*🌺🙏 *జై శ్రీ కుసుమహార* 🙏🌺
*_🌴దైవమును నమ్మక చెడినవారలున్నారు కానీ నమ్మి చెడినట్టివారు ఎవరూ లేరు, లేరు, లేరు. ఈ జగత్తంతా నమ్మకంపై ఆధారపడి నడుస్తోంది. డ్రైవరు ఎవరో తెలియకపోయినా అతను మనల్ని సురక్షితంగా గమ్యం చేరుస్తాడని విశ్వసించి మనం బస్సుకానీ, ట్రైను కానీ ఎక్కి ప్రయాణం సల్పుతున్నాము. ఎవరో తెలియని వంటవాడిని నమ్మి, భోజనశాలకు వెళ్ళి అతను వండిన పదార్థాలను తృప్తిగా భుజిస్తున్నాము. ఈరీతిగా నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనీ నమ్మకంతోనే ముడిపడి ఉంది. అది లేకపోతే ఈ లోకంలో మనుగడ సాగించలేము. మనుషుల్ని ఇంతగా నమ్మే మనము భగవంతుని మాత్రం ఎందుకు నమ్మకూడదు?! ఎందుకు నమ్మడం లేదు?!! నిజంగా పరిపూర్ణమైన ప్రేమతో భగవంతుణ్ణి విశ్వసిస్తే, ఆ భగవంతుడే మన జీవనయానాన్ని సజావుగా సాగేలా చేయడా! మానవునిపై పెట్టుకున్న విశ్వాసము మాధవునిపై పెట్టుకుంటే మన జీవితాలను సుఖసంతోషాలతో నింపి, మనల్ని గమ్యం చేరుస్తాడు కదా!. కానీ మనం ఇలా చేస్తున్నామా? ఆయనపైనే శతకోటి సందేహాలు పెంచుకుంటున్నాం. దేవునిపై పెంచుకోవలసింది సందేహాలను కాదు, విశ్వాసమొక్కటే! ఆయనపై ప్రగాఢమైన విశ్వాసాన్ని మన గుండెల్లో నింపుకున్నపుడు మనభారం అంతా ఆయనే చూసుకుంటాడు. చెడడం అనే మాటే ఉండదు.. జీవితం అంతా ఆనందమయమే అవుతుంది.🌴_*
No comments:
Post a Comment