✍️.....నేటి చిట్టికథ
🦅🦚🦜🦢🦅🦚🦜🦢🦅🦚🦜
ఒక అడవిలో🌳 ఓ చెట్టు మీద గూడు కట్టుకుని ఒక కాకి సుఖంగా ఉండేది. 🦅
ఒక రోజున ఓ సరస్సు మీదగుండా ఎగిరి వెళ్తూ కిందన ఒక చక్కని పక్షిని చూసింది.
సన్నటి పొడుగాటి నాజూకైన మెడ, విశాలమైన రెక్కలు, అంతకంటే విశాలమైన పాదాలు - తెల్లగా వెన్నముద్దలా ఉంది. దాని నడకలో రాచ ఠీవి ఉంది. అది గాలిలోకి ఎగురుతున్నప్పుడు కూడా చూసింది కాకి. మెడ ముందుకు సాచి రెక్కల్ని విసనకర్రల్లా ఆడిస్తూ ఏమి వయ్యారాలు పోయిందో! కిందకు దిగి చూసింది. ఎవరో కాదది రాజహంస.🦢
‘అది అంత తెల్లగా ఉంటే, నేను చూడు ఎలా ఉన్నానో నల్లగా’ అనుకుంది కాకి. బాధపడింది.🦅
ప్రపంచంలోని పక్షులన్నిట్లోకి హంస అదృష్టవంతురాలనుకుంటూ హంస దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంది. హంసకు అభినందనలు తెలిపింది.👏👏
‘అవును, ఇన్నాళ్లూ నేనూ నా అంత అదృష్టవంతు రాలు లేదనుకున్నాను. నిన్న ఓ చిలకను🦜 చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ఆ చిలక ఎంత బాగుందో! చిత్రంగా అది రెండు రంగులతో ఉంది. ముద్దు ముద్దుగా మాట్లాడుతోంది. సృష్టిలోకెల్లా అదే అందమైన పక్షి. సందేహం లేదు’ అంది హంస.
కాకి 🦅ఎగురుకుంటూ పోయి చిలక ముందు వాలింది.🦜
కాకి దాన్ని చూస్తూ ‘ఏమందమే చిలకా నీది’ అంది.
‘ఔను. నేనూ అలాగే అనుకున్నాను. కానీ
నిన్ననే ఓ నెమలిని 🦚 చూశాను. దాన్ని చూశాక నాదీ ఒక అందమే అనిపించింది. దాని నడక, దాని హొయలు, దాని అందం... ఆహాహా... ఏమని చెప్పను. నాకున్నవి రెండే రంగులు.
దానికి ఒళ్లంతా ‘రంగులే’ అంది.
కాకికి 🦅కాలు నిలవలేదు. రివ్వున ఎగురుకుంటూ నెమలిని వెతుక్కుంటూ వెళ్లింది.
ఒకచోట నీలం, ఆకుపచ్చ, ఎరుపు, బంగారం ఇలా ఎన్నెన్నో రంగులతో మెరిసిపోతూ కనిపించింది నెమలి.🦚 అప్పుడది పురి కూడా విప్పి ఉందేమో. ఇంద్రధనస్సులా కాంతులీనుతూ ఉంది .
కళ్లు చెదురుతున్నాయి. కాని, నెమలి అందచందాలను ఆస్వాదిస్తూ నెమలి దగ్గరకు వెళ్లి ‘ఎంత అందంగా ఉన్నావో! చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. నిన్ను చూసేందుకు రోజూ ఇంత మంది వస్తున్నారంటేనే నువ్వెంత అందగత్తెవో అర్థమౌతోంది. నేనూ ఉన్నాను. జనాభా లెక్కకి. నన్ను చూస్తూనే విదిలించి కొడతారందరూ’ అని వాపోయింది.🦅
🦚నెమలి విరక్తిగా నవ్వింది. ‘నా అందమే నాకు శాపం. అద్భుత రూప లావణ్యంతో ఉన్నాను కనుకే నన్ను బంధిస్తారు.
నీలా కాకిలా పుట్టి ఉంటే ఎంత స్వేచ్ఛో గదా అనుకుంటున్నాను.
నాకా అదృష్టం లేదు. ఈ జన్మంతా బానిస బతుకే’ అని కన్నీళ్లు పెట్టుకుంది.
నెమలి బాధ విన్నాక కాకికి తెలివొచ్చింది.
మనందరి సమస్య కూడా ఇదే. ఎవరెవరితోనో పోల్చుకుని బాధపడుతుంటాం. భగవంతుడిచ్చిన దాంతో తృప్తి పడటం తెలీదు మనకు. అసంతృప్తే అన్ని దుఃఖాలకు కారణం. మనకు ఏవి లేవో వాటిని తలచుకుని పొర్లి పొర్లి ఏడ్చే బదులు, ఏవి ఉన్నాయో వాటితో సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి.
ప్రపంచమన్నాక హెచ్చు తగ్గులెప్పుడూ ఉంటాయి. ఉన్న వాటిని హాయిగా స్వేచ్ఛగా తృప్తిగా అన భవించే వాడి బతుకే బతుకు. వాడు నిత్య సంతోషి.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
సర్వం పరవశం దుఃఖం సర్వం ఆత్మవశం సుఖం
ఏతత్విద్యా త్సమానేన లక్షణం సుఖదుఃఖయోః
మనదే అయినా, ఇతరులు గనుక తీసుకుంటే, ఇక అది దుఃఖాన్నే కలిగిస్తుంది. మనకు దక్కింది మాత్రమే సుఖాన్ని ఇస్తుంది. సుఖదుఃఖాలను ఇలాగే నిర్వచించుకోవాలి.
అంటే, మనవద్ద లేనివాటికోసం దిగులు పడకూడదని, ఉన్నవాటితో సంతృప్తిగా ఉండాలని భావం. 🙏
🕉️🌞🌎🏵️🌼🚩
Source - Whatsapp Message

No comments:
Post a Comment