Friday, July 16, 2021

నేటి ఆణిముత్యాలు.

నేటి ఆణిముత్యాలు.

దీపం మట్టి తో చేసిందా?
లేక బంగారం తో చేసిందా ?

అనేది ముఖ్యం కాదు ..!

ఆది చీకటి ఎంత వరకు పార ద్రోలింది అనేదే ముఖ్యం.

అలాగే చేసిన సహాయం చిన్నదా?పెద్దదా? అనేది ముఖ్యం కాదు

ఆది ఎదుటి వారి కష్టాన్ని ఎంత వరకు తీర్చింది అనేదే ముఖ్యం..!

స్వార్ధం, మోసంతో నిండిన నేటి సమాజంలో...
సర్దుకుపోతూ బతకడమే తప్ప,
సంతోషంగా జీవించేవాళ్ళు కొద్దిమందే ఉంటారు...
సంస్కారవంతులు సంతలో దొరకరు?
సరైన సమయం వచ్చినప్పుడు,
వాళ్లే మనకు తారసపడతారు..
వారిని గుర్తించే సంస్కారం మనమూ కలిగి ఉండాలి..

ఎవరికీ తల వంచకు,
ఎవరినీ ఆశించకు,
నీకంటూ నీరోజు తప్పక ఉంటుంది,
ఆరోజు కోసం సహనంతో వేచి ఉండు..
నీ సంకల్పం ఎలా ఉండాలి అంటే,
నిన్ను సమాజం ముందు,
దోషిగా నిలబెట్టాలని చూసిన వాడే...
చివరికి నీకు "శాలువ "తో సన్మానం చేయాలి!

ఇదే అందరి లక్ష్యం.*

మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment