*🌷సంస్కృత భాష - దేవీ రూపం🌷*
*"ఆద్యా మహార్హా సా మూలం సర్వస్య ఇతి నిగద్యతే"*
ఆది యందు పుట్టింది ఆద్యా. ప్రపంచ భాషలలో మొదట పుట్టినది సంస్కృత భాష. అది అపౌరుషేయము.
ప్రపంచ భాషలన్నియు దానినుండే పుట్టాయి. గొప్ప పూజనీయమైన మాతృస్వరూపము. అమ్మ రూపమే భాష. అదియు సంస్కృత భాష. అమరభాష.
మొదట *"౦"*. పూర్ణము. అది *పరమేశ్వర* రూపము.*¾ +¼= 1*. అందు *¾* భాగం *జ్యోతిఃపుంజము*, *అవ్యక్తము*. అది *నాదమయము*, *జ్యోతి నాదం*.
దీపారాధన వెలుగుతుంటే దగ్గరగా అబ్జర్వ్ చేస్తే స్వల్ప శబ్దం వినిపిస్తుంది. అది *నాదవిద్య*. అమ్మ జగన్మాతను *నాదరూపా* అంటారు. *ఆ నాదం జ్యోతి లోనిదే, పరబ్రహ్మ లోనిదే*.
పరమేశ్వరుడు *"౦"* పూర్ణము అనుకుందాం. పూర్ణమునుండియే *"1"* వచ్చింది. ఆ ఒకటి మనకు ఒక విలువగా కనిపిస్తుంది కావున వ్యక్తము. *"౦"* పూర్ణము విలువ అనంతం.అప్రమేయం. అనుపమం. అది అవ్యక్తము.
*"౦"* పూర్ణము అవ్యక్తము అయితే, *"1"* వ్యక్తము. *"అవ్యక్తము (పురుషుడు) వ్యక్తము ప్రకృతి"* కనిపిస్తుంది. పూర్ణములో *అవ్యక్తము = ¾* . *వ్యక్తము = ¼*. ఆ వ్యక్తమే *జగత్తు*. మనమంతా జగత్తులోని వారం. ప్రకృతిలోని భాగం.
పురుషుడు లోనుండియే ప్రకృతి వచ్చింది. *"ఏకోహం బహుస్యాం ప్రజాయేయ"* అని ఉపనిషత్తు బోధించింది. మొదట ఒకటే
దాని రూపం పూర్ణం. అది బ్రహ్మం. *"బహు"* గా అవుదామని తలచింది. ఆ తలపే *¼ జగత్తు*.
*పురుషుడు ¾ + ప్రకృతి ¼ (అమ్మ-శక్తి)* పురుషునిలోని శక్తి యే అమ్మవారు= 1 నుండి 9 వరకు రూపం దాల్చింది. ఆతరువాత మరల 1, O.
1 నుండి 8 జగత్తు. 1+8 = 9. *"9"* పరబ్రహ్మయే. అది ఏ అంకెతో హెచ్చించినా ఉదాహరణకు : 1×9= 9. 2×9= 18(1+8= 9), 3×9 = 27( 2+7= 9). 9 విలువ మారదు.
ఇదే *నవావరణ శ్రీ చక్రము*. 4+5= 9.
*4* లో
1. *మనసు*
2. *బుద్ధి*
3. *చిత్తము*
4. *అహంకారము*
ఇవి శివునకు సంకేతాలు. శివ చక్రాలు.
*5* లో పంచ భూతాలు. ఇదే *ప్రకృతి, శక్తిచక్రములు*.
మొత్తం 9 ఇదే జగత్తు. ఇందు పరబ్రహ్మ కలిసే ఉన్నాడు.
*శిశు జననము - జగజ్జననము*
*విశ్వావతరణం*
1.*బిందువు* (బ్రహ్మరంధ్రము) పరమాత్మ
2.*త్రికోణం* (సీమంతం) నల్లని జుట్టు + పాపిటి
(త్రికోణరూపిణీ శక్రిః, బిందురూప పరః శివః)
3.*అష్టకోణం* - లలాటం
4.*అంతర్దశారము* - భ్రుకుటి
5.*బహిర్దశారము* - కంఠం
6.*మన్వస్రం* - హృదయం
7.*అష్టదళం* - నాభి
8.*షోడశదళం* - లింగ స్థానం
9.*భూపురం* - పాదములు
పరబ్రహ్మ మది ఎలాగంటే సూర్యునిలో కాంతి, చంద్రునిలోని వెన్నెల, అగ్నిలోని వేడిమి ఇవి అవినాభావాలు. అలాగే *"పురుషుడు + ప్రకృతి"* పరబ్రహ్మ. *"ఓమ్ ఇత్యేతదక్షరమిదగ్ం సర్వం"* అని *మాండూక్యోపనిషత్* వచించింది. సహస్రారనాదం ఓంకారం. అందుండియే అక్షరమాల వచ్చింది. *"ఓమ్"* లో *మ* కారం *అమ్మయే*.
*"ఓమిత్యేకాక్షరం బ్రహ్మ"* అని మనం ముప్పొద్దులా సంధ్యావందనములో స్మరిస్తాము. ఆ *'ఓం'* కారము, ఆ పరమేశ్వరుడు ఒకడే. ఆతడు తననుండి జనించిన ప్రకృతిలోని సనకాది మహర్షులను ఉద్ధరించుటకు అనగా జ్ఞానమయుల జేయుటకు అనగా అక్షరాస్యులను చేయుటకు 5+9 = 14 పర్యాయాలు శివుడు తన ఢమరుకాన్ని మ్రోగించాడు. ఆ 14 నాదములు 14 సూత్రములు. మహేశ్వరసూత్రములు.
ఇవి శ్రీ చక్ర సూచకములు. శ్రీ చక్రములో 8 కోణాలు ఉంటాయి. ఆ 8+ 3 వృత్త రేఖలు + 3 చతురస్ర రేఖలు= మొత్తం 14. శివ సూత్రములకు, శ్రీ చక్రమునకు సరిపోతుంది. శ్రీ చక్రము *అమ్మ + అయ్య* ల స్వరూపం.
వర్ణమాల - పార్వతీ పరమేశ్వర స్వరూపం
శ్రీ చక్ర స్వరూపం పరబ్రహ్మ స్వరూపం.
ఆ 14 అఇఉణ్ - ఋ లుక్ - ఏ ఓఙ్ - ఐ ఔ చ్ - హయవరట్ … ఇలా 14 సూత్రములు. ఇందు వచ్చే వర్ణాలు దీర్ఘాలు కాక 44. ఇవి శ్రీచక్రకోణాలు. ఒక్కొక్క వర్ణం ఒక్కో శ్రీచక్రమందలి కోణమే.
••••••••••••••••••••••
*ఇది అక్షర మాల*
అచ్చులు 16. ఇవి అమృతకళలు + హల్లులు 34, అమృతకళలతో కలిస్తేనే పలుకబడుతాయి= 50 వర్ణమాల.*16 అచ్చులు శక్తి రూపాలు*. అమ్మ రూపాలు.
*34 హల్లులు శివయ్య రూపాలు*.
•••••••••••••••••••••
అచ్చులు కంఠం వద్ద విశుద్ధ చక్రములో ఉన్నాయి.
హల్లులు కంఠమునకు దిగువన ఉంటాయి.
కనుక మానవ దేహం అక్షరరూపం. శ్రీ చక్రరూపం. శివ శక్తుల రూపం.
•••••••••••••••••••••••••
వర్ణోత్పత్తి స్థానాదులు-వశిన్యాది దేవతలు 8
వశిన్యాదిభిస్సంస్తుతా
1. *కంఠ్యములు* -'అ' వర్గ - వశినీ దేవి.
2.*తాలవ్యములు* - కామేశ్వరి - 'క' వర్గ
3.*దంత్యములు* - మోదిని - 'చ' వర్గ
4. *ఓష్ఠ్యములు* - విమల - 'ట' వర్గ
5. *మూర్థన్యములు* - అరుణ -'త' వర్గ
6. *ఆభ్యంతర ప్రయత్నము* - జయ -'ప'వర్గ
7. *బాహ్య ప్రయత్నములు* - సర్వేశ్వరి-'య'వర్గ
8. *నాలుక* - కౌళిని - 'శ'వర్గ
శక్తి లేకపోతే శివుడు లేడు *" శివశ్శక్త్యా యుక్తో…."* అని *ఆదిశంకరభగవత్పాదుల* వారు సౌందర్యలహరి మొదటి శ్లోకంలో *"శక్తి లేక శివుడు ఏమీ చేయలేడు.."* అంటారు. అంటే అచ్చులు కలియనిదే హల్లులు పలుకుట సాధ్యంకాదు. శబ్దస్వరూపం రాదు.
ఆ శబ్ద స్వరూపంలో *"వాక్కు + అర్థము= అమ్మ + అయ్య"* కలిసి ఉన్నారు. కనుక భాష *పార్వతీ పరమేశ్వర* స్వరూపము.
*కాళిదాస* మహాకవి
*"వాగర్థావివ సంపృక్తౌ…"* అని పార్వతీ పరమేశ్వరుల ఉపాసన చేసి రఘువంశం ఆరంభించారు.
సంస్కృత భాష దేవీ రూపం.
వర్ణాలన్నీ షట్చక్ర స్థిత దేవతలు
మూలాధారం -
(భూమి)4 గణపతి (56°)
స్వాధిష్ఠానం -
(జలం) 6 బ్రహ్మ 1(52°)
మణిపూరం -
(అగ్ని) 10 విష్ణువు2(62°)
అనాహతం -
(వాయు) 12 రుద్రుడు3(54°)
విశుద్ధం-
(ఆకాశం)16 -మహేశ్వరుడు4(72°)
ఆజ్ఞ. -
(మనస్సు 2 - సదాశివుడు5(64°)
-------------------------------------------
*6 చక్రాలు-50అక్షరాలు- పంచబ్రహ్మలు-360°*
*360°= ౦ వృత్తము. సహస్రారదళకమలం*
-----------------------------------------
సహస్రారం - అమ్మ - పంచబ్రహ్మలపై ఉంది
పంచ బ్రహ్మలు - పంచభూతాలు - ఆసీనపంచ బ్రహ్మాసనాసీనా అమ్మ
అమ్మ సహస్రారం.
*'అ'* నుండి *'హ'* వరకు 50 అర్థ వృత్తం
*'హ'* నుండి *'అ'* వరకు 50 అర్థవృత్తం
మొత్తం పూర్ణ వృత్తం. 50+50= 100× 10 వృత్తాలు= 1000 దళాలు. *"సర్వవర్ణోపశోభితా"*
దశ సంఖ్య దశ దిశలకు, దశ మహావిద్యలకు సంకేతం. అమ్మ దశమహావిద్యాస్వరూపిణి జగన్మాత. పరబ్రహ్మ మే.
పరబ్రహ్మను తెలిపే *"ప్రజ్ఞానం బ్రహ్మ -తత్త్వమసి-అహం బ్రహ్మాస్మి - అయమాత్మా బ్రహ్మ"* మహావాక్య శబ్ద స్వరూపిణి అమ్మ. అర్థస్వరూపిణి అమ్మ. *"భాషారూపా"* అని లలితాసహస్రనామం.
*"భాషాసు ముఖ్యా మధురా దివ్యా గీర్వాణభారతీ"*
వృత్తం= 360°
*108* అగ్ని కళలు - కిరణాలు
*116* సూర్యకళలు - కిరణాలు
*136* చంద్ర కళలు - కిరణాలు
వెరసి తటిల్లేఖ. శ్రీ కళ
360 మొత్తం కళలు - కిరణాలు
అటు లలితారూపం + భాషారూపముల సమన్వయం బాగుంటుంది.
*"అమంత్రమక్షరం నాస్తి"* ఖలు. ప్రతి వర్ణము ఒక బీజమే. 50 బీజాలు విశ్వమహావృక్షమే భాష. అది గీర్వాణభాషకే చెల్లును. ప్రజ్ఞానం(ఆధ్యాత్మికత), విజ్ఞాన( సైన్సు)భరితం గీర్వాణభాష. విశ్వమే భాష. విష్ణుశీల.
అమ్మ పంచబ్రహ్మాసనాసీన.
ఇటు 16 మంది + ఎదురు 16మంది ద్విజులు= 32 *ద్విజులు = బ్రహ్మ జజ్ఞానము* కలవారు.
ద్విజబృంద నిషేవితా. బ్రహ్మజ్ఞానవంతైః సేవితా షోడశీ(16) మంత్ర సేవితా
ఇటు 4+అటు 4 = వశిన్యాదిభిస్సంస్తుతా
*"ఓంకారపంజరశుకీమ్ ఉపనిషదుద్యానకేళికలకంఠీం*
*ఆగమవిపినమయూరీం అంతర్విభావయే గౌరీమ్"*
అమ్మ *'ఓమ్'* కారమనే పంజరంలో చిలుక.
ఉపనిషత్తులు అనే ఉద్యానవనం లో విహరించే కమ్మని అధ్యాత్మవిద్యా మణిరవాలను కుహూ కుహూ అని వినిపించే *"కోకిల"*
వేదాలనే అరణ్యసంచారిణి యైన వేద నాద హొయలులతో కులికే *"నెమలి"*.
ఆమె స్వరూపం నాలో ఉంది. ఆ అమ్మను నాలో అంతర్యాగము ద్వారా దర్శిస్తాను.
*ఏతత్ ఫలమ్ సర్వమ్*
*శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు*
🌷శ్రీ మాత్రే నమః🌷
No comments:
Post a Comment