*మానవుని దుఃఖానికి కారణం ఏమిటి???*
"అపోహయే దుఃఖ హేతువు" అని శాస్త్ర వచనం...!!
ఒక సింహపు పిల్ల తప్పిపోయి, గొఱ్ఱెలు మేపు వారికి దొరికింది...
వారు దానిని తన గొఱ్ఱెల మందలతో పాటు పెంచగా, కొంచెం అది పెద్దదైంది.
అది గొఱ్ఱెలలో తాను ఒక గొఱ్ఱెను అనే అనుకునేది...అలాగే ప్రవర్తించేది...
ఒకసారి అవన్నీ అడవిలో మేస్తుండగా, వేరే సింహం వచ్చి, ఈమందపై పడింది...
గొఱ్ఱెలన్నీ పారిపోయాయి, సింహం పిల్ల కూడ, వాటితో పాటు పారిపోసాగింది.
అడవి సింహం దీనిని చూసి, ఆశ్చర్యపడి, ఎలాగో పరుగెత్తి దానిని ఆపింది.
"చిన్న గొఱ్ఱె ను నన్ను చంపకయ్యా"అంది వణికిపోతూ సింహం పిల్ల...
అడివి సింహం నవ్వి, దానిని ఓ కొలను వద్దకు తీసుకెళ్ళి నీటిలో తమ ప్రతి బింబాలను చూపింది.
మూతి పై మీసాలు చూపింది, పిల్ల సింహం గొఱ్ఱె ను కానని తెలుసుకుంది.
తాను కూడా సింహమేనని, తలచి సింహంలా గర్జిస్తూ అలాగే సంచరించ సాగింది...
ఐతే ఇక్కడ సింహా నికి కొత్తగా వచ్చినది, స్వరూప జ్ఞానమేకాని, స్వరూపం కాదు...
అందుకే మానవుని, దైవ స్వరూపులుగా భావిస్తారు, సంబోధిస్తారు,
కాని మనం ప్రాకృతమైన జీవితానికి అలవాటు పడి, మనలో ఉన్న పరమాత్మను, విస్మరిస్తున్నాము...
జీవుడు,దేవుడు ఒకటే , మన స్వస్వరూపం , ఆత్మయే... అని తెలుసుకోవాలి ...
ఏదీ శాశ్వతం కాదు, అన్నీ నిమిత్త మాత్రమే అని భావించాలి, అశాశ్వతమైన వాటిపై ఆశ వదలాలి ...
*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
No comments:
Post a Comment