Monday, October 4, 2021

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు ఆదివారపు శుభాకాంక్షలు.. 🌹🌷ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణ మూర్తి వారి అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మన ఎదుగుదల మనతో పాటు పది మందికి ఉపయోగపడేలా ఉండాలి అంతే కానీ పది మందికి నష్టం బాధ కలిగేలా ఉండకూడదు 🤝💐
ఆదివారం --: 03-10-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు

మనకు అర్థం అయ్యేలోపు దూరం అయ్యేది కల నీకు అర్థం అయినా నీవు ఒప్పుకో లేనిది వాస్తవం నీకు అర్థం అయ్యేకొద్ది దగ్గరయ్యేది స్నేహం నీకు తెలిసే కొద్దీ కొత్త అర్థం వెతికేది ప్రేమ నీకు అర్థం అయినట్లు అనిపిస్తుంది కానీ అర్థం కానిదే జీవితం

నీకు ఓర్పు ఉన్నంత వరకు కాదు , నీ ఊపిరి ఉన్నంత వరకు పోరాడు , ఓటమి నీ కాళ్ళ దగ్గర గెలుపు నీ కళ్ళ ముందర నిలిచిపోతాయి . నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవెంటో తెలుస్తుంది , అదే నీవు అపజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులు ఎవరో నీకు తెలుస్తుంది నీ తప్పులను పొరపాట్లను నీ ముందే చెప్పి నీ గొప్పతనాన్ని ఇతరుల ముందు చెప్పేవారే నీ అసలైన బంధువు నీ అసలైన మిత్రుడు .




జీవితంలో మనం ఎదుటి వారి దగ్గర తీసుకోవడం కన్నా ఇవ్వడం లోనే ఎక్కువ సంతోషం ఉంటుంది . మనకు ఉన్నదంతా పోయినా కూడా మనం ఇంకా ధనవంతులమే ఎందుకంటే బంగారం లాంటి సమయం ఇంకా మన చేతుల్లో ఉంది

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండడు తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది తలదించుకుని బతికినవాడిని ధైర్యంగా తల ఎత్తుకొని బతికేలా చేస్తుంది నవ్వినవాడిని ఏడిపిస్తుంది ఏడ్చిన వాడిని నవ్వేల చేస్తుంది కాలం చేతులో అందరం కీలుబొమ్మలమే .

మనం దూరంగా నాటిన చెట్లు పెరిగేకొద్ది దేగ్గరౌవుతాయి, దగ్గరగా ఉన్న మనుషులు . పెరిగే కొద్ది దూరమౌవుతున్నారు చిన్ననాటి ప్రేమలు & స్నేహాలు . ఏమైపాయే . మాయమైయే . గౌరవాలు & మర్యాదలు . మంటకలిసిపాయే వావి & వరుసలు మరిచిపోయిరి . కామాందులు పెరిగిపోయిరి . మంచి మనుషులు తగ్గిపోయిరి చెడ్డవారు ఎక్కువైయ్యారు . ఏమౌతుంది . ఈలోకం ఎటు పోతుంది ఈసమాజం . ఎవరికి వారే ఆలోచించండి .

నోరు లేకుండానే మనల్ని పలకరిస్తుంది డబ్బు , కళ్ళు లేకుండానే మనల్ని శాసిస్తుంది డబ్బు , చేతులు లేకుండానే ఆదేశం ఇస్తుంది డబ్బు , కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది డబ్బు , లేని బంధాలను కలిపేస్తుంది డబ్బు , ఉన్న బంధాలను తుడిపేస్తుంది డబ్బు , మనసు లేని డబ్బు మనిషి చేసిన డబ్బు .

‌ సేకరణ 🖊️*మీ ..ఆత్మీయుడు AVB సుబ్బారావు 🌹💐🌷🤝

సేకరణ

No comments:

Post a Comment