Sunday, September 3, 2023

మాటతీరు

 *🦋HappY SundaY🦋* 
     Date:  *16-04-2023*
        *ఆదివారం*
*BeautifuL $torY...®️✍🏻*  
  
*మాటతీరు*
          *అనంత్* చదువు ముగించి ఉద్యోగంలో చేరటానికి వ్యవధి ఉందని స్వంత ఊరు చేరాడు. ఆ ఊరిలోనే చిన్న నాటి స్నేహితులను పలకరించాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. *గోవింద్, కేశవ* వ్యాపారం చేస్తుంటారు. ఇంట్లోలేరు. సుభద్రమ్మ ఒక్క తే ఉంది. అనంత్ ని చూసి నవ్వుతూ, రావయ్యా అనంత్.., ఎన్నాళ్ళకీ అంతా బాగున్నారా అడిగింది. బాగున్నామత్తా అన్నాడు.
        *ఆ!!! ఏంబాగులే...* ఇంతకూ నీకు ఉద్యోగం వచ్చిందా..! లేక ఇంకా మీ నాన్న సంపాదనే తింటూనే ఉన్నావా? అనంత్ సమాధానం  చెప్పేలోపు సుభద్రమ్మ అందుకుని, ఇంత చదువు చదివి అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. *ఏంలాభం చెట్టల్లే* ఎదిగారు. ఇంకా తండ్రి మీదే ఆధారపడి తింటూ కూర్చున్నావు. మీ నాన్న కష్టం తీరేది కాదు. పెద్ద చదువు వుంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి అంటారు. మా కేశవ, గోవింద్ లను చూడు. నీలాగా పెద్ద చదువులు చదవలేదు. చిన్నప్పటినుండి వ్యాపారంలో ఆరి తేరబట్టి కదా *కనక వర్షం* కురిపిస్తున్నారు. ముఖాన సిరి లేదు. నీకు ఆ గీత రాయలేదు ఆ దేవుడు. ఏం చేస్తాం మనసు లో పెట్టుకుని కుమిలి కుమిలి ఏడవ్వాల్సిందే. మా *అమ్మాయి పెళ్ళి ఝంఝం* చేశాము. ధనికులు వాళ్ళు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా...! గోవింద్ కి కోరిన కట్నం, పిల్లకి కోరిన నగలతో పిల్ల నిస్తామని వచ్చారు. కేశవకీ అలాగే అనుకో. *నీకైతే ఉద్యోగం, సద్యోగం లేదాయె...* పిల్లనెవరిస్తారు నీకు? ఇస్తే ఆ పిల్లకు ఉరికంబమే కదా నీతో పెళ్ళి. అలా అని డ్రైవర్, వెయిటర్, కూలి, ప్యూను
పనులు కూడా చెయ్యలేవు ఇంత చదివీ. *టైం వుంటేనే కదా వచ్చావు.* మా పిల్లలకు టైం వుండదు. *టైం అంటే డబ్బు* అని అంటారు పిల్లలు. ఏదైనా తింటావా? మా ఇంట్లో ఎన్నో ఉన్నాయి తినేందుకు. మొహమాటం లేకుండా అడుగు. అయినా *మీ అమ్మ ఏం చేస్తుందిలే...!.* మీ పొట్టలే నింపడం కష్టం. విచారించకు డబ్బు లేదని. గోవింద్ సాయం చే‌స్తాడులే. ఇలా సుభద్రమ్మ ధోరణి సాగి పోతుంటే వెళ్ళొస్తా నత్తా అంటూనే లేచాడు. అసూయ కాబోలు లేక తనను కించ పరిచి మనసు లోని అసంతృప్తిని దాచాలనకుందో. కొందరి *ధోరణి గాయం* చేసే లాగా వుంటుంది.
       ఒకవేళ తనకి *మంచి ఉద్యోగం* వచ్చింది అని చెప్పి వుంటే సుభద్రమ్మ అత్త ఏమై పోయి వుండేదో!!! మరునాడు ఉదయం *స్వీట్స్ సుభద్రమ్మ చేతుల్లో* పెట్టి, నమస్కరించి, తనకు *ముంబైలో మంచి ఉద్యోగం* వచ్చింది అని పెద్ద జీతం, ఇల్లు కారు హంగులతో బాగా వుంది, కుటుంబం మొత్తంగా ముంబైకీ  వెళ్ళేముందు, *గోవింద్, కేశవలని* చూసి పోదామని వచ్చానత్తా...! అని అన్నాడు. సుభద్రమ్మ నిలబడలేక పడబోయి తమాయించుకుంది. *ఖంగు తినే సమయం ఈసారి సుభద్రమ్మది.* 
మిత్రమా...!
చాపలత్వం ప్రమాదమే ఎప్పటికైనా....!
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*Your's....*
    *-🎤K ®️avindra Dheera,*
      *M.Sc (Psy), D.Ed &B.Ed*
      *Motivational Speaker &Trainer*        
      *NLP Practitionar*
      *Life skills coach*
      *🎯Impact Foundation.*
*Cell: 9848105906*

No comments:

Post a Comment