Saturday, July 31, 2021

ఉచితం

ఉచితం

ఓ దొంగ ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు.

ఇంటి ముందు కాపలాగా ఓ కుక్క ఉన్నది. దొంగను చూసింది కానీ, ఏ చప్పుడు చేయకుండా చూస్తూ ఉండిపోయింది.

తనను చూసి కూడా మొరగని కుక్కను చూసిన దొంగ ఆలోచనలో పడ్డాడు. దొంగతనానికి వెళదామా? వద్దా ?? అని...

ఒకవేళ ఇంటి లోపలకు వెళ్ళాక కుక్క అరిచిందంటే ఏం చేయాలి. ఇప్పుడే అరిచినా వేరే ఇంటికి దొంగతనానికి వెళ్లొచ్చు అని అనుకున్నాడు.

ఇలా ఆలోచిస్తూ చివరగా తాను తెచ్చిన రొట్టెముక్కను కుక్కకు విసిరాడు.

అంతే, వెంటనే ఆ కుక్క గట్టిగా అరుస్తూ అతని వెంట పడి కొరకడానికి ప్రయత్నించింది.

అప్పుడు ఆ దొంగ కుక్కను చూసి... నన్ను చూసి కూడా అరవని నువ్వు ఇప్పుడు రొట్టె ముక్క ఇవ్వగానే అరుస్తున్నావు ఏంటి అని అడిగాడు...

నువ్వు ఊరికే ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు ఈ ఇంటి బంధువో లేక తెలిసిన వ్యక్తివో అయుంటావనుకున్నాను... కానీ, ఎప్పుడైతే నువ్వు నాకు ఉచితంగా రొట్టె ముక్క ఇచ్చావో అప్పుడే అర్థం అయింది నువ్వు దొంగవని అని చెప్పింది కుక్క.

మరి ఆలోచించవల్సిన విషయమే కదండీ ఇదీ...

ఉచితం అనగానే ఆలోచన మరిచి ఎగబడిపోతున్నారు జనాలు..

ఉచితంగా ఇచ్చారంటే అందులో ఎంతటి మర్మముందో అర్థం చేసుకున్నది కుక్క, కానీ, మనుషులైన మనం మాత్రం ఉచితంగా ఎందుకు ఇస్తున్నారో అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాం...

ఓ కుక్క గ్రహించినంత కూడా ఈ మానవులు గ్రహించలేకున్నారంటే బాధాకరమే మరి.

Source - Whatsapp Message

No comments:

Post a Comment