Saturday, August 27, 2022

మైండ్ ప్రోగ్రాం, స్వీయ ప్రేమ - Self Love..

మైండ్ ప్రోగ్రాం:-

మన స్వీయ సంభాషణ, ప్రతికూలంగా నకారాత్మకంగా మరియు నిరాశావాదం తో ఉంటే , అది ఉపచేతన మనసులోకి వ్యాపిస్తుంది మరి మన వ్యక్తిత్వం విరక్తి గా, దయనీయంగా మారుతుంది. మన అంతర్గత స్వరమే, మన దారుణమైన శత్రువు కావడం అసాధారమైనదేమీ కాదు. నిరంతరాయంగా మనల్ని శిక్షిస్తూ మరియు ప్రాణశక్తిని హరిస్తూ, మనల్ని మనో యాతనకు గురిచేస్తూ ఉంటుంది. బదులుగా, మనం స్వీయ దృవీకరణ శక్తిని మన ప్రయోజనాలకు ఉపయోగిస్తే మన మనస్తత్వాన్ని చాలా సానుకూల మార్గాలలో ప్రోగ్రాం చేయవచ్చు. 

మనసును ప్రోగ్రాం చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా చేసే స్వీయ సంభాషణను సానుకూల దృవీకరణ అంటాం. ఇది పునరావృత్తి చేయడంలో ఉన్న శక్తిని ఉపయోగించుకుంటుంది. ఏదైనా ఒక విషయాన్ని పదే పదే మనసులో పునరావృతం చేసినప్పుడు, అది లోతుగా వెళ్లి అంతర్గతంగా సమ్మిళితమై పోతుంది. మనసుని నిర్వహించుకోవడంలో, సానుకూల దృవీకరణ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆశావాదం, విశ్వాసం, దైర్యం, పట్టుదల మరియు ప్రయోజనాత్మకతలతో నిండిన సానుకూల వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మను దీనిని ఉపయోగించవచ్చు. మనం ఉపయోగించాల్సిన కొన్ని సానుకూల దృవీకరణ ఇవి...

🥰 నాలో అభివృద్ధికి కావాల్సిన అనంతమైన సామర్థ్యం ఉంది.

🤗 ఈ విశ్వం నా కోసం గొప్ప ప్రణాళికను కలిగి ఉంది.

😍 భగవంతుని కృప నాపై ఉంది. నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను.

🥰 నా దివ్య తండ్రి చే నేను రక్షించబడతున్నాను. ఏం భయం లేదు. విశ్వంలో అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, మరియు నాకు తగినంత లభ్యం అవుతుంది.

🤗 నా శరీరం ఆరోగ్యంగా ఉంది. అవయవాలు ఆరోగ్యం గా మరియు చక్కగా ఉన్నాయి.

😍 నా శరీరం లోని ప్రతి కణం ఆహ్లాదంతో మరియు ఆనందంతో పులకించిపోతోంది. 

🥰 ఫలితాల గురించి చింతించకుండా నేను నా ప్రయత్నం పై దృష్టిని పెడతాను.

😊 ఏది జరిగినా అది మంచి కోసమే అవుతుంది.

😃 నేను చేయగలను. నేను విజయం సాధిస్తాను. లక్ష్యం దాదాపుగా సాధించబడింది. 

😂 నా పని చాలా ముఖ్యం. నేను దాని ద్వారా భగవంతుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. 

☺️ నేను భగవంతుని నుంచి చాలా పొందాను. నేను భక్తి ద్వారా తిరిగి ఇవ్వాలి. 

😄 భగవంతుడు నాకు ప్రతీ రోజూ రాత్రి కలలో కూడా మార్గనిర్దేశం చేస్తాడు.

సానుకూల దృవీకరణ అంటే, ఈ విధంగా జాగ్రత్తగా ఎన్నుకోబడిన స్వీయ సంభాషణ, అది మన ఉపచేతన మనసుపై మనం కోరుకునే రీతిలో ముద్ర వేస్తుంది. భగవంతుని పట్ల ప్రేమపూర్వకంగా భక్తిని సాధించడానికి ఈ సాధనను ఎలా ఉపయోగించాలి ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం.

#భగవంతుని_నామాన్ని_జపం_చేయడం :-

సానుకూల దృవీకరణ ఒక శక్తివంతమైన సాధన. వేద గ్రంథాలు దీనిని జపం రూపంలో మనకు అందిస్తుంది. భగవంతుని నామాన్ని జపం చేయడం అనేది భగవంతుని జ్ఞాపకం చేసుకోవడానికి చాలా సౌకర్యవంతమైన మార్గం, ఎందుకు అంటే దీన్ని ఎక్కడైనా ఎప్పుడైనా చేయవచ్చు. నడుస్తున్న, మాట్లాడుతూ ఉన్నా, కూర్చుని ఉన్నా, తింటూ ఉన్నా, లేదా మరే ఇతర పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా చేయవచ్చు. 

మనం భగవంతుని నామాన్ని జపం చేసేటప్పుడు, ఆయనను ప్రేమగా స్మరించాలని మనసును కోరుకుంటాం. అందుకే, పదే పదే మనసు దాని సంచారాల నుంచి తిరిగి వచ్చి భగవంతుని స్మరించాల్సి ఉంటుంది.  

"యజ్ఞానాం జపయోగస్మి" 

అన్ని రకాల యజ్ఝములలో, భగవంతుని నామ జపాన్ని నేనే. 

సర్వోత్కృష్ట భగవంతుని కోసం మనల్ని మనం అంకితం చేసుకోవడమే యజ్ఞం. భగవంతుని పవిత్ర నామాలను లేదా మంత్రాన్ని జపం చేయడం వల్ల అన్ని యజ్ఞాలలో కంటే సరళమైనది మరియు అత్యంత ఉత్కృష్టమైనది. దీనిని జప యజ్ఞం అంటారు. ఈ శ్లోకం లో కృష్ణుడు తన దివ్య నామాన్ని జపించడమే, ఏ వ్యక్తి అయినా చేయగలిగే అత్యున్నత యజ్ఞం అని వివరించారు. 

కొంత మంది జపం చేయడానికి జప మాల సహాయంతో తీసుకుని చేస్తారు. జపమాల ఉపయోగించడం ద్వారా కలిగే ఇబ్బంది ఏంటి అంటే జపం యాంత్రికంగా మారిపోయే అవకాశం ఉంది. ఏదో లాంచనాప్రాయంగా మారుతుంది. జప మాలకు బదులుగా ప్రతీ శ్వాస తో నామాన్ని, మంత్రాన్ని జపం చేయడం అలవాటు చేసుకోవడం ఒక మంచి పద్దతి. 

అంతే కాకుండా భగవంతుని నామాలను జపం చేయడానికి ఎవరైనా గురువు నుంచి చెవిలో ఎటువంటి మంత్ర దీక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు. సర్వోత్కృష్ట భగవంతునికి అసంఖ్యాక నామాలు ఉన్నాయి మరియు వాటిలో దేనినైనా జపం చేయడానికి మనకి పూర్తి స్వేచ్ఛ ఉంది. భగవంతుడు తన నామంలో కూర్చుని ఉన్నాడు. అందు వలన ఏ గురు మంత్రం కూడా భగవంతుని పేరు కంటే గొప్పది కాదు. 

మనసును, దాని ఉపచేతన మూలాల వరకూ శుద్ది చేయడంలో సానుకూల దృవీకరణల యొక్క ప్రభావాన్ని మనం చూశాం. భగవంతుని యొక్క నామాలను జపం చేయడం అనేది, మనసును భగవంతుని యందు నిమగ్నం చేయడంలో ఎలా సహయం చేస్తుందో గమనించాం...
.
.
.

        🌸 *స్వీయ ప్రేమ - Self Love..

   🌸 మనకు ఉన్న వరాల జాబితాలో ఇదొక వరం... 
స్వీయప్రేమతో మనం పొందేది చాలా ఎక్కువ... ఎక్కడైతే స్వీయప్రేమ ఉంటుందో అక్కడ బాధలకు, దుఃఖాలకు చోటు ఉండదు... ఉండేదల్లా 
స్వ అధ్యాయం మాత్రమే అంటే ఏమిజరిగినా అందులో మనకు ఉపయోగపడే విషయాన్ని స్వీకరించటం మాత్రమే ఉంటుంది... ఎప్పుడైతే అన్ని విషయాలలో సరైంది తీసుకుంటామో అక్కడ మన శక్తి దుర్వినియోగం జరగదు..

   🌸 స్వీయప్రేమ ఉన్నవారు అందరిలో కలిసిపోయి ఉన్న తమ ఉనికిని మాత్రం కోల్పోరు.. నలుగురితో నారాయణ అనేస్థితి వీరికి వర్తించదు... సహజంగా వీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాతావరణం లో ఉండటానికి ఇష్టపడతారు... వీరు ఎప్పుడూ సరికాని మాటలను దగ్గరకు రానియ్యరు ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా కామ్ గా ఉంటారు... వీరికి పరిస్థితి ఎలా ఉన్నా ఇమిడిపోవటం వెన్నతో పెట్టిన విద్య అనొచ్చు కానీ స్పష్టత కోసం ప్రయత్నం ఎక్కువ చేస్తారు... ఫాలోవర్ (అనుచరులు ) గా ఉండలేరు... వీళ్ళను గుర్తించాలి అంటే అందరిమాటా వింటూ వారికి కావలసిందే చెయ్యటం వీరి ప్రత్యేకత.. వీరిలో సృజనాత్మకత ఎక్కువ... 

   🌸 స్వీయప్రేమతో ఉండేవారు ఎక్కువ ప్రేమగా ఉండేవారిని త్వరగా గుర్తిస్తారు.. 

ఎటువంటి పరిస్థితులు ఉన్నా తమను తాము మలుచుకుంటూ ముందుకు సాగుతారు..

స్వీయప్రేమతో ఉండేవారికి మానసిక ఒత్తిడిని త్వరగా జయిస్తారు..

తెలిసి ఎవరినీ ఇబ్బందులలోకి నెట్టరు... ప్రతిఒక్కరి ఎదుగుదలకు సాయంగా ఉంటారు..

స్వీయప్రేమతో ఉండేవారు నలుగురితో ఎలా ఉంటారో ఒంటరిగా కూడా అలాగే ఉంటారు...

స్వీయప్రేమతో ఉండేవారు సాధన, స్వాధ్యాయ, సజ్జనసాంగత్యం చేస్తూ వాటిలో ఎక్కువ సజ్జనసాంగత్యం కోరుకుంటారు.. అంటే ప్రత్యక్షంగా నేర్చుకోవడం కొరకు..

స్వీయప్రేమతో ఉండేవారు తలపెట్టిన పని పూర్తి చేసేవరకు ఓపికగా ఉంటారు... అవాంతరాలు దాటుకుంటూ..

స్వీయప్రేమతో ఉండేవారికి కోపం రావడం, పోవడం కూడా తొందరగానే ఉంటుంది..
ఒకవేళ వారిది సరికాని పని అనుకుంటే తమ తప్పును ఒప్పుకుంటారు సరిచేసుకుంటారు...

   🌸 స్వీయప్రేమ ఇప్పటి పరిస్తుతులలో అందరికీ చాలా అవసరం.. ఎందుకంటే వీరికి అనారోగ్యం అనేది దాదాపుగా ఉండదు ఉన్నా అది సమస్యగా చూడరు... తెలియంది నేర్చుకుంటారు..  వీలైనంత వరకు ముందు ఉంటారు కానీ పోటీలో ఉండరు...

స్వీయప్రేమతో ఉండేవారు అన్నింటినీ ప్రేమగా చూస్తారు..
సాధారణంగా వీరు శాఖాహారులుగా ఉంటారు...

స్వీయప్రేమతో ఉండేవారిని ప్రత్యేకంగా ప్రోత్సాహంతో పని ఉండదు సూచన  తెలుసుకోగానే మార్పును స్వీకరిస్తారు..

స్వీయ ప్రేమికులు ఎక్కువగా అంతర నేనుతో ఉంటుంటారు..

స్వీయ ప్రేమికులు భౌతికంగా(ఆధ్యాత్మికంగా లేని వారు) మాట పట్టింపు ఎక్కువ..
ఆధ్యాత్మికంగా ఉన్నవారు మాట సరిలేనివారిని దూరంగా ఉంచుతారు... అలా వీరిని గుర్తించటం తేలిక... *స్వీయప్రేమ ఉండటం అంటే సూది మొన పదునుగా ఉండటం... ఒక్క మాట లో చెప్పాలంటే వీరు కార్యసాధకులు...*

       Thank you...

(సేకరణ...ఆదిత్యనారాయణ....తిప్పానా)

No comments:

Post a Comment