నేటి ఆణిముత్యాలు .
అక్షరాలు మనకు నచ్చిన్నట్లు మనకు అనుకూలంగా రాసుకునేవి
మాటలు కూడాఅంతే మనకు అనుకూలంగా చెప్పుకునేవి,
కానీ జీవితం అలా కాదు మనకు నచ్చినట్లు జీవించడానికి ఎన్ని
వేదనలు పడాలో లెక్కపెట్టలేము.
కావాలని వెళ్లే బంధాలకు,
అనుకోకుండా కలిసే బంధాలకు
మధ్య సాగేదే మనిషి జీవితం.
కొందరు కొంతవరకే మనతో ప్రయాణిస్తారు.కొందరు మాత్రం ఎంతవరకు ప్రయాణించినా, అనుక్షణం మనల్ని నడిపిస్తారు.
నువ్వు నిజానికి దగ్గరగా బ్రతకగలిగితే,సరిగ్గా గురిపెట్టు.నీ బ్రతుకు గాడి తప్పకుండా, కుటుంబం కుదేలైపోకుండా చూసుకుంటూనే, నీకు నచ్చిన పనికోసం మరింత కష్టపడు.
మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment