🌺 *సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 8:--- ఓ స్త్రీ తల్లైతేనే సంపూర్ణ స్త్రీ కాగలుగుతుంది* 🌹
🌷 *Part -- 1* 🌷
🌿 ఓ స్త్రీ తల్లి అయితేనే తప్ప మనోహరమైన వ్యక్తిత్వ వికాసమూ, రూప లావణ్యాల సౌందర్య వికాసమూ సంభవించదు. శిశువుతో ఏకత్వాన్నీ, గాఢ ఆధ్యాత్మిక సంబంధాన్ని స్వయంగా అనుభవించి తెలుసుకున్న మాతృ మూర్తే సంపూర్ణ స్త్రీ కాగలుగుతుంది
🌳 ఓ స్త్రీ మాతృమూర్తి కాగానే ఆమెలో కామ వికారాలన్నీ వెంటనే నశించి పోతాయన్న విషయాన్ని, కామాసక్తి తగ్గిపోతుందన్న విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కామం మీద ఆసక్తి ఇక ఆమెకు ఉండదు. కామం పట్ల ఆమెకున్న నిర్లక్ష్యతను గమనిస్తున్న భర్త పలుమార్లు విస్మయానికీ లోనయ్యే పరిస్థితులు నెలకొంటాయి.
🌼 ఓ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆ తల్లిలో ఓ నవ్య ఆధ్యాత్మిక నిండుదనం కనిపిస్తుంది. ఓ తల్లి అయిన స్త్రీనీ, తల్లికానీ స్త్రీని గమనించనట్లయితే ఆ ఇద్దరి మధ్యా కొట్టొచ్చినట్లున్న స్వభావ భేదం వాళ్ళ వ్యక్తిత్వాలలో కనబడి తీరుతుంది. తల్లి అయిన స్త్రీలో ఓ దివ్య తేజస్సు, దివ్య ప్రశాంతతా మైదానాన్ని చేరుకున్న సెలయేరులాగా కనిపిస్తాయి. ప్రశాంతంగా, నింపాదిగా, నిండుగా, గంభీరంగా కనిపిస్తుంది.
☘️ తల్లికాని స్త్రీలో అలజడి - పరవళ్ళు తొక్కుతూ, దూకుతూ, హోరు శబ్దంతొ కొండచరియాల్లో రాళ్ళ మధ్య వేగంగా కదుల్తూ గట్లు తెచ్చుకుంటూ సమతలాన్ని అన్వేషిస్తున్న నదీ ప్రవాహంలా కనిపిస్తుంది.
🌸 మీరు దేన్ని సాధించగలరో తెలుసుకోవాలంటే ముందుగా మిమ్మల్ని గురించి మీరే తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకమవుతుంది.
🍀 ఎవరైనా ఓ చోట్ల ప్రశాంతంగా కూర్చుని రతి కార్యపు భంగిమల మీద మనస్సును కేంద్రీకరించి, మనో వికారాల మీదే మనస్సు లగ్నం చేసి ధ్యానం చేస్తే, అతడిలో కామ పిచ్చి వికారాలన్నీ ఆవిరైపోగలుగుతాయి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🍁 *సంభోగం నుండి సమాధి వైపు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
No comments:
Post a Comment