నేటి జీవిత సత్యం.
సోక్రటీస్ జీవితం లో జరిగిన...ఒక అధ్భత సంఘటన.
ఒకసారి సోక్రటీస్ సముద్రతీరంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒడ్డున నిలబడి ఏడుస్తున్న ఒక బాలుడిని గమనించాడు. ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లి తలపై ప్రేమగా చేయి వేసి, “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాడు.
ఆ బాలుడు, "నేను ఆ సముద్రాన్ని ఈ కప్పులో నింపాలనుకుంటున్నాను, కానీ అది నా కప్పులో సరిపోవట్లేదు", అన్నాడు.
పిల్లవాడి మాటలు విన్న సోక్రటీస్ బిత్తరపోయి, తానే ఏడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అడగడం పిల్లవాడి వంతు: "నువ్వు కూడా ఏడుస్తున్నావు, కానీ నీ కప్పు ఏదీ ?"
సోక్రటీస్ ఇలా జవాబిచ్చాడు. "నాయనా, ఒక చిన్న కప్పులో మొత్తం సముద్రాన్ని నీవు నింపాలనుకుంటున్నావు, నేను నా చిన్న మనస్సులో ఈ ప్రపంచ జ్ఞానాన్ని మొత్తం నింపాలనుకుంటున్నాను. ఈ మహాసముద్రం అంతా ఈ కప్పులో సరిపోదని ఈ రోజు నీవు నాకు నేర్పించావు. నేను అనవసరంగా అశాంతికి లోనవుతున్నానని తెలుసుకున్నాను."
ఇది విన్న పిల్లవాడు ఒక క్షణం ఆగి, ఆ కప్పును సముద్రంలోకి విసిరి, "ఓ సముద్రమా, నీవు నా కప్పులో సరిపోకపోతే, నా కప్పు నీలో ఇముడుతుంది," అని అన్నాడు.
వెంటనే సోక్రటీస్ పిల్లవాడి పాదాలపై పడి, " నేను ఇప్పుడు చాలా విలువైన జ్ఞానపు ముత్యాలను పొందాను, దానికి నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను!" అని అన్నాడు.
"ఓ మాస్టార్ !గారు
మీరు నాలో పూర్తిగా లయమై ఉండలేరు, కానీ నేను మీలో పూర్తిగా లీనమై ఉండగలను."అంటూ
భగవంతుడు, అస్థిరంగా సంచరిస్తున్న సోక్రటీస్ కు ఆ పిల్లవాడిలో లయమై, సోక్రటీస్ యొక్క గర్వాన్నంతటినీ పటాపంచలు చేశాడు.
గొప్ప గొప్ప చక్రవర్తుల చేత గౌరవించబడే సోక్రటీస్, ఒక చిన్నపిల్లవాడి కాళ్ళపై పడ్డాడు.
భగవంతుడు మనల్ని తన ఆశ్రయంలోకి తీసుకున్నప్పుడు, మొదట, మనలోని "నేను" అన్నది అదృశ్యమవుతుంది.
మరో మాటలో చెప్పాలంటే, మనలోని "నేను" అనేది అదృశ్యమైనప్పుడు, భగవంతుని కృప మనలోకి ప్రవహిస్తుంది.
"నేను" అనేది వాస్తవానికి "మన అహం", ఇది మన చైతన్యం విస్తరించకుండా నిరోధిస్తుంది.
కావున మిత్రులారా విస్తారమైన ప్రేమ సముద్రం మన హృదయంలో ఉంది. దాని తాళం కూడా మన చేతుల్లోనే ఉంది.
శుభోదయం తో మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment