Sunday, July 18, 2021

🧘‍♂️మానవ దేహము 🌳మహావృక్షము వంటిది🧘‍♀️

🧘‍♂️మానవ దేహము 🌳మహావృక్షము వంటిది🧘‍♀️
🕉️🌞🌏🌙🌟🚩

మానవ దేహం వృక్షంతో సమానం. అది ఎలా? అనే విషయాన్ని వివరించి చెప్పేదే ఈ కథ. మహాభారతం అశ్వమేధపర్వం ముప్పైఅయిదో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విషయాలను వివరించి చెప్పాడు.


మానవ దేహం అక్షరాలా ఓ వృక్షం లాంటిది. అజ్ఞానం అనేది ఈ వృక్షానికి మూలమైన బీజం. బుద్ధి దాని బోదె. అహంకారం ఆ చెట్టుకు ఉండే కొమ్మలు. ఇంద్రియాలు ఆ చెట్టు మానుకు ఉన్న తొర్రలు. పంచ మహా భూతాలు ఆ వృక్షానికి ఉన్న విశేషమైన అవయవాలు.


ఆ పంచభూతాల విశేష భేదాలు కొమ్మల నుంచి పుట్టు కొచ్చిన చిరుకొమ్మలు. ఈ కొమ్మలకు, చిరు కొమ్మలకు నిరంతరం సంకల్పాలు అనే ఆకులు పుడుతుంటాయి. కర్మలు అనే పూలు పూస్తుంటాయి. అయితే మనిషి పిచ్చి మొక్కల్లా మిగలగూడదు.


తాను చేసే శుభ, అశుభ కర్మలవల్ల కలిగే సుఖదుఃఖాదులే ఫలాలు (ఆ చెట్ల పండ్లులాగా ) ఇలా బ్రహ్మరూపమైన బీజం నుంచి పుట్టుకొచ్చి ప్రవాహ రూపంగా నిరంతరం ఉండే దేహం అనే వృక్షాన్ని, జాగ్రత్తగా పరిశీలిస్తే, అది అంత సామాన్యమైనదేమీ కాదు చాలా గొప్పదే.


ఎందుకంటే అది ఎన్నెన్నో ప్రాణుల బతుకులకు ఆధారంగా ఉంటుంది. ఆ దేహమనే వృక్షతత్వాన్ని అందరూ గ్రహించ గలగాలి. ఆ తత్వం అర్థం కావాలంటే సద్గురువుల ఉపదేశాలు అవసరం. అయితే ఒకసారి అలా ఉద్భవించిన దేహం సంసార సముద్రంలో పడి తాను, తనవాళ్లు అని కొట్టు మిట్టాడుతూ స్వార్థంతో నిండిపోతే కష్టమే.


నిస్వార్థంగా నిజమైన చెట్టులాగా అందరికీ సహాయపడాలే తప్ప పిచ్చి మొక్కల్లాగా పనికిరాని తీరులోనూ అందరికీ ఇబ్బంది కలిగించే చెట్ల లాగా మనిషి దేహం, ప్రవర్తన మారకూడదు.


తన దేహం అలా మారుతోంది అని సందేహం కలిగినప్పుడు సద్గురువు సూచనల మేరకు జ్ఞానం అనే ఉత్తమ ఖడ్గాన్ని తీసుకొని అజ్ఞాన అడవులు, పిచ్చికొమ్మలు, అనే ఆలోచనలను నశింపచేసుకోవాలి. అప్పుడే మానవ దేహం అందరికీ నీడనిచ్చే మంచి చెట్టులాగా పేరు తెచ్చుకుంటుంది. అలా కానప్పుడు ముళ్లచెట్టు లాగా, కలుపుమొక్కల లాగా అందరి నిరాదరణకు గురవుతుంది.


మంచి చెడ్డలు అవగాహనతో సనాతన జ్ఞానవిషయం ధర్మాన్ని అనుసరిస్తూ అలా మనిషి తన దేహాన్ని, జీవన విధాన్నన్ని,అన్ని ధర్మకార్యాలకు సాధనంగా వినియోగిస్తుండాలి. ఈ విషయం తెలిసిన వారే జీవితం ఫలవంతం చేసుకోగలరు. వారే విద్వాంసులు, సిద్ధులు అని పేరు పొందుతారు.


పూర్వకాలంలో దక్షప్రజాపతి, భరద్వాజుడు, గౌతముడు, శుక్రుడు, వసిష్ఠుడు, కశ్యపుడు, విశ్వామిత్రుడు, అత్రి అనే మహర్షులు తమతమ జీవన మార్గాలలో పెద్దపెద్ద వృక్షాలు గా మానవాళికి ఎంతో విలువైన, సమగ్ర జ్ఞానాన్ని జీవిత విధాన్నన్ని ఆన్దించి, అందరికీ సుఖాన్ని,, ఆనందాన్ని కలగచేశారు.అయితే దేహమైనా, వృక్షమైనా కొద్దికాలంపాటే భూమ్మీద ఉండగలిగేది. కనుక కొంత కాలానికి వారికి అలసట వచ్చింది.


అప్పుడు వారంతా కలిసి అంగీరస మునిని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు. వెళ్లి అంత,,,,కాలంపాటు తామెన్నో పనులు చేశామని ఆ పనులన్నీ మంచివేనా? లేకపోతే శ్రేష్ఠకర్మ ఎలా చేయాలి? ఒకవేళ పాపం చేసి ఉంటే ఆ పాపం నుంచి ఎలా బయట పడాలి? అనే విషయాలను గురించి చెప్పమన్నారు.


అప్పుడు బ్రహ్మదేవుడు వారందరికీ మంచి పనులు, పుణ్య కార్యాల విషయాలను తెలియ చెప్పాడు. బ్రహ్మ చెప్పిన విషయాలతోపాటు తాము చేసిన పనులు సరిపోల్చుకొని ఆదర్శ వంతమైన జీవితాన్ని మళ్లీ సాగించారు ఆ ఋషులు. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియ చెప్పాడు.


ఈ కధ ద్వారా మనం తెలుసుకోవలసినది, గమనించాల్సిన విషయం మనం మన జీవితంలో అనుసరించాల్సిన దేమిటంటే, మనిషి నిస్వార్థంగా ఓ మంచి మహా వృక్షంలాగా అందరికీ సహాయ పడుతూ ఉండాలి.


ఎన్ని మంచి పనులు చేస్తున్నా చివరకు అనుభవజ్ఞుల దగ్గర తమ పనులను సమీక్షించుకుంటూ మంచి, చెడులను బేరీజు వేసుకుంటూ మందుకు నడవాలనే జీవన సత్యాన్ని, ఉత్తమ మార్గదర్శక సూత్రాన్ని మనకు తెలియపరుచును.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment