🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"416"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"మనసంటే ఏమిటి ? దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ?"*
*"మనసంటే ఒక పదార్ధం కాదు. అది ఒక శక్తి. అది విద్యుత్ శక్తి లాంటిది. కరెంటులాగే మనసుకూడా కేవలం ఒక్క గుణంతోనే లేదు. కరెంట్ అంటే చలించేది అని అర్ధం. అది కదులుతుంది, వెలుగుతుంది. ఫ్యాన్ ను తిప్పుతుంది, పట్టుకుంటే షాక్ కొడుతుంది. ఇవన్నీ కరెంట్ లక్షణాలు. అలాగే మనసు కూడా సమస్త గుణాల సమాహారంగా ఉంది. మనసుకు గమనింపు ఉంది. తన ముందున్న వస్తువును తెలుసుకునే గుణం ఉంది. గుర్తు పెట్టుకొనే సామర్ధ్యం కూడా ఉంది. చూసిన వాటిని కాపాడుకోవటం, వద్దనుకోవటం దాని లక్షణం. కోరుకున్నది దక్కినప్పుడు ఒక రకంగానూ, దక్కనప్పుడు ఒకరకంగానూ స్పందించే గుణం ఉంది. కోరిక, కోపం, చికాకు, సంతోషం ఇలా అన్ని గుణాలు కలిసి మనసు అయ్యింది. మన మనసేంటో సంపూర్ణంగా అర్ధమైతే అది ఎందుకు అనుకున్న దానిపై నిలవటంలేదో అర్ధం అవుతుంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment