే, వారెవరూ గర్భం తొలగించుకోరాదని అదంతా దేవుడిచ్చిన వరమని అని మదర్ తెరిసా ప్రకటించింది. అది ఆమె జీవకారుణ్యానికి, దైవభక్తి గీటురాయి.
ఐర్లాండ్ లో కేథలిక్కులు అత్యధికంగా ఉన్నచోట గర్భస్రావం, విడాకుల విషయం పార్లమెంటులో చర్చకి రాగా, మదర్ తెరిసా గూడా కల్పించుకుని తన మత ప్రకారం విడాకులు, గర్భాన్ని తొలగించుకోవడం ససేమిరా వీలుకాదన్నది.

కానీ డయానా యువరాణి విడాకులు తీసుకుంటుంటే అది దైవేచ్ఛ అని మదర్ తెరిసా దీవించింది. ఆమెది నాలుకేనా అనబోకండి. డబ్బు,పలుకుబడి, ఆకర్షణ ఉన్న డయానా ప్రభావమే వేరు. మదర్ తెరిసా అక్కడ అవకాశవాదం చూపించింది.

ఇలాంటివి ఏకరువు పెట్టడం ఈ రచన ఉద్దేశం కాదు. లోకానికి తెలియని మదర్ తెరిసా గురించి నిజాలు చెప్పడమే ముఖ్యం. నీవు ఎన్ని నిజాలు చెప్పినా, మదర్ తెరిసా కీర్తి తగ్గదు అంటారా? వారికి నమస్కారాలు.
మదర్ తెరిసా(1910-1997) తల్లిదండ్రులు పెట్టిన పేరుకాదు. ఆమె పుట్టింది మాసడోనియా దేశంలోని స్కోపీజేలో(Skopje). సోదరి, సోదరుడు ఉన్నారు. క్రైస్తవమత శాఖలో నన్స్(సన్యాసినులు) అయ్యే ఒక సాంప్రదాయం పాటించి, 15వ యేట ఈమె ఐర్లాండ్ వెళ్ళింది. అక్కడినుండి ఇండియాలో కలకత్తా చేరుకున్నది. 1929లో కొన్నాళ్ళు టీచర్ గా చేసి, చివరకు నన్(nun) గా కుదురుకున్నది. తొలిపేరు ఆగ్నస్ గోంషా బొజాక్సు(Anjezë Gonxhe Bojaxhiu).

చిన్నపిల్లల్ని సేకరించి, అనాధశరణాలయాలలో పెట్టడం క్రైస్తవ మతప్రచారంలో ఒక భాగం. ఆ కార్యక్రమం మదర్ తెరిసా చేపట్టింది. చిన్నప్పుడు పిల్లల్ని రాబడితే, వారిని ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చనేది సెయింట్ అగస్టీన్( Saint Augustine) మూలసూత్రం. జెసూట్ ఫాదరీలు కూడా అదే పాటిస్తారు. నన్స్ కూడా ఆ దోవలో నడుస్తారు. మదర్ తెరిసాకు కలకత్తా వీధులు కావలసినంతమంది పిల్లల్ని అందించాయి. ఛారిటీస్ రావడం మొదలైంది. దాంతో అనేకచోట్ల, వివిధ దేశాల్లో పిల్లల అనాధశరణాలయాలు స్థాపించారు.

పిల్లలకు జబ్బుగా ఉన్నప్పుడు ప్రార్థనలు చేయడం, చనిపోతున్న వారి పక్కన నిలబడి మత విధులు ఆచరించడం మదర్ తెరిసా ఆశ్రమం ఆచారమే. ఆ విధంగా మతమార్పిడి సున్నితంగా చాపకింద నీరువలె ఆచరించారు. అసలు ఉద్దేశం అది కాదంటుండేవారు! ప్రపంచ వ్యాప్తంగా కేథలిక్కులు, వారి సంస్థలు మదర్ తెరిసా సేవల్ని వూదరగొట్టాయి. పొప్ కూడా పొగిడాడు. దాంతో గుర్తింపుతోబాటు దేశదేశాల నుండి డబ్బు కూడా రావడం మొదలైంది. డబ్బు సేకరించడానికి కేథలిక్కులు అనుసరించే అనేక మార్గాలలో ఛారిటీస్ సంస్థలు ముఖ్యం. మదర్ తెరిసా అరమరికలు లేకుండా వసూళ్ళు చేసింది.

హైతీదేశపు పాలకులుగా, నరహంతకులుగా ప్రజల్ని 
నలుచుకుతిన్న డ్యువలియర్ కుటుంబానికి మదర్ తెరిసా సన్నిహితురాలైంది. జీన్ క్లాడ్ డ్యువలియర్(Jean-Claude Duvalier) ఆమెకు సన్మానాలు చేసి, డబ్బిచ్చింది. మదర్ తెరిసా తన సత్కారానికి సమాధానంగా డ్యువలియర్ కుటుంబం పేదల ప్రేమికులని ఉపన్యసించింది. అంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదు.

అమెరికాలో అప్పులిస్తానని నిధులు సేకరించి, మోసగించిన ఛార్లెస్ కీటింగ్ (Charles keating) జైల్లో పడ్డాడు. 252 మిలియన్ డాలర్ల మోసగాడికి జైలు శిక్ష తప్పించమని మదర్ తెరిసా జడ్జికి ఉత్తరం రాసింది! కీటింగ్ 1.25 మిలియన్ డాలర్లు ఆమె నిధికి ఇచ్చాడు. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తే కోటింగ్ చేతిలో మోసపోయిన కొందరినైనా ఆదుకుంటామని అడ్వకేట్ అడిగాడు. జవాబు లేదు. రాబర్ట్ మాక్స్ వెల్ అనే పత్రికా ప్రచురణ కర్త 450 మిలియన్ పౌండ్లు వాటాదార్ల దగ్గర మోసం చేసినప్పటికీ అతని వద్ద మదర్ తెరిసా డబ్బు పుచ్చుకున్నది. న్యూగినీ దేశంలో మతమార్పిడులు విపరీతంగా చేయించింది.

భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితిని పొగుడుతూ ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఉద్యోగాలు బాగా లభిస్తున్నాయని, సమ్మెలు లేవని మదర్ తెరిసా సర్టిఫికెట్ ఇచ్చింది. అందువల్లనే అనలేంగానీ, ఆ తరువాతే ఆమెకు భారతరత్న లభించింది.

మదర్ తెరిసా ట్రస్టులకు సంబంధించి భారతదేశంలో డబ్బు పెట్టకుండా విదేశీ బాంకులలో దాచారు. చివరకు అంతా వాటికన్ బాంకుకు ముట్టింది. ఆమె చనిపోయేనాటికి ఒక్క న్యూయార్క్ లోనే 50 మిలియన్ డాలర్లు మూలుగుతున్నాయి. చట్టప్రకారం ఛారిటీస్ కు వసూలైన డబ్బు వేరే ఖర్చు చేయకూడదు. మదర్ తెరిసాను అడిగెదెవరు?
సుప్రసిద్ధ జర్నలిస్ట్ క్రిస్టోఫర్ హిచిన్స్, తారిక్ అలీ ఇంగ్లాండ్ లో ఒక డాక్యుమెంటరీ తీసి (హెల్స్ ఏంజిల్) ఛానల్ 4లో మదర్ తెరిసా గుట్టురట్టు చేసారు. 'ది మిషనరీ పొజిషన్'( the missionary position) శీర్షికన హిచిన్స్( Christopher hitchens) ఒక పుస్తకం వెలువరించారు. సునంద దత్త రే కూడా నిశిత పరిశీలనా వ్యాసాలు రాసారు. అరూప్ ఛటర్జీ 'న్యూ స్టేట్స్ మెన్'లో 1997 సెప్టెంబర్ 26న తీవ్ర పరిశీలనా వ్యాసం రాసారు. ధీరుషా ఇండియాలో మతమార్పిడిలు చేసిన మదర్ తెరిసా గురించి రాసారు. మదర్ తెరిసా వసూళ్ళ గురించి జర్మనీలో స్టెరన్ అనే పత్రిక విచారణ జరిపింది. నిధులు ఎంత,ఎక్కడ ఉన్నాయి? ఎలా ఖర్చు చేస్తున్నారని అడిగితే చెప్పలేదు. అంతా రహస్యం అన్నారు.

స్టెర్న్ పత్రికలో వాల్టర్ వ్యూలెన్ వెబర్ 1998 సెప్టెంబర్ 1న సుదీర్ఘ విమర్శలు చేస్తూ మదర్ తెరిసా నిధులు, బాంకులో దాచి, పిల్లలకు ఖర్చు పెట్టని తీరు, చివరకు రోమ్ బాంకుకు చేర్చిన విధానం బయట పెట్టాడు. సుజన్ షీల్డ్స్ లోగడ మదర్ తెరిసా వద్ద పనిచేసి విసుగుతో బయటపడి న్యూయార్క్ లో డబ్బు విషయాలు వెల్లడించింది.

కలకత్తా వీధుల్లో మదర్ తెరిసాకు దానంగా వచ్చిన బట్టలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం, పేదపిల్లలు ఆమె ఆశ్రమాల్లో దిక్కులేక ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో బ్రతకడం వెల్లడయ్యాయి. ఏమైతేనేం,మతం ఆమెకు చాలా మంచి ప్రచారం చేసిపెట్టింది.
మదర్ తెరిసా చనిపోగానే, పోప్ జాన్ పాల్ కొత్త ఎత్తుగడకు నాంది పలికాడు. మతవ్యవస్థలో చనిపోయిన వ్యక్తిని సెయింట్ చెయ్యాలంటే రెండు అద్భుతాలు చూపాలి. కనీసం 5 సంవత్సరాలు వేచి ఉండాలి. మతవ్యాపారంలో పోప్ ఆరితేరిన వ్యక్తి కనుక. అంత జాప్యం లేకుండా మదర్ తెరిసాను సెయింట్ చేయడానికి పూనుకున్నాడు. 19 అక్టోబర్ 2003లో అందుకు తొలిప్రక్రియ ప్రకటించాడు.

ఇక అద్భుతాల సృష్టి ఎలా జరిగిందో చూద్దాం. పశ్చిమబెంగాల్ లో ఆదివాసి కుటుంబానికి చెందిన మోనికాబస్రా అనే ఆమెకు 5గురు పిల్లలు. పేదకుటుంబం. ఆమెకు చికిత్స చేయగా, కడుపులో పెద్ద గడ్డ వచ్చింది. బాలూర్ ఘటా ఆస్పత్రిలో డా॥రంజన్ ముస్తాఫ్ చికిత్స చేయగా, కడుపులో గడ్డ పోయింది. మోనికాబస్రా ఒకనాడు కలలో మదర్ తెరిసాను చూసినట్లు, ఆమె సమాధిని సందర్శించినట్లు, దాని ఫలితంగా ఆమెకు ఉన్న కడుపులో గడ్డ మాయం అయినట్లు కథ సృష్టించారు. తొలుత అది సరైనది కాదని ఆమె భర్త సీకో అన్నాడు. తరువాత వారి పిల్లల్ని క్రైస్తవబడిలో చేర్చడం, వారికి కొంతభూమి సమకూర్చడంతో, అద్భుతకథ నిజమేనని చెప్పించారు.

మదర్ తెరిసా బ్రతికుండగా అనాధపిల్లల పేర నిధులు వసూలు చేసి, రోమ్ కు చేరవేస్తే, చనిపోయిన తరువాత సెయింట్ పేరిట డబ్బు వివిధ రూపాలలో వసూలు అవుతుంది. ఇది కొన్నాళ్ళు సాగుతుంది. దీన్నే మతవ్యాపారం అనవచ్చు. ఇలా నిత్యనూతనంగా భక్తుల్ని వంచిస్తూ పోవడం ఆధ్యాత్మిక ప్రక్రియలో అనుచానంగా వస్తున్నది. ఇక మదర్ తెరిసా ఫోటోలు, విగ్రహాలు, రకరకాల చిహ్నాలకు ఏ మాత్రం కొదవలేదు.

మీరు *ద అన్ టోల్డ్ స్టోరీ* అనే పుస్తకం చదవండి.

మధర్ థెరీసా మాయాజాలం pdf ebook download link

Saturday, August 27, 2022

నీలోనే అన్నీ ఉన్నాయి

 నీలోనే అన్నీ ఉన్నాయి
             

*నీవు కావలన్నది సాధించుకోవాలంటే నీలో ఉన్న శక్తిని నీవు విశ్వసించాలి.

*నిజమైన సంతోషం కోసం బయట ఎక్కడ ఉంది  అని వెతకకు, అది నీ అంతరంగంలోనే  అంతర్యామి అయిన  అంతరాత్మలోనే ఉంటుంది.

*సంతోషానిచ్చేది సంపదలు, అంతస్తులు లేదా వైభవం కాదు, ప్రశాంతమైన మనసు వృత్తి మాత్రమే.

*నిరంతరము నిన్ను ఎవరో కనిపెట్టి చూస్తున్నారన్న సృహతో నీవు ప్రవర్తించు.

*మన సమస్యలకు, మన దుఃఖాలకు, మన బాధలకు పరిష్కారాలు మన దగ్గరే ఉంటాయి, కాని ఎవరో పరిష్కరించాలని అనుకుంటాము.

*సంతోషం అనేది ఎంతో మధురమైనది కాని ఆ మాధుర్యం పొందాలంటే ఎంతో వేదన పడాలి.

*విజయం సాధించడంలో ఎవరూ నిన్ను మోసము చేయలేరు - నిన్ను నీవు మోసం చేసుకుంటే తప్ప.

*నీలో ఉన్న శక్తిని నీవు తెలుసుకున్నపుడే గమ్యం చేరగలము, ముందు నీ గురించి నీవే పరిశోధిoచుకో.

*నిన్ను నీవు విమర్శించుకో , నిన్ను నీవు పురికొల్పుకో , నిన్ను నీవే పరీక్షించుకో , దీని వలన నీవు సదా జాగ్రత్తతో సురక్షితంగా ఉంటావు , కాలము సుఖంగా గడుస్తుంది.

*నీ శత్రువులు నీలోనే ఉన్నారు, నిజానికి వేరే శత్రువులు ఎవరు లేరు, తప్పుతోవ త్రొక్కే నీ మనసే నీ శత్రువు అని తెలుసుకో.

*నిన్ను నీవు మోసగించుకున్నంతగా , ఇంకొకరెవరూ నిన్ను మోసగించరు.

*దేనినైనా ఆశించబోయే ముందు అందుకు కావలసిన అర్హతను సంపాదించుకో – తనను తాను జయించుకోగల వ్యక్తి అన్నింటిని జయించగలడు.

*దీపము తానూ వెలుగుతూ ఉంటేనే మరో దీపాన్ని వెలిగించ గలదు.

*నీమీద నీకు నమ్మకం పెరుగుతున్నప్పుడు, నీ సమర్ధత కూడా పెరుగతుంది.

*అనుభవం నుంచి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

భక్తి లేని జ్ఞానం వృథా!

 🌺🪔భక్తి లేని జ్ఞానం వృథా!🪔🌺

🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼

🌿‘సంపూర్ణ జ్ఞానం’ ఉన్నవారు (ఆత్మజ్ఞానులు) నిండుకుండల వంటివారు.

🌿తొణకరు, బెణకరు. వీరు సాధారణంగా ఎవరితోనూ ఎక్కువగా సంభాషించరు. అవసరం మేరకు మాత్రం పెదవి విప్పుతారు. మంచిని పెంచుతూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు.

 🌿జ్ఞానులు మంచి భక్తులుగా మారి భగవంతునికి దగ్గర కావాలని కోరుకుంటారు. లోకంలో వీరు చాలా కొద్దిమంది, అత్యంత అరుదుగానే ఉంటారు. వీరు దేనినీ పెద్దగా కోరుకోరు. లౌకిక విషయాలేవీ పట్టవు. వీరికి కావలసిందల్లా భగవంతునికి ఆత్మార్పణం చేసుకొని, అతనిలో ఐక్యం కావడమే. అందుకోసమే నిరంతరం సాధన చేస్తుంటారు.

 🌺‘ఆత్మజ్ఞానులు’ చేసే పనులు ఎంతో విజ్ఞతతో కూడుకొని ఉంటాయి.

🌿మానవుడు తన జ్ఞానంతో ఎన్నింటినో (విద్యుత్‌ బల్బ్‌, ఫ్యాన్‌, రిఫ్రిజిటర్‌ వంటి విద్యుత్‌ పరికరాలు) కనుగొన్నాడు. ఇవన్నీ కూడా స్వయంప్రతిపత్తి (స్వీయశక్తి)ని కలిగినవి కావు. వాటిని విద్యుచ్ఛక్తితో అనుసంధానిస్తేనే పనిచేస్తాయి. ఎలాంటి జ్ఞానం ఉపయోగించకుండానే వాటి స్విచ్‌ ఆన్‌ చేస్తే సరి. జ్ఞానం లేనివారు కూడా ఇంతే. అజ్ఞానంతో లోపభూయిష్టమైన జీవితాలు గడుపుతుంటారు. జ్ఞానం లేనివాని జీవితం కష్టాలమయంగా ఉంటుంది. అతను తాను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుక్కుంటుంటాడు. 

🌿ఒకసారి ఈ దృశ్యాన్ని ఆకాశంలో విహరిస్తున్న ‘పార్వతీ పరమేశ్వరులు’ చూసి, తమలో తాము ఇలా అనుకున్నారట. ‘జ్ఞానం లేని ఇతను నిజంగానే పెద్ద మూర్ఖుడు. కొమ్మ విరిగాక అతను కిందపడి పోవడం ఖాయం. అప్పుడు అతను ‘అమ్మా’ అని అరిస్తే నేను రక్షిస్తాను. ‘నాన్నా’ అని కేక వేస్తే మీరు రక్షించండి’ అందిట పార్వతి. 

🌿ఇద్దరూ ‘సరే’ అని ఆ వ్యక్తివైపు చూడసాగారు. అతడు పడిపోతూ, ‘చచ్చాను..’ అని అరిచాడు. ఇద్దరిలో ఎవరినీ తలచుకోలేదు. ‘ఆపదల నుంచి గట్టెక్కించమని’ ఆపద్భాందవుని వేడుకుంటేనే కదా కాపాడేది!

🌿ఇటువంటి ‘బుద్ధి’ (వివేచన) నిజానికి మనిషికి జ్ఞానం ‘ఉంటేనే’ పుడుతుంది. ‘కొంత ధీశక్తి, పరిశీలనా పటిమతో ఈ సమస్త విశ్వాన్ని నడిపించేవాడు ఎక్కడ, ఎలా ఉంటాడు?’ అనే కుతూహలంతో నిరంతరం సాధన చేసేవాడే జ్ఞాని.

 🌿అతనిపై ఎలాంటి ఐహికమైన కోరికలు ప్రభావం చూపవు. ఒక్క పరమాత్మ సాన్నిధ్యం తప్ప, అతనికి మరేదీ అక్కరలేదు.

🌿 ‘ప్రియో హి జ్ఞానినో త్యర్థం అహం సచ మమ ప్రియః’ (భగవద్గీత: 7-17).

🌿 ‘నాకు జ్ఞాని అయినవాడు అత్యంత ప్రియుడు. నేనూ అతనికే మిక్కిలి ప్రియుడను’ అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు.

 🌿‘జ్ఞానికి నేను తప్ప ఇంకేమీ అవసరం లేదు. తన్ను తాను నాకు సమర్పించుకుంటాడు. ఆత్మార్పణ బుద్ధితో, శరణాగత భావంతో నన్ను సమీపిస్తాడు. నేను అతనిని కృపాదృష్టితో, ప్రేమభావంతో చూడకపోతే అతని శరణాగతి, ఆత్మార్పణం అర్థం లేకపోగా, అవి వృథా అవుతాయి కదా. అందుకే, నేను అతణ్నే ప్రేమిస్తాను. అతనంటేనే నాకంత ఇష్టం.’ అన్నది పరమాత్మ భావన.

🌿మనస్తత్వ శాస్త్రం ప్రకారం స్వార్థరహిత ప్రేమ చూపగలిగితే దీర్ఘకాలిక శత్రువు కూడా ప్రేమమూర్తిగా మారిపోతాడు. 

🌿ఈ లోకంలో భక్తి, జ్ఞాన మార్గాలు రెండూ వేర్వేరు. ఒకరకంగా ఇవి రెండు ‘విరుద్ధాలు’ కూడా. ఇక్కడ జ్ఞానియే భక్తుడు కూడా అవటం విశేషం. ‘భక్తి లేని జ్ఞానం’ నిస్సారమైంది. ‘ఆత్మజ్ఞానం’ అనేది సాధన ద్వారానే సాధ్యం. ఆత్మజ్ఞానులు సమస్త జీవకోటి, మానవ కల్యాణానికి బాటలు వేస్తారు.

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 

⛰️తిరుమల ఏడుకొండలు ఈ ఏడు శక్తి స్థానాలకి ప్రతీక🍁

 *⛰️తిరుమల  ఏడుకొండలు ఈ ఏడు శక్తి స్థానాలకి ప్రతీక*🍁

📚✍️ మురళీ మోహన్

1. నిద్రిస్తూ ఉన్న కుండలినీ శక్తిని మేలుకోలపటమే ధ్యానం, ఇది క్రియాయోగం వల్ల సాధ్యపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి మూలాధార చక్రాన్ని  తాకుతుందో అప్పుడు ఈ నిద్రిస్తూ ఉన్న శక్తిని మనం శేషువు తో పోల్చాము, అంటే నిద్రిస్తున్న పాము, అది మేలుకొంటుంది. అందుకే మొదటి కొండకి శేషాద్రి అని  పేరు. 

2.  ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని శక్తి స్వాధిస్టాన చక్రాన్ని  తాకుతుంది,  ఇప్పటికి సాధకుడికి నూటికి 40% సాధించినట్లు. సాధన పట్ల కోరిక, పరమాత్మను కనుక్కోవాలనే ఆరాటం మొదలవుతాయి. ఇక్కడ అంటే స్వాధిస్టాన చక్రం వద్ద వినిపించే శబ్దం వేణుగానం. వేదా అంటే వినటం అని అర్ధం, అందుకే రెండవ కొండకి వేదాద్రి అని పేరు.

3.  ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి    మణిపుర చక్రాన్ని తాకుతుంది,  ఇప్పటికి సాధకుడికి నూటికి 60% సాధించినట్లు, ఇప్పటికి సెల్ఫ్ కంట్రోల్ వచేస్తుంది, జ్ఞాన శక్తి పెరుగుతుంది, గ్రహణశక్తి పెరుగుతుంది. "గ ' కార శబ్దం జ్ఞానానికి ప్రతీక, ఇక్కడికి వచ్చేటప్పటికి సాధకుడు జ్ఞానారూడుడు అవుతున్నాడు. అందుకే మూడవ కొండకి "గ"రుడాద్రి " అనే పేరు. 

4. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి   అనాహత చక్రాన్ని తాకుతుంది,  ఇప్పటికి సాధకుడికి నూటికి 80% సాధించినట్లు.  ఇప్పటికి సాధకుడికి స్థూల శరీర స్పృహ తగ్గుతుంది.  శరీరం చాల తేలిగ్గా, గాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది,  సాధకుడు వాయుపుత్రుడైన ఆంజనేయుడే అవుతాడు.  అందుకే నాలుగవ కొండకి "అంజనాద్రి " అని పేరు.

5.   ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి   విశుద్ధ  చక్రాన్ని తాకుతుంది,  ఇప్పటికి సాధకుడికి నూటికి 100% సాధించినట్లు,  భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. సంసార చక్రాలన్నీ దాటేస్తాడు, అన్ని బంధాలు విడిపోతాయి. ప్రాణ నియంత్రణ శక్తి వస్తుంది . ఇంక పరమాత్మ వైపు పరిగెడుతూ ఉంటాడు. ఎద్దుకి అచ్చు వేసి వదిలేస్తే ఎలా దాని ఇష్టం వచ్చినట్లు పరిగెడుతుందో అలాగ. అందుకే ఐదవ కొండకి వృషభాద్రి  అని పేరు. 

6.  ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని తాకుతుంది. ఇప్పుడు దాటి వచ్చిన ఆరు చక్రాలు ఆరు పడగలు విప్పినట్లు అనుకుంటే, ఆ పడగలు కామ, క్రోధ , లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరు అరిషడ్వర్గాలని శ్రీకృష్ణుడు కాళీయ మర్ధనుడై దర్శనమిస్తూ సాధకుడి నుంచి పోగొట్టినట్లు అనుభూతి పొందుతాడు.  మహా వెలుగు, తనే వెలుగైనట్లు  అనుభూతి చెందుతాడు. ఇప్పటికి సాధకుడికి, భగవంతుడు ఎదురుగానే ఉంటాడు. తనకి పరమాత్మకి మద్య ఇంకేమి లేదు.  పరమశాంతి కలుగుతుంది. అది ఆరవ కొండ  వేంకటాద్రి.  
  
7. తరువాత సాధకుని కుండలిని శక్తి  సహస్రార చక్రాన్ని తాకుతుంది, ఇది పరమాత్మ చక్రం. ఇంక  అక్కడ సాధకుడు లేడు, నారాయణుడే ఉన్నాడు, సాధకుడు తనే పరమాత్మ అవుతాడు, నారాయణ అంటే వ్యాపించటం అని అర్ధం. అంతటా తానేయై వ్యాపించేవాడు కాబట్టి నారాయణుడు. అందుకే ఏడవ కొండ నారాయణాద్రి. 

ఇది యోగ పరంగా తిరుమల ఏడు కొండల అంతరార్ధం.
ఇంతే కాకుండా మనం ఎక్కేటప్పుడు మెట్లని కూడా observe చేస్తే అర్ధం అవుతుంది, అవన్నీ ఇలా  8,16,24,32.... (multiples of eight) లో ఉంటాయి. దీన్ని మనం అష్టాంగయోగం చెయ్యమని చెపుతున్నట్లు అన్వఇంచుకోవచ్చు.   ఎందుకంటే అష్టాంగయోగం అంటే  యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ,  ధ్యాన సమాధి. 
భగవంతుణ్ణి చేరుకొనే ఏడు క్రియలని (కొండల రూపంలో) -- ఎనిమిది యోగాలని (అష్టాంగయోగం) మెట్ల రూపంలో బాలాజి మనందరికి కళ్ళముందు ఉంచారు. కళ్ళు తెరిచి చూస్తే నారాయణులం, తెరవకపోతే నరులం.  ఓం నమో వెంకటేశాయ నమః..🙏

నేటి ఆచార్య సద్భావన

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀48.
నేటి... 

            నేటి ఆచార్య సద్భావన
                   ➖➖➖✍️

    ఈ మానవ జన్మ మళ్లీ మళ్లీ వచ్చేటటువంటిది కాదు. 

ఈ ప్రాణమూ దేహమూ శాశ్వతంగా ఉండిపోవు కూడా.

ఇది మాయామయమగు లోకము కనుక ఇక్కడ దొరికే సుఖాలు కూడా మాయతో కూడినవే!

ఇది స్వార్థపూరితమైన ప్రపంచం కనుక ఇందులో ఉండే బంధాలన్నీ స్వార్థపూరితమైనవే! 

ఇక్కడ మనదంటూ బయట ఏదీ లేదు. మనదంటూ ఏదైనా ఉందంటే అది మన లోపలే ఉంటుంది. అదియే ఆత్మానందము.

ఈ ఆత్మానందము చిక్కవలెనంటే పరలోకమునందే! పరలోకమనగా ఎక్కడో ఆకాశం పైన లేదు! మనలోనే ఉంటున్నది.

కుండలో పాలుపోసి కవ్వముతో బాగుగా చిలికినపుడు వెన్న రావడం జరుగుతుంది.

అదే విధముగా మనస్సును భగవన్నామమనే కవ్వంతో బాగా చిలకాలి. అపుడే ఆత్మానందమనే వెన్న లభిస్తుంది.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

ప్రాయశ్చిత్తం

ప్రాయశ్చిత్తం

🔹🔸🔹🔸🔹🔸

మనం చేసిన పాపాలకి శిక్ష ఉంటుందని తెలుసు. కానీ తెలియకుండా కొన్ని, తెలిసి కొన్ని చేసేస్తూ ఉంటాం. 

ఈ విషయంలో మన సనాతన ధర్మంలో స్పష్టమైన విశ్లేషణ ఉంది. 

మనం చేసే అన్ని తప్పులు (పాపాలు) మూడిటితోనే చేస్తాం. 

(1) కాయిక (శరీర గత); 
(2) వాచిక (మాటతో); మరియు
(3) మానసిక (మనసుతో). 

ఆ తప్పులు ఏమిటో తెల్సుకుని వాటిని ఎలా అరికట్టవచ్చో చూద్దాం.

ఒకవేళ ఆ తప్పులు చేసినట్లైతే ప్రాయశ్చిత్తానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ మూడు విధములైన తప్పులకు మూడు విధములైన తపస్సులు చెప్పేరు. ఇవి ఎవరికి వారే వ్యక్తిగతంగాపరీక్షించుకుని మార్పు చెందే సుళువైన మార్గం.

(1) కాయిక (శరీరగత) పాపములు: మనుధర్మ శాస్త్ర ఆధారంగా…

అదత్తాముపాదానం హింసాచైవా విధానతః, పరదారోపసేవా చ శరీరం త్రివిధం స్మృతం.

అన్యాయముగా డబ్బు సంపాదించడం, హింస చేయడం, శాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం, పరస్త్రీ సంగమం.. ఇవి శరీరముతో చేసే పాపములు (తప్పులు).

ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…

దేవ ద్విజ గురు ప్రాఙ్ఞ్య పూజనం శౌచమార్జవం, బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే.

దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, ఙ్ఞానులను పూజించడం, శరీరమును శుచిగా ఉంచడం, పవిత్రమైన ఆచారములు, డబ్బును, ఇతర ద్రవ్యములను న్యాయముగా సంపాదించడం, బ్రహ్మచర్యము (తన భార్యతో తప్ప ఇతర స్త్రీలయందు కామ దృష్టి లేకపోవడం), ఇతరులను హింసించకుండా ఉండడం.. ఇవి శారీరిక తపస్సులు.

(2) వాచిక (మాటతో) పాపములు:

పారుష్యమనృతం చైవ పైశున్యం చాపి సర్వశః, అసంబద్ధ ప్రలాపశ్చ వాఙ్ఞ్మయంస్యాచ్చతుర్విధం.

కఠినముగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, ఇతరులను నిందిస్తూ మాట్లాడడం, వ్యర్థమైన/పనికిమాలిన మాటలాడడం.. ఇవి వాక్కుతో చేసే తప్పులు.

ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్, స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్ఞ్మయం తప ఉచ్యతే.

ఉద్వేగం కలిగించకుండా మాట్లాడడం, ఇష్టముగా మరియు మేలుకలిగించే విధంగా మాట్లాడడం, యదార్థము మాట్లాడడం, వేద శాస్త్రములను పఠించడం, పరమేశ్వరుని నామ జపం చేయడం.. ఇవి వాక్కుకి సంబంధించిన దోషాలను పోగొట్టే తపస్సనబడుతుంది.

(3) మానసిక పాపములు:

పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్ట చింతనం, వితథాభినివేశశ్చ త్రివిధం కర్మ మానసం.

ఇతరుల డబ్బును, ద్రవ్యాలను దోచుకోవాలనే ఆలోచన, పరులకి కీడుతలపెట్టే ఆలోచన, శరీర అభిమానము.. ఇవి మనసుకి సంబంధించిన పాపములు.

ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…

మనః ప్రసాదః సౌమ్యత్త్వం మౌనమాత్మ వినిగ్రహ:, భావ సంశుద్ధిరిత్యేతత్తపోమానసముచ్యతే.

మనసుని ప్రసన్నంగా ఉంచుకోవడం, శాంత భావం, సదా భగవచ్చింతన చేసే స్వభావం, మనోనిగ్రహం, అంతఃకరణాన్ని పవిత్రంగా ఉంచుకోవడము.. ఇవి మానసిక దోషములను పోగొట్టే తపస్సులనబడతాయి. అన్నిటిలోకి మానసిక తపస్సు చాలా గొప్పది. ఎందుకంటే అనేక తప్పులకు కారణం మానసిక దోషాలే. మనందరం ఈ నిముషం నుండే అభ్యాసం మొదలెడదాము.

🔹🔸🔹🔸🔹🔸🔹🔹

మైండ్ ప్రోగ్రాం, స్వీయ ప్రేమ - Self Love..

మైండ్ ప్రోగ్రాం:-

మన స్వీయ సంభాషణ, ప్రతికూలంగా నకారాత్మకంగా మరియు నిరాశావాదం తో ఉంటే , అది ఉపచేతన మనసులోకి వ్యాపిస్తుంది మరి మన వ్యక్తిత్వం విరక్తి గా, దయనీయంగా మారుతుంది. మన అంతర్గత స్వరమే, మన దారుణమైన శత్రువు కావడం అసాధారమైనదేమీ కాదు. నిరంతరాయంగా మనల్ని శిక్షిస్తూ మరియు ప్రాణశక్తిని హరిస్తూ, మనల్ని మనో యాతనకు గురిచేస్తూ ఉంటుంది. బదులుగా, మనం స్వీయ దృవీకరణ శక్తిని మన ప్రయోజనాలకు ఉపయోగిస్తే మన మనస్తత్వాన్ని చాలా సానుకూల మార్గాలలో ప్రోగ్రాం చేయవచ్చు. 

మనసును ప్రోగ్రాం చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా చేసే స్వీయ సంభాషణను సానుకూల దృవీకరణ అంటాం. ఇది పునరావృత్తి చేయడంలో ఉన్న శక్తిని ఉపయోగించుకుంటుంది. ఏదైనా ఒక విషయాన్ని పదే పదే మనసులో పునరావృతం చేసినప్పుడు, అది లోతుగా వెళ్లి అంతర్గతంగా సమ్మిళితమై పోతుంది. మనసుని నిర్వహించుకోవడంలో, సానుకూల దృవీకరణ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆశావాదం, విశ్వాసం, దైర్యం, పట్టుదల మరియు ప్రయోజనాత్మకతలతో నిండిన సానుకూల వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మను దీనిని ఉపయోగించవచ్చు. మనం ఉపయోగించాల్సిన కొన్ని సానుకూల దృవీకరణ ఇవి...

🥰 నాలో అభివృద్ధికి కావాల్సిన అనంతమైన సామర్థ్యం ఉంది.

🤗 ఈ విశ్వం నా కోసం గొప్ప ప్రణాళికను కలిగి ఉంది.

😍 భగవంతుని కృప నాపై ఉంది. నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను.

🥰 నా దివ్య తండ్రి చే నేను రక్షించబడతున్నాను. ఏం భయం లేదు. విశ్వంలో అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, మరియు నాకు తగినంత లభ్యం అవుతుంది.

🤗 నా శరీరం ఆరోగ్యంగా ఉంది. అవయవాలు ఆరోగ్యం గా మరియు చక్కగా ఉన్నాయి.

😍 నా శరీరం లోని ప్రతి కణం ఆహ్లాదంతో మరియు ఆనందంతో పులకించిపోతోంది. 

🥰 ఫలితాల గురించి చింతించకుండా నేను నా ప్రయత్నం పై దృష్టిని పెడతాను.

😊 ఏది జరిగినా అది మంచి కోసమే అవుతుంది.

😃 నేను చేయగలను. నేను విజయం సాధిస్తాను. లక్ష్యం దాదాపుగా సాధించబడింది. 

😂 నా పని చాలా ముఖ్యం. నేను దాని ద్వారా భగవంతుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. 

☺️ నేను భగవంతుని నుంచి చాలా పొందాను. నేను భక్తి ద్వారా తిరిగి ఇవ్వాలి. 

😄 భగవంతుడు నాకు ప్రతీ రోజూ రాత్రి కలలో కూడా మార్గనిర్దేశం చేస్తాడు.

సానుకూల దృవీకరణ అంటే, ఈ విధంగా జాగ్రత్తగా ఎన్నుకోబడిన స్వీయ సంభాషణ, అది మన ఉపచేతన మనసుపై మనం కోరుకునే రీతిలో ముద్ర వేస్తుంది. భగవంతుని పట్ల ప్రేమపూర్వకంగా భక్తిని సాధించడానికి ఈ సాధనను ఎలా ఉపయోగించాలి ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం.

#భగవంతుని_నామాన్ని_జపం_చేయడం :-

సానుకూల దృవీకరణ ఒక శక్తివంతమైన సాధన. వేద గ్రంథాలు దీనిని జపం రూపంలో మనకు అందిస్తుంది. భగవంతుని నామాన్ని జపం చేయడం అనేది భగవంతుని జ్ఞాపకం చేసుకోవడానికి చాలా సౌకర్యవంతమైన మార్గం, ఎందుకు అంటే దీన్ని ఎక్కడైనా ఎప్పుడైనా చేయవచ్చు. నడుస్తున్న, మాట్లాడుతూ ఉన్నా, కూర్చుని ఉన్నా, తింటూ ఉన్నా, లేదా మరే ఇతర పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా చేయవచ్చు. 

మనం భగవంతుని నామాన్ని జపం చేసేటప్పుడు, ఆయనను ప్రేమగా స్మరించాలని మనసును కోరుకుంటాం. అందుకే, పదే పదే మనసు దాని సంచారాల నుంచి తిరిగి వచ్చి భగవంతుని స్మరించాల్సి ఉంటుంది.  

"యజ్ఞానాం జపయోగస్మి" 

అన్ని రకాల యజ్ఝములలో, భగవంతుని నామ జపాన్ని నేనే. 

సర్వోత్కృష్ట భగవంతుని కోసం మనల్ని మనం అంకితం చేసుకోవడమే యజ్ఞం. భగవంతుని పవిత్ర నామాలను లేదా మంత్రాన్ని జపం చేయడం వల్ల అన్ని యజ్ఞాలలో కంటే సరళమైనది మరియు అత్యంత ఉత్కృష్టమైనది. దీనిని జప యజ్ఞం అంటారు. ఈ శ్లోకం లో కృష్ణుడు తన దివ్య నామాన్ని జపించడమే, ఏ వ్యక్తి అయినా చేయగలిగే అత్యున్నత యజ్ఞం అని వివరించారు. 

కొంత మంది జపం చేయడానికి జప మాల సహాయంతో తీసుకుని చేస్తారు. జపమాల ఉపయోగించడం ద్వారా కలిగే ఇబ్బంది ఏంటి అంటే జపం యాంత్రికంగా మారిపోయే అవకాశం ఉంది. ఏదో లాంచనాప్రాయంగా మారుతుంది. జప మాలకు బదులుగా ప్రతీ శ్వాస తో నామాన్ని, మంత్రాన్ని జపం చేయడం అలవాటు చేసుకోవడం ఒక మంచి పద్దతి. 

అంతే కాకుండా భగవంతుని నామాలను జపం చేయడానికి ఎవరైనా గురువు నుంచి చెవిలో ఎటువంటి మంత్ర దీక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు. సర్వోత్కృష్ట భగవంతునికి అసంఖ్యాక నామాలు ఉన్నాయి మరియు వాటిలో దేనినైనా జపం చేయడానికి మనకి పూర్తి స్వేచ్ఛ ఉంది. భగవంతుడు తన నామంలో కూర్చుని ఉన్నాడు. అందు వలన ఏ గురు మంత్రం కూడా భగవంతుని పేరు కంటే గొప్పది కాదు. 

మనసును, దాని ఉపచేతన మూలాల వరకూ శుద్ది చేయడంలో సానుకూల దృవీకరణల యొక్క ప్రభావాన్ని మనం చూశాం. భగవంతుని యొక్క నామాలను జపం చేయడం అనేది, మనసును భగవంతుని యందు నిమగ్నం చేయడంలో ఎలా సహయం చేస్తుందో గమనించాం...
.
.
.

        🌸 *స్వీయ ప్రేమ - Self Love..* 

   🌸 మనకు ఉన్న వరాల జాబితాలో ఇదొక వరం... 
స్వీయప్రేమతో మనం పొందేది చాలా ఎక్కువ... ఎక్కడైతే స్వీయప్రేమ ఉంటుందో అక్కడ బాధలకు, దుఃఖాలకు చోటు ఉండదు... ఉండేదల్లా 
స్వ అధ్యాయం మాత్రమే అంటే ఏమిజరిగినా అందులో మనకు ఉపయోగపడే విషయాన్ని స్వీకరించటం మాత్రమే ఉంటుంది... ఎప్పుడైతే అన్ని విషయాలలో సరైంది తీసుకుంటామో అక్కడ మన శక్తి దుర్వినియోగం జరగదు..

   🌸 స్వీయప్రేమ ఉన్నవారు అందరిలో కలిసిపోయి ఉన్న తమ ఉనికిని మాత్రం కోల్పోరు.. నలుగురితో నారాయణ అనేస్థితి వీరికి వర్తించదు... సహజంగా వీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాతావరణం లో ఉండటానికి ఇష్టపడతారు... వీరు ఎప్పుడూ సరికాని మాటలను దగ్గరకు రానియ్యరు ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా కామ్ గా ఉంటారు... వీరికి పరిస్థితి ఎలా ఉన్నా ఇమిడిపోవటం వెన్నతో పెట్టిన విద్య అనొచ్చు కానీ స్పష్టత కోసం ప్రయత్నం ఎక్కువ చేస్తారు... ఫాలోవర్ (అనుచరులు ) గా ఉండలేరు... వీళ్ళను గుర్తించాలి అంటే అందరిమాటా వింటూ వారికి కావలసిందే చెయ్యటం వీరి ప్రత్యేకత.. వీరిలో సృజనాత్మకత ఎక్కువ... 

   🌸 స్వీయప్రేమతో ఉండేవారు ఎక్కువ ప్రేమగా ఉండేవారిని త్వరగా గుర్తిస్తారు.. 

ఎటువంటి పరిస్థితులు ఉన్నా తమను తాము మలుచుకుంటూ ముందుకు సాగుతారు..

స్వీయప్రేమతో ఉండేవారికి మానసిక ఒత్తిడిని త్వరగా జయిస్తారు..

తెలిసి ఎవరినీ ఇబ్బందులలోకి నెట్టరు... ప్రతిఒక్కరి ఎదుగుదలకు సాయంగా ఉంటారు..

స్వీయప్రేమతో ఉండేవారు నలుగురితో ఎలా ఉంటారో ఒంటరిగా కూడా అలాగే ఉంటారు...

స్వీయప్రేమతో ఉండేవారు సాధన, స్వాధ్యాయ, సజ్జనసాంగత్యం చేస్తూ వాటిలో ఎక్కువ సజ్జనసాంగత్యం కోరుకుంటారు.. అంటే ప్రత్యక్షంగా నేర్చుకోవడం కొరకు..

స్వీయప్రేమతో ఉండేవారు తలపెట్టిన పని పూర్తి చేసేవరకు ఓపికగా ఉంటారు... అవాంతరాలు దాటుకుంటూ..

స్వీయప్రేమతో ఉండేవారికి కోపం రావడం, పోవడం కూడా తొందరగానే ఉంటుంది..
ఒకవేళ వారిది సరికాని పని అనుకుంటే తమ తప్పును ఒప్పుకుంటారు సరిచేసుకుంటారు...

   🌸 స్వీయప్రేమ ఇప్పటి పరిస్తుతులలో అందరికీ చాలా అవసరం.. ఎందుకంటే వీరికి అనారోగ్యం అనేది దాదాపుగా ఉండదు ఉన్నా అది సమస్యగా చూడరు... తెలియంది నేర్చుకుంటారు..  వీలైనంత వరకు ముందు ఉంటారు కానీ పోటీలో ఉండరు...

స్వీయప్రేమతో ఉండేవారు అన్నింటినీ ప్రేమగా చూస్తారు..
సాధారణంగా వీరు శాఖాహారులుగా ఉంటారు...

స్వీయప్రేమతో ఉండేవారిని ప్రత్యేకంగా ప్రోత్సాహంతో పని ఉండదు సూచన  తెలుసుకోగానే మార్పును స్వీకరిస్తారు..

స్వీయ ప్రేమికులు ఎక్కువగా అంతర నేనుతో ఉంటుంటారు..

స్వీయ ప్రేమికులు భౌతికంగా(ఆధ్యాత్మికంగా లేని వారు) మాట పట్టింపు ఎక్కువ..
ఆధ్యాత్మికంగా ఉన్నవారు మాట సరిలేనివారిని దూరంగా ఉంచుతారు... అలా వీరిని గుర్తించటం తేలిక... *స్వీయప్రేమ ఉండటం అంటే సూది మొన పదునుగా ఉండటం... ఒక్క మాట లో చెప్పాలంటే వీరు కార్యసాధకులు...*

       Thank you...

(సేకరణ...ఆదిత్యనారాయణ....తిప్పానా)

అష్టసిద్ధులు.

 *💐💐అష్టసిద్ధులు.*💐💐
సందేహం - అష్టసిద్ధులు అని అంటారు కదా, వాటి గురించి వివరించండి ?

సమాధానం - సనాతనధర్మం ప్రకారం మానవజన్మ యొక్క ముఖ్య ఉద్ద్యేశం ఆత్మవిచారణ చేసి, ఆత్మానుభూతిని పొందిముక్తి పొందడం. ముక్తి పొందిన ఆత్మకు చావుపుట్టుకలు ఉండవు. ఆత్మ అనగానే అది ఏదో ఒక కొత్త శక్తి అని భావించకూడదు. నా శరీరంలో ఉండే నేను ఆత్మ. నేను ఈ శరీరాన్ని ధరించాను. శరీరం వస్త్రాన్ని ధరించినట్టుగానే, ఆత్మ శరీరాన్ని ధరించింది. వస్త్రం చినిగోతే ఎలా పడేస్తామో, అలాగే ప్రారబ్దం తిరిపోగానే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. తిరిగి వేరే దేహాన్ని కర్మాణుసారంగా వెతుక్కుంటుంది. ఇంత చేస్తున్న ఆత్మ ఎవరో కాదు మీరే. మనల్ని మనం శరీరంతో గుర్తించుకుంటున్నాం, కానీ మనం శరీరం కాదు. మనల్ని మనం తెలుసుకోవడమే, అన్నిటికి అతీతమైన ఆత్మ స్థితిని పొందే ప్రయత్నమే ఆత్మవిచారణ. అటువంటి ఆత్మానుభూతిని పొందే సులువైన పద్దతిని పరమశివుడు యోగం (యోగా) ద్వారా అందించారు. దాన్ని పతంజలి మహర్షి తిరిగి మానవాళికి అందించారు. ఆత్మ విచారణ చేసే క్రమంలో, సాధకునికి కొన్ని శక్తులు లభిస్తాయి. వాటితో ఆత్మవిచారణకు సంబంధం లేకపోయినా, వాటి మీద అధికమోహం అసలు గమ్యాన్ని మర్చిపోయేలా చేస్తుంది. సిద్ధులు 8 కనుక వాటిని అష్టసిద్ధులు అన్నారు. అవి

1. అణిమా - ఈ సిద్ధితో యోగి తన శరీరాన్ని చీమ కంటే, అణువుకంటే చిన్నగా మార్చుకోగలడు, పూర్తిగా అదృశ్యమవగలడు.

2. మహిమా - దీన్ని పొందడం ద్వారా యోగి తన రూపాన్ని చాలా పెద్దదిగా చేయగలడు, మేఘాలను చీల్చ్కుని, సూర్యుని తాకుతున్నాడా అన్నట్టుగా కనిపిస్తాడు.

3. లఘిమా - దీని ద్వారా దేహాన్ని చాలా తేలికాగా చేస్తారు, ఎండిన ఆకు, పక్షి ఈక కంటే తేలికగా యోగి దేహం మారిపోయే శక్తిని పొందుతుంది, ఈ సిద్ధితో గాలిలో తేలగలడు, నీటిపై నడువుగలడు.

4. గరిమా - భారీకాయంతో పర్వతాన్ని తపలిస్తూ యోగి మొత్తం గాలిని పీల్చేయగలడు.

5. ప్రాప్తి - ఈ సిద్ధితో యోగి, ఏ వస్తువునైనా తనకు నచ్చిన విధంగా రూపం మార్చగలడు, దాని స్థితిని మార్చగలడు. భవిష్యత్తును దర్శించగలడు, ఫోనులు మొదలైనవి అవసరం లేకుండా ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారితోనైనా సంభాషిచగలడు, వ్యక్తిని చూసి మనసులో ఏముందో చెప్పగలడు, ఎవడు ఎలాంటివాడో, పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పగలడు, ప్రపంచంలోని అన్ని బాషలను అర్దం చేసుకుంటాడు, ఏ భాషలోనైనా మాట్లాడుతారు, జంతువులు, మృగాలు, పక్షులు, చెట్లతో కూడా మాట్లాడగలడు, వాటి భాషను అర్దం చేసుకోగలరు.

6. ప్రాకామ్య - ఏ ఇతర శరీరాల్లోకైనా ప్రవేశించగలరు, ఇదే పరకాయప్రవేశ విద్య.

7. వశిత్వం - అందరిని వశం చేసుకుంటారు. కౄర మృగాలను సైతం తన దగ్గర పెంపుడు జంతువులను చేసుకోగలరు, తన సంకల్పబలం చేత దుష్టులను కూడా అదుపు చేయగలరు, పంచభూతాలను సైతం తన అదుపులో ఉంచుకుంటారు.

8. ఈశిత్వం - యోగి దైవశక్తిని పొందుతారు, ఈశ్వరతత్వాన్ని పొందుతారు, ఈ ప్రపంచానికి అధిపతి అవుతాడు, మరణించిన వారిని కూడా బ్రతించగలరు..

ఇవి అష్టసిద్ధులు.

ఇవి పతంజలి మహర్షి తన యోగశాస్త్రంలో వివరించిన అష్టసిద్ధులు. మంత్రజపం చేత కూడా కలుగుతాయని గురువుల వచనం. కానీ ఇతరులకు అపకారం చేయడానికి వాడుకుంటే మాత్రం సిద్ధులు నశిస్తాయి..!!

💥 ఏది ఒప్పు ఏది తప్పు??

🕉️నమో భగవతే శ్రీ రమణాయ🙏🙏
భగవాన్ శ్రీ రమణ మహర్షి:
💥 ఏది ఒప్పు ఏది తప్పు?? ఒకటి సరైనదని మరొకటి కాదని అని నిర్ధారించటానికి ప్రమాణమేమీ లేదు.
వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి మరియు పరిసరాల ప్రకారం అభిప్రాయాలు విభిన్నంగా ఉంటాయి.
అవన్నీ ఆలోచనలే తప్ప మరింకేమీ కాదు.
వాటి గురించి చింతించకండి. ఆలోచనలను వదిలించుకోండి.
మీరు ఎల్లప్పుడూ మంచి వైపు ఉంటే, ప్రపంచంలో మంచి ప్రబలంగా ఉంటుంది. 💥
( టాల్క్స్ 453)
🙏🌷🙏 శుభం భూయాత్🙏🌷🙏

ఆశ మనసులో అలజడి రేపుతోంది, ఆశ స్వరూపం ఏమిటి ? దాన్ని ఎలా అధిగమించాలి !?

 💖💖💖
       💖💖 "305" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖


"ఆశ మనసులో అలజడి రేపుతోంది, ఆశ స్వరూపం ఏమిటి ? దాన్ని ఎలా అధిగమించాలి !?"


"భగవంతుడు సమకూర్చిన వాటితో ఆగకుండా ఇంకా, ఇంకా కావాలనుకోవటం, మళ్ళీ, మళ్ళీ కావాలనుకోవడం ఆశ లక్షణాలు. ఒక వస్తువు బాగుందని అనుకోవటంలోనే కావాలన్న ఆశ ఇమిడి ఉంది. కనిపించే మార్పే మనకి మళ్ళీ కావాలనిపించేలా చేస్తుంది. అదే దుఃఖహేతువు అవుతుంది. ఆశపడే లక్షణమే కోరికగా మారుతుంది. అదే మనసులో కలిగే అలజడికి కారణం అవుతోంది. తీరని కోరికలు మనసులో ఉప్పెనను రేపుతాయి. అందుబాటులోకి వచ్చిన వాటితో సంతృప్తి చెందిన వాడు మహనీయుడు అవుతాడు. ఇంకా కావాలనుకునేవాడు సామాన్యుడిగా మిగిలిపోతాడు. మనిషి తన అభిరుచికి, ఆచరణకు సంబంధం లేకుండా జీవించడం అసలు సమస్యకు కారణం. ఇంట్లో అందమైన ప్రకృతి చిత్రపటాలు, జంతురాశి ఛాయాచిత్రాలు అమర్చుకుంటాడు. కానీ ప్రకృతిని, ప్రాణులను స్వేచ్ఛగా మాత్రం ఉండనివ్వడు. మనిషిలోని ఆశ తనను ఏ స్థాయికైనా దిగజారుస్తుంది. ఆశ నుండి విడవడగలిగితే అనుక్షణం ధ్యానంలో ఉన్నట్లే ! ఆశలేని ప్రతి ఆలోచన ధ్యానమే !!"

"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"
           🌼💖🌼💖🌼
                  🌼🕉🌼

ప్రతి మనిషిలో ముఖ్యంగా మూడు కోరికలు ఉంటాయి. జీవించాలి...మరణం ఉండకూడదు. సంపాదించాలి... మితం ఉండకూడదు. ఆనందించాలి... హద్దులు ఉండకూడదు.

 నేటి జీవిత సత్యం. 

ప్రతి మనిషిలో ముఖ్యంగా మూడు కోరికలు ఉంటాయి. జీవించాలి...మరణం ఉండకూడదు. సంపాదించాలి... మితం ఉండకూడదు. ఆనందించాలి... హద్దులు ఉండకూడదు. ఎవరైతే వీటిని దూరంగా ఉంచగలుగుతారో వారిని మానవాతీతులుగా భావించాలి. మనిషి మొదటినుంచి తాను ఉన్న స్థితిలో రాజీ పడలేక, ఇంకా దేనికోసమో తపనతోనే జీవిస్తున్నాడు. అనంతాన్ని జయించాలన్న కోరిక ఒక్క మనిషిలోనే కనిపిస్తుంది.

‘మీరు ఇంకా ఒక్క గంట మాత్రమే జీవిస్తారు అని ముందుగా తెలిస్తే, ఎలా ఉంటుందో... ఆ స్థితిలోనే జీవించాలి’ అంటారు జిడ్డు కృష్ణమూర్తి.
ఆ రహస్యం తెలిసిన మరుక్షణమే తనకు సంబంధించినవన్నీ తనవారికి ధారాదత్తం చేయడానికి ఆ గంట వ్యవధి సరిపోదని బాధపడతాడు మనిషి.
త్యజించాల్సిన శరీరాన్ని బతికించాలన్న తపనతోనే, విలువైన సమయాన్ని వృథా చేస్తాడు. కానీ తాను చేరుకోవాల్సిన సహజ స్థితి గురించి ఆలోచించడు.
 కర్మ ఫలాల్ని జన్మ జన్మలుగా అనుభవిస్తున్నాడు. అయినా దేహం ఉండగానే విముక్తి కోసం సాధన మార్గం సుగమం చేసుకోలేక పోతున్నాడు.

రామకృష్ణ పరమహంస పొందిన నిర్వికల్ప సమాధి, రమణ మహర్షి పొందిన సహజస్థితి, బుద్ధుడు పొందిన జ్ఞానోదయం... ఇవన్నీ వారు అంతఃకరణాన్ని, ఇంద్రియాలను, సమస్త భోగ సామగ్రిని త్యజించి సాధించారు. ఆశారహితులై శారీరక కర్మలను చేసినట్టు కనిపించినా, వాటి ఫలితం అంటకుండా జీవించబట్టే అవి సిద్ధించాయి.
మనిషి సహజ స్థితిని పొందడానికి సన్యాసం అవసరం లేదంటారు జిడ్డు కృష్ణమూర్తి.మరణం తరవాతే సహజస్థితి సిద్ధిస్తుంది అనేది అపోహ. వాస్తవానికి మనిషి నశించేవాడు కాదు, స్వేచ్ఛారహితుడు అంతకంటే కాదు. నిజమైన మనిషి అంటే ఆత్మ. ఆత్మ నిజస్వరూపం సచ్చిదానందం. అనంత ఆకాశంలో సర్వవ్యాపకమైన సర్వస్వాన్ని ప్రకాశింపజేసేదే సత్‌, చిత్‌, ఆనందం. నిత్యమైన, మరణం లేని, పతనం లేని పరమాత్మతత్వం ఇదే.

దాన్ని పొందడానికి చేసే సాధనలో అహం అడ్డు పడుతూ ఉంటుంది. అహం అనే ప్రవాహం మీద తేలుతూ సహజస్థితి చేరే సాధన చేయడం అసాధ్యం. అహం హద్దులు దాటి, దాని ఆద్యంతాలు తెలుసుకోవడానికి అంతఃచైతన్యమనే నిచ్చెన ఎక్కాలి. అప్పుడే స్పష్టత ఏర్పడుతుంది. చైతన్యం అనే ఉన్నత స్థితిని చేరుకోవడానికి చేసే ప్రయత్నమే నిజమైన సాధన.
సూర్యుడి వేడికి సముద్ర జలాలు ఆవిరై, మేఘాలుగా మారతాయి. అవి హిమాలయాల ఎత్తుకు ఎగురుతాయి. ఆవిరి అణువుల నిజస్వరూపం సముద్రమే. తమ మూలస్థానమైన సముద్రాన్ని తిరిగి చేరడానికి ఆ అణువులు నిరంతరం తాపత్రయపడతాయి. ఆకాశంలో సంచరిస్తూ తిరుగుతుంటాయి. సమయం రాగానే వర్షించి, అనంత సాగరంలో ఐక్యమై సహజస్థితికి చేరుకుంటాయి. అన్ని నీటి బిందువులూ సముద్రాన్ని చేరనట్లే, ఎంత సాధన చేసినా కర్మఫల శేషం వీడిపోనిదే సహజస్థితి సిద్ధించదు. కర్మ బంధాలనుంచి విముక్తి పొంది, ఆత్మను గుర్తించి, ఇంద్రియాల పరిధిని అధిగమించడానికి చేసే ప్రయత్నం నిరంతరం కొనసాగాలి. ఎవరైతే సమస్త సృష్టిలో సర్వవ్యాప్తిని చూడగలుగుతారో, వారికే ఆత్మ దర్శనం కలుగుతుంది. ఆ స్థితిని నిలబెట్టుకోవడమే యోగం.
భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే, ఎంతో మంది తపోధనులు తమ యోగవిద్య ద్వారా, ఉన్నతమైన ఆధ్యాత్మిక చైతన్యంతో అస్తిత్వ సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు. తమ ఆధ్యాత్మికతతో అహం యొక్క వాస్తవ స్వరూపం తెలుసుకొని, భవబంధ విముక్తులు అయ్యారు.

సేకరణ. మానస సరోవరం

ప్రశాంతత ఎలా వస్తుందో తెలుసుకుందాం

 *ప్రశాంతత  ఎలా వస్తుందో తెలుసుకుందాం

'సుప్రభాత వేళ నుంచి ఎన్ని పనుల్లో తలమునకలై ఉన్నా, కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలని ప్రతి మనిషికి అనిపిస్తుంది. ప్రశాంతత మనసుకు లేపనం. ఆత్మకు ఔషధం. మానవ జీవితంలో ప్రశాంతత ఎంతో అవసరం, ఆధ్యాత్మిక జీవనం ప్రశాంతతతోనే సాధ్యం. జీవన బృందావనంలో ప్రశాంత పారిజాతాలు లేకపోతే వేణుమాధవుడు విహరించడానికి రాడు. ప్రశాంతత సీతాకోకచిలుకలా ఎగురుతూ ఉంటుంది. దాని వెంట పడితే అది దొరకదు. ఒక చోట హాయిగా కూర్చుంటే, వచ్చి వాలుతుంది. ఆలసిన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
జీవితం ప్రశాంతంగా ధ్యానంలా సాగిపోవాలని చాలా మంది ఆకాంక్ష. అలా జరగదు. ఎందుకిలా జరుగుతోంది అనే భావనే మనసును అల్లకల్లోలం చేసి ప్రశాంతతకు దూరం చేస్తుంది. ప్రశాంతతను తెచ్చి పెట్టుకోవాలి. అది పరిమళించే గులాబీల గుత్తిలా ఉండాలి. ప్రశాంతత లేని జీవితం వ్యర్థం. తినే ఆహారం, పీల్చే గాలి, నడక, ఆలోచన, నిద్ర... ఇవన్నీ మనిషిని సుఖంగా ఉంచడానికే. ఈ సుఖంలోంచే ప్రశాంతత పుడుతుంది. అత్యంత కీలకమైన ప్రశాంతత కలుగుతుంది. అది శాంతికి,
పరమశాంతికి దారి తీస్తుందని యోగం
తెలియజేస్తోంది. మొదట మనిషి నిలబెట్టు కోవాల్సింది ప్రశాంతత. దాని కోసమే కొంత ప్రయత్నం చెయ్యాలి. ఆ తరువాత ఎంత గొప్ప ఆధ్యాత్మిక స్థితినైనా అలవోకగా
అందుకోవచ్చు. అంతర్గత ప్రశాంతత లేనిదే బాహ్య ప్రశాంతత వీలుపడదు. లోపల శ్రీకృష్ణుడు నివసిస్తుంటే, బయట కంసుడిలా ప్రవర్తించడం జరగదు. లోపల రావణాసురుడు తిష్ఠ వేసుకుని కూర్చుంటే, బయట శ్రీరాముడిలా నటించడం ఎక్కువ కాలం సాగదు..

జ్జానంతో నిజమైన ప్రశాంతత వసంత సమీరంలా ఉంటుంది. వాన వెల్లువలా ఉంటుంది. వాకిలి ముందు వేసిన అందమైన రంగుల హరివిల్లులా ఉంటుంది. కోకిల గానంలా ఉంటుంది. పారిజాత పుష్ప పరిమళంలా ఉంటుంది. పోతన తీయటి తెలుగు పద్యంలా హృద్యంగా ఉంటుంది.

దైవాంశ సంభూతుల చుట్టూ పట్టువస్త్రంలా ప్రశాంతత చుట్టుకుని ఉంటుంది. అవతార మూర్తుల సన్నిధిలో ప్రశాంతత వటవృక్షంలా ఎదిగి ఉంటుంది. ప్రశాంతత ఇవ్వని ఆలయం ఆలయం కాదు. దేవుడు దేవుడు కాదు.
చేయకూడని పనులు చేసి ప్రశాంతతను పోగొట్టుకోవడం సులువు. ప్రశాంతంగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని హాయిగా జీవించడం కష్టం. ప్రశాంతత విలువను గుర్తించడంలో మనిషి ఔన్నత్యం బయటపడుతుంది.

ప్రశాంతతతోనే ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది. తరంగాలు తరంగాలుగా ప్రశాంతత మనల్ని ఆవరిస్తుంటే అది అదృష్టం అనుకోవాలి. సహజంగా ప్రశాంతంగా ఉండటం అనేది ఏ నూటికో కోటికో ఒకరికి సాధ్యపడుతుంది. ఈ యాంత్రిక జీవనంలో మనసును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలని మనోవైజ్ఞానిక శాస్త్రకారులు చెబుతున్నారు.

మంచి పుస్తకాలు చదవడం, మంచి మనుషుల్ని కలపడం, మంచి ఆలోచనలు. చెయ్యడం. అందరినీ కలుపుకొని ముందుకు పోవడం, కనిపించే ప్రతి విషయంలోనూ ప్రతికూల అంశాలు వెదకకుండా ఉండటం, అవకాశం ఉంటే ఏ కొద్ది మంచైనా ప్రతిఫలం ఆశించకుండా చెయ్యడం వంటి అంశాలు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ప్రశాంతత దేవుడిచ్చిన వరం. వెల కట్టలేనిది. వెనక్కి తిరిగి చూస్తే ఎంత హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాం అన్నదే మానవ జీవన సాఫల్యానికి అద్దం పడుతుంది. దీన్ని ఎన్నడూ
మరిచిపోకూడదు.

సేకరణ. మానస సరోవరం

సామాజిక అంశాలపై/విలువలపై అవగాహన సంబంద 46 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో!

 *సామాజిక అంశాలపై/విలువలపై అవగాహన  సంబంద 46  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో! ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*
-----------------------------------
1)భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? www.freegurukul.org/g/BharyaBhartaAnyonyamgaaVundalante

2) అనుబంధాలు,పరిచయాలు,స్నేహాలు,సత్సంగం,సత్సంబంధాలు www.freegurukul.org/g/Anubhandhalu-Snehalu

3) ఆత్మవిశ్వాసం,ధైర్యం-భయం,నిరాశ,పిరికితనం,ఆత్మన్యూనత www.freegurukul.org/g/Dhairyam-Bhayam

4) ఆధునికత,సాంకేతికత,వస్తువులు,సౌకర్యాలు www.freegurukul.org/g/Adhunikatha-Vastuvulu

5) నిరాడంబరం,ఆడంభరం,విలాసం,అవసరాలు www.freegurukul.org/g/Niradambaram-Adambaram

6) పొరపాటు,ఓటమి,పరాజయం,వైఫల్యం www.freegurukul.org/g/Porapatu-Otami

7) పోలిక,పోటీ,ఒత్తిడి,ఆందోళన www.freegurukul.org/g/Polika-Ottidi

8) మమకారం-వ్యామోహం www.freegurukul.org/g/Mamakaram-Vyamoham

9) నింద,విమర్శ,అవమానం,చులకన-పొగడ్త,ప్రశంశ,ప్రోత్సాహం www.freegurukul.org/g/Avamanam-Pogadtha

10) తప్పు,లోపం,దోషం,బలహీనత www.freegurukul.org/g/Tappu-Lopam

11) అలోచన నియంత్రణ,నిగ్రహం,స్వేఛ్చ,వైరాగ్యం,నిస్సంగత్వం www.freegurukul.org/g/Nigraham-Swechha

12) అసంతృప్తి,వెలితి - సంతృప్తి,రాజీపడటం www.freegurukul.org/g/Asamtrupthi-Samtrupthi

13) ఉపాధ్యాయులు www.freegurukul.org/g/Upadhyayulu

14) విద్య,చదువు,సంస్కారం www.freegurukul.org/g/Chaduvu-Samskaram

15) విద్యార్ధి www.freegurukul.org/g/Vidhyardhi

16) లక్ష్యం-గమ్యం www.freegurukul.org/g/Lakshyam

17) దేశ అభివృద్ధి www.freegurukul.org/g/DeshaAbhivruddhi

18) దేశ భక్తి www.freegurukul.org/g/DeshaBhakti

19) అనుకరణ-ఆదర్శం www.freegurukul.org/g/Anukarana-Adarsham

20) కష్టం,సమస్య,అవకాశం,అవరోధం,సవాల్ www.freegurukul.org/g/Samasya-Avakasham

21) ఓర్పు,సహనం www.freegurukul.org/g/Orpu

22) డబ్బు www.freegurukul.org/g/Dabbu

23) త్యాగం,సేవ,దానం,స్వార్ధం www.freegurukul.org/g/Thyagam-Danam

24) నాయకుడు,నాయకత్వం www.freegurukul.org/g/Nayakatvam

25) పట్టుదల,సంకల్పం,శ్రద్ధ,కట్టుబడుట,వాగ్దానం www.freegurukul.org/g/Pattudala

26) మరణం www.freegurukul.org/g/Maranam

27) విజయం,గెలుపు www.freegurukul.org/g/Vijayam

28) సమయం,కాలం www.freegurukul.org/g/Samayam

29) స్వార్ధం,నిస్వార్ధం,సహాయం,ఉపకారం,దయ,కరుణ www.freegurukul.org/g/Sahayam

30) పగ,ద్వేషం,పంతం,ప్రతీకారం www.freegurukul.org/g/Paga

31) కీర్తి,పేరు,గుర్తింపు www.freegurukul.org/g/Keerthi

32) అనుకూల దృక్పథం www.freegurukul.org/g/AnukoolaDrukpadam

33) నిజాయితి,కపటం www.freegurukul.org/g/Nijayithi

34) సృజనాత్మకత,నవ్యత www.freegurukul.org/g/Srujanatmakatha

35) స్వేఛ్చ,క్రమశిక్షణ www.freegurukul.org/g/KramaSikshana

36) కోపం,చిరాకు,విసుగు www.freegurukul.org/g/Kopam

37) క్షమ, సర్డుకుపోవు www.freegurukul.org/g/Kshama

38) చెడు అలవాటు, చెడు బలహీనత www.freegurukul.org/g/CheduAlavatu

39) ఆత్మహత్య www.freegurukul.org/g/Athmahathya

40) ఏకాగ్రత www.freegurukul.org/g/Ekagratha

41) దివ్యాంగులు www.freegurukul.org/g/Divyangulu

42) భార్య-భర్త www.freegurukul.org/g/Bharya-Bhartha

43) మాట్లాడటం www.freegurukul.org/g/Matladatam

44) యువత www.freegurukul.org/g/Yuvatha

45) వృద్దాప్యం www.freegurukul.org/g/Vruddapyam

46) తల్లిదండ్రులు,పిల్లలు,పెంపకం www.freegurukul.org/g/Tallidandrulu-Pillalu-Pempakam

ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:
Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join   
Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Friday, August 26, 2022

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🙏🙏🙏🙏🙏
అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది.  
 
నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..?
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.  

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.  

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.
🙏🙏🙏🙏🙏 

ప్రముఖులు, మనకు తెలిసిన వారు, మన స్నేహితులు, మన తోటి ఉద్యోగ వ్యపారాలు చేసుకునే వారు హఠాత్తుగా అకాల‌ మరణం పొందడం మనం చూస్తున్నాము.

 మిత్రులందరికి ఒక రిక్వెస్ట్. 
గత కొద్ది కాలంగా చాలా మంది ప్రముఖులు, మనకు తెలిసిన వారు, మన స్నేహితులు, మన తోటి ఉద్యోగ వ్యపారాలు చేసుకునే వారు హఠాత్తుగా అకాల‌  మరణం పొందడం మనం చూస్తున్నాము. 
ముఖ్యంగా 40-60 సంవత్సర నడి వయస్సులో ఉన్నవారు. జీవితంలో peak stage లో ముఖ్యమైన బాధ్యతలు నరవేర్చాల్సిన సమయంలో ఇలా జరుగుతుండడం బాధాకరమైన విషయం. 
దీనికి ఒక కారణం unexpected and unknown long term effects of Covid అని కొందరు వైద్య నిపుణుల అభిప్రాయం. 
మరొక ముఖ్య కారణం జీవన విధానం లో లోపాలు. ముఖ్యంగా ఈ రెండో కారణంపై దేశంలో ప్రస్తుతం పెద్ద చర్చనే జరిగుతుంది. 
షేర్ మార్కెట్ బిలియనీయర్ రాకేష్ జుంజున్ వాలా మరణ కారణంగా, 62 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో ఆయన మరణించడం, అయన‌ మరణాన్ని ఆయన దగ్గరవున్న వెలకోట్ల ధనం ఆపలేకపోవడం మన ముందు ఒక గుణపాఠం ల నిలిచింది. 
దానికి కారణాలు ఆయనే చెప్పినట్టు 'నియంత్రణ లేని  మద్యపానం, ధూమపానం, నియమం లేని ఆహారం, శారీరక వ్యాయామం అసలే లేకపోవడం, మానసిక ఒత్తిడి'. వెరసి ఆయన జీవితం కనీసం 20 ఏళ్ళు తగ్గింది. వెయ్యికోట్లిచ్చినా ఆరోగ్యం, అయుష్షు  తిరిగి రావని మనకు చెప్పిన నీతి.

మనందరం కూడా వయస్సు దృష్ట్యా జీవితంలో ఇదే vulnerable period లో ఉన్నాం. 
నెరవెర్చల్సిన బాధ్యతలున్నాయి. 
మన కుటుంబాలకు మనం చాలా ముఖ్యం. 
అందువలన మనందరం మన ఆరోగ్యంపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెడుదాం. ఆరోగ్యకరమైన జీవన విధానానికి అలవాటు పడుదాం. 
దానికి కావల్సిన నాకు తెలిసిన కొన్ని సూచనలు:
1. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేసుకుందాం. 
ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుంటే అదృష్టవంతులమే. భగవంతుడు ఇచ్చిన ఈ అపురూపమైన వరాన్ని అలాగే కాపాడుకుందాం. దానికి అవసరమైన జీవన విధానాన్ని continue చేద్దాం.
2. మన వయస్సులో BP, Sugar, Cholesterol, overweight లాంటి సమస్యలు రావడం సహజమే. 
రెగ్యులర్ మెడికేషన్, సరైన ఆహారం, అవసరమైన‌ exercise తో వీటిని నియంత్రించ వచ్చు. పట్టించుకోకపోవడం ప్రమాదం. అందువలన దానికి అవసరమైన జీవన విధానం సమయానికి ఆహారం, సమయానికి మందులు, regular testing అలవాటు చేసుకుందాం.
3. మన దురదృష్టం కొద్ది అప్పుడప్పుడు పెద్ద ఆరోగ్య సమస్యలు రావచ్చు. దానికి భయపడవద్దు. మనోధైర్యం కోల్పో వద్దు. ఈ కాలంలో ప్రతి ఆరోగ్యసమస్యకు చికిత్స ఉంది. సమస్య గుర్తించడం ముఖ్యం. Early stages లో గుర్తించ గలగడం మన అదృష్డం. దానికి regular health check up చాలా అవసరం.‌మనకు ఎలాంటి సమస్య లేకున్నా కనీసం‌ సంవత్సరానికి ఒకసారి మొత్తం శరీరం check చేయించుకుందాం.
4. సరియైన time లో మన ఆరోక్యానికి సరిపడే ఆహారం తినడం అలవాటు చేసుకుందాం. మన పనుల ఒత్తిడి పక్కనపెట్టి మూడుపూటలా సకాలంలో భోజనం చేద్దాం. మనకు ఇష్టమైనవి మన ఆరోగ్యానికి సరి పడనివి మితంగానే తీసుకుందాం.
5. వీలైతే ధూమపానం పూర్తిగా మానేద్దాం.  మద్యపానం నియంత్రిద్దాం. మనిషికి ఆరోగ్యం లేకపోతే ఆనందం లేదు.
6. ముఖ్యంగా ప్రతిరోజు కనీసం ఒక  గంట exercise/Yoga కు కేటాయిద్దాం. Exercise కు మించిన ఆరోగ్య సాధనం, అనారోగ్య నివారిణి ఇంకొకటి లేదు. కొంచెం కష్డమైనా క్రమశిక్షణతో ప్రయత్నించాలి. Walking, jogging, gym, yoga, pranayam ఏదో ఒక వ్యాయామం. వీలైతే ఒకరిద్దరు మిత్రులతో కలిసి. Peer pressure వలనన్న క్రమశిక్షణ అలవడుతుంది.
7. కొంచెం వృత్తిపరమైన ఒత్తిడి తగ్గించుకుందాం. సంపాదన‌ అవసరమే. కాని మనం జీవించి ఉండడం అంతకంటే ముఖ్యం. మనకు మన కుటుంబానికి కూడా. Let's slow down a bit
8. వారానికి ఒక రోజైనా నవ్వుతూ, సంతోషంగా కుటుంబసభ్యులతో, స్నేహితులతో మనకు నచ్చిన entertainment పద్దతిలో గడుపుదాం. సినిమా, ఆటలో, పాటలో, హాబీలో, అభిరుచులో, ఏదో ఒక రీతిలో ఆనందంగా.
9. మనసుకు ప్రశాంతతను, ఆత్మకు తృప్తి ని ఇచ్చే పనులు కూడా చేద్దాం. ధ్యానం, పూజ, దానం, ధర్మం, సేవా ఎంతోకొంత మన జీవితంలో భాగం చేసుకుందాం.

Message పెట్టినందుకు విసుక్కోకుండా మిత్రులందరూ దీని గురించి ఆలోచించాలని స్నేహితుడిగా, శ్రేయోభిలాషి గా మనవి 😊

భారత సైనికుడి తలని విడతీసి తలతో ఫుట్ బాల్ ఆడుకున్న పాకిస్తాన్ సైనికులు... అవును యువత మారాలి....

సందేహం - సందేశం

 🪴🌾🌴🌿🌵☘️🌳🍃🍂🌱🍀
         *సందేహం-సందేశం*
        ➖️➖️➖️➖️➖️➖️➖️

‘ఎన్నిసార్లు చెప్పినా చెవికి ఎక్కడం లేదు. ఎంతసేపు చెప్పినా నిష్ప్రయోజనంగా ఉంది...’ ఇలాంటి మాటలు తరచూ వినబడుతూ ఉంటాయి. మరి ఇక మార్గం ఏమిటి? బుద్ధభగవానుడు శిష్యులతో ఇలా చెప్పాడు- ‘తక్కువ మాట్లాడాలి. ఎక్కువ పనిచేయాలి. ఎక్కువ మాట్లాడే వ్యక్తికి క్రమంగా విలువ తగ్గిపోతుంది. మాటలకంటే భావం ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. ప్రతిమాటలో మర్యాద,  సానుభూతి, విశ్వాసం, దృఢత్వం తప్పనిసరిగా ఉండాలి. అఖిల మానవాళికీ బుద్ధుడి సందేశమిది!
దేహమున్నంతకాలం సందేహాలు సామాన్యం. సామాన్యుల కంటే మాన్యులకు ఇవి మరీ ఎక్కువ. అర్జునుడు గొప్ప గురువుల వద్ద విద్యలను అభ్యసించాడు. విద్యానిపుణుడు; మహావీరుడు. తీరా యుద్ధం వచ్చేసరికి అతడికి గొప్ప సందేహం కలిగి ఆయుధాలను అవతల పెట్టేశాడు. ‘ఇంతమంది బంధువులు ఎదురుగా ఉన్నారు. వీళ్ళనందర్నీ చంపి, ఆ రక్తపుకూడు తినడం అవసరమా?’ అని అర్జునుడికి ఆలోచన వచ్చింది. శ్రీకృష్ణభగవానుడు తన గీతోపదేశంతో తిరిగి అర్జునుణ్ని కార్యోన్ముఖుణ్ని గావించాడు. ‘నా కర్తవ్యాన్ని నేను ఆచరిస్తున్నాను. దీనివల్ల సత్ఫలితం కలగవచ్చు, కలగకపోవచ్చు. కలగకపోతే విచారించనవసరం లేదు... సమదృష్టితో ఉండాలి!’ అని కృష్ణుడు బోధించిన తరవాత, అర్జునుడి సందేహం తీరి, మళ్ళా విల్లు పట్టాడు.
విద్యార్థులను వారి పాఠ్యాంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక ప్రశ్నకు ఒకే సమాధానం ఉంటుంది. విద్యార్థులందరూ ఆ సమాధానాన్నే రాయాలి. లేకపోతే ఉత్తీర్ణులు కారు. జీవితం అలా కాదు. ఒకే అంశంపై వివిధ వ్యక్తులు పలురకాలుగా సమాధానాలు చెప్పవచ్చు. వ్యక్తుల అనుభవాన్ని బట్టి, వారి దృష్టిలో తమతమ సమాధానాలు సరైనవే అవుతాయి.
ఒక పుణ్యాత్ముడు అడవిలో ఒక సుందర భవనాన్ని నిర్మించాడు. దానిచుట్టూ మనోహరమైన పూలతోటను వేయించాడు. బాటసారులకు కావలసిన సౌకర్యాలన్నీ అక్కడ ఏర్పాటు గావించాడు. ఆ ధర్మాత్ముడికి తాను చేసిన పని ప్రజల్లో ఎవరెవరికి ఎంతవరకు ఉపయోగ పడుతున్నదా అనే సందేహం వచ్చింది. మారువేషంలో వచ్చి అక్కడ కూర్చుని వారి మాటలను ఆలకించసాగాడు. ఇద్దరు బాటసారులు అక్కడ పడుకొని సేదతీరు తున్నారు. అందులో ఒకడు ధనవంతుడు. అతడు ‘ఈ దాతకు బుద్ధిలేదు! ఈ నిర్జనారణ్యంలో ఇంత పెద్ద నిర్మాణం అవసరమా?’ అన్నాడు. ఆ మాటలు విని దాత మిక్కిలి నిరుత్సాహపడ్డాడు. రెండో బాటసారి పేదవాడు. ‘ఈ అరణ్యంగుండా పోవలసి వచ్చిన మనలాంటి బాటసారులకు ఇదే కదా దిక్కు! ఆ రకంగా ఇది మనలాంటి వారికెంత మేలుచేస్తున్నదో గుర్తుతెచ్చుకో!’ అని బదులిచ్చాడు. ఇంతలో నలుగురు దొంగలు వచ్చి అక్కడ కూర్చున్నారు. తాము దోచుకు వచ్చిన సొమ్మును పంచుకుంటున్నారు. ఒకడు అంటున్నాడు- ‘ఇది మనకు సురక్షిత ప్రదేశం. ఇక్కడికి రక్షకభటులెవరూ రారు!’ వాళ్ల మాటలతో ఆ దాతకు సందేహం తీరింది. సామాన్య ప్రజలకు ఉపయోగపడని దాతృత్వం వ్యర్థమని, పైగా అది చెరుపు చేస్తుందని దుర్వినియోగం అవుతుందని ఆ దాత గ్రహించాడు.
వివేకానందుడికి ‘అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా?’ అని సందేహం కలిగింది. చాలా మందిని అడిగాడు. సరైన సమాధానం రామకృష్ణ పరమహంస మాత్రమే చెప్పగలిగారు. ‘ఆ! ఉన్నాడు! నేను చూశాను! నేను నిన్ను ఇప్పుడు చూస్తున్న దానికంటే ఇంకా స్పష్టంగా చూశాను!’ కావాలంటే నీకుకూడా చూపిస్తాను!’ అన్నాడు పరమహంస. దానితో వివేకానందుడి జీవితమే మారిపోయింది!

🌷💐🌷💐🌷💐🌷💐🌷💐🌷

తేజో_మహాలయ ...... అగ్రేశ్వర_మహాదేవ_స్వామి... పంచలింగాలలో ప్రధానమైన తేజోమహాలయ ఆలయం పూర్తి వివరణ

 


తేజో_మహాలయ ...... అగ్రేశ్వర_మహాదేవ_స్వామి...
పంచలింగాలలో ప్రధానమైన తేజోమహాలయ ఆలయం
పూర్తి వివరణ
బాలకేశ్వర్, 
పృథ్వీనాథ్, 
కైలాష్ మరియు 
రాజరాజేశ్వర్ అనే 4 శివాలయాలు మాత్రమే
ఉన్నాయి.తాజ్ మహల్ నిర్మాణ పనులు 1632 లో ప్రారంభమయ్యాయని మరియు దాని నిర్మాణ పనులు 1653 లో పూర్తయ్యాయని చరిత్రలో చెప్పబడింది.

1631 లో ముంతాజ్ మరణించినప్పుడు, 
1632 లో తాజ్ మహల్ నిర్మించడం ప్రారంభించినప్పుడు, 
1631 లో మాత్రమే తాజ్ మహల్‌లో ఎలా ఖననం చేయబడ్డారో వారికే తెలియాలి.ఇవన్నీ 18 వ శతాబ్దంలో ఇంగ్లీష్ మరియు ముస్లిం చరిత్రకారులు రాసిన సమ్మేళనాలు.

 వాస్తవానికి 1632 లో హిందూ దేవాలయానికి ఇస్లామిక్ రూపాన్ని అందించే పని ప్రారంభమైంది.  దీని ప్రధాన ద్వారం 1649 లో నిర్మించబడింది, దానిపై ఖురాన్ వాక్యాలు చెక్కబడ్డాయి.  ఈ ప్రధాన ద్వారం పైన హిందూ శైలిలో చిన్న గోపురం ఆకారంలో ఉన్న పెవిలియన్ ఉంది మరియు చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది.  సమీపంలోని మినార్‌లు ఏర్పాటు చేయబడ్డాయి మరియు తరువాత ముందు ఉన్న ఫౌంటెన్ పునర్నిర్మించబడింది.

ముంతాజ్_మరణించిన_7_సంవత్సరాల_తరువాత, ఈస్ట్ ఇండీస్‌కి ప్రయాణం చేసినప్పుడు JA మండెల్స్లో తన వ్యక్తిగత పర్యటనల జ్ఞాపకాలలో ఆగ్రా గురించి ప్రస్తావించారు, కానీ తాజ్ మహల్ నిర్మాణం గురించి ప్రస్తావించలేదు.
తమ్హార్నీ ప్రకటన ప్రకారం, 20 వేల మంది కార్మికులు 22 సంవత్సరాలుగా తాజ్ మహల్ నిర్మిస్తుంటే, మండెల్స్లో కూడా భారీ నిర్మాణ పనులను గురించి పేర్కొన్నాడు.

 11 వ శతాబ్దం నుండి తాజ్ తలుపులు ముస్లింలకు తెలిసినందున, తాజ్, నది ప్రక్క తలుపు మీద ఉన్న ఒక చెక్క ముక్క ను ఒక అమెరికన్ ప్రయోగశాలలో కార్బన్ పరీక్ష చేయగా ఆ ముక్క షాజహాన్ కాలానికి 300 సంవత్సరాల ముందు ఉందని తేలింది. దాడి చేసినవారు అనేకసార్లు ఆ తలుపును తెరిచారు మరియు మళ్లీ మూసివేయడానికి ఇతర తలుపులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.
కిరీటం ఇంకా పాతది కావచ్చు.  నిజానికి, తాజ్ 1115 సంవత్సరంలో అంటే షాజహాన్ సమయానికి 500 సంవత్సరాల ముందు నిర్మించబడింది.

 తాజ్ మహల్ గోపురంపై ఉన్న అష్టాదత్తు_కలశం త్రిశూలం ఆకారంలో ఉన్న పూర్ణ కుంభం.  
కొబ్బరి ఆకారం దాని మధ్యలో రాడ్ పైన తయారు చేయబడింది.  కొబ్బరి ఆకారం కింద రెండు వంగిన మామిడి ఆకుల ఆకారం మరియు దాని క్రింద కలశం చిత్రీకరించబడ్డాయి.  ఆ చంద్రుని రెండు చిట్కాలు మరియు వాటి మధ్యలో కొబ్బరి శిఖరాన్ని చేరడం ద్వారా త్రిశూలం ఆకారం ఏర్పడుతుంది.

 హిందూ మరియు బౌద్ధ దేవాలయాలపై ఇలాంటి కలశాలు తయారు చేయబడతాయి.  సమాధి పైన గోపురం మధ్యలో నుండి అష్టాదత్తుల గొలుసు వేలాడుతోంది.  ఈ గొలుసుపై వేలాడే శివలింగంపై నీటిని పడేలా చేసిన ఉపయోగించే బంగారు గిన్నె.  దాన్ని తీసి షాజహాన్ ఖజానాలో జమ చేసినప్పుడు, గొలుసు వేలాడుతూనే ఉంది.లార్డ్ #కర్జన్ దానిపై ఒక దీపాన్ని వేలాడదీశాడు, అది ఇప్పటికీ ఉంది.

శ్మశానాన్ని ప్యాలెస్ అని ఎందుకు పిలుస్తారు?  సమాధిని ప్యాలెస్ అని ఎందుకు పిలిచారు?  దీని గురించి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే అప్పటికే నిర్మించిన రాజభవనం స్మశానవాటికగా మార్చబడింది.  స్మశానానికి మారే సమయంలో అతని పేరు మార్చబడలేదు.  ఇక్కడే షాజహాన్ తప్పు చేసాడు.  'తాజ్ మహల్' అనే పదం ఆ కాలంలోని ఏ అధికారిక లేదా రాయల్ డాక్యుమెంట్ మరియు వార్తాపత్రిక మొదలైన వాటిలో ప్రస్తావించబడలేదు.  తాజ్ మహల్‌ను తాజ్-ఇ-మహల్‌గా భావించడం హాస్యాస్పదంగా ఉంది.

 'మహల్' అనే పదం ముస్లిం పదం కాదు.  అరేబియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మొదలైన వాటిలో ఒక్క మసీదు లేదా సమాధి లేదు, ఆ తర్వాత రాజభవనం స్థాపించబడింది.

 ముంతాజ్ కారణంగా దీనికి ముంతాజ్ మహల్ అని పేరు పెట్టడం కూడా తప్పు, ఎందుకంటే అతని భార్య పేరు ముమ్తా_ఉల్_జమాని.  ఒకవేళ దీనికి ముంతాజ్ పేరు పెడితే, తాజ్ మహల్ ముందు నుండి అమ్మను తొలగించడానికి ఎటువంటి సమర్థన లేదు.

 విన్సెంట్ స్మిత్ తన 'అక్బర్ ది గ్రేట్ మొఘల్' పుస్తకంలో రాశాడు, బాబర్ 1530 లో ఆగ్రాలోని వాటికా ప్యాలెస్‌లో తన సమస్యాత్మక జీవితం నుండి స్వేచ్ఛ పొందాడు అని.  తోట ఉన్న ఆ ప్యాలెస్ అదే తాజ్ మహల్.  ఇది చాలా పెద్దది మరియు గొప్పది, భారతదేశంలో ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు.  బాబర్ కుమార్తె గుల్బాదన్ 'హుమాయున్నమా' అనే చారిత్రక కథనంలో తాజ్‌ని 'మిస్టిక్ హౌస్' అని పేర్కొన్నారు.

 1155 అశ్వీజ శుక్ల పంచమి, ఆదివారం నాడు రాజు పరమర్దిదేవ్ హయాంలో తాజ్ మహల్ నిర్మించబడింది.  అందువలన, తరువాత ముహమ్మద్ ఘోరీతో సహా అనేక మంది ముస్లిం ఆక్రమణదారులు తాజ్ మహల్‌ను ద్వారాలు పగలగొట్టడం ద్వారా దోచుకున్నారు.  ఈ ప్యాలెస్ నేటి తాజ్ మహల్ కంటే చాలా రెట్లు పెద్దది మరియు గతంలో మూడు గోపురాలు ఉండేవి.  హిందువులు దీనిని బాగు చేసిన తర్వాత పునర్నిర్మించారు, కానీ వారు ఈ రాజభవనాన్ని ఎక్కువ కాలం రక్షించలేకపోయారు.
          
 విశ్వకర్మ వాస్తు శాస్త్రం అని పిలువబడే ప్రసిద్ధ నిర్మాణ గ్రంథంలో, శివలింగాలలో 'తేజ్-లింగ్' యొక్క వివరణ ఉంది.  తాజ్ మహల్‌లో 'తేజ్-లింగ్' గౌరవించబడింది, అందుకే దీనికి 'తేజో మహాలయ' అని పేరు పెట్టారు.

 షాజహాన్ కాలంలో యూరోపియన్ దేశాలకు చెందిన చాలా మంది ప్రజలు ఈ భవనాన్ని 'తాజ్-ఇ-మహల్' అని పిలిచారు, ఇది దాని శివాలయం కోసం సాంప్రదాయ సంస్కృత నామమైన 'తేజోమహాలయ'తో సరిపోతుంది.  దీనికి వ్యతిరేకంగా, షాజహాన్ మరియు ఔరంగజేబు పవిత్ర సమాధి అనే పదాన్ని జాగ్రత్తగా ఉపయోగించారు, ఈ పదం సంస్కృతంతో సరిపోలడం లేదు.

 ఓక్ ప్రకారం, హుమయూన్, అక్బర్, ముంతాజ్, ఇత్మాత్-ఉద్-దౌలా మరియు సఫ్దర్‌జంగ్ వంటి రాజ మరియు సభికులందరూ హిందూ రాజభవనాలు లేదా దేవాలయాలలో ఖననం చేయబడ్డారు.

 తాజ్‌మహల్ లేదా తేజోమహల్ ఒక శివాలయం - ముంతాజ్ మృతదేహాన్ని తాజ్ మహల్ అప్పటికే నిర్మించిన తాజ్ లోపల ఖననం చేసినట్లు అంగీకరించాలి మరియు ఖననం తర్వాత తాజ్ దాని పైన నిర్మించబడలేదు.  'తాజ్ మహల్' అనే పదం శివాలయాన్ని సూచించే 'తేజోమహాలయ' అనే పదం యొక్క ఉత్పన్నం.  తేజోమహాలయ ఆలయంలో అగ్రేశ్వర్_మహాదేవ్గా పూజించబడ్డాడు.  సెల్లార్ లోపల ఉన్న సమాధి గదిలో తెల్లటి పాలరాతి రాళ్లు మాత్రమే ఉన్నాయని, అటకపై మరియు సమాధి గదిలో పూల తీగలు మొదలైనవి పెయింట్ చేయబడ్డాయని వీక్షకులు తప్పక గమనించాలి.

 ముంతాజ్ సమాధి ఉన్న గది శివాలయం యొక్క గర్భగుడి అని దీని నుండి స్పష్టమవుతుంది.  108 కలశాలను పాలరాతి జాలకతో చిత్రించారు 108 కలశాలు దానిపై అమర్చబడి ఉన్నాయి, హిందూ దేవాలయ సంప్రదాయంలో 108 సంఖ్య పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

 తేజోమహాలయ లేదా తాజ్ మహల్‌ను నాగనాథేశ్వర్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే దాని వాటర్‌షెడ్ ఒక పాముతో చుట్టబడినట్లుగా రూపొందించబడింది.  ఈ ఆలయం జెయింట్ ప్యాలెస్ ప్రాంతంలో ఉంది.  ప్రాచీన కాలంలో ఆగ్రాను #అంగిరా అని పిలిచేవారు, ఎందుకంటే ఇది ఆంగీరస మహర్షి యొక్క తపోభూమి.ఆంగీరస మహర్షి శివుడిని ఆరాధించేవాడు.

 చాలా పురాతన కాలం నుండి, ఆగ్రాలో 5 శివాలయాలు నిర్మించబడ్డాయి.  ఇక్కడి నివాసితులు శతాబ్దాలుగా ఈ 5 శివాలయాలను సందర్శించి పూజించేవారు.

 కానీ ఇప్పుడు కొన్ని శతాబ్దాలుగా 
బాలకేశ్వర్, 
పృథ్వీనాథ్, 
కైలాష్ మరియు 
రాజరాజేశ్వర్ అనే 4 శివాలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.  5 వ శివాలయం శతాబ్దాల క్రితం సమాధిగా మార్చబడింది.  తేజోమహాలయ దేవాలయం లేదా తాజ్‌మహల్‌లో ఆరాధించబడే ఆగ్రా నాగరాజు_అగ్రేశ్వర్_మహాదేవ్_నాగ్నేశ్వర్ యొక్క 5 వ శివాలయం ప్రధాన దేవత.

 ఈ వ్యాసం శ్రీ_పురుషోత్తం_నగేష్_ఓక్ పరిశోధనపై ఆధారపడింది. #👉సమాజం
https://sharechat.com/post/3nxKE5j?d=n&~campaign=WAShareExpcontrol&referrer=whatsappShare

షేర్‌చాట్‌ను ఇన్‌స్టాల్ చేసి, 1లక్ష వరకు గెలుచుకోండి. https://sharechat.com?d=n

నాకు కోపం రాదు. ఎందుకంటే జీవితమనే మన ఈ ప్రయాణం చాలా చిన్నది.

 నాకు కోపం రాదు. ఎందుకంటే జీవితమనే మన ఈ ప్రయాణం చాలా చిన్నది.

ఒక వృద్ధమహిళ బస్సులో ఎక్కి కూర్చుంది. 
తరువాతి స్టాప్ వద్ద, 
ఒక బలమైన, 
క్రోధస్వభావం గల యువతి పైకి ఎక్కి, వృద్ధురాలి పక్కన కూర్చుని, 

ఆమెను తన సంచులతో కొట్టినంత పని చేసింది. 
వృద్ధురాలు మౌనంగా ఉండిపోవడాన్ని చూసిన యువతి 
తన సంచులు తగిలినందుకు కోపం రాలేదా అని అడిగింది.?

వృద్ధ మహిళ ఒక చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చింది: లేదు,
ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది. 

నేను తరువాతి స్టాప్లో దిగబోతున్నాను కాబట్టి, 
ఈ కొంత సమయానికి అసభ్యంగా ప్రవర్తించాల్సిన 
అవసరం లేదు.
ఈ సమాధానం బంగారు అక్షరాలతో వ్రాయడానికి అర్హమైనది:
అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు 

ఎందుకంటే  ఈ మన యాత్ర చాలా చిన్నది.

ఈ ప్రపంచంలో మనముండే సమయం చాలా తక్కువ అని 
మనలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. 
పనికిరాని వాదనలు, 
అసూయ, ఇతరుల మీద చాడీలు చెప్పడం, వారి మనసులను బాధపెట్టడం,
ఇతరులను క్షమించకపోవడం, ఎంత ఉన్నా అసంతృప్తి
మరియు చెడువైఖరి ద్వారా సమయం మరియు 
శక్తి హాస్యాస్పదంగా వృధా అవుతాయి.

మీ హృదయాన్ని ఎవరైనా విచ్ఛిన్నం చేశారా? 
ప్రశాంతంగా ఉండు. 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 
ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.

ఎవరైనా మీకు 
ద్రోహం చేశారా, 
బెదిరించారా, 
మోసం చేశారా లేదా 
అవమానించారా? 
విశ్రాంతి తీసుకోండి. 
ఒత్తిడి కి గురికావొద్దు.
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 
ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.

కారణం లేకుండా ఎవరైనా మిమ్మల్ని అవమానించారా? 
దాన్ని వదిలేయండి. 
దాన్ని విస్మరించండి. 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 
ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.

ఎవరైనా మీతో విభేదించారా, 
బాగా ఆలోచించండి...? 
గట్టిగా ఊపిరి తీసుకోండి. 
అతన్ని / ఆమెను విస్మరించండి. 
మన్నించి మరచిపోండి. 
“ఎంత ముఖ్యమైనా 
మీ మనసుకు నచ్చని, 
నీ మనసు మెచ్చని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు, 
వారితో ప్రతిరోజూ తగవు పెట్టుకోకుండా. 
వారికి దూరంగా మనశ్శాంతి తో ఉండండి, 

కొంత ఇబ్బంది కలిగినా అలవాటైతే ఏదీ ఇబ్బంది కాదు” 
ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.

ఎవరైనా మనకు ఏదైనా సమస్య కలగచేసినా, 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 
ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.

ఈ మన యాత్ర యొక్క పొడవు ఎవరికీ తెలియదు. 
దాని స్టాప్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 
ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.

మనకు అన్ని సమయాలలో అండగా ఉండే 
స్నేహితులను అభినందిద్దాం.
మనం 
గౌరవంగా, 
దయగా, 
క్షమించేలా ఉందాం.

తద్వారా, 
మనం కృతజ్ఞత 
మరియు 
ఆనందంతో నిండిపోతాము. 
చివరికి గుర్తుంచుకోవాల్సింది. 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 
ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.

మీ చిరునవ్వును అందరితో వెంటనే పంచుకోండి. 
“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 
ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.

ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు.. 

ఇది మూన్నాళ్ళ ముచ్చటే.. !!
 
లోకా సమస్తా స్సుఖినోభవంతు
🙏🙏

ఆధ్యాత్మిక జీవనం గడిపేవారు....

 శ్రీ దత్త వాక్సుధారసం....
                         
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

              🙏 జై గురుదత్త 🙏

✳️ మనిషి మనసు ఆధ్యాత్మికత వైపు మరలాలంటే ముందుగా బుధ్ధి వికసించాలి. అప్పుడే మనిషి అజ్ఞానమనే చీకటి నుంచి వెలుగు అనే జ్ఞానం వైపు ప్రయాణిస్తాడు.

✳️ నిజమైన ఆధ్యాత్మికత - మనసును నిగ్రహపరచి, దృష్టిని అంతర్ముఖం చేసి ఆత్మసాక్షాత్కారం పొందడంలోనే ఉంది. అందుకే ఆధ్యాత్మిక జీవనంలో మనిషి తనను తాను గమనించుకుంటూ ఆత్మదృష్టిని అలవరచుకోవాలి.

✳️ ఆత్మబోధనలోనే సత్య దర్శనం అవుతుంది. మనిషిలోని తమోగుణాన్ని నిరోధించి, రజోగుణాన్ని అణచివేసి, మనిషిని సత్వగుణ సంపన్నుడిగా చేస్తుంది ఆధ్యాత్మికత.

✳️ ఆధ్యాత్మిక జీవనం గడిపేవారు ఎల్లప్పుడూ సత్యజీవనానికి కట్టుబడి ఉంటారు.

✳️ కొండ శిఖరంమీద కూర్చున్న వ్యక్తి కిందికి చూస్తే, అంతా సమతులంగా అనిపిస్తుంది. అలాగే, ఆధ్యాత్మిక శిఖరం చేరుకున్నవారికి తరతమభేదాలు, ఆధిక్యతా భావాలు ఉండవు.  వారు అందరినీ సమానంగా చూస్తారు. గగనంలా గంభీరంగా, సముద్రంలా గాఢంగా, ప్రకృతిలా పవిత్రంగా, చంద్రుడిలా ఆత్మీయంగా ఉంటారు.

✳️ ఆధ్యాత్మిక జీవనంలో ప్రతి వ్యక్తీ కర్మలన్నింటినీ ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. సాధ్యమైనంత వరకూ ఇతరులకు ఉపకారం చేయాలి. స్వచ్ఛమైన ప్రేమ, దయ, కరుణ, కృతజ్ఞత, పవిత్రత వంటి దైవీగుణాలు అలవరచుకోవాలి.

✳️ పర్వతం ఎక్కినవారు బరువులన్నీ ఒక్కొక్కటీ వదిలించుకుంటారు. లేకపోతే ప్రయాణం ముందుకు సాగదు. అలాగే…ఆధ్యాత్మిక జీవనంలో బహుకాలం ఆశ్రయించి ఉన్న ప్రాపంచిక బంధాలను, భావాలను వదిలేస్తూ ముందుకు సాగాలి. అప్పుడే మనిషి ఆధ్యాత్మికత శిఖర స్థాయికి చేరుకుంటాడు.

✳️ ఆధ్యాత్మిక జీవనం అంటే పూజలు, జపాలు, భజనలు చేయడం కాదు. ఇవన్నీ సత్కర్మలు. ఆధ్యాత్మికత అంటే మనిషి తనలోని పశుత్వాన్ని జయించడం.

✳️ పశుత్వ గుణాలైన అహంకారం, దురాశ, కోపం, మదమాత్సర్యాలు, ఈర్ష్యాద్వేషాలు తొలగించుకోవాలి. మానవత్వం నుంచి దివ్యత్వానికి చేరుకోవడానికి ప్రయత్నించాలి.

✳️ ఆధ్యాత్మిక జీవనంలో మనిషికి అతిగా ఆశలు, ఆశయాలు, కోరికలు వంటివి ఉండవు. రాగద్వేషాలకు అవకాశమే ఉండదు. తాత్విక చింతన, స్థితప్రజ్ఞత కలిగిన ఆ మనిషి విమర్శలను, వ్యతిరేకతలను ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సోపానాలుగా ఉపయోగించుకుంటాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకంజ వేయడు. 

✳️ ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించిన మనిషి ప్రాపంచిక సుఖాల కోసం ఆరాటపడడు. ఆధ్యాత్మిక జ్ఞానసంపద మనిషికి మంచి జీవన విధానాన్ని నేర్పుతుంది. పరమార్థాన్ని బోధించి మనిషిని స్థితప్రజ్ఞుడిగా మారుస్తుంది.

✳️ ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదిగినట్లయితే, అతడి జీవనవిధానంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. దృష్టిలో పవిత్రత, సేవలో నమ్రత, స్నేహంలో ఆత్మీయత, సంస్కారంలో శ్రేష్ఠత, మాటల్లో మాధుర్యం వంటి గుణాలను అతడు అలవరచుకుంటాడు. జన్మను సార్థకం చేసుకుంటాడు.

✳️ భగవంతుడు చాలా శక్తిమంతుడు. భక్తుల పాలిట కల్పవృక్షం. కష్టమైనా, సుఖమైనా అంతా భగవంతుడు ఇచ్చినవే అని భావించాలి. కోరికలు నెరవేరకపోయినా భగవద్భక్తిని విడవకూడదు. భగవంతుడికి అన్ని విధాలా శరణాగతుడై సాధకుడు జీవితాన్ని కొనసాగించాలి. 

మనోనిగ్రహమే మహా సాధనం!

 మనోనిగ్రహమే మహా సాధనం!

ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎవరూ వృథాగా కాలం వెళ్లబుచ్చకూడదన్నది’ మన పూర్వీకుల సందేశం. నిరంతరాయంగా, ధర్మబద్ధంగా మన కర్తవ్యాలను నిర్వహిస్తూనే ‘ఆత్మోద్ధరణ’ దిశగా ప్రయాణించాలి. మళ్లీ మళ్లీ పుడుతూ చనిపోయే (‘పునరపి జననం, పునరపి మరణం’) కర్మబంధాలలో చిక్కుకొని అలమటించే పరిస్థితిని తెచ్చుకోకూడదు. ఈ మేరకు, ‘విముక్తి (మోక్షం) కలిగించే తరుణోపాయాన్ని గీతాచార్యుడే మనకు సూచించాడు.

ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానమవ సాదయేత్‌
ఆత్మైవ హ్యాత్మనోబంధుః ఆత్మైవ రిపురాత్మనః॥
                                భగవద్గీత (6-5)

సంసార సాగరం నుంచి మనల్ని మనమే ఉద్ధరింపజేసుకోవాలి. లోకంలో మనకు మనమే మిత్రులం, మనకు మనమే శత్రువులం. బయటి శత్రువులను సామదాన భేదదండోపాయాలతో జయించవచ్చు. కానీ, శరీరం లోపలి అంతశ్శత్రువులను జయించడం చాలా కష్టం. ముఖ్యంగా మనసును జయిస్తే అదే మంచి మిత్రుడౌతుంది. జయించలేకపోతే అదే మన పాలిట శత్రువువలె మారి, మనల్ని కుంగదీస్తుంది. మానవులకు అతిపెద్ద శత్రువులైన ‘కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం’ (అరిషడ్వర్గాలు) అనేవి మనలోనే ఉంటాయి. ఈ అంతర్గత శత్రువులు బాహ్యమైన వాటికన్నా ఎంతో హానికరమైనవి, నిర్దాక్షిణ్యమైనవి.
ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మకు ఆత్మయే శత్రువు. ఎవరికి దాహమేస్తే వారే నీళ్లు తాగినట్లుగా ఎవరి సాధన వాళ్లే చేసుకోవాలి. ఎవరి జ్ఞానాన్ని వాళ్లే సంపాదించుకోవాలి. సద్గురువులను ఆశ్రయించి ధ్యానసాధన చేయాలి. గురు ముఖతఃగానీ, సద్గ్రంథాధ్యయనం వల్లగానీ ఆత్మజ్ఞానాన్ని పొందినవారే ఆత్మోద్ధరణ చేసుకోగలుగుతారు. ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలిచినట్లు మనం ఏ విధమైన కర్మలు చేస్తుంటామో అదేవిధమైన ఫలితాలను పొందుతాం. గురువు, శాస్త్రం, దైవం కూడా చివరికి మన ఆత్మోద్ధరణకు దారి చూపేంతవరకే పరిమితం. మన కాళ్లతో మనమే నడిచినట్లు, మన కండ్లతో మనమే చూస్తున్నట్లు, మన ఆకలిని మనమే తీర్చుకుంటున్నట్లు మనల్ని మనమే ఉద్ధరింపజేసుకోవాలి.
మనసు చంచలమైంది. ఒకవంక మంచిపనుల వైపు, మరొక వంక చెడు ఆకర్షణలవైపు అది లాగుతూ ఉంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని ప్రయత్న పూర్వకంగా సాధించిన మనిషి మహోన్నతుడవుతాడు. ఇంద్రియ వ్యామోహంలో చిక్కుకున్నవాడు పతితుడవుతాడు. దశకంఠుడైన రావణుడు పది రకాలుగా ఆలోచించేవాడట. అతని నాలుగు తలలు మంచివైపు ఉంటే, ఆరు తలలు చెడువైపు లాగేవట. ఇంద్రియ చాపల్యమే మనిషి పతనానికి హేతువవుతుందన్నది నిజం. కాంచనాన్నీ (బంగారం), గాజు ముక్కనీ సమానంగా చూడగలిగిన శ్రీ రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావులు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. వివేకం, వైరాగ్యం కలిగినవారే మనసును జయించగలుగుతారు. అలా, మనోనిగ్రహం కలిగినవానికే మనసు మిత్రునిలాగా మారిపోతుంది. తన ఆప్తమిత్రుడు, బాల్య స్నేహితుడైన శ్రీ కృష్ణుని ఏదో అడగాలనే కోరికతో కుచేలుడు వెళ్లినా, స్వామి దివ్యత్వాన్ని కండ్లారా చూశాక, ఏమీ కోరకుండానే వచ్చేస్తాడు. అడగకుండానే ఐష్టెశ్వర్యాలనూ ప్రసాదిస్తాడు శ్రీకృష్ణ పరంధాముడు. అనన్య స్నేహభక్తి కుచేలునిదైతే, ఆశ్రిత వత్సలత పరమాత్మ తత్త్వం.

మనిషి ఎల్లవేళలా ధర్మబద్ధమైన, సకల ప్రాణి హితమైన కర్మలనే ఆచరించాలి. మనం చేస్తున్న పనులెలాంటివో ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. సాధనతో జ్ఞానాన్ని సమీకరించుకోవాలి. సృష్టిలోని ప్రతి ప్రాణినీ పరమాత్మ స్వరూపంగా చూస్తూ, ప్రేమభావంతో మెలగాలి. అమూల్యమైన కాలాన్ని వృథా చేయకుండా నిరంతరం సత్కర్మాచరణలతో మనసును అదుపులో ఉంచుకోవాలి. నకారాత్మక మనోభావాల (నెగెటివ్‌ థాట్స్‌) ప్రభావం వల్లనే ఒత్తిడి, కోపం, విపరీత ధోరణులు, దీర్ఘకాలిక అనారోగ్యం వంటివి కలుగుతాయని మనస్తత్వ శాస్త్రవేత్తలూ అంటారు. కనుక, సకారాత్మక ఆలోచనావిధానాన్ని (పాజిటివ్‌ థింకింగ్‌) సాధనతోనే అలవరచుకుందాం.

పనికిమాలిన వస్తువులు ఇంటికి బరువు.....

 🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఓ మానవ గుర్తుంచుకో.....

పనికిమాలిన వస్తువులు ఇంటికి బరువు.....

పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు...,

పనికిమాలిన వారి స్నేహము జీవితానికి బరువు....

ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మన జీవితానికి శ్రేష్టం.....

ఎరుకతో ఉండండి.....
తెలివిగా ప్రవర్తించండి.....
ధర్మ చింతనతో ఉండండి....
సేవా దృక్పథం పాటించండి....

ధ్యానం చేయండి....
జ్ఞానం పొందండి.....
ఓర్పు సహనంతో సమయస్ఫూర్తితో ఆనందంగా జీవించండి.....
                చెన్నై జగదీష్.....

💐💐💐💐💐💐💐💐

దైవమును నమ్మక చెడినవారలున్నారు కానీ నమ్మి చెడినట్టివారు ఎవరూ లేరు, లేరు, లేరు.

 *🌺🙏 *జై శ్రీ కుసుమహార* 🙏🌺

*_🌴దైవమును నమ్మక చెడినవారలున్నారు కానీ నమ్మి చెడినట్టివారు ఎవరూ లేరు, లేరు, లేరు. ఈ జగత్తంతా నమ్మకంపై ఆధారపడి నడుస్తోంది.  డ్రైవరు ఎవరో తెలియకపోయినా అతను మనల్ని సురక్షితంగా గమ్యం చేరుస్తాడని విశ్వసించి మనం బస్సుకానీ, ట్రైను కానీ ఎక్కి ప్రయాణం సల్పుతున్నాము. ఎవరో తెలియని వంటవాడిని నమ్మి, భోజనశాలకు వెళ్ళి అతను వండిన పదార్థాలను తృప్తిగా భుజిస్తున్నాము. ఈరీతిగా నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనీ నమ్మకంతోనే ముడిపడి ఉంది. అది లేకపోతే ఈ లోకంలో మనుగడ సాగించలేము. మనుషుల్ని ఇంతగా నమ్మే మనము భగవంతుని మాత్రం ఎందుకు నమ్మకూడదు?! ఎందుకు నమ్మడం లేదు?!! నిజంగా పరిపూర్ణమైన ప్రేమతో భగవంతుణ్ణి విశ్వసిస్తే, ఆ భగవంతుడే మన జీవనయానాన్ని సజావుగా సాగేలా చేయడా! మానవునిపై పెట్టుకున్న విశ్వాసము మాధవునిపై పెట్టుకుంటే మన జీవితాలను సుఖసంతోషాలతో నింపి, మనల్ని గమ్యం చేరుస్తాడు కదా!. కానీ మనం ఇలా చేస్తున్నామా? ఆయనపైనే శతకోటి సందేహాలు పెంచుకుంటున్నాం. దేవునిపై పెంచుకోవలసింది సందేహాలను కాదు, విశ్వాసమొక్కటే! ఆయనపై ప్రగాఢమైన విశ్వాసాన్ని మన గుండెల్లో  నింపుకున్నపుడు మనభారం అంతా ఆయనే చూసుకుంటాడు. చెడడం అనే మాటే ఉండదు.. జీవితం అంతా ఆనందమయమే అవుతుంది.🌴_*

మానవ జీవితం ఒక నాటక రంగం వంటిది.

 *🌺🙏జై శ్రీ కుసుమహార🙏🌺*

*_🌴 మానవ జీవితం ఒక నాటక రంగం వంటిది.  ఈ నాటక రంగంలో ఎవరు పోషించాల్సిన పాత్ర వారు చక్కగా పోషించి డైరెక్టర్ నుండి మంచి పారితోషికం పొందడానికి ప్రయత్నం చేయాలి. దర్శకుడు ఎలా చెప్తే అలా చేసినపుడే ఆయన నటులను అభినందిస్తాడు. మంచి పారితోషికం ఇస్తాడు. ఇక్కడ భగవంతుడు మనకు దర్శకుడు లాంటివాడు. ఆయన నిర్మిస్తున్న నాటకంలో మనల్ని పాత్రధారులుగా ఎంచుకున్నాడు. కనుక ఎవరి పాత్ర వారు చక్కగా పోషించడానికి ప్రయత్నం చేయాలి. సూత్రధారి సూచించిన సూచనలు పాటించినపుడే పాత్రకు సరైన న్యాయం చేయగలుగుతాం. కనుక ఎక్కడున్నా, ఎలా ఉన్నా  దేవుడు చూపిన  మార్గంలో నడవడానికే పూన్కోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్గం నుండి తప్పడానికి వీలులేదు. గుర్తుంచుకోండి, దైవము చూపిన దారి తప్పి నడిచామా అంటే, మన నాశనానికి మనమే ముహూర్తం పెట్టుకున్నట్లు అవుతుంది. 🌴_*

స్వేచ్ఛ గల మనస్సు మాత్రమే తగు స్పందనని, ఉద్వేగాన్ని వ్యక్తం చేయగలదు.

 మనకు రొజువారి జీవితంలో అనేక సంఘటనలలు ఎదురు అవుతూ వుంటాయి.
ఇవన్నీ మనలో వివిధ ఉద్వేగాలను కలిగిస్తాయి.అలా ఉద్వేగాలు కలగడమే కాదు ఇవి మన స్వభావాన్ని నిర్ణయిస్తాయి.
     అలా ఉద్వేగం కలిగినప్పుడు ,ఈ ఉద్వేగానికి కారణం బాహ్య సంఘటన  అనుకుంటాము.
 కాదు.
జరిగిన సంఘటనని మనం ఎలా అర్థం చేసుకున్నాము, ఎలా స్పందించాము,ఎలా అది మనతో సంబంధం కలిగి వున్నది, అన్న అంశాలు ఆధారంగా ఉద్వేగం కలుగు తుంది..
    ఒక రకమైన సంఘటన పట్ల అనేక రకాలుగా మనం స్పందించ గలము.
   ఏది సరైన స్పందన,ఏది తగు భావోద్వేగం అనేది ఆ సమయంలో మనస్సు యొక్క స్థితి ఎలాంటిది అన్న అంశం ప్రాధాన్యం.
   స్వేచ్ఛ గల మనస్సు మాత్రమే తగు స్పందనని, ఉద్వేగాన్ని వ్యక్తం చేయగలదు.
ధ్యానం మనస్సు ని స్వేచ్ఛ గా వుంచుతుంది.
ఇట్లు.
ప్రేమికుడు లేని ప్రేమ.

ఆధ్యాత్మికత

 *ఆధ్యాత్మికత*

*ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఏదో ఒక రోజు ఆధ్యాత్మిక ఆదర్శంపై అభిరుచి కలిగే తీరుతుంది.

*అప్పుడు వారికి ప్రపంచంలో ఏదీ సంతృప్తిని ఇవ్వదు. ఆ ఉన్నత ఆదర్శాన్ని ప్రాప్తించుకునే వరకూ వారికి మనశ్శాంతి లభించదు. ఈ వ్యాకులత, అంతరంగిక జాగృతి ఇవే ఆధ్యాత్మిక జీవనానికి నాంది పలుకుతాయి.

*ఆధ్యాత్మిక ఆదర్శం వారిని ప్రబలంగా ఆకర్షించి, జీవితాంతం అంటిపెట్టుకుని ఉంటుంది. ఈ విధంగా ప్రాపంచికమైన ఆదర్శాలను వదలి ఆధ్యాత్మికమైన ఆదర్శాలను అనుసరించడమే ఆధ్యాత్మిక పరివర్తన.

*దీనితోనే ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమౌతుంది. ఈ పరివర్తన కొందరిలో హఠాత్తుగా జరిగితే మరి కొందరిలో క్రమక్రమంగా జరుగుతుంది.

*భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు ఈ విధంగా చెబుతాడు...      "అనేక వేలమంది మనుజులలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. అట్లు యత్నించు వారైన అనేకమందిలో   ఏ ఒక్కడో మాత్రమే నన్ను వాస్తవముగా తెలిసికొనగల్గుతున్నాడు."

*వేలకొద్ది జనులలో చాలా కొద్దిమంది మాత్రమే ఆధ్యాత్మిక జీవనానికి ఆకర్షితులౌతారు. అటువంటి ఆధ్యాత్మిక సాధకులలో బహుకొద్ది మందికి మాత్రమే అత్యున్నతమూ, చైతన్యానికి కూడా అతీతమూ అయిన సాక్షాత్కారం లభిస్తుంది.

*కానీ మనం నిరాశ చెందకుండా, ఆ ప్రయత్నించే కొద్దిమందిలో మనం కూడా ఉన్నామని భావించుకుని, ఆ ఆధ్యాత్మిక ఆదర్శం కోసం తీవ్రంగా శ్రమిద్దాం.

           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏

*రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయతను కూడా నేర్పుదాం.

మానసిక సౌఖ్యం మహోన్నతం

 Xxi.X. 1-6.   260822-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


మానసిక సౌఖ్యం మహోన్నతం
               ➖➖➖✍️

సుఖం, అనేది అంగట్లో దొరికే వస్తువే అయితే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే వస్తువు అయ్యేది. 

వెండి, బంగారం, వజ్రాల కంటే విలువైనది అయ్యేది. అది కొని తెచ్చుకునేది కాదు. ప్రతి మనిషీ తనకు తాను, తనలో తాను రూపొందించుకునే గొప్ప అనుభూతి! 

మణిమాణిక్యాలు, వజ్రవైఢూర్యాలు, ధనరాశులు, రాజ్యం, అధికారం, మహా ఐశ్వర్యం ఇవన్నీ దర్పాన్ని తెచ్చిపెడతాయి కానీ, చిటికెడు సుఖాన్ని అందించలేవు. కనీసం కంటినిండా కునుకు తీసే అవకాశాన్ని ఇవ్వలేవు.

కప్పినుడు అలాంటి పరిస్థితిని చవిచూశాడు. అతను కుక్కుట రాజ్యానికి రాజు. తండ్రి మరణానంతరం రాజయ్యాక జంబూ ద్వీపం మొత్తాన్ని జయించాడు. రాజులందర్నీ పారద్రోలాడు. కానీ... మెత్తటి పడక ఉన్నా, సుగంధ పరిమళ ద్రవ్యాలు ఉన్నా కంటినిండా నిద్రపోలేక పోయాడు. శత్రువులు ఏ క్షణాన, ఏ రూపంలో వచ్చి పడతారో అనే భయం. 

అతను ఒకరోజున నగర ప్రదక్షిణ చేస్తూ చెట్టుకింద హాయిగా నిద్రపోతున్న ఒక భిక్షువుని చూశాడు. ఆగి అతణ్ణి లేపి… “నీ సుఖనిద్రకు కారణం ఏమిటి?” అని అడిగాడు. 

ఆ భిక్షువు రాజుని బుద్ధుని దగ్గరకు తీసుకుపోయాడు. బుద్ధ ప్రబోధం విన్నాడు రాజు.

“కోరికలు ఎడతెరిపి లేనివి. వాటివల్ల కలిగే కామసుఖం తాత్కాలికం. కానీ నిష్కామసుఖం గొప్పది, శాశ్వతం. సంపాదనతో ముడిపడిన కర్మవల్ల కలిగే సుఖం కొద్దిపాటిది. అలా ముడిపడనిది మహత్తరమైనది. తృష్ణవల్ల కలిగే సుఖం తుచ్ఛం. తృష్ణారహిత సుఖం అమోఘం. లేశమంతే లౌకిక సుఖం. 

“అద్వితీయం- అలౌకికసుఖం, శారీరక సుఖం కంటే మానసిక సుఖం మహోన్నతమైంది. సుఖం మీద ప్రీతితో పొందే సుఖం కంటే అప్రీతితో పొందే సుఖం అమరమైంది. అపేక్షతో పొందే సుఖం అమరమైంది. ఆపేక్షతో పొందే సుఖం కంటే ఉపేక్షతో పొందే సుఖం ఉన్నతమైంది. ఉత్తమమైంది. సమాధిస్థితిలో పొందే సుఖం అనిర్వచనీచమైంది. 

ఒక గృహస్తు పొందే సుఖం కంటే తాపసి. ధ్యాని పొందే సుఖం ధరణీతలంలో అన్నింటికంటే గొప్పది”అని చెప్పాడు.

మనం మరొకరి సుఖాన్ని దొంగిలించినా, లాక్కున్నా అది మనకు సుఖాన్నివ్వదు. దొంగ అందుకే ఎంత ధనాన్ని దోచుకున్నా సుఖంగా బతకలేడు. పట్టుబడతానేమో అనే భయంతో బతుకుతూనే ఉంటాడు.                        కామ దురాచారుల గతి కూడా అంతే! ఎదుటివారి శ్రమను దోపిడి చేసినా, సంపదను దోచుకున్నా, పరుల అధికారాన్ని, రాజ్యాల్ని బలవంతంగా హస్తగతం చేసుకున్నా, ఆస్తి, అంతస్తు అధికారాల్ని పెంచుతాయి గానీ, ఆదమరచి నిద్రపోనీయవు. కునుకు సుఖాన్ని కూడా దక్కనీయవు. 

కామ, క్రోధ, లోభ, మోహ, రాగాల్ని వీడినవారే అమరమైన సుఖాన్ని పొందగలరు. 

బుద్ధ ప్రబోధానంతరం, రాజ్యాన్ని త్యజించి, భిక్షువుగా మారాడు కప్పియరాజు. ‘ప్రజ్ఞాని మాత్రమే సుఖంగా జీవిస్తా’డనే బుద్ధవాక్కు ప్రకారం ఆ తర్వాత ఆనందంగా, సుఖంగా, కంటినిండా నిద్రపోయాడు. 

జీవితాంతం ధర్మాన్ని ప్రబోధిస్తూ మరణించాక కూడా అమరుడయ్యాడు. కప్పియ భిక్షువుగా కీర్తిగాంచాడు.✍️                                
                         – డా. బొర్రా గోవర్ధన్‌.
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.

వాసనలు

 2ix.ix. 1-2. 260822-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
భగవద్…
                  వాసనలు:
                 ➖➖➖✍️
వేదాంత పరిభాషలో వాసనలు మూడు రకాలు. దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన. అసలీ వాసన అంటే ఏమిటో, అది ఎలా వస్తుందో తెలుసుకుందాం.

శరీరం ధరించిన ప్రతివాడికీ ఆ శరీరం ఉన్నంతవరకు ఏదో ఒక పని చేస్తూ ఉండక తప్పదు. కానీ గరిటతో కలపవలసిన సాంబారు చేత్తో కలిపితే ఆ చేతికి వాసన అంటుకున్నట్టు, శరీరంతో చేయవలసిన పనులకు మనస్సును జత చేస్తే మనస్సుకు ఆ వాసన అంటుకుంటుంది.

శరీరానికి ఆకలి వేసిందనుకోండి, తినగలిగిన పదార్ధం అప్పటికి ఏది దొరికితే అది లోపల వేస్తే ఆ ఆకలి తీరిపోతుంది. కానీ ఆ సమయానికి మనం ఏ శరవణ భవన్ కో వెళ్ళామనుకోండి, శరీరం ఆకలి తీరటంతోపాటు అక్కడ వంటకాలు బాగుంటాయి అనే ఒక గుర్తు మనస్సులో నాటుకుపోతుంది….అదే వాసన! 

అయితే మీరు మనస్సు పెట్టి తినకపోతే ఈ వాసన అంటదు. నిజానికి ఆకలి వేయటం, ఆహారం తినటం, కడుపు నిండటం ఇవన్నీ కేవలం దేహానికి సంబంధించిన విషయాలు. 

కేవలం ఒక దేహ క్రియగా ఉండవలసినదానికి మనసు చేర్చటంతో అది వాసనగా అంటుకొని చివరికి కర్మగా మారుతుంది.

ఇక దేహ వాసన అంటే ఈ దేహం నేను అనే నిశ్చితమైన నమ్మకం. అది ఈ దేహానికి పెట్టుకున్న పేరుపై కూడా అంతే గాఢంగా ఉంటుంది. నా పేరు ప్రసాదు అనుకోండి, పిలిచేది నన్నే అని తెలిసినా ప్రసాదరావు అంటే పలకను. పేరు కేవలం దేహానిదే అయినా, అది కేవలం సౌలభ్యం కోసం పెట్టుకునన్నదే అయినా, మహాత్ముల సన్నిధిలో కూడా దాని మీద అభిమానాన్ని వదులుకోలేము.

శాస్త్ర వాసన అంటే మనం చదువుకున్న పుస్తకాలలో, విన్న విషయాలలో ఉన్న విజ్ఞానమే సర్వస్వం అని బలంగా విశ్వసించటం. పరిమితమైన మానవ జీవితకాలంలో పరిపూర్ణ విజ్ఞానాన్ని కేవలం చదువుద్వారా పొందటం ఎవరికీ సాధ్యం కాదు. కేవలం తనను తాను తెలుసుకొన్న బ్రహ్మజ్ఞానికే సర్వం తెలియబడుతుంది. కానీ మనం మనకున్న పరిమిత జ్ఞానంతోనే అనంతుడైన భగవంతుణ్ణి, ఆయన ప్రతిరూపాలైన అవతార పురుషుల్ని, మహాత్ముల్ని అంచనా వేయాలని చూస్తాం. మనకు తెలిసిన గుప్పెడు ధర్మ సూత్రాలతో ధర్మాధిష్టానమైన పరమాత్మనే అంచనా వేస్తూ రాముడు అలా ఎందుకు చేసాడు? కృష్ణుడు ఇలా ఎందుకు చేసాడు? అని వాదిస్తాం. అనంత విశ్వంలో అతి చిన్న భాగమైన మన సమాజపు కట్టుబాట్లతో అనంతుడైన భగవంతుణ్ణి బంధించాలని చూస్తాం. మనమీద కరుణించి ఆ భగవంతుడే ఏ కుక్క రూపంలోనో ప్రత్యక్షమైతే శాస్త్రాలలో చెప్పిన ఆకారంలో రాలేదని గుర్తించటానికి నిరాకరిస్తాం. తులసీదాసు అంతటి మహాభక్తుడికే ఈ పరిస్థితి తప్పలేదు.

ఇక లోక వాసన - ఈ లోకంలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ కొన్ని అభిప్రాయాలూ అలవాట్లూ ముందే ఏర్పరుచుకొని ప్రతిదానిని ఆ కోణంలోనే చూస్తాం. ఒక వ్యక్తి మనకు ఏదో మంచో చెడో చేస్తే, అలాంటి వేషభాషలు, ఆ కులం, ఆ మతం, ఆ జాతికి సంబంధించిన వారందరికీ, వాళ్ళెవరో మనకు తెలియకపోయినా, అవే గుణాలు అంటగడతాం. సిగరెట్టు కోసం పరాయి వాళ్ళని అగ్గిపెట్టె అడగడానికి కూడా సిగ్గుపడం కానీ ఏ ఆశ్రమనికో సత్సంగానికో వెళ్ళాలంటే నలుగురూ ఏమనుకుంటారో అని సిగ్గుపడతాం.

మన కంటికి కనపడకుండా ఎక్కడో గోడవతల ఉన్న పువ్వు వాసన కూడా మనదాకా చేరినట్లు, ఈ వాసనలు మనను జన్మజన్మలదాకా వెంటాడుతూనే ఉంటాయి. 

సాధనద్వారా మన మనస్సు ప్రక్షాళన చేసుకొనేదాకా ఈ వాసనలు తప్పవు.✍️
 . సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి. 

జీవిత లక్ష్యం

 జీవిత లక్ష్యం

🔹🔸🔹🔸🔹🔸

జీవితం అనేది జీవించడానికి మాత్రమే ఉంది. మన ఆశలు, కోరికలు, ఆకాంక్షలు మనల్ని జీవించకుండా అడ్డుపడతాయి. మన సహజత్వాన్ని మనకు కాకుండా చేస్తాయి. మనుషులు ఏవో ప్రయోజనాలను, లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. అట్లాంటివి ఉన్నప్పుడే జీవితం అర్థవంతంగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. అదొక సహజ క్రియ అని అవగాహనకి వస్తుంది.

ఆలోచన అన్నది మన మనసులో ఎప్పుడూ కదుల్తూ ఉంటుంది. కుటుంబం, సంబంధ బాంధవ్యాలు అన్నీ మెదుల్తూ ఉంటాయి. వాటిని అనుసరించి బాధ్యతలు, కోరికలు తీగలు సాగుతాయి. దాంతో జీవితం తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. పరిస్థితి తారుమారు అవుతుంది.

మనిషి సహజ సిద్ధంగా ఉండాలి. కానీ మనిషి అసహజం గా మారిపోయాడు. తిరిగి సహజత్వంలోకి వెళ్ళడానికి అతనికి ఒక ప్రయత్నం ఉండాలి. ఒక ఉద్దేశం ఉండాలి. ఎందుకు అంటే మనిషి సహజంగా ఉంటే తను సహజంగా లక్ష్య
అన్న స్పృహ మనిషికి ఉండదు. అసలు సహజంగా ఉండాలన్న ఆలోచనే చిత్రమైంది. మనిషి సహజంగా ఉండాలి అన్న అబిప్రాయం వదులుకోవాలి. ఎందుకు అంటే అలా ఉండటం అనేది ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని ఏర్పర్చుకోవడం. కానీ జీవితానికి ఎలాంటి గమ్యం, లక్ష్యం ఉండవు. జీవితం అన్నది జీవించడానికి మాత్రమే ఉంది. !!

అంటే ఏంటి జీవితానికి ఒక ప్రత్యేక లక్ష్యం అంటూ లేదు. ఒక ప్రయోజనం అంటూ లేదు. ఉదాహరణకు ఒక పువ్వు ను తీసుకోండి. సున్నితమైన తీగకు సుందరమైన పువ్వు పూస్తుంది. అది వికసిస్తుంది. అందాన్ని వెదజల్లుతుంది. అది ఏదో ఉద్దేశంతో, ఎటువంటి ప్రయోజనం తో ఉనికిలోకి రాలేదు. అది ఎవరి కోసమో ఆకారాన్ని సంతరించుకోలేదు. పరిమళాన్ని ప్రసరిస్తూ ఉంటుంది. దారంటే ఎందరో వెళుతూ ఉంటారు. "రండి దయచేసి దగ్గరకు రండి. నన్ను చూడండి. ఆనందించండి. ఆఘ్రాణించండి. నేను మీ కోసమే ఈ భూమి మీదకు వచ్చాను " అని అనదు. లేదా" నేను అంటే ఏమనుకుంటున్నారు. అమ్మాయిలకి, ఆడవాళ్ళకు నేను అంటే ఎంతో ఆసక్తి. నన్ను తీసుకుని వెళ్ళండి. అమ్మండి. వాళ్ళు నన్ను కొంటారు. వారిని ఆకర్షించేందుకే నేను జన్మించాను " అని గొప్పలు చెప్పుకోదు. ఇంకా... " నేను ఆయన పాదాలని తాకందే ఆయనకు పరిపూర్ణత సిద్దించదు. నన్ను తీసుకుని వెళ్ళండి. ఆలయానికి వెళ్ళండి. దేవుడి పాదాలపై నన్ను ఉంచండి. నాలో పవిత్రత ఉంది " అని పరితపించదు. ఇలా ఎన్నెన్నో చెబుతుంది అని మనసు అంటుంది. కానీ అది వాస్తవం కాదు. ప్రయోజనాలు అన్నవి మనసు చేసే కల్పనలు. మనుషులకు ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనాలు లేకుండా ఏదైనా ఉండటం అన్నది మనుషులు ఊహించలేరు. పువ్వులు అంటే స్త్రీల జడల్లో ఉండాలి. దేవుడి పాదాలపై ఉండాలి. నాయకుల మెడల్లో ఉండాలి. ఇలా పూలకు ఒక ప్రయోజనాన్ని మనం అంటగడతాం. కానీ నిజానికి వీటి అన్నింటిని ఉద్దేశించి పువ్వు ఉనికిలోకి రాలేదు. అది ఉంది అంతే. ! 

పువ్వు యొక్క ప్రయోజనం వికసించడమే. వికసించడం అన్నదానికి ఒక ప్రయోజనం. ఉద్దేశించడం ఉండవు. దాని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు అనవచ్చు. ఎలాంటి ప్రయోజనమూ లేకపోవడమే పువ్వుకు అయినా, మనిషికి అయినా ఉన్న సహజ లక్షణం.

మనిషి కూడా పువ్వులాగా ఉండాలి. పువ్వు లాగే జీవించాలి. "మనిషి జన్మించినప్పుడు స్వేచ్ఛగా ఉన్నాడు. ఆ తర్వాత జీవితం అంతా నిగాళాల్లో ఉన్నాడు అని రూసో అన్నది అందుకే. నిజమే. మనం జన్మతో స్వేచ్ఛగా భూమికి వస్తాం. సహజంగా వస్తాం. క్రమక్రమంగా కుటుంబం, సమాజం మనల్ని వాటికి అనుగుణంగా అనుకూలంగా మారుస్తాయి. మలుచుకుంటాయి. మనిషి యొక్క అసలైన అస్తిత్వం మరుగున పడిపోతుంది. సమాజం ఆపాదించిన "వ్యక్తిత్వం " రూపొందుతుంది. సహజత్వం అనేది అదృశ్యం అవుతుంది. మనం అసహనంగా రూపొందుతాం. కానీ మనిషి అలా లేడు ‌ . అసహజత్వాన్ని సహజంగా భావిస్తున్నాడు. దాంతో పరిస్థితి తారుమారు అయింది. ప్రయోజనాల పరస్పర సంబంధంలో జీవితం ఉన్నది జీవించడానికి అన్న విషయం మరుగున పడింది.

🔹🔸🔹🔸🔹🔸🔹

రెండు కోతులు

 రెండు కోతులు

🌷🌷🌷🌷🌷🌷

నదీ తీరాన వున్న ఆ గ్రామంలో ఒక  మఠం
వున్నది. ఆ మఠంలో  కొంతమంది  సాధువులు నివసిస్తున్నారు. ఆ గ్రామంలోని ఒక వ్యక్తకి ఆ సాధువులంటే  ఏహ్యభావం.
'ఏ పనీ లేకుండా వూరికే కాలక్షేపం చేస్తున్నారని విమర్శిస్తూ వుండేవాడు.

ఒక నాడు సాధువులు ఆ మఠంలో ఏం చేస్తున్నారో చూడాలని అనిపించింది ఆ వ్యక్తి కి. వెంటనే బయలుదేరి వెళ్ళేడు. 
మఠానికి బయట ఒక సాధువు నిలబడి వున్నాడు.  గ్రామంలోని వ్యక్తి ఆ సాధువుని '
ఇక్కడ వూరకనే నిలబడి ఏం చేస్తున్నారు?
అని అడిగాడు.  ' నేను ఊరికే నిలబడలేదు. 
రెండు గ్రద్దలు, రెండు కోతులు, రెండు కుందేళ్ళు, ఒక విష సర్పాన్ని కాపలా
కాస్తున్నాను అన్నాడు ఆ సాధువు.

ఆ గ్రామస్థుడు చుట్టు ప్రక్కల చూశాడు.
అక్కడ కోతులుగాని, కుందేళ్ళు గాని, 
గ్రద్ద, సర్పం ఏవీ కనిపించలేదు. 

' ఊరికినే అంటున్నారు. ఇక్కడ అవేమి కనిపించడం లేదే'' అని అన్నాడు.

వెంటనే ఆ సాధువు నవ్వుతూ ఆ గ్రామస్థునికి
వివరించాడు. ...
"నా రెండు కళ్ళు రెండు గ్రద్దలు.  
పనికిరానివాటినన్నిటిని చురుగ్గా
చూస్తూవుంటాయి. వాటిని చూసి
బుధ్ధిని పాడుచేస్తాయి. 
నా రెండు చేతులు రెండు కోతులు. 
వేటిని పట్టుకుందాం  అనవసరమైన పనులు చేయాలి అని తురు తురుమంటూ వుంటాయి. నా రెండు
కాళ్ళు రెండు కుందేళ్ళు .
ఒక గమ్యం లక్ష్యం లేకుండా గెంతుతూ పరుగెత్తాలని చూస్తూ వుంటాయి.
నా నాలుక వుంది చూశావూ...అది
విష నాగము.  ఎవరిని కరుద్దామని
సిధ్ధంగా వుంటుంది.  వీటిని వాటి ఇష్టానికి
వదలి వేశామంటే  ఆపదలు కలుగుతాయి.
అందుకే జాగ్రత్తగా వాటికి కావలిగా వుంటాను. అని అన్నాడు సాధువు.
 
గ్రామస్థునికి  సత్యం బోధ పడినది. 
భౌతిక సుఖాలను అణుచుకోవడం యొక్క
అవసరం ,మనలని మనం ఆత్మ పరిశీలన
చేసుకోవడం  ముఖ్యమైన పని
అని అర్ధమైనది.


🌷🌷🌷🌷🌷