కదిలిపోయేదే కాలం.
కష్టాన్ని నిలువరించే సులభోపాయాలేమీ లేవు. అడ్డదారులు, దొడ్డిదారులు ఉండవు. నష్టం అనగానే కన్నీళ్లు ఉంటాయి. కలతపడటమూ ఉంటుంది. దానికి నివారణోపాయం- మనోధైర్యంతో ఎదుర్కోవడమే. సంయమనంతో సమాధానపడటమే. అప్పుడు స్థిరంగా పాతుకుపోతుందనుకుని భయపడిపోయిన మేరు పర్వతమంత కష్టమైనా కదిలిపోతుంది, ఎగిరిపోతుంది. కష్టం కాలంలాంటిది. కదలడమే దాని లక్షణం. కదిలిపోవడమే దాని స్వభావం. కాలంతోపాటు ఆ కాలంలో సంభవించిన కష్టమూ కదిలిపోతుంది.
జీవితం చాలా విలువైంది. నిజానికి విలువ కట్టలేనిది. జీవితంలోని ప్రతిక్షణం కూడా. ఏ కష్టం దాని విలువను తగ్గించగలదు? మనం లోతుగా ఆలోచించాలి. కష్టాలు, కన్నీళ్లు... ఇవన్నీ అధిగమించగలిగినవి. కాలం అంటే క్షణాల కూర్పు. క్షణాల మార్పు. ఏ శక్తీ ఏ క్షణాన్నీ ఆపలేదు. కరిగిపోయేదాని కోసం, కదిలిపోయే దానికోసం మన ప్రయాణం, మన ప్రగతి ఆగిపోకూడదు.
ఏ కష్టం కోసమైనా సరే జీవితం తాలూకు ఏ క్షణాన్ని పోగొట్టుకోకూడదు. కాలంలో సంభవించిన ఏ కష్టమైనా సరే, దానితోపాటు కదిలిపోతూనే ఉంటుంది. కొత్త క్షణం వస్తుంది. దానితోపాటే కొంత సుఖం రావచ్చు. కొత్త సుఖం రావచ్చు. పోనీ... కనీసం కొత్త కష్టమైనా రావచ్చు. వచ్చి స్థిరపడిపోతుందని భయపెట్టిన కష్టం కంటే కొత్త నష్టం కొంత మేలుకదా? అలవోకగా వచ్చిన కష్టానికి అవగాహనలేక... ఆయాసపడి ఆగిపోతే- లోకంలో భగవంతుడిచ్చిన జీవితాన్ని పూర్ణంగా జీవించేవాడే ఉండేవాడు కాదు. లోకంలో విజేత అనేవాడు ఒక్కడూ ఉండేవాడు కాదు. మార్పు ప్రకృతి సహజం. రుతువులు మారతాయి. రాత్రింబవళ్లు మారతాయి. సూర్యచంద్రులూ. మారనిదేదీ లేదు.
మార్పే జీవితం! జీవితం అంటే కూడా మార్పే. పిల్లలు పిల్లకాలువలో వేసిన కాగితపు పడవలా కాలం కదిలిపోతుంది. మనం పిల్లల్లా వినోదంగా చూడాలి. వాళ్లకు తెలుసు. పడవ చాలా కష్టపడి చేశామని. నీళ్లలో వదిలేస్తే కాసేపటికి మునిగిపోతుందని, తడిసిపోతుందని. అయినా క్రీడావినోదం కావాలంటే ఆ కష్టానికి వెరవకూడదు. ఆ నష్టానికి బెదరకూడదు. సిద్ధపడే ఉండాలి. పిల్లలు మునిగిపోతున్న పడవకేసే చూస్తూ బాధపడుతూ కూర్చోరు. పరుగున వెళ్లి మరో కాగితం తెచ్చుకొని మరో పడవ తయారుచేస్తారు. టైటానిక్ చేసినంత ఉత్సాహంతో. మనం పిల్లలపాటి చేయమా? ఆ మాత్రం అనర్థాలను, ఆటంకాలను అధిగమించలేమా? దేవుడు ఈ క్షణాన్ని యథాతథంగా అనుభవించమన్నాడేగానీ క్షణంలోనే స్థిరంగా ఉండిపొమ్మని చెప్పలేదు- అది సుఖమైనా, కష్టమైనా! కష్టాన్ని కదిలిపోతున్న క్షణంతోపాటు మరచిపోవాలి. కదిలిపోతున్న క్షణాన్ని మనం మూర్ఖత్వంతో ఆపివేస్తున్నాం. పదేపదే ఆ క్షణాన్ని, అది ఇచ్చిపోయిన కష్టాన్ని నెమరువేసుకుంటూ అనుభవిస్తున్నాం. అది సరికాదు. మనముందు ఎవరూ ఆపలేని మరో అద్భుత క్షణం ఉంది. మరెన్నో అమృత క్షణాలున్నాయి. వాటికి అవకాశం ఇస్తూ గడిచిపోయిన క్షణాన్ని సంతోషంగా సాగనంపుదాం.
నెమరువేసే అలవాటు పశువులది. మనది కాదు!
సేకరణ. మానస సరోవరం 👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment