Sunday, September 3, 2023

Quotes

 _______________________
🔥మందు అలవాటు పడిన వారికి వద్దురా బాబూ అని ఎంత చెప్పినా...
రాత్రి వింటాడు..
పొద్దున షరామామూలే..
చీకటి పడ్డాక 
మళ్లీ షరాబీ మామూలే ..!
_______________________
🔥జూదం ఆడేవాడిని ఆడని వాడు gambler అనుకుంటాడు..
ఆడేవాడు మాత్రం తనో
*GAME* blar అనుకుంటాడు..!
_______________________
🔥ఖైనీ వేసుకునే అలవాటున్న వాడు నువ్వు చెప్పినప్పుడు విన్నట్టే అనిపిస్తాడు...
కాసేపయ్యాక మళ్లీ ఖైనీ వేసుకోవాలనిపిస్తే కానీ
అనేసుకుంటాడు..!
_______________________
🔥రేసులాడేవాడు అలా రాసుకుంటూనే ఉంటాడు..!
_______________________
🔥పూర్వం చెయ్యి తడిపితే లంచం అనేవారు..
ఇప్పుడు చెయ్యి 
కదిపితే చాలు..
లంచం ఇచ్చెయ్యాల్సిందే..!?
_______________________
🔥వేశ్యల దగ్గరికి వెళ్తే విటుడు అంటారు కదా..
మరి అజ్ఞాతంగా 
వేశ్యా వాటిక నడుపుతూ వేశ్యలకు ఆశ్రయం ఇచ్చే వాడిని విరాటుడు అనాలా..అనలేమేమో..!
భారతం బాధపడుద్ది..!!
_______________________
🔥అప్పు చేసేటప్పుడు ప్రామిసరీ నోటు రాస్తారు..
ఎగ్గొట్టాలనుకునేవాడు
దానిని ప్రా"మిస్"అరీ నోటు అనుకుంటాడు..
ఎలాగైనా తీర్చాలనుకునే వాడు అది "హామి"సరి 
నోటుగానే గౌరవిస్తాడు..
రాయించుకునే వాడు మాత్రం 
దానిని ప్రా"మిసైల్"గానే పరిగణిస్తాడు..!
_______________________
🔥అప్పుతో చెలగాటం నిప్పుతో చెలగాటం కంటే ప్రమాదకరం..!
_______________________
🔥ఎందుకో గాని పూర్వం అప్పిచ్చు వాడు వైద్యుడు 
అనేవారు..
ఇప్పుడు మాత్రం చికిత్స పూర్తయ్యాక చిప్పిచ్చు వాడే వైద్యుడు..(మంచి డాక్టర్లకు
క్షమాపణలతో..
ఎవరైనా ఉంటే సుమీ..!)
_______________________
🔥గుడిని,గుడిలో లింగాన్ని మింగితే దేవాంతకులు..
గుడిని,గుడిలో లింగాన్ని కూల్చితే దైవాంతకులు..!
_______________________

         _సురేష్ కుమార్..ఇ_

No comments:

Post a Comment