Thursday, March 17, 2022

ఎంతో పెద్దది ఆకాశం.. ఏమంటున్నది నీ కోసం.. అలాగే నీ హృదయం కూడా విశాలమైతే చాలంటా అంటారు శ్రీ శ్రీ

✨🌊 ఎంతో పెద్దది ఆకాశం..
ఏమంటున్నది నీ కోసం..
అలాగే నీ హృదయం కూడా
విశాలమైతే చాలంటా అంటారు శ్రీ శ్రీ అవును..
✨మనం మన చుట్టూ నిత్యం కనిపించే వస్తువుల నుండి వివిధ అంశాలను నిరంతరం నేర్చుకుంటూ, నిరంతరం మోటివేట్ అవ్వగలిగితే, నిరంతరం విజయపథంలో ప్రయాణించవచ్చు. అలా 24 గంటలు మనకు కనిపించేది ఆకాశం..
✨ "ఆ ఆకాశం నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు అలాంటి కొన్ని పాఠాల గురించి ఇప్పుడు నేర్చుకుందాం..
✨" ఆకాశం విశాలమైనది.. ఎంత విశాలమైనది అంటే అంతకుమించి విశాలమైన వస్తువు ఈ ప్రపంచంలోనే లేదు అన్నంత విశాలమైనది ..
✨ఈ విశాలత అనేది దేనికి వర్తిస్తుంది తనను గొడుగుగా భావించి తన నీడలో సేదతీర్చే ప్రతి జీవిని సమానంగా చూడటంలో, తను ఇవ్వగలిగిన ప్రతిదీ జీవ, జంతు, వృక్ష జాతులకు వివక్ష లేకుండా అందివ్వడంలో ఆ విశాలత వర్తిస్తుంది.
మనం కూడా అలాగే ఎలాంటి వివక్షత లేకుండా అందరినీ సమానంగా చూడగలగటం అనేది ఈ ఆకాశం నుండి నేర్చుకోవాలి .
✨అంత పెద్ద ఆకాశాన్ని కూడా మేఘాలు కమ్ముకోక మానవు, ఎంతటి మేఘాలు కమ్ముకున్న కాసేపటి తర్వాత ఆకాశం తన రూపాన్ని తిరిగి చూపక మానదు.
అందుకే జీవితంలో వచ్చే కష్టాలకు కుంగిపోకండి, "ఆకాశం వంటి మిమ్మల్ని మేఘాలలా కమ్ముకున్న కష్టాలన్నీ కరిగిపోతాయి అన్న ధైర్యంతో ఉండండి".
ఆకాశమే మీకు ఆదర్శం.. అంతేకాదు జీవితం అంటే కష్టసుఖాల సమ్మేళనం.. సుఖం వెనక కష్టం, కష్టం వెనుక సుఖం నడుస్తూనే ఉంటాయి.
ఆకాశాన్ని ఎప్పుడైనా గమనించారా..ఆ ఆకాశం కూడా చీకటి తర్వాత వెలుగును, వెలుగు తరువాత చీకటిని నిత్యం తనలో నింపుకుంటూనే ఉంటుంది. "వెలుగు వెనకాల వచ్చే చీకట్లకు కుంగిపోదు, చీకటి వెనక వచ్చే వెలుతురును మర్చిపోదు..

✨ఆకాశం నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం స్వేచ్ఛ..
ఆకాశమంటే స్వేచ్ఛకు చిహ్నం".. ఎన్నెన్నో స్వేచ్ఛా విహంగాలకు అది వేదిక అవుతుంది,ప్రేమగా నిర్మలమైన హృదయంతో తనలో వాటికి చోటు ఇస్తుంది.
అలాగే "
మీరు కూడా స్వేచ్ఛ చిహ్నాలుగా" మారండి..
మీ చుట్టూ ఉండే వారికి స్వేచ్ఛ ఇవ్వండి..
మీదైన స్వేచ్ఛను ఎల్లప్పుడూ కలిగిఉండి ఆనందంగా అనుభవించండి ..
మీరు కూడా ఆకాశంలాగా మారిపోండి ..
ఆకాశమే మీ హద్దుగా విహరించండి ..



సేకరణ

No comments:

Post a Comment