🌹💫🌹💫🌹💫🌹💫🌹💫🌹💫
ఈ చిన్ని కథ మీ హృదయాన్ని 👌🏼దోచుకుంటుంది...
ఒక పిల్లవాడు రోజూ తన తాతగారు సంధ్యావందనాది పూజలు చేయడం చూసేవాడు. తాను కూడా అలా అనుష్టానం చేయాలనే కోరికను లోలోపల దాచుకున్నాడు. ఎందుకంటే తాతగారు చేస్తూ ఉండటం వలన తనకు ఆ అవకాశం రాలేదు. ఒకరోజు సాయంత్రం తాతగారు రావడం ఆలస్యం అయ్యింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆ పిల్లవాడు సమయానికి పూజను ప్రారంభించాడు. తాతగారు వస్తూ ఆ పిల్లవాని పూజను గోడ చాటు నుండి గమనించెను. పిల్లవాడు అగర్బత్తులు తదితర సామాగ్రి అన్నీ యధావిధిగా వాడుతున్నాడు మరియు ఈవిధంగా ప్రార్ధన చేస్తున్నాడు...
భగవంతుడా! నీకు నమస్కారములు!
మా తాతగారిని ఆరోగ్యంగా ఉంచు మరియు నానమ్మ మోకాలి నొప్పిని తగ్గించు. వారికి ఏమైనా అయితే నాకు చాక్లెట్స్ ఎవరు ఇస్తారు.
భగవంతుడా! నా స్నేహితులందరినీ మంచిగా ఉంచు. లేకుంటే నాతో ఎవరు ఆడుకుంటారు.
నా తల్లిదండ్రులను మంచిగా ఉంచు.
మా ఇంటి కుక్కను కూడా మంచిగా ఉంచు..లేకుంటే దొంగల బారి నుండి మా ఇంటిని ఎవరు రక్షిస్తారు.
భగవంతుడా! నీవు అన్యదా భావించకుంటే ఒక విషయం చెప్పనా...
అందరినీ బాగా చూడు. కానీ, దానికంటే ముందు మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి. ఎందుకంటే మీకు ఏమైనా అయితే మా అందరి పరిస్థితి ఏమిటి..!
ఈ సహజమైన ప్రార్ధనను విని తాతగారి యొక్క కనులు ఆశ్రుపూరితాలయ్యాయి.
ఎందుకంటే ఇటువంటి ప్రార్ధన తాను ఎప్పుడూ చేయలేదు మరియు వినలేదు కూడా.
💫🌹💫🌹💫🌹💫🌹💫🌹💫🌹💫
Source - Whatsapp Message

No comments:
Post a Comment