Bhagavadgeetha *Class-5 day*
Video link : https://youtube.com/live/YTToFvGGU7Q?feature=share
*ముఖ్యాంశాలు*
1. ఈరోజు మనం రెండవ శ్లోకంలో మొదటి అధ్యాయం రెండవ శ్లోకం....
*దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధన స్తధా |*
*ఆచార్య ముపసంగమ్య రాజా వచన మబ్రవీత్||*
ఆ సమయంలో రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూసి ద్రోణాచార్యునీతో ఇట్లు అంటున్నాడు.
2. దుర్యోధనుడు ద్రోణాచరుని వద్దకు వెళ్లి ఏమంటున్నాడంటే బుద్ధిమంతుడైనటువంటి నీ శిష్యుడు అయినటువంటి ద్దృష్టద్యుమ్నుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మహా వ్యూహాన్ని చూడు, ఈ సైన్యాన్ని చూడు అని అంటున్నాడు. కానీ ఇక్కడ దుర్యోధనను ఈ యొక్క ప్రవర్తన గనక మనం గమనిస్తే నిజానికి మన జీవితంలో గొప్ప జీవిత పాఠాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ద్రోణాచార్యులు కురుపాండవుల యొక్క గురువు సమస్త విద్యలను కూడా నేర్పించినటువంటి గురువు. ఆయనే కౌరవుల పక్షాన పాండవులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
3. ద్రౌపది యొక్క సోదరుడు ద్రుపద పుత్రుడైనటువంటి దృష్టద్యుమ్నుడు సైన్యాన్ని మొహరింపజేసి ఉన్నాడు ద్రోణాచార్యుల వద్దకు వెళ్లి ఒకసారి చూడండి నీ బుద్ధిమంతుడైనటువంటి శిష్యుడు ఎంత గొప్ప వ్యూహాన్ని రచించాడో చూడండి అంటున్నాడు.
4.మొదటి అధ్యాయంలో భగవంతుడు ప్రస్తావించడం జరిగింది. భగవద్గీత ఈ మొదటి శ్లోకంలో దుర్యోధనుల గురించి ద్రోణాచార్యుల గురించి దృపదని గురించి దుష్టమును గురించి వీరి యొక్క పేర్లను ప్రస్తావించడం జరిగింది.
5.భగవద్గీతలో ఏ ఒక్క పదము కూడా మనము తీసేయడానికి లేదు ప్రతి పదము నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది.
6.ఇక్కడ దుర్యోధనుడు అన్నటువంటి పేరు భగవద్గీత శ్లోకాలు చోటుచేసుకుందంటే మరి ఆ దుర్యోధన వెనకాల ఉన్నటువంటి కొన్ని పాఠాల్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. వారి జీవితం గురించి పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే ద్రోణాచార్యులు దృక్పథుడు వీరు వీరి జీవితాల ద్వారా మనకు ఏం సందేశాన్ని ఇస్తున్నారు, వారి జీవితాలు మన జీవితాలకు ఎలా ఉపయోగపడుతుంది, ఇక్కడ మనం మామూలుగా చాలామంది జీవితంలో గొప్ప విజయాలు సాధించాలి గొప్ప అద్భుతమైనటువంటి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి తమ జీవితాలను అత్యున్నతంగా మార్చుకోవాలని సక్సెస్ అయిన వారు లేదంటే గొప్ప వారి యొక్క జీవితాల నుంచి మాత్రమే పాఠాలు తీసుకోవాల్సిన అవసరం నుంచి కూడా వైఫల్యాలు పొందినటువంటి వారి నుంచి కూడా మనం అద్భుతమైనటువంటి తీసుకోవచ్చు ఎక్కడ కూడా దుర్యోధన ఒక ముఖ్యమైనటువంటి పాత్ర మహాభారతంలో దుర్యోధను అనబడే ఒక ముఖ్యమైన పాత్ర మనకేం బోధిస్తుంది.. మనం ఏం నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి ఇది మనము ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం అదేవిధంగా గురించి వారి పేర్లను ప్రస్తావించడం జరిగింది.
7.ఏర్పాటు చేసినటువంటి వ్యూహాన్ని చూడు అనకుండా నీ బుద్ధిమంతుడైనటువంటి శిష్యుడు ద్రుపద పుత్రుడు అని మెన్షన్ చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు దృక్పథుడు యాక్చువల్ గా దుర్యోధనుడికి శత్రువు పాండవ పక్షంలో ఉన్నవాడు మరి శత్రువుని బుద్ధిమంతుడు అని ఎందుకు అంటున్నాడు అంటే ఇక్కడ దుర్యోధనుడి యొక్క ఇంటెన్షన్ మనం గ్రహించాలి. అది నిజానికి చాలామందిలో ఉంటుంది. మనందరిలో కూడా ఉంటుంది అదేంటంటే మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఇతరులను భావోద్వేగాలను బట్టి కుదిపేసేలాగుంటాయి. ఇతరులను రెచ్చగొట్టేటట్టు, వాళ్లకు ఆందోళన కలిగించినట్టు, వాళ్లకు భయాన్ని కలిగించినట్లు ఈ విధంగా మాట్లాడే తమకు కావలసిన విధంగా లబ్ధి పొందుతూ ఉంటారు. ఈ విధంగా మనుషులను రెచ్చగొట్టడంలో యుద్ధ రంగంలో కర్ణుడిని గాని ఎద్దేవ చేస్తూ ఇన్ డైరెక్ట్ గా రెచ్చగొట్టి మాట్లాడి ఇది చాలా చాలా నీచమైనటువంటి హేయమైన చెప్పుకున్నాం. అనుద్వేగకరం ప్రేమహితం అని మనం చెప్పుకున్నాం.
8.మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటే ఇతరుల ఉద్వేగాన్ని కలిగించకూడదు. ప్రతి మాట కూడా ఎదుటివారి హృదయంలో శాంతిని నెలకొల్పాలి. శాంతి కలిగే విధంగా, భయం పోయే విధంగా, అభయాన్ని కలిగించే విధంగా ఈ యొక్క మాటలు ఉండాల్సి ఉంటుంది.
9.ఎవరైనా సరే తాము తరించిపోవడానికి ఒక పరమ లక్ష్యాన్ని పెట్టుకుంటారు. ప్రపంచానికి మేలు చేయడానికి ఒక పరమ లక్ష్యం పెట్టుకుంటాడు. కానీ ఇక్కడ పగ ప్రతీకారంతో అల్లాడిపోతూ జీవితం మొత్తాన్ని ఒక వ్యక్తి పైన పగ తీర్చుకోడానికి ఉపయోగించేసాడు. అతను మరణించాడు. చూడండి ఒక మనిషికి అంతిమ లక్ష్యం ఎప్పుడూ కూడా భగవంతుని చేరుకోవడమై ఉంటుంది. మరి అటువంటి లక్ష్యాన్ని పక్కన పెట్టేసి, పగప్రతీకారాల చేత పిచ్చి పిచ్చి లక్ష్యాలు అన్ని పెట్టుకుని జీవితాలను అద్భుతమైనటువంటి జీవితాలను గడపవలసి ఉంటుంది. ఈ దృక్పథం నుంచి ఎటువంటి లక్ష్యాన్ని కలిగి ఉండకూడదు పగ ప్రతీకారం.. ఇటువంటి లక్ష్యంతో మనం జీవితాన్ని గడపకూడదు.
గమనిక:-
ఈ రోజు గురువు గారు చెప్పిన క్లాస్ లో మమకారం, అహంకారం మొదలైన రాక్షస గుణాలు మానవునిలో ఉంటే వారి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో దుర్యోధనుని పాత్ర ద్వారా సవివరంగా వివరించారు.
------------------
ఓం శ్రీ గురుభ్యోనమః. 🙏.
ఈరోజు క్లాస్ లో దుర్యోధనుడు పతనానికి కారణమైన దుర్గుణాలను గురించి చాలా బాగా తెలియజేశారు. అసూయ ఎంతటి పతనానికి కారణం అవుతుందో తెలిసింది. అదే అసూయ కొంచెం గా ఉంటే మన డెవలప్మెంట్ కి ఉపయోగపడుతుందని మనల్ని మోటివేట్ చేసుకోవడానికి పనికొస్తుందని చాలా బాగా చెప్పారు.
కపటము, మొండితనము, దురభిమానము, క్రోధము ,పరుషంగా మాట్లాడడం ,అజ్ఞానము ఇవన్నీ రాక్షసు గుణాలని తెలియజేశారు.
"ఇనుము నాశనం అవ్వడానికి కారణము దానికి పట్టిన తుప్పే" అని చక్కటి ఉదాహరణ ఇచ్చారు. మన జీవిత పతనానికి కారణం కూడా మనలో ఉన్న ఈ రాక్షస గుణాలే అని అర్థమైంది.
కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుంటూ ఎప్పటికప్పుడు మన గుణాలను మనము సరిజేసుకుంటూ మన ఆలోచనలను ధనాత్మకంగా ఉంచుకుంటూ మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ఉపయోగకరంగా మారి మన జన్మ కారణం తెలుసుకొని వినయ విధేయతలతో ఉంటూ సమాజానికి ఉపయోగపడేటట్లు తయారయ్యి మన జన్మకు ఒక సార్థకత తెచ్చుకోవాలని చాలా బాగా సెలవిచ్చారు గురువుగారు ధన్యవాదములు. 🙏🙇
-----------------------
🙏🏻ఓం శ్రీ గురుభ్యోన్నామహ🙏🏻
ఈ రోజు క్లాస్ లో గురువుగారు చెప్పిన సారాంశము ….
నిత్య సాధన నీ చేస్తే కనుక నిజంగా …..
అసూయ. , ప్రతీకారం , స్వాభిమానం. , అహంకారం లాంటి దుష్ట గుణాల యొక్క ప్రభావం నుండి పూర్తిగా విముక్తి కలిగి , సత్యాన్వేషణ వైపుకి మరల్చుకోగలుగుతారు.
మనం …. మంచి గుణాలు కలిగి ఉన్న వారి నుండే నేర్చుకోవడం కాకుండా ,
దుర్యోధనుడి లాంటి ….. పూర్తి negitiv గుణాలు కలిగివున్న వారి నుండికూడా …..
ఎలా జీవించకూడదో తెలుసుకుని తీరాలి.
ఇలాంటి దుష్ట పాత్రలు వల్ల కూడా
గుణ పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది.
అన్నిటికీ మించి .. అహంకారం …………
ఈ గుణం కలిగి ఉండడం వల్ల ….……
ఎంత మంచితనం ఉన్నా కూడా ఉపయోగం ఉండదు.
ఆ గుణం వానిని అదఃపాతాలానికి చేర్చేస్తుంది.
అలాగే , ఎదుటివారికి కూడా హాని కలుగుతుంది.
🙏🏻ఓం శ్రీ గురుభ్యోన్నమహ🙏🏻
No comments:
Post a Comment