Tuesday, January 10, 2023

****కష్టసుఖాలు

 *కష్టసుఖాలు*

లౌకిక విషయాలు తెలియనంతవరకూ కుర్రాడైనా కల తలూ, కలవరాలూ లేకుండా సంతోషంగా కనిపిస్తుంటాడు. సంసారసాగరంలో దిగాక అతనిలోని సంతోషాలన్నీ మటుమాయమ ముఖాన చెప్పలేని కనిపి స్తాయి. ఉదయాన వీచే గాలిలా స్వతంత్రంగా, ఎప్పటికప్పుడు పువ్వులా, జీవితాంతం వారు భాగ్యవంతులు. భగవాన్ రామకృష్ణ పరమ హంస మాట.

జీవితం ఒక్కొక్క దశలోనూ ఏదో మార్పు చోటుచేసుకుంటూ ఉంటుంది. మనిషి మనసు, దేహమూ కాలానుగుణంగా మారుతాయి. ఓ వయస్సులో భరించగలిగిన చలిని మరొకప్పుడు కాస్తంత కూడా తట్టుకోలేం. రుతువు ముడిపడిన మానవదేహంతోపాటు మానసిక స్థితిలోనూ మార్పులు తథ్యం. హృదయం నిండా ఉండిన ప్రశాంతత క్రమక్రమంగా తగ్గుతూ అక్కడ ఆందోళనలు గూడు కట్టడం మొదలుపెడతాయి. సంతోషం కోసం పరితపించిన మనసు ప్రశాంతత కోసం ఆరాటపడుతుంది. అప్పుడు ఆధ్యాత్మికతపై మనసు మళ్ళుతుంది. మధురమైన సంగీతం మనసుకి ఊరటనిస్తుంది. లాలి పాటతో నిద్ర వస్తుంది. శోకమైన పాటతో ఏడుపు వస్తుంది. శృంగార రసమైన పాటతో కోరికలు పుడతాయి. భక్తిరస ప్రధానమైన పాటతో హృదయానికి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది.

మనకున్న దైవరూపాలన్నీ సంగీతమయమైనవే. వీణ లేకుండా సరస్వతిని ఊహించగలమా. వేణువు లేని కృష్ణుడిని ఊహించగలమా. శివుడు అనగానే తాండవం. ఇలా ఒక్కో దేవుడు దేవతా ఏదో ఒక దానికి సంకేతమే. ఆనందభైరవి, మోహనం, చారుకేశి, సహానా, కాంభోజీ వంటి రాగాలు వింటుంటే మనసుకు హాయిగా ఉంటుంది. జీవితమూ అంతే. కష్టసుఖాల సమ్మేళనం. కనుక దేనికీ ఉప్పొంగకూ డదు. కృంగిపోకూడదు. అప్పుడే మానసిక ప్రశాంతతకు లోటుండదు. 

No comments:

Post a Comment