జీవిత లక్ష్యం
🔹🔸🔹🔸🔹🔸
జీవితం అనేది జీవించడానికి మాత్రమే ఉంది. మన ఆశలు, కోరికలు, ఆకాంక్షలు మనల్ని జీవించకుండా అడ్డుపడతాయి. మన సహజత్వాన్ని మనకు కాకుండా చేస్తాయి. మనుషులు ఏవో ప్రయోజనాలను, లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. అట్లాంటివి ఉన్నప్పుడే జీవితం అర్థవంతంగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. అదొక సహజ క్రియ అని అవగాహనకి వస్తుంది.
ఆలోచన అన్నది మన మనసులో ఎప్పుడూ కదుల్తూ ఉంటుంది. కుటుంబం, సంబంధ బాంధవ్యాలు అన్నీ మెదుల్తూ ఉంటాయి. వాటిని అనుసరించి బాధ్యతలు, కోరికలు తీగలు సాగుతాయి. దాంతో జీవితం తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. పరిస్థితి తారుమారు అవుతుంది.
మనిషి సహజ సిద్ధంగా ఉండాలి. కానీ మనిషి అసహజం గా మారిపోయాడు. తిరిగి సహజత్వంలోకి వెళ్ళడానికి అతనికి ఒక ప్రయత్నం ఉండాలి. ఒక ఉద్దేశం ఉండాలి. ఎందుకు అంటే మనిషి సహజంగా ఉంటే తను సహజంగా లక్ష్య
అన్న స్పృహ మనిషికి ఉండదు. అసలు సహజంగా ఉండాలన్న ఆలోచనే చిత్రమైంది. మనిషి సహజంగా ఉండాలి అన్న అబిప్రాయం వదులుకోవాలి. ఎందుకు అంటే అలా ఉండటం అనేది ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని ఏర్పర్చుకోవడం. కానీ జీవితానికి ఎలాంటి గమ్యం, లక్ష్యం ఉండవు. జీవితం అన్నది జీవించడానికి మాత్రమే ఉంది. !!
అంటే ఏంటి జీవితానికి ఒక ప్రత్యేక లక్ష్యం అంటూ లేదు. ఒక ప్రయోజనం అంటూ లేదు. ఉదాహరణకు ఒక పువ్వు ను తీసుకోండి. సున్నితమైన తీగకు సుందరమైన పువ్వు పూస్తుంది. అది వికసిస్తుంది. అందాన్ని వెదజల్లుతుంది. అది ఏదో ఉద్దేశంతో, ఎటువంటి ప్రయోజనం తో ఉనికిలోకి రాలేదు. అది ఎవరి కోసమో ఆకారాన్ని సంతరించుకోలేదు. పరిమళాన్ని ప్రసరిస్తూ ఉంటుంది. దారంటే ఎందరో వెళుతూ ఉంటారు. "రండి దయచేసి దగ్గరకు రండి. నన్ను చూడండి. ఆనందించండి. ఆఘ్రాణించండి. నేను మీ కోసమే ఈ భూమి మీదకు వచ్చాను " అని అనదు. లేదా" నేను అంటే ఏమనుకుంటున్నారు. అమ్మాయిలకి, ఆడవాళ్ళకు నేను అంటే ఎంతో ఆసక్తి. నన్ను తీసుకుని వెళ్ళండి. అమ్మండి. వాళ్ళు నన్ను కొంటారు. వారిని ఆకర్షించేందుకే నేను జన్మించాను " అని గొప్పలు చెప్పుకోదు. ఇంకా... " నేను ఆయన పాదాలని తాకందే ఆయనకు పరిపూర్ణత సిద్దించదు. నన్ను తీసుకుని వెళ్ళండి. ఆలయానికి వెళ్ళండి. దేవుడి పాదాలపై నన్ను ఉంచండి. నాలో పవిత్రత ఉంది " అని పరితపించదు. ఇలా ఎన్నెన్నో చెబుతుంది అని మనసు అంటుంది. కానీ అది వాస్తవం కాదు. ప్రయోజనాలు అన్నవి మనసు చేసే కల్పనలు. మనుషులకు ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనాలు లేకుండా ఏదైనా ఉండటం అన్నది మనుషులు ఊహించలేరు. పువ్వులు అంటే స్త్రీల జడల్లో ఉండాలి. దేవుడి పాదాలపై ఉండాలి. నాయకుల మెడల్లో ఉండాలి. ఇలా పూలకు ఒక ప్రయోజనాన్ని మనం అంటగడతాం. కానీ నిజానికి వీటి అన్నింటిని ఉద్దేశించి పువ్వు ఉనికిలోకి రాలేదు. అది ఉంది అంతే. !
పువ్వు యొక్క ప్రయోజనం వికసించడమే. వికసించడం అన్నదానికి ఒక ప్రయోజనం. ఉద్దేశించడం ఉండవు. దాని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు అనవచ్చు. ఎలాంటి ప్రయోజనమూ లేకపోవడమే పువ్వుకు అయినా, మనిషికి అయినా ఉన్న సహజ లక్షణం.
మనిషి కూడా పువ్వులాగా ఉండాలి. పువ్వు లాగే జీవించాలి. "మనిషి జన్మించినప్పుడు స్వేచ్ఛగా ఉన్నాడు. ఆ తర్వాత జీవితం అంతా నిగాళాల్లో ఉన్నాడు అని రూసో అన్నది అందుకే. నిజమే. మనం జన్మతో స్వేచ్ఛగా భూమికి వస్తాం. సహజంగా వస్తాం. క్రమక్రమంగా కుటుంబం, సమాజం మనల్ని వాటికి అనుగుణంగా అనుకూలంగా మారుస్తాయి. మలుచుకుంటాయి. మనిషి యొక్క అసలైన అస్తిత్వం మరుగున పడిపోతుంది. సమాజం ఆపాదించిన "వ్యక్తిత్వం " రూపొందుతుంది. సహజత్వం అనేది అదృశ్యం అవుతుంది. మనం అసహనంగా రూపొందుతాం. కానీ మనిషి అలా లేడు . అసహజత్వాన్ని సహజంగా భావిస్తున్నాడు. దాంతో పరిస్థితి తారుమారు అయింది. ప్రయోజనాల పరస్పర సంబంధంలో జీవితం ఉన్నది జీవించడానికి అన్న విషయం మరుగున పడింది.
🔹🔸🔹🔸🔹🔸🔹
No comments:
Post a Comment