Sunday, September 3, 2023

" ART Of PARENTING" " నేడు పిల్లలను పెంచడం ఒక కళ"

 "💐💐💐💐💐💐,"
" ART Of PARENTING"
" నేడు పిల్లలను పెంచడం ఒక కళ"
     ‌‌🙏🙏🙏
   " ఇది ఒక సముద్రం లాంటి విషయముకలది.  ఎంత రాసిన తక్కువే?  మీరు ఆదర్శవంతమైన "భారత భావి పౌరులు" గా మీ పిల్లలను తీర్చిదిద్దాలని కలలు కంటున్నారా?  అయితే తప్పక ఓర్పుతో, పట్టుదలతో పూర్తిగా చదవండి ఇది మీ కోసం మీ పిల్లల కోసం అని,
గుర్తుంచుకోండి!
      🔥🔥🔥
🙏సమర్పణ:- MAZUMDAR, BANGALORE
87925-86125.
        🔥🔥🔥
 🙏సేకరణ: చిన్నపిల్లల '" మానసిక శాస్త్రవేత్తలు, 
ఇతర విద్యావేత్తలు, సౌజన్యముతో,
  
🙏" పిల్లలతో పెద్దలు ఎలా ఉండాలి.   " పిల్లలు పెద్దలు ఏది చెబితే అది సరిగా  అర్థం చేసుకోలేకపోవచ్చు.  కానీ పెద్దలు ఏది చేస్తే అది పిల్లలు చేస్తారని, గమనిస్తారని గుర్తుంచుకోండి!  
" మాతృదేవోభవ- " "పితృదేవోభవ-" "ఆచార్యదేవోభవ-" "అతిధిదేవోభవ" అన్నారు.  ఇవి విశిష్టమైన వాక్యాలు.  తల్లి ,తండ్రి విలువ చాలా గొప్పది.  వారి లక్ష్యము తల్లితండ్రుల చేతుల్లో నే నేడు వుంటుంది, అని చెప్పక తప్పదు.  పిల్లలు ఎప్పుడూ స్వచ్ఛమైన కాగితం లాంటి వాళ్లు తెరిచిన పుస్తకం లాంటివాడుగా గోచరమవుతారు.  మనము ఏది రాస్తే అలాగే ఉండును.    మనం ఏ బీజం వేస్తే ,ఆ మొక్క వచ్చును.  మనం వారికి ఇచ్చే సంస్కారము వల్ల మనం వృద్ధాప్యంలో ఆశ్రమాలు  పాలు కావటం జరగదు.   చత్రపతి శివాజీ ని " తల్లి "జిజియాబాయి" చిన్నతనము నుండి పెంచిన తీరు లో "దేశభక్తి" అలవాడేలా చేసింది.

    🔥" నేడు "అపార్ట్మెంట్ కల్చర్ ' వచ్చి న్యూక్లియర్ ఫ్యామిలీలు ఏర్పడుచున్నవి.  బామ్మ, తాత ,మామ, అమ్మమ్మ,
పరిచయము చేయట, బాల్యం నుండి " మానవ సంబంధాలు 'సామాజిక, మానసిక  విషయాల పట్ల శ్రద్ధ, తీసుకుని పెంచడం నేడు  ఒక సవాలు అయింది. 
 
      🙏" నేడు మనము పెంచే బిడ్డలు సమాజమునకు చీడపురుగులుగా పెంచిన మనము "దేశ ద్రోహం" చేసిన జాబితాలోకి చేరగలమని గుర్తించండి!
మేధో వికాసము మేదో మదనము చేస్తూ మెదడుకు పదులు పెట్టు పజిల్స్ ,మైండ్ గేమ్స్ ట్రేడింగ్ గేమ్స్, పచ్చీసు,
ఆటలు మరియు "అవుట్ డోర్ గేమ్స్"  కు అవకాశం, వారి కి
ఆలోచనా, అవగాహన కలగజేయ వలెను.  మీ పిల్లలను వీకెండ్స్ నందు జూ పార్కు, మ్యూజియం , ఎగ్జిబిషన్,
సర్కస్ తో పాటు నిత్యము మనకు ఉపయోగపడు, రైల్వే స్టేషన్స్, బస్టాండు, కూరగాయల మార్కెట్, పోస్ట్ ఆఫీస్, బ్యాంకులు,
తీసుకుని పోయి, అచట జరుపు, లావాదేవీలు, కార్యనిర్వహణ, చేయు పద్ధతులు,  ప్రాథమికమైన
విషయాలను సులభముగా అర్థము చేసుకునే విధముగా, చెప్పుకుంటూ, వారి నుంచి " సరిగా అర్థం అయినదా? అని పిల్ల చేత, ఇంకొకసారి మననం చేయించవలెను.   నేడు అన్నియు" ఆన్లైన్" విధానము నడుచుచున్నది.  అయినా మనము ప్రాక్టికల్ గా తగు నాలెడ్జి"
ఇవ్వవలెను.   ఇతిహాస పురాణములపై, అవగాహన కొరకు చిత్రములతో, మరియు సినిమా, నాటకాలు, చూపండి.   మంచి పుస్తక పఠనను అలవాటు చేయండి.   పిల్లలను లేపి తట్టి "ఆత్మవిశ్వాసము" కలగజేసే విధము, వారికి నీ కష్టసుఖము నాకు చెప్పు అని వారికి తగు "భరోసా", ఇవ్వండి.  నేడు
లైంగిక వేధింపులు కూడా,
ఎక్కువ అయినాయి.  వాళ్లు ధైర్యముగా, చాకచక్యముగా, ఎదుర్కొనుటకు, అవసరమైన, నైపుణ్యం కూడా నేర్పండి!

   🔥" పిల్లలు "గాలిపటాలు" "లాంటివారు.  దారం మీ వద్ద గట్టిగా పట్టుకుంటూ, వదులుతూ , గాలిని బట్టి నేర్పుతో ప్రవర్తించేట్టు నేర్పాలి.    నేటి పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి వేసినారు.   పేదవాళ్ల స్థితిగతులు గ్రామ వాతావరణము, ప్రకృతి సౌందర్యము  వారికి తెలియదు.  వారికి సేవ, దయ, ప్రేమ, ఆప్యాయత, అభిమానము, అనురాగం, మానవత్వము, ఉదార స్వభావము, వేరుకరితో పంచుకొనుట,
డబ్బు విలువ, ఆర్థిక విద్యబోధన, సమయము విలువ, తెలియదు కనుక, వాటి పట్ల ఆసక్తి అవగాహన పెరిగేటట్లు, వారిని చైతన్య పరచాలి.   వారు ఒకరిపై ఆధారపడి జీవించటం కాదు.  వారికి "నాయకత్వం" లక్షణాలు, చిన్నతనము నుండే తగు శిక్షణ, ఇచ్చుటకు కృషి చేయవలెను.

    🙏" నేడు మీ పిల్లలు తప్పు చేస్తున్నారు అంటే,
తల్లిదండ్రుల పెంపక విధానములో లోపాలు, గురువులు తీర్చిదిద్దవలసిన వారు మిన్న కుండుట, చుట్టుపక్కల సమాజంలో, చెడుకు ఆకర్షణ కు  లోనవుతున్నారు.   పిల్లలు భగవంతుని యొక్క ప్రతిరూపాలు, లాలి పాటలు, జోల పాటలు,  లాలించి, పాలించి ఆలకించాలి.  కానీ నాడు తల్లిదండ్రులు "చందమామ' ను చూపించి, ప్రకృతి అందాన్ని చూపించి, పిల్లల్ని  అన్నము తినేలా చేసేవారు.  కానీ నేడు ఉరుకుల పరుగుల ప్రపంచంలో, ఇరువురు ఉద్యోగము చేస్తూ, వారికి ఒక మొబైల్, లేదా కంప్యూటర్, గేమ్స్ పెట్టి,
వారి చేత అన్నము తినిపించుచున్నారు.  
తల్లిదండ్రుల స్పర్శ వల్ల కెమిస్ట్రీ కలుగును, పిల్లల వ్యక్తపరచు "ఫేస్ ఫీలింగ్స్"  గత జన్మ విశేషాలు చెబుతారు.  ఆడపిల్ల మంచి తండ్రి కను సన్నలలో పెరిగిన, పెద్ద అయినా భర్తను కూడా గౌరవించుట తెలియను "అద్దె గర్భం" లో పెరిగిన పురుడు పోసుకున్న పిల్లలు, తదుపరి "డే కేర్"లో పెరిగిన పిల్లలను,  నేటి తరంలో మనము చూస్తున్నాం! పిల్లలు లేక తపనతో బాధతో, ఆవేదన పడుచున్నారు మరి ఎందరో!  నవభారత నిర్మాణ , నిర్మాతలు భావి భారత పౌరులుగా తల్లిదండ్రులు తీర్చిదిద్దావలసిన బాధ్యత ,కర్తవ్యం , ఎంతైనా కలదు.  అప్పుడే మన భారత దేశము ఇంకనూ ఉచ్చస్థితికి, చేరును.  
    
     👍" నేడు పిల్లలలో Demanding Nature, Selfish Nature, Fighting Nature, ఏడవటం మారం చేయుట ( క్రూరియాసిటీ)
కుతుహులము  పెరుగును.  అందుకే పెద్దలు యాక్సెప్ట్ చేసి, Yes, అంటూ మన దారికి వారిని తెచ్చుకోవాలి.
Identify చేయవలసిన వయస్సు వారిది కానీ,
Orgument చెయ్యటంలో ముందు ఉంటారు.  వారి కళ్యాలు  పట్టుకోకండి? పిల్లలకు నిజాయితీ అలవర్చటం, విద్యాభ్యాసములో తొలిమెట్టు.   ఆలన,  పాలన వారి కి  మనము నేర్పాలి.
"సామాజిక రక్షణ" కల్పించాలి.   స్త్రీ, పురుషులు కలిస్తే భార్య భర్తలు అవుతారు, కానీ మంచి' తల్లిదండ్రులు" అని అనిపించుకోలేరు.
నేడు ఎవరైనా ఇంటికి వస్తే, ఇంట్లో గల మా అమ్మ ,తాతయ్య, మామయ్యలను పరిచయము చేయరు.
ఇంట్లో ఫ్రిడ్జ్, వారి కొన్న కారు, వాళ్లు సందర్శించిన హోటల్, వస్తువుల గురించి చెబుతారే గాని,
అనగా పెద్దలను, ఒక వస్తువు కన్నా తక్కువగా చూస్తారు.  ఈ విధానము పోవలెను.

🧤"SMART " PARENTING TIPS"
        🙏🙏🙏
1)" Encourage Innovative  Thinking.

2)" Read books to your  child."

3)" Encourage Mutual Questions."

4)" Play with your child mind games, educational games."

5)" Teach them bed getting and everything'

6)" Teach  Finance and every thing to your child".( వారికి తగిన పనిని ఇచ్చి ప్రోత్సహించాలి వాటికి పాయింట్స్ ఇవ్వాలి)

7)" Learning,/ speaking /  Thinking"

8)" stories on health food, growth mind set improve."

9)" Scenario -- Basied 
Questioning.'

10)" Passion Oriented Content."

11)" motivational content to beat can do Attitude.'

12)" help your child get organised'.( పిల్లలను ఒక భాగస్వామిగా చేస్తూ వారికి తగిన పని అప్పగించు)

13)" applicate & puzzle. Your child and give some points.

14)" goal oriented discussions."

15)" don't micro manage your child' (accept it) ఆ విషయాన్ని పాఠంగా చెప్పు . ఏమి పైకి అనకు.

16)" Ask positive solutions oriented questions.'

17)" తొందరగా పడుకొని తొందరగా లేవాలి. ( ఈ విధానము వల్ల రెండు గంటలు టైం, మీకు మిగులును)

18)" నీతులు"  ఉన్నత విలువలు కలిగిన కథలు చెప్పి వారిని చైతన్య పరచాలి.

19)" బాధ్యతాయుత ప్రవర్తన, వాళ్ల పనులు వారే చేసుకునే టట్లు  నేర్పాలి.

20)" నిర్వహణ-- నియంత్రణ," "Leadership Mentality"  నేర్పె
 స్కూల్స్ నందు , మీ పిల్లలకు బోధన విధానము ఉన్న చోటికి పంపండి.

21)" వారు అడిగింది ఇవ్వటం ( దేనికి ఖర్చు పెట్టాలి- వారికి నియంత్రణ నేర్పండి )

22)" వారిని ఎలా కంట్రోల్ చేయాలి పంచుకో- పెంచుకో ,ఎవరికి పెట్టకూడదని మీరు చెప్పవద్దు.   వస్తువు ఇవ్వు, అనుబంధము పెంచుకోవడానికి ప్రోత్సాహం చేయండి.

23)" నిత్య పరిశీలన" చేసుకొను లాగున అలవాటు చేయండి
( వారికి రోజు డైరీ రాయుట అలవాటు చేయండి)

24)" Yes, No, please, thank you ,sorry, ఈ పదాలు మీరు వాడుతూ, వుంటే,  పిల్లలు, చూసి అనుసరిస్తారు, ఆచరిస్తారు.

25)" ఎప్పుడూ చిరునవ్వుతో ఉండుట వారికి అలవాటు చేయండి!

26)" "శిక్ష" లతో కాకుండా,  "శిక్షణ" రూపేణా చెప్పాలి.  వారి పుస్తకాలు మరియు బొమ్మలు క్రమ పద్ధతిలో అందముగా పెట్టుకునేటట్లు నేర్పండి.

27)" తల్లిదండ్రులు తమ ఉద్యోగ హోదా, అధికార దర్పం ,పరపతి,  డబ్బు విలాసాల జీవితం మీ పిల్లలకు తెలిసేలాగా మీరు ప్రవర్తించకండి.
ఇంటిలో సీ.సీ కెమెరాలు అమర్చండి.  మీరు చేర్చే చోటు" డేకేర్ ' అయిన సీసీ కెమెరాలు ఉన్నచోట చేర్పించి వారిని వాచ్ చేయండి.

28)" గవర్నమెంట్ చట్టాలు దానికి బద్ధులై ఉండేలా " నైతిక విలువలు అవగాహన ఏర్పరచండి.  అనగా హెల్మెట్,  డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయుట, సిగ్నల్స్ సరిగా పాటించుట ,మాస్క్ లాంటి ఇతర "సోషల్"స్పెషల్ లోకల్ లాస్ "తెలిపి,మీరు పాటించి వారికి నేర్పించండి.

29)" TIME" :- వారికి ఇవ్వండి ,మంచి ఆలోచనలు పెరిగే ప్రశ్నలు వేయండి ,పజిల్స్, Cess ఇచ్చి" మైండ్ గేమ్స్" ఆడించండి.

30)" TALK":- వారితో మాట్లాడుతూ, ఆటలు, పాటలు, కవితలు పై తెలుగు భాష పై, సంస్కృత భాష యెడల మక్కువ కలుగునట్లు అవగాహన చెయ్యండి.

31)" TEACH":- " బోధించండి . జీవిత పాఠాలు, విజయ సారధులు పడిలేచిన సముద్రం కెరటంలా, వారి జీవితాలు ఎలా తీర్చి దిద్దుకున్నారో వారి వీర గాథలు తెలపండి!  " "Dignity of labour" 
నేర్పిన భవిష్యత్తులో విలువ , గౌరవము ఇస్తారు.

32)" TRUST":- " మీ పిల్లలను పూర్తిగా నమ్మండి.  మీరు నిజం చెప్పడానికి వారికి ధైర్యము నేర్పండి.  తప్పు చేసిన కొట్టిన "భయము" ఏర్పడి నిజము చెప్పరు.  కనుక తగు జాగ్రత్త తీసుకోండి.
మీ పిల్లలపై ఇతరులను ఎంక్వయిరీ చేయకండి,
వారికి తెలిసే విధంగా!

33)" TOUCH":- " మీ ఆత్మీయ స్పర్శ ద్వారా మంచి కొటేషన్స్ చెప్పండి రాత్రి నిద్రించే ముందు మంచి నీతి కథలు చెప్పండి . మంచి కలలకు సకారము చేకూర్చండి.

34)" TREAT":- 6 నుండి 12 సంవత్సరముల పిల్లలు  సిగ్గుపడతారు, వారిని "అబ్జర్వ్ "చేయండి.  మీ పిల్లలను హీనంగా చూడకండి, చులకన హేళన చేయకండి , వారిని ఉత్సాహపరచండి వారిలో "ఆత్మవిశ్వాసం" పెంపొందించుకునే  టట్లు చేయండి.  నేడు అనాధ పిల్లలను అవమానపరిచిన బయటపెట్టిన "సోషల్ యానిమల్"  గా తయారవుతారు, అదే మీరు ప్రోత్సాహం ఇస్తే, అనేక  అద్భుతాలు చేస్తారు ,అని తెలుసుకోండి!

35)" YES":- మీ పిల్లలు ఏది చేసినా అడిగిన ముందు "ఎస్ "అని చెప్పండి . దానికి కొంత టైం ఇచ్చి , నెరవేర్చగలను అని చెప్పి,  తగు విధముగా వారికి "కౌన్సిలింగ్ " ఇవ్వండి. "పాజిటివ్ "సమాధానం మీ నుండి వారు ఆశిస్తారు అని గుర్తుపెట్టుకోండి . "వద్దు " అన్న  ఆ పని వారు తప్పక చేస్తారు. ఉదా:" పేదరాశి పెద్దమ్మ' కథలలో , నీవు ఉత్తర దిక్కుగా పోవద్దు అంటే వారు అటే  వెళ్లి ,తిరిగి అన్వేషణ చేస్తారు.

36)" మీ పిల్లలను "విజయసారదులు' గా తీర్చిదిద్దండి , వారికి మీరు తగు వారధిగా మీరు ఉండండి అంతే! వారికి పూర్తి భరోసా ఇవ్వండి.

37)" మీ ఫ్యామిలీలో రిలేషన్స్ ఎవరైనా చనిపోతే వారు ఎందుకు ఎలా చనిపోయినది?  వివరాలు చెప్పి, వారిని ఆ కార్యక్రమాలలో పాల్గొనేటట్లు చేయండి మేనమామ ,అత్త ,బావ, అమ్మమ్మ ,వైపు బంధువులు , నాన్న వైపు బంధువులు ఎవరు? ఏమిటి? వివరాలు తెలిసేలా అవగాహన కలిగేలా చెప్పండి. "మానవ సంబంధాలు" మెరుగుపడతాయి.  లేక అవి "ఆర్థిక సంబంధాలు" గా మారిపోవును.

38)" మీ పిల్లలకు "money management , TIME management , communication skills, moral stories,
తెలియజేయండి.  మొక్కలు పెంచుటకు, వాటి సంరక్షణ నీరు పోయుట, మీ పిల్లలను " ఇన్వాల్వ్" చేయండి.

39)" గుడి, విహారయాత్రలు, మ్యూజియం, ఎగ్జిబిషన్,
వండర్ వరల్డ్, సర్కస్, జూ పార్కులు, వివిధ కోటలు బురుజులు, చారిత్రిక కట్టడాలు, ప్రకృతి సౌందర్యము,
వీకెండ్ ప్లాన్ చేయండి.
పుట్టిన స్థలాలు, ఆ గ్రామము నందు వారికి పుస్తకము , పెన్ను ఇచ్చి వాళ్ళ అనుభూతులు డైరీలో రాసుకుననే  అలవాటు చేయండి.

40)" మాతృభాషతో పాటు ఇతర భాషలు, సంస్కృత భాష మీద మోజు, అభిరుచి పెంచి ప్రోత్సహించిన అన్ని భాషలు వారికి వచ్చును అని వారికి తెలియపరచండి.  మీరు నేర్చుకుంటూ వారిని ప్రోత్సహించండి.

41)" పిల్లలకు మీరు ఆస్తులు కన్నా సంస్కారము నేర్పిన రేపు మిమ్ములను వారు" ఓల్డ్ ఏజ్ హోము" నకు పంపరు.

42)" 0-6 వయసు పిల్లలకు గుర్తుండని దశ,
7-నుండి 12 సంవత్సరముల పిల్లల తో ఫ్రెండ్లీగా ఉండండి.
12-18 యూత్ వారికి శారీరిక ,మానసిక లైంగిక హార్మోన్స్ ఉత్పత్తి అనేక మార్పులు వచ్చును గొంతు కూడా మారును.
వారిని ఫ్రెండ్లీగా చూడండి.
ప్రేమతో పుష్పాలుగా భావించండి, వారికి బాధ్యతలు కుటుంబ గౌరవం బోధపరచి, finance management, చెయ్యమని నేర్పి, "Budget Management" ఇవ్వండి.  20 నుండి 30 సంవత్సరములు లలో, "Life Turning Point"
నిర్ణయాలు, సలహాలు ఇవ్వండి.   30 సంవత్సరములు దాటిన ఏమి సలహాలు ఇవ్వకండి.  అడిగితే చెప్పండి.

43)" ఇద్దరు పెద్దలు మాట్లాడుకుంటే ఎదుటి ఉన్న పెద్దవాళ్లు 30% అర్థమవుతుంది.  అదే తల్లి ,తండ్రి మాట్లాడుకున్నప్పుడు,
ఎదుట మీ పిల్లలు ఉంటే 90% అబ్జర్వ్ చేయగలరు జాగ్రత్త!

44)" application పొగడ్తలతో స్ఫూర్తి ఇవ్వాలి.

45)" Advised by others social media 
ప్రభావము పడకుండా తల్లిదండ్రుల కంటే పక్క వాళ్ళు చెప్పిన వింటారు.

46)" Asking there opinion: వాడి ద్వారా అడగాలి.

47)" adventure oriented task photos short films, తీయమని చెప్పండి.

48)" పిల్లలకు శ్రమ పడుటలోని విలువలు నేర్పాలి.  ఇష్టపడుతూ చెయ్యాలి కానీ కష్టపడుతూ కాదు అని తెలియపరచండి.

49)" పిల్లలను మానసిక, శారీరిక ,ఎదుగుదల సామాజిక ,ఆధ్యాత్మిక వికాసము, కలిగించేలా పెంచాలి.

50)" పిల్లలకు సంస్కారము, సభ్యత, నిరాడంబరత, స్థితప్రజ్ఞతా, నీతి నిజాయితీ, లాంటి నైతిక విలువలు పెంచి పోషించాలి.

51)" మీరు పిల్లల విషయంలో పొరపాట్లు చేశారా ? వారు మీకు జీవిత చరమాంకంలో, వారి వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

52)" ఆడపిల్లలలో "ఆత్మస్థైర్యాన్ని" నింపాలి.
కుల సంఘాలు ర్యాగింగ్ పాల్పడకుండా, friendly classes, interactive classes, introduction classes, ప్రవేశపెట్టి, ఒక నెల తరువాత "friendship day" నిర్వహణలో స్నేహితుడు, తత్వ బోధకుడు, మార్గదర్శిగా గురువుగా ఉండాలి.

53)" మీరు తెచ్చిన బహుమతి చెల్లాయికి ఇవ్వు తమ్ముడికి ఇప్పించి వారి పట్ల అనురాగము, ఆపేక్ష, పెరుగే లాగా చూడండి.  అలాగే ఇంటికి ఎవరు వచ్చినా వారి చేత మంచినీళ్లు ఇప్పించుట, కూర్చోమని చెప్పుట, 
బహుమతులు కూడా వారి చేత ఇప్పించండి.
వారికి బంధుమిత్రుల,  గురించి అవగాహన కలిగించండి.

55)" నేటికి అమెరికాలో పిల్లలు స్కూలుకు వచ్చు వారిని, సీనియర్ క్లాస్  వాళ్లు రిసీవ్ చేసుకొనుట చేస్తారు.  స్కూల్ ఓపెన్,
స్కూల్ క్లోజ్ చేయు సమయములలో, security traffic police 
లేదా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుతారు.  వారికి ఒక గంట డ్యూటీ గా ప్రత్యేకముగా నియమించుతారు.

56)" పేరెంట్స్ మాతో ఎదురింటి వారితో మాట్లాడినట్లు మాట్లాడాలి అనుకుంటారు.

57)" ఇంటికి వచ్చిన బంధుమిత్రులు ఎదుట వారిని చులకన చేసి మాట్లాడుట వారి గురించి చెడుగా చెప్పరాదు.

58)" పెద్ద కలలు కనటం వాటిని సహకారం చేసుకునేటట్లు ప్రోత్సహించండి.

59)" మీ పిల్లలకు లౌకిక విద్య ,ఆధ్యాత్మిక విద్య, తోపాటు, బిజినెస్ స్కూల్స్ ద్వారా "ఆర్థిక విద్య " బోధన నేర్పాలి.

60)" మీ పిల్లలకు చైతన్య శక్తితో సంభాషించే, ప్రముఖ వ్యక్తుల యొక్క వ్యాఖ్యలను తెలియ చెప్పండి.
    🔥" నేను రాసింది గోరంత మాత్రమే, రాయవలసినది కొండంత ఉన్నది.  విసిగించటం నా పని కాదు.   నచ్చిందా? షేర్ చేయమని నేను చెప్పను.  అది మీ వివేకానికి, మీ ఓర్పుకు,
స్వార్థ చింతన లేని, మీకు చెప్పనవసరం లేదు, అని అనుకుంటాను. ( రేపు కలుద్దాం)
   
     👍👍👍
🙏సమర్పణ: మజుందార్ బెంగళూరు,87925-86125.
జై భారత్, వందేమాతరం
🔥🔥💅🏿💅🏿🧤🧤🧤

No comments:

Post a Comment