🌸
"గుల్జార్" పొయెట్రీ......
"రాలిపోతున్న ఆకులు
నాకు నేర్పించాయి పాఠాన్ని
నీవు బరువు అయితే
నీవారే వదుల్చుకుంటారని."!!
*మూలం…. గుల్జార్..!
*అనువాదం: ఆర్.ఎస్. వెంకటేశ్వరన్.
చాలా అదృష్టవంతులకు తప్ప వృద్ధాప్యం
అందరికీ సుఖంగా వుండదు.. సుఖంగా గడవదు… పిల్లలు బాగుంటే అదో రకం.. పిల్లలు సరిగా లేకున్నా.. మన చేతిలో పైసల్లేకపోయినా… ఆ వృద్ధాప్య జీవితం నరకం కంటే తక్కువగా యేం వుండదు.. నూటికి పది శాతం మందికి మాత్రమే వృధ్ధాప్యం హాయిగా గడుస్తోంది… మిగిలిన వారికి దినదిన గండమే. మేం ఇంకాఎందుకు బతుకున్నాం రా దేవుడా! అంటూ మరణం కోసం ఎదురు చూసేవారే ఎక్కువగా వున్నారు.
ఏతావాతా… లోకంలో వృద్ధాప్యం అంటరాని
వసంతంతో సమానం. ఇది సత్యం. దీనికి..... సాక్ష్యం నానాటికి పెరుగుతున్న వృద్ధాశ్రమాలే.
గుల్జార్ (సంపూరణ్ సింగ్) 1934 లోనేటి పాకిస్తాన్ లోని 'దీనా' లోజన్మించారు. 1947లో భారత్, పాకిస్తాన్ విడిపోయిన తర్వాత దిల్లికి వచ్చేశారు. బిమల్ రాయ్, హృషికేష్ ముఖర్జీ లతో కలిసి గేయ రచయితగా పేరు తెచ్చుకున్న తర్వాత సినిమాలకు కథలు , స్క్రిప్టులు రాశారు. ఆతర్వాత, దర్శకత్వం కూడా చేశారు. సినిమా జీవితంలో ఆయన ఎన్నో వేలపాటల్ని రాశారు. గుల్జార్ తన…
అనుభవాలను కథలుగా మలిచి హిందీ,
ఉర్దూ, పంజాబీ భాషల్లో రాశారు. ఆవి ఆంగ్లం,
తెలుగు తో పాటు ఇతర భాషల్లోకి కూడా
అనువాదమయ్యాయి…
మన తరం కవుల్లో గుల్జార్ గొప్పకవి. భావుకుడు... తాత్వికుడు.. నాలుగు పాదాల్లో.. నాలుగు దశల తర్వాతి జీవితాన్ని ముక్తసరిగా చెప్పాడు..
చెట్టుకు బరువైతే ఆకులు రాల్చుకుంటుంది.
అలాగే వృద్ధాప్యంలో మనం బరువనుకుంటే పిల్లలే మనల్ని వదిలించుకుంటారు. చెట్టును చూసి మనం ఈ విషయాన్ని గ్రహించాలి… బరువైతే నిర్మొహమాటంగా ఆకుల్ని రాల్చేస్తుంది.. దాన్నే మనం గ్రీష్మం అంటున్నాం… అలాగే బరువనుకుంటే, మన పిల్లలు కూడా మనల్ని పట్టించుకోరు సరికదా!వదిలించుకుంటారు.. మంచోళ్ళైతే వృద్ధాశ్రమాల్లో చేరుస్తారు.. లేకుంటే వీధులపాలు చేస్తారు..!!
చెట్టు ఆకులు రాల్చుకోవడం ప్రాకృతిక సత్యం.
బరువైతే మనల్ని మనవాళ్ళు(పిల్లలు)... వదిలించుకోవడం లోక సహజం.. కాబట్టి దీన్ని గురించి బాధపడకూడదు. ఆలోచించి తల…
బొప్పి కట్టించుకో కూడదు.. మనోవ్యాది అసలే పెట్టుకోకూడదు..!
మనకు డబ్బు, దస్కం, ఆస్తులు, అంతస్తులు
ఎన్నైనా వుండొచ్చు… మన చుట్టూ, మనల్ని
ఇష్టపడే. ఓ నలుగురు లేకుంటే ఎన్ని వున్నా
వ్యర్ధమే..!
అందుకే మనం వున్నంతకాలం నలుగురితో
మంచిగా వుండాల. మన చుట్టూ ఓ పాజిటివ్
వైబ్రేషన్స్ ను క్రియేట్ చేసుకోవాలి.. మనల్ని
చిన్నచూపు చూసే వాళ్ళెవరైనా చివరకు వాళ్ళు కన్నబిడ్డలైనా దూరంగా వుంచాలి. వృద్ధాప్యాన్ని శాపంగా కాకుండా, వరంగా భావించాలి.. జీవితపు చివరి క్షణాల్ని పరిమళభరితం చేసుకోవాలి.. మనం లేకున్నా.. మన గురించి మాట్లాడుకునే నాలుగు మంచిపనుల్ని చేయాలి.. మన జ్ఞాపకాలు ఆకుపచ్చగా పది కాలాలుండేట్లు చూసుకోవాలి.. అప్పుడే వృద్ధాప్యం దండగగా కాకుండా పండగవుతుంది. మన జన్మకు ఓ సార్ధకత దొరుకు
తుంది..!!
No comments:
Post a Comment