*🔊ఆన్లైన్ ఆర్డర్లు మానుకొని.. పిల్లలకు వండి పెట్టండి..తల్లిదండ్రులకు హైకోర్టు సూచన*
*🍥పిల్లలకు వండి పెట్టమని కోర్టులు చెప్తున్నాయి కానీ,, వండిన వంట పిల్లలను తింటున్నారా! అనేది మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఈకాలం పిల్లలు ఆకలి వేసిందా.. మొబైల్ చేతికి తీసుకోవడం.. జొమాటా లేదా స్విగ్గీ యాప్ ఓపెన్ చేయటం.. ఆర్డర్ ఇవ్వటం. అరగంటలో ఫుడ్ వారి ముందుకు రాగానే దాన్ని ఆరగించటం.. ఇదే దినచర్య. అలా అని పెద్దలు తినరేమో అనుకోకండి. అందులో సగభాగం పెద్దలదే. ఇకనైనా ఇలాంటివి మనుకోమని పిల్లలకు, పెద్దలకు కేరళ హైకోర్టు సూచించింది.*
*🌀స్విగ్గీ, జొమాటో నుంచి ఆర్డర్ చేసే బదులు.. తల్లి వండిన రుచికరమైన ఆహారాన్ని పిల్లలకు తిననివ్వండి అని కేరళ హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. " పిల్లలకు స్వేచ్ఛనివ్వండి.. ఖాళీ సమయంలో క్రికెట్ లేదా ఫుట్బాల్ లేదా వారు ఇష్టపడే ఇతర క్రీడలను ఆడనివ్వండి. అలాగే ఇంటికి తిరిగి వచ్చినప్పుడు స్విగ్గీ, జొమాటో నుండి ఆర్డర్ చేసే బదులుగా తల్లి వండిన మైమరిపించే వంటకాల సువాసనను ఆస్వాదించనివ్వండి.." అని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. భావితరాలదే భవిష్యత్ అన్న కేరళ న్యాయస్థానం.. యువ తరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలా లేదా అన్నది తల్లిదండ్రుల విజ్ఞతకే వదిలేస్తున్నాను.. అని తెలిపింది.*
No comments:
Post a Comment