Monday, March 9, 2020

కోతుల సహజ మరణాన్ని మీరెప్పుడైనా చూసారా?

కోతుల సహజ మరణాన్ని మీరెప్పుడైనా చూసారా
నేను ఒక్కసారి చూసాను కానీ చాలా వరకు ఎవరూ చూడలేరంట

వాటికీ వారం ముందే మరణం అని తెలిసిపోతుందంట
అలా తెలుసుకున్నాక అవి ఎవరి కంట పడకుండా సంచారం లేని చోట ఏ ఆహారము తీసుకోకుండా తనకు కావాల్సినంత గుంతను తీసేసి అందులో పడుకుని ఉండిపోతాయంట
అవి చనిపోయాక భూమి తనంతట అదే మట్టితో కప్పేస్తుందంట

ఆ ఒక్క వారం అవి తపస్సు చేస్తుంటాయంట
ఎవరైనా గెంతుంతుంటేనో లేక అల్లరి చేస్తుంటేనో మనం కోతులతో పోలుస్తాం
ఒక్క నిమిషం ఒక్క చోట కూర్చోడు కోతిలాగా గెంతుతూనే ఉంటాడు అని
అలాంటిది ఒక వారం ఒకే చోటు కదలకుండా ఉండిపోతాయి అంటే ఆశ్చర్యం వేసింది

ఇది నిజామా కాదా అని ఆలోచిస్తే
ఆంజనేయుడు శ్రీరాముడి వద్ద అడిగి పొందిన వరం అంట ఇది

మరణం ముందుగా గ్రహించి
ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా
పుట్టలోని జీవాలకు ఆహారంగా మారాలి
నా దేహం ఎవరి కంట పడనీక అని వరం అడిగాడట ఆ హనుమయ్య

అందుకే ఒక్క కోతి ప్రమాదంలో చనిపోయిన మిగతా అన్ని కోతులు కలిసి పుట్ట మన్ను ఉన్న చోట తీసుకెళ్లి ఆ దేహం మట్టితో పూర్తిగా కప్పబడేవరకు వదిలి రావంట

అందుకే కోతులకు వాటికి ఇష్టమైన అరటిపళ్ళు అంది ఇవ్వాలని చెప్తున్నారు

అలాగే మీరు రామాయణం చదువుతున్నా లేక ఎక్కడైనా రామాయణ పారాయణం జరుగుతుంటే అక్కడ కోతి ప్రత్యక్షమౌతాయని విన్నాను

అందుకేనేమో హనుమను మించిన భక్తుడు లేడు అంటారు

🌷 జై శ్రీరామ్ 🌷

No comments:

Post a Comment