Saturday, July 24, 2021

హిందూయిజం vs. అన్యమతాలు

హిందూయిజం vs. అన్యమతాలు🚩
నిన్న నాకు (ప్రవీణ్ తాడూరి కి) ఒక హిందు బంధువు ఒక ప్రశ్న అడగడం జరిగినది. దానికి నేను, అనగా ప్రవీణ్ తాడూరి ని ఇచ్చిన సమాధానం.👇👇

ఒకరు అడిగిన ప్రశ్న🤔🤔
ఒక్క వ్యక్తి ఇస్లాం మతంలోకి వస్తే అతనికి సున్తీ చేసి, వారి సంప్రదాయం గురించి చెప్పి, రోజు నమాజ్ చేయమని చెబుతారు.
అలాగే ఒక్క వ్యక్తి క్రిస్టియానిటీ లోకి వస్తే,ముందు బొట్టు తీయమని తర్వాత మన దేవుడి పటాలు తీయమని చెప్పి ప్రార్థనలు చేయిస్తారు. అతనికి బాప్తిసం ఇస్తారు. అప్పుడు అతను
క్రిస్టియన్ అంటారు.

అటువంటిది మరి మన హిందుత్వం లోకి, ఒక్క ముస్లిం కానీ క్రిస్టియన్ వ్యక్తి కానీ వస్తే మనము ఏమి చెపిస్తాము లేదా ఏమి చేస్తే హిందువు అని చెప్పగలరు?

నా జావాబు బై ప్రవీణ్ తాడూరి🚩
ఇస్లాం ఒక మతం
క్రిస్టియానిటి ఒక మతం.

కాని
హిందుత్వం ఒక ధర్మం.
ఒక జీవన విధానం.

నువ్వు ఒక చిన్న ఇంటికి వెళ్లు. అక్కడ వారి ఇంటి సాంప్రదాయం ప్రకారం భోజనము, మర్యాదలు లభిస్తాయి. ఎందుకు? వారు అవి పాటిస్తారు కాబట్టి. పాటించకపోతే నరకానికి పోతాము అని వారు గట్టిగా నమ్ముతారు కాబట్టి వారు పాటిస్తారు. వారి ఇంటికి వెళ్లిన నువ్వు కూడా అవ్వే పాటించాలి. అప్పుడు నువ్వు వారి మతములో భాగము అవుతావు. ఎందుకు అంటే అవి నువు పాటిస్తున్నావు కాబట్టి. అవి పాటిస్తున్నంత సేపు నువ్వు ఆ మతస్థుడివే.

ఇలాగే ఇస్లాం లేదా క్రిస్టియన్ మతములో కి వెళ్ళినప్పుడు నీకు ఇలాంటి మర్యాదలే లభిస్తాయి. ఇది ఇస్తారు. అది ఇస్తారు. ఇంకేవో చేయిస్తారు. అక్కడ ఉన్నంత సేపు నువ్వు ఆ మతస్థుడివే.

వారి ఇళ్లు అందంగా కనిపిస్తుంది. కాని ఇళ్లు ఎన్ని రోజులు ఉంటుంది? ఉన్నంత కాలం రిపేర్ చేస్తూనే ఉండాలి. రంగులు మారుస్తూ ఉండాలి. గోడలకు భయంకరమైన బీటలు వారితే రంగులతో కప్పేస్తారు. ఎంత చేసినా ఏదో ఒక రోజు అది కూలిపోక తప్పదు. కూలి పోయినా కాని, ఆ ఇంటి బయట ఉండే వాడికి ఏమి బాధ కలగదు. కూలిన ఇంటివానికి తప్ప.

ఇస్లాం మరియు క్రిస్టియానిటి కూడా ఈ ఇళ్ళులాంటివే. ఎప్పడు వాళ్ళ రంగులు మారుతూ ఉంటాయి. వారి గ్రంథాలలో అంశాలు మారుతూ ఉంటాయి.

బైబిల్ ఇప్పటికి ఆరు సార్లు మార్చి రాసినారు. ఖురాన్ కూడా మార్చి రాసినారు. వాటిలో ఉన్న భయంకరమైన అంశాలను అందమైన అబద్ధపు రంగులతో మార్చి వేస్తున్నారు. ఎంత చేసినా వాళ్ళ ఇళ్ళు కూలిపోక తప్పదు.

సరే ఇప్పుడు నువ్వు ఒక అనంతమైన అడవిలోకి వెళ్లినావు. అందమైన పూల చెట్లు, పళ్ళ చెట్లు, ఎన్నో జంతువులు, ఎన్నో జలరాసులు, లోయలు, కోనలు కొండలు. అక్కడ నిన్ను స్వాగతించడానికి ఎవ్వరు ఉండరు. ఎందుకు అంటే అదంతా ప్రకృతే. నీకు అక్కడ రాచ మర్యాదలు ఉండవు. ఎవరి పనిమీద వారు ఉంటారు. నువ్వు ఏ పువ్వు కోసుకున్న, ఏ పండు తిన్నా, ఏ కొండ ఎక్కిన, ఏ లోయలోకి పోయిన నిన్ను ఎవరు ఏమి అనరు. అంతా నీ ఇష్టం. నీవు ఇప్పుడు ప్రకృతిలో భాగం. నీకు నచ్చినట్టుగా ఉండు. కానీ ఒక్కటే గుర్తు పెట్టుకో ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళ్లకు. ప్రకృతిని ఆరాధించు. ప్రకృతితో మమేకమై పండగలు చేసుకో. నీ భౌతికాన్నీ మరిచిపోయి, నీ ఆత్మ శోధన చేసుకొని, ప్రకృతి సాక్షిగా పరమాత్మ లో లీనం ఐపో. దీనికి నీకు ఒకటే పద్ధతి అని ఏమీలేదు. ఒకటే మార్గం అని ఏమీలేదు. నీకు ఫలాన శాసనం ఏమి లేదు. నీవు ఇది అని నీకు గుర్తింపు కూడా ఉండదు. ఎందుకు అంటే నువ్వు సనాతనుడివు. అంటే ప్రకృతి లో భాగనివి. అంటే హిందువువి. ఇక్కడ రంగుల వేయడము ఉండదు. ఎందుకంటే ఇక్కడ గోడలు లేవు. ఇది కూలిపోదు ఎదుకంటే దీనిని ఎవరు కట్టలేదు. ఇక్కడ నిర్మాణమే లేదు. మరి ఇంకెక్కడి కూలిపోవడం.

ఇందాక నువ్వు వెళ్లిన ఇళ్ళు ఒక ముస్లిం మతానిది లేదా క్రిస్టియన్ మతానిది. అక్కడ అన్ని నియమాలే. ఇలా ఉండాలి. అలా ఉండాలి. చుట్టూ గూడలే. పై పై రంగులే. నువ్వు ఇలా లేకపోతే నరకానికి పోతావు. నువ్వు ఇలా ఉంటే ముస్లిం, అలా ఉంటే క్రిస్టియన్ అని అంటారు.

కానీ ప్రకృతి అనే హిందుత్వంలో నువ్వు, నువ్వు లా ఉంటేనే హిందువువు. నువ్వు ప్రకృతిని ఆరాధిస్తే నే హిందువువు. ప్రకృతి నియమాలను పాటిస్తే నువ్వు హిందువువు. నీకు గోడలు లేవు. వేసిన రంగులు లేవు. అంతా పువ్వుల మయం. నువ్వు నువ్వులా ఉంటే అదే స్వర్గం. నువ్వు ఇంకోలా ఉండాలి అనుకుంటే అదే నరకం. కాబట్టి నువ్వు హిదుత్వం అనే స్వర్గం లో ఉంటావో, లేక ఇంకోలా ఉండే నరకం లో ఉంటావో నీఇష్టం.

నీవు సున్తీ చేసుకుంటే ముస్లిం ఐతావు అని ఎవరు అన్నారు? నీ శరీరం మీద కొంత చర్మం తీసేస్తే హిందువు కాకుండా పోతావా?

నీవు మూడు సార్లు నీటిలో మునిగి, ద్రాక్ష రసం తగితే నువ్వు క్రిస్టియన్ ఐపోతావ్ అని ఎవరు అన్నారు?

చర్మం తీసేస్తే, రసం తాగితే, ఒకరకమైన బట్టలు వేసుకుంటే, ఇలాంటి వాటివల్ల హిందువు కారు... ప్రపంచములో పుట్టే ప్రతి శిశువు హిందువే. ఎందుకు అంటే ఇంకా ఎటువంటి సిద్ధాంతము స్వీకరించలేదు. ఆ శిశువు పూర్తిగా ప్రకృతి తో మమేకమై, పరమాత్మునితో అనుసంధానమై ఉన్నాడు కనుక ఆ శిశువు ఒక హిందువు. ఒక సనాతనుడు. కావున మనుషులందరు హిందువులే. తర్వాతి కాలంలో బలవంతపు ముస్లిం, క్రిస్టియన్లు గా మారుతున్నారు అంతే.

హిందుత్వం లో రావడానికి నీకు స్వాగత తోరణాలు ఉండవు. నీకై నీవు రావాలి. పుట్టిన ప్రతి వాడు ముందు హిందుత్వంలోకే వస్తాడు.
హిందుత్వం అంటే అన్వేషణ. ఎవరికి వారే అన్వేషించుకోవాలి.
🚩🚩🚩🚩🚩🚩🚩
సమాధానం బై ప్రవీణ్ తాడూరి

నేను ఇచ్చిన సమాధానం పట్ల మీ అభిప్రాయాన్ని నా నంబర్ కు మెసేజ్ పెట్టండి. 9440476854.

Source - Whatsapp Message

No comments:

Post a Comment