Friday, August 26, 2022

రెండు కోతులు

 రెండు కోతులు

🌷🌷🌷🌷🌷🌷

నదీ తీరాన వున్న ఆ గ్రామంలో ఒక  మఠం
వున్నది. ఆ మఠంలో  కొంతమంది  సాధువులు నివసిస్తున్నారు. ఆ గ్రామంలోని ఒక వ్యక్తకి ఆ సాధువులంటే  ఏహ్యభావం.
'ఏ పనీ లేకుండా వూరికే కాలక్షేపం చేస్తున్నారని విమర్శిస్తూ వుండేవాడు.

ఒక నాడు సాధువులు ఆ మఠంలో ఏం చేస్తున్నారో చూడాలని అనిపించింది ఆ వ్యక్తి కి. వెంటనే బయలుదేరి వెళ్ళేడు. 
మఠానికి బయట ఒక సాధువు నిలబడి వున్నాడు.  గ్రామంలోని వ్యక్తి ఆ సాధువుని '
ఇక్కడ వూరకనే నిలబడి ఏం చేస్తున్నారు?
అని అడిగాడు.  ' నేను ఊరికే నిలబడలేదు. 
రెండు గ్రద్దలు, రెండు కోతులు, రెండు కుందేళ్ళు, ఒక విష సర్పాన్ని కాపలా
కాస్తున్నాను అన్నాడు ఆ సాధువు.

ఆ గ్రామస్థుడు చుట్టు ప్రక్కల చూశాడు.
అక్కడ కోతులుగాని, కుందేళ్ళు గాని, 
గ్రద్ద, సర్పం ఏవీ కనిపించలేదు. 

' ఊరికినే అంటున్నారు. ఇక్కడ అవేమి కనిపించడం లేదే'' అని అన్నాడు.

వెంటనే ఆ సాధువు నవ్వుతూ ఆ గ్రామస్థునికి
వివరించాడు. ...
"నా రెండు కళ్ళు రెండు గ్రద్దలు.  
పనికిరానివాటినన్నిటిని చురుగ్గా
చూస్తూవుంటాయి. వాటిని చూసి
బుధ్ధిని పాడుచేస్తాయి. 
నా రెండు చేతులు రెండు కోతులు. 
వేటిని పట్టుకుందాం  అనవసరమైన పనులు చేయాలి అని తురు తురుమంటూ వుంటాయి. నా రెండు
కాళ్ళు రెండు కుందేళ్ళు .
ఒక గమ్యం లక్ష్యం లేకుండా గెంతుతూ పరుగెత్తాలని చూస్తూ వుంటాయి.
నా నాలుక వుంది చూశావూ...అది
విష నాగము.  ఎవరిని కరుద్దామని
సిధ్ధంగా వుంటుంది.  వీటిని వాటి ఇష్టానికి
వదలి వేశామంటే  ఆపదలు కలుగుతాయి.
అందుకే జాగ్రత్తగా వాటికి కావలిగా వుంటాను. అని అన్నాడు సాధువు.
 
గ్రామస్థునికి  సత్యం బోధ పడినది. 
భౌతిక సుఖాలను అణుచుకోవడం యొక్క
అవసరం ,మనలని మనం ఆత్మ పరిశీలన
చేసుకోవడం  ముఖ్యమైన పని
అని అర్ధమైనది.


🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment