*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🌺 *సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺
🌹 *Chapter --5:-- ప్రేమ శిఖరాలను అధిరోహించండి* 🌹
🌷 *Part -- 1* 🌷
🌳 కామం ద్వారా మనిషి ప్రేమని అందుకోవచ్చు కానీ, ప్రేమ పథంలో నడిచే వారు కామంలోకి ఎప్పుడూ జారుకోరు. కామం యొక్క శక్తే ప్రేమగా రూపాంతరం చెందుతుంది.
🌼 తమలో ప్రేమని నింపుకోలేని వారు, కామంతో నింపబడి ఉంటారు. అలాంటి ఆలోచనలతోనే వారుంటారు. ఎంత తక్కువగా ఓ మనిషి ప్రేమిస్తాడో, అంత ఎక్కువగా ద్వేషిస్తాడు.
🌸 తమ జీవితంలో ప్రేమను ఏ పరిమాణంలో పొందలేరో - అదే పరమాణంలో, దుఃఖం, చింత వాళ్ళకూ కల్గుతూ ఉంటాయి.
🌷 ప్రేమ శక్తుల్ని ప్రేరేపిస్తుంది. ప్రేమ ఒక ప్రవాహం, ప్రేమ ఓ సృజనాత్మకత. ఎంతో తృప్తి జనకమైనది. కామం ద్వారా పొందగలిగే ఆనందం కన్నా ప్రేమ ద్వారా పొందే సంతృప్తి ఎంతో గాఢమైనది, విలువైనది. బహ్మనందాన్ని పొందిన వారు మరో ప్రత్యామ్నాయం కోసం అర్రులు చాచరు. వజ్ర వైఢూర్యాలని సంపాదించుకున్న వ్యక్తికి మామూలు రాళ్ళు - రప్పలతో ఏం పని?
☘️ ప్రేమ శిఖరాలను అధిరోహించండి. ప్రేమని ఆరాధించండి. ప్రేమని పంచండి, ప్రేమలోనే జీవించండి.
🍁 ప్రాణ స్నేహితుణ్ణి అప్యాయంగా పైకెత్తి పట్టుకున్నట్లే, ఓ రాతి ముక్కని కూడా అదే ఆప్యాయతతో ఎత్తి పట్టుకోగలగాలి. స్నేహితుడికి కరచాలనం చేస్తున్నట్లే శత్రువుకు కూడా అంతే ఆస్యాయత కరచాలనం చేయగలగాలి!
🌿 మనుషుల్ని మాత్రమే ప్రేమించడం సంపూర్ణత్వం అనిపించుకోదని సిద్ధాంతం. ఈ సృష్టినంతా ప్రేమించగల్గడమే పరమార్ధం అనిపించుకుంటుంది.
🌷 *Part -- 2* 🌷
🌳 నిర్మలమైన ప్రేమకు కారణాలు కన్పించవు. ప్రేమ కారణాలతో బంధించబడదు.
🌼 ఓ చిన్నారి అభివృద్ధి, అతని వ్యక్తిత్వం, అతని భవిష్యత్తు, అతనికి ఎదురయ్యే వ్యక్తుల పరిస్థితుల దర్శన మాత్రంతో పొందే సంతోషం మీదా, తన నుంచి ప్రతిబింబించే సంతోషం మీద ఆధారపడి ఉంటుంది.
🌸 ప్రేమించగల మనిషి కామం నుంచి కూడా విముక్తుడు కాగలుగుతాడు, కానీ మనం ప్రేమను ఎవరికీ అందించడం లేదు, మనలో ప్రేమించాలన్న ఉత్సాహం కూడా లేదు.
🌷 ఒక మనిషిని ప్రేమించే వాడు ఇంకొక మనిషిని ద్వేషించగలడా? వీలుపడదు ! సంపూర్ణ ప్రేమా, ద్వేషమూ ఈ రెండూ ఒకే వ్యక్తిలో ఉండడం ఆసంభవం.
☘️ మానవుల్లో నిండయిన ప్రేమ సహజంగా ఉండాలి. *"ఎవరి మీద?"* అనే మాట మీద అది ఆధారపడకూడదు. కానీ తన ప్రియురాలు తనను మాత్రమే ప్రేమించాలనీ, ఇంకెవర్ని ప్రేమించకూడదని ఓ ప్రియుడు, అనుకుంటాడు . *"నన్ను మాత్రం ప్రేమించు"* అని అంటున్న ఆ ప్రియుడికి అందర్ని ప్రేమించలేని వాళ్ళు ఒకర్ని కూడా ప్రేమించలేరనే విషయం తెలియదు.
🍁 తండ్రి తన బిడ్డ తనను ప్రేమించాలని చెబుతున్నాడే కానీ, తమ ఇంట్లోనే పని చేస్తున్న పనివాణ్ణి కూడా ప్రేమించాలన్న మాట మాత్రం ఎప్పుడూ చెప్పడు.
🌿 ప్రేమ అనేది ఓ మనిషితో పెట్టుకునే సంబంధం కాదు. ప్రేమ అన్నది మనస్సు యొక్క ఓ స్వభావం. ప్రేమ. చిన్న పిల్లలకు ధ్యానం నేర్పించడం మొదటి అంశం. ప్రేమని బోధించడం రెండవ అంశం.
🌷 *Part -- 3* 🌷
🏵️ ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా, హృదయ పూర్వకంగా అందిస్తున్న మన ప్రేమ వల్లే అత్యంత ఆహ్లాదకరమైన తృప్తి కొద్దిసేపు మనల్ని ముంచెత్తటం ఎప్పుడూ మీ అనుభవంలోకి రానేలేదా? రాలేదా?!.
🌳 ఆంక్షలతో కలుషితం కాకుండా ఉన్నప్పుడే స్వచ్ఛమైన ప్రేమ కలకాలం జీవించగల్గుతుంది. ఆంక్షలతో అందించబడే ప్రేమ ప్రేమే కాదు.
🌼 క్రింద పడ్డ ఓ మనిషిని పైకి లేవదీసినప్పుడూ, ఓ చేయూత అందించినప్పుడూ, జబ్బుతో బాధపడుతున్న వాళ్ళకి ఓ పుష్పగుచ్ఛాన్ని అందిస్తూ వున్నప్పుడూ మీలో రేగే ప్రశాంత భావ తరంగం అందించే ఆనందానికి అవధులో ఉండవు, కానీ ఈ సహాయం గ్రంహించిన వాళ్ళు నీ తల్లి, తండ్రో కాబట్టి చేసినట్లయితే ఆ పని ఏ సంతోషాన్ని కల్గించదు. ఏ తృప్తినీ అందించదు. ఏ సంబంధమూ లేకపోయినా, ఏ ప్రతి ఫలమూ ఆశించకుండా నిస్వార్ధంగా అందించే ప్రేమ కానుకే ఓ గొప్ప బహుమానం , ఓ గొప్ప వరం.
🌸 సంభోగ సమయంలో శ్వాస వేగం ఎంత పెరిగితే సంభోగ కాలం అంతగా తగ్గిపోతూ ఉంటుంది ! ప్రశాంతంగా నెమ్మదిగా శ్వాస సాగితే సంభోగకాలమూ పెరుగుతుంది.
🌷 సంభోగ సమయంలో మీ చేతనత్వం మీ కను బొమ్మల మధ్య ప్రదేశంలో భ్రుకుటిలో, అజ్ఞాచక్రం మీదే స్థిరంగా లగ్నమయి ఉండేటట్లుగా చూసుకోవడం, అక్కడే మీ చేతనత్వాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోగలిగితే మీ సంభోగ పరాకాష్టను 3 గంటల పర్యంతమూ నిలిపి ఉంచుకోగలగడం సుసాధ్యమే అవుతుంది.
☘️ వినోభా భావే గానీ, నేను (ఓషో) గానీ మరెవ్వరైనా సరే కామకేళీ పరాకాష్టలో సమాధి స్థితిని దర్శించి నిలబెట్టుకో లేకపోతే ఎప్పటికీ బ్రహ్మ చర్యానికి అర్హత లేని వాళ్ళే అవుతారు. బ్రహ్మ చర్యపు సంపూర్ణ పరిజ్ఞానాన్ని పొందని వారే అవుతారు. ఆ అనుభవం ఈ జన్మకు సంబంధించినదే కానక్కేరలేదు... గత జన్నకు సంబంధించిన అనుభవమైనా అయ్యుండొచ్చు! ఈ జన్మలో ప్రాప్తించిన బ్రహ్మ చర్యానికి మూలం గత జన్మలోని అతని సంభోగ పరాకాష్ఠా నిష్ణానత వల్లే తప్ప మరే పూణ్య కార్యం వల్లే కానే కాదు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🍀 *సంభోగం నుండి సమాధి వైపు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
No comments:
Post a Comment