Wednesday, September 13, 2023

సంభోగం నుండి సమాధి వైపు (ఓషో) Chapter --7:-- కామానికి 3 స్థాయిలున్నాయి

🌺 *సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺
🌹 *Chapter --7:-- కామానికి 3 స్థాయిలున్నాయి:--* 🌹
🌷 *Part -- 1* 🌷

🏵️ *1) స్థూలమైన స్థాయి:--*

🍁 ఈ స్థాయిలో శరీరాలు కలుస్తాయి. ఓ వేశ్యతో సంభోగం లాగా, ఓ మానభంగం లాగా అంతే, హృదయాలు, ఆత్మల కలయిక ఉండదు. 

🍀 మొట్ట మొదటి కామానుభవం స్థూల శరీరానికి సంబంధించిన స్థాయిలో ఉంటుంది, కానీ ఆ స్థాయిలోనే ఆగిపోయిన వాడికి ఓ సంపూర్ణ కామానుభవం ఎప్పటికీ ప్రాప్తించదు. 

🌸 ఏ దేశాలలో ప్రేమ లేకుండానే పెళ్ళిళ్ళు జరుగుతుంటాయో అక్కడ కామం శారీరక స్థాయిలోనే మగ్గిపోతూ ఉంటుంది. రెండు శరీరాలకు మాత్రమే ఈ పెళ్ళిళ్ళు జరుగుతాయి. కానీ, రెండు ఆత్మలకు ఏ మాత్రం కాదు, ప్రేమ రెండు ఆత్మల మధ్య మాత్రమే సంభవింపగలుగుతుంది. 

☘️ వేశ్యతో సంభోగమూ, ప్రేమలేని పెళ్ళి ఒక్కలాగే ఉంటాయి. ఒక రాత్రి కోసం ఓ వ్యభిచారిని డబ్బిచ్చి మీరు కొనుక్కుంటారు, అదే విధంగా ఓ జీవిత కాలానికి డబ్బిచ్చి ఓ భార్యను కొనుక్కుంటారు. అంతే తేడా !

🏵️ *2) మానసికమైన స్థాయి:--*

🌼 ఈ స్థాయి మనస్సుకూ హృదయానికీ సంబంధించినది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటలు మరికొంత దురాలకు, ఇంకాస్త లోపలికి వెళ్ళగలుగుతారు. హృదయాల్లోకీ మానసిక లోతుల్లోకి వెళ్ళగలుగుతారు. కానీ అదే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూండడంతో మొహం మొత్తి మళ్ళీ భౌతిక తలానికే ప్రతి రోజూ తిరిగి వచ్చి చేరుతుంటారు. 

🌳 మనస్సు ఈ రోజు ఒకటి కావాలంటుంది, రేపు మరొకటి కావాలంటుంది. దాన్ని నమ్ముకుని జరిగే పెళ్ళిళ్ళను నమ్మడానికి వీల్లేదు. స్థిర వైవాహిక వ్యవస్థను నిర్మించాలన్న ఆశయం కోసం పని చేసే సమాజాలు అందువల్లే ప్రేమ వివాహాలను సవరించలేకపోయాయి. వివాహాలను స్థిరంగా భౌతిక స్థాయిలనే నిలబెట్టే ప్రయత్నాల్ని చేస్తాయి. *'పెళ్ళాడు, కానీ ప్రేమించి కాదు, పెళ్ళయ్యాక ప్రేమ పుట్టుకొచ్చిందా, శభాష్ మంచిదే. అలా కుదరకపోతే ఈ పరిస్థితినే  కొనసాగనీ ! మార్చే ప్రయత్నం చేయకు అన్నాయి.

🏵️  *3) ఆధ్యాత్మిక స్థితి స్థాయి:--*

🌿 ఈ స్థాయిలో ప్రతిదీ ప్రశాంతంగా , శాశ్వతంగా మార్పు లేకుండా ఉంటుంది . 

🍁 ఈ ఆధ్యాత్మిక తలంలో ఓ స్త్రీ, పురుషుడూ కలిసి, ఓ క్షణం పాటు ఏకత్వం పొందినా, యుగ యుగాలకూ కలిసే ఉన్నంత అనుభవాన్ని పొందగలుగుతారు. అక్కడ ఓ లోతైన ప్రేమ ఝారీ, కాల శూన్యతా, పవిత్ర పారవశ్యాలు పెళ్ళి కట్నంగా, లభిస్తాయి. ఈ స్థాయి ఆత్మలకు సంబంధించింది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🍀 *సంభోగం నుండి సమాధి వైపు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

No comments:

Post a Comment