Thursday, March 17, 2022

నేటి మంచిమాట. జ్ఞానం కోసం ఆరాటపడు....

నేటి మంచిమాట.

ఎప్పుడు శ్వాస ఆగుతుందో తెలిదు...ఇది నీ దాకా రానంత వరకు ఏమీ అనిపించదు ..అయిన వారో ...తెలిసిన వారో పొతే కానీ ఒక్క క్షణం ..ఎవ్వరు శాశ్వతం కాదు అన్న విషయం ఆ కొద్ది సేపు మదిలో మెదులుతుంది . ఆ తర్వాత మళ్ళీ షరా మామూలే .. రోజూ ఉరుకులు పరుగులు ...

కొందరికి పార్టీలు చేసుకోడంలో సంతోషం ..మరి కొందరికి సినిమాలు, రాజకీయాలు,ఇలా రకరకాల విషయాల్లో తల మునకలు అయ్యి అన్నిటికి పరుగులు పెడుతున్న మనిషి ... తన చావు పుట్టుకల గురించి మాత్రం
ఆలోచించడు . అడపాదడపా ఎవ్వరైనా స్టార్ హీరోనో ..హీరోయిన్ వారి కర్మ తీరి టపీమని పోయాక అప్పుడు తనేదో ఇక్కడే శాశ్వతంగా ఉన్నట్టు ...శ్రద్దాంజలి తెలుపుతాడు ..

కళ్ళ ముందు చావులు తెలిపే సత్యం ...ఈ రోజు వారు రేపు నీవు అని గుర్తు చేయుటకే ...అందుకే ఉన్నప్పుడు దేవుడిని ..ఆయన మార్గాన్ని (ధర్మాలను) ఎంతవరకు అనుసరించావు..పాటించావు అన్నది నిరంతరం గుర్తు చేసుకో .వారానికి ఒకసారి గుడికి , అడపాదడప అన్నవరానికి పోయేది భక్తీ కాదు . నిజమైన భక్తి జ్ఞానం తెలిసినప్పుడు వస్తుంది . .ఒకవేళ నీవు దేవుడి మార్గం లో లేకపోతే తక్షణమే ఆ మార్గానికి తొలి అడుగు వేయి ... అందరిలా పుట్టి ...పెరిగి ...పేరు సంపాదించి ..అతి సాదారణ చావు చచ్చే కంటే ..దేవుడి బాటలో మరణమైన మేలే ...

.ప్రపంచంలో నువ్వు ఎంత డబ్బు ,పేరు సంపాదించినా అది దేవుడి లెక్కలో ఉండదు. అందుకే ఎటువంటి బిగ్ షాట్ అయిన మృత్యువుకి లెక్కలేదు . దేవుడి లెక్కవేరు..ఆయన ధనం జ్ఞానం ..అది నువ్వు సంపాదిస్తే . ఆ ధనం (జ్ఞానం ) జన్మ జన్మకు నీ వెంటే వస్తుంది. ఇది నా మాట కాదు. గీతలో శ్రీ కృష్ణుడి మాట . కాబట్టి చావులకి ఎక్కువ చలించక ..నీచావు త్వరలో ఉందని గమనించి .. జ్ఞానం కోసం ఆరాటపడు ఆ జ్ఞానమే అన్ని సమస్యల నుంచి నిన్ను తప్పిస్తుంది . నీ చావుకి ఒక అర్థము ఉంటుంది .

ఉషోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment