"అమ్మ తిట్టు ప్రేమతో తట్టు"
పొద్దు పొడవగానే మా అమ్మ
తిట్లతోనే నన్ను నిద్ర లేపుతుండేది...
తన నోటికొచ్చిన తిట్లతో
నిత్యం నన్ను తట్టిలేపేది...
ప్రతితిట్టూ నన్ను స్పర్శించినప్పుడు
మృదువుగా..మెత్తగా మత్తుగా
గమ్మత్తుగా తాకుచుండేది...
కోపంతో తిట్టినా..కసితోతిట్టినా
ఆర్ద్రతతో నిండిన అమ్మతిట్లు
ఆత్మీయంగా నన్ను స్పృశించేవి...
నన్ను కన్నపుడు ఎన్నెన్ని
నొప్పులు భరించిందో!!??
ఎన్ని కష్టాలు నెట్టేసిందో!!??
పొత్తిళ్ళలో పురుడు పోసుకున్నప్పుడు
ఊహించని ప్రేమ..ఊహకందని
ఎన్ని ఆశలను ప్రోగుచేసుకుందో!!??
అప్పుడు ఆతిట్లు అన్నీ
నా బాగోగుల గురించే!!...
నా బతుకును దారిలో పెట్టడానికే!!..
నన్ను ఓఇంటివాన్ని చేయడానికే
ఆ తిట్ల తిప్పలన్నీ...
ఆ తిట్లే నాకు ఆశీర్వచనాలైనాయి...
దీర్ఘాయుష్మాన్భవ అంటూ
అక్షింతలుగా నెత్తిపై చల్లినట్లు
అమ్మ నోటితిట్లే శిరోధార్యమైనాయి...
ఎన్ని సమస్యలు ఎదురైనా...
నా ఆలనాపాలనా చూసుకుంటూ
ఆప్యాయతతో హత్తుకొని
తన ఒడిలో దాచుకునేది...
నాలోని అణువణువునూ..ఆనందంతో తన కళ్లలోనే దాచుకునేది...
తన కళ్లెదుటే నాతపనను చూసి
కన్నీరు జారిపోయేవి...
అమ్మతనాన్ని కమ్మగా అందించి..
నా చైతన్యజ్వాలకు ఆజ్యం పోసేది...
నాలో నిద్రిస్తున్న జాగృతిని
తన తిట్లతోనే తట్టి లేపేది!!..
వాస్తవసమాజం వైపు నడిపించడానికి
నా హృదయ తలుపుల్నినిత్యంతట్టి
నామనసు పొరలను సుతారంగా మీటి
కొత్త ఊపిరి పోసేది...
కుళ్లు కుతంత్రాల లోకం నుండి
నన్ను కాపాడడానికే
ఈ తిట్లతోనే ఎన్నో అగచాట్లుపడేది..
అమ్మ అంటే ఇంతేనేమో అనిపించేది...
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ
పొద్దు పొడవగానే మా అమ్మ
తిట్లతోనే నన్ను నిద్ర లేపుతుండేది...
తన నోటికొచ్చిన తిట్లతో
నిత్యం నన్ను తట్టిలేపేది...
ప్రతితిట్టూ నన్ను స్పర్శించినప్పుడు
మృదువుగా..మెత్తగా మత్తుగా
గమ్మత్తుగా తాకుచుండేది...
కోపంతో తిట్టినా..కసితోతిట్టినా
ఆర్ద్రతతో నిండిన అమ్మతిట్లు
ఆత్మీయంగా నన్ను స్పృశించేవి...
నన్ను కన్నపుడు ఎన్నెన్ని
నొప్పులు భరించిందో!!??
ఎన్ని కష్టాలు నెట్టేసిందో!!??
పొత్తిళ్ళలో పురుడు పోసుకున్నప్పుడు
ఊహించని ప్రేమ..ఊహకందని
ఎన్ని ఆశలను ప్రోగుచేసుకుందో!!??
అప్పుడు ఆతిట్లు అన్నీ
నా బాగోగుల గురించే!!...
నా బతుకును దారిలో పెట్టడానికే!!..
నన్ను ఓఇంటివాన్ని చేయడానికే
ఆ తిట్ల తిప్పలన్నీ...
ఆ తిట్లే నాకు ఆశీర్వచనాలైనాయి...
దీర్ఘాయుష్మాన్భవ అంటూ
అక్షింతలుగా నెత్తిపై చల్లినట్లు
అమ్మ నోటితిట్లే శిరోధార్యమైనాయి...
ఎన్ని సమస్యలు ఎదురైనా...
నా ఆలనాపాలనా చూసుకుంటూ
ఆప్యాయతతో హత్తుకొని
తన ఒడిలో దాచుకునేది...
నాలోని అణువణువునూ..ఆనందంతో తన కళ్లలోనే దాచుకునేది...
తన కళ్లెదుటే నాతపనను చూసి
కన్నీరు జారిపోయేవి...
అమ్మతనాన్ని కమ్మగా అందించి..
నా చైతన్యజ్వాలకు ఆజ్యం పోసేది...
నాలో నిద్రిస్తున్న జాగృతిని
తన తిట్లతోనే తట్టి లేపేది!!..
వాస్తవసమాజం వైపు నడిపించడానికి
నా హృదయ తలుపుల్నినిత్యంతట్టి
నామనసు పొరలను సుతారంగా మీటి
కొత్త ఊపిరి పోసేది...
కుళ్లు కుతంత్రాల లోకం నుండి
నన్ను కాపాడడానికే
ఈ తిట్లతోనే ఎన్నో అగచాట్లుపడేది..
అమ్మ అంటే ఇంతేనేమో అనిపించేది...
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ
No comments:
Post a Comment